తెలంగాణ రాజధాని హైదరాబాద్


Mon,January 21, 2013 07:23 PM

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన్సీ మడ్రాస్ రాష్ట్రం నుంచి విడివడి వచ్చినా ఆంగ్లయాస ప్రభావం వల్ల గోదావరిని గోడావరి అనేవారు, హైదరాబాద్‌ను హైడ్రాబాడ్ అంటారు. తెలంగాణకు గోదావరి నీళ్లు సమపాళ్లలో ఇవ్వని కారణంగా చెలరేగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం హైదరాబాద్‌తో ముడిపడి ఉంది. తెలంగాణ పది జిల్లాల మధ్యలో ఉన్న హైదరాబాద్, కోస్తాంధ్రతో భౌగోళికంగా కలిసి లేకపోయినా హైదరాబాద్‌ను కోస్తాంధ్రకు ఇవ్వాలనడం, అది కాకపోతే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం కోసం పట్టుబట్టడం లాబీయింగ్ ప్రతిభ కావచ్చు కానీ, ఏమాత్రం సమంజసం కాదు. ‘హైదరాబాద్‌లో మేమే పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నెలకొల్పాం కను క హైదరాబాద్ మాదే’ అనే మాటకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆనాడే జవాబు చెప్పారు. ‘బొంబాయిలో మా డబ్బుంది, మా పరిశ్రమలున్నాయి, మేమే వాణిజ్యం అభివృద్ది చేసాం. కనుక బొంబాయి మాదే’ అని గుజరాతీలు అన్నప్పుడు, డాక్టర్ అంబేద్కర్...‘ఈ మాటలకు ఆధారమే లేదు. తన భూమిని యజమాని తాకట్టు పెడితే, తాకట్టుకు తీసుకున్న వ్యక్తి ఎన్ని శాశ్వత నిర్మాణాలుచేసినా యజమాని సొంతపు హక్కులను తీసుకోవడం సాధ్యం కాదు. బొంబాయిలో వర్తక వాణిజ్య పరిశ్రమలు పెట్టిన గుజరాత్ నిర్మాతలు మరాఠీ యజమానుల భూములను సొంతం చేసుకోవడం సాధ్యం కాదు. గుజరాతీలు బొంబాయిలో తాకట్టుతీసుకున్న వారికన్న ఎక్కువ కా దు. అయినా బొంబాయిలో పరిక్షిశమలు ఎవరు పెట్టారనే అంశంపైన బొంబాయి మహారాష్ట్రలో ఉండాల్నా లేదా అనే విష యం ఆధారపడి ఉండదు.మరాఠాలు కూలీ లు గుమాస్తాలు కనుక వారికి కాకుండా సొంతదారులు యజమానులైన గుజరాతీలకే బొంబాయి చెందుతుందనడం, వ్యాపార పారిశ్రామిక గుత్తాధిపత్య వాదమే అవుతుంది.’ (మహారాష్ట్ర ఆఫ్ ఎ లింగ్విస్టిక్ ప్రావిన్స్, లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీకి 1948లో అంబేద్కర్ సమర్పించిన మెమోరాండం, 1948)అని చెప్పారు.‘హైదరాబాద్‌లో పరిశ్రమలు మేమే పెట్టాం కనుక హైదరాబాద్ మాకే’ అనే సీమాంధ్ర పెట్టుబడిదారులకు ఇంతకన్నా మంచి సమాధానం ఉండదేమో.

తెలంగాణలో బాగా అభివృద్ధి అయిందనే దానికి సాక్షిగా హైదరాబాద్ ను చూపుతున్నారు. అయితే అంతకుముందు ఇక్కడ నగరమే లేదన్నట్టు మాట్లాడడం చరిత్ర తెలియనితనం. నాలుగొందల సంవత్సరాల మహానగరం హైదరాబాద్. తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ భాషలు కలిసి బతికిన రాష్ట్రం. హైదరాబాద్ బహుళ మతాలు సంస్కృతులు భాసిల్లిన నగరం. భాషలు సమష్టిగా మనుగడ సాధించి సామరస్యం అంటే ఏమిటో చాటి చెప్పే నగరం. మతాన్ని ఓట్లకోసం వాడుకునే కుటిల రాజకీయాలు వచ్చే వరకు హైదరాబాద్‌లో అశాంతి, అల్లర్లు, కలహాలు, మతకల్లోలాలు లేవు. సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రని మార్చడానికి మతకల్లోలాలను రెచ్చగొట్టే దుర్మార్గ వ్యూహం చెలామణి కావడం వల్ల పాతబస్తీ నెత్తురోడింది. ఇప్పడికీ స్వప్రయోజనాలకోసం, ముస్లిం ఓటుబ్యాంకు కోసం, మజ్లిస్‌తో పొత్తు కోసం వారి కోరికలన్నీ నెరవేర్చారు. పాతనగరాన్ని వెనుకబడేసే రాజకీయాల్ని పాటించినవే ఈ ప్రభుత్వాలన్నీ. పాత బస్తీ పాడుబెట్టి, కొత్త కాలనీలు నిర్మించి, వ్యాపారాలు పరిశ్రమల పేరుతో భూములు సంపాదించి జలయజ్ఞంతో భూమి ధరలు పెంచి రంగాడ్డిజిల్లా రైతుల బతుకులను అల్లకల్లోలం చేసి దాన్నే అభివృద్ది అంటున్నారు. ఇది సాధించినందుకు అదంతా కోస్తాంధ్రలకే చెందుతుందని చెప్పుకొస్తున్నారు. రాజధాని తమదే అంటున్నారు. ఇవ్వక తప్పకపోతే హైదరాబాద్ లేని తెలంగాణను మాత్రమే ఇవ్వాలని ఢిల్లీ పెద్దలకు చెవిలో జోరీగలై పైరవీలు చేస్తున్నారు.కోస్తా రాయలసీమ ప్రాంతాలను హైదరాబాద్ (తెలంగాణ)తో కలపాలని 1956కు ముందు ఇక్కడ పైరవీలు జరుగుతున్న రోజుల్లో అక్కడ సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం సాగింది. బొంబాయి కోసం గుజరాతీలు మడత పేచీ పెట్టారు. సరిగ్గా ఇప్పడు హైదరాబాద్ కోసం అటువంటి తకరారు నడుస్తున్నది. యాభై ఆరేళ్ల కిందట సాగిన రాజధాని రాజకీయాన్ని మరో రూపంలో వ్యాపార శక్తులు హైదరాబాద్‌లో ప్రారంభించాయి. గుజరాతీ వర్తకులకన్నా కోస్తాంధ్ర వర్తకులు చాలా పెద్ద ఎత్తున ఖరీదైన లాబీయింగ్ సాగిస్తున్నారనడంలో సందేహం లేదు.


బాంబే సిటిజన్స్ కమిటీ పేరుతో గుజరాతీ వాణిజ్య ప్రముఖులు మరాఠీ మహానగరానికి ఎసరు పెట్టారు. మరాఠీ వారు పల్లెటూరి మనుషులనీ, గుజరాతీలకే నగరనిర్మాణాలు తెలుసనీ వారు దురహంకరించారు. అయిదు వేల ఏళ్లు గడిచినా మరాఠీలకు బొంబాయి దక్కనీయబోమని హుంకరించారు. బొంబాయి నగరంలో సంస్కృతీ వైవిధ్యంతో పలు భాషా పౌరుల సహజీవన కేంద్రమైన బొంబాయి నగరాన్ని విడిగా ఉంచాలని నాటి గుజరాతీ నాయకులు వాదించారు. బొంబాయి ఆక్రమణ ప్రయత్నాలను నిరసిస్తూ కౌన్సిల్ హాల్‌కు సాగిన ఊరేగింపుపై కాల్పులు జరిపితే 15 మంది మరణించారు. 60మంది గుజరాతీ వర్తకులు మాత్రమే ఇండియ న్ మర్చంట్స్ ఛాంబర్‌లో గుమికూడి బొంబాయి తమదే అని డిమాండ్ చేస్తే అప్పుడు అక్కడి గుజరాతీ వర్తకుల ప్రయోజనాలను కాపాడుతున్న టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ వార్తను ప్రముఖం గా ప్రచురించిందని అంబేద్కర్ తన వినతిపత్రంలో వివరించారు. వర్తక నాయకులు మరాఠీలకు వ్యతిరేకమైన తీవ్ర ప్రసంగాలను అదే ధోరణిలో రెచ్చగొట్టే వార్తలుగా, సంపాదకీయాలుగా రాసింది. బొంబాయి భవిష్యత్తు బంగారు మయంగా ఉండాలంటే గుజరాతీల డిమాండ్ సరైనదని మద్దతు పలికింది. గోరంతలు కొండంతలు చేసి ప్రచురించింది. ఇప్పుడు తెలంగాణలో అదే పరిస్థితి. ఆంధ్రవూపదేశ్‌లో రాజకీయాలు, వ్యాపారాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. మీడియా కూడా వ్యాపారంగా మారిపోయిన తరువాత రాజకీయ వ్యాపారుల గుప్పిట్లోకి చేరిపోయింది. శ్రీకృష్ణ కమిటీ చీకటి అధ్యాయంలో రాసినట్టు, మీడియా యజమానులు, సొంతదారులు చాలా వరకు కోస్తాంధ్ర వారే కనుక ఉద్యమాన్ని అణచివేయడానికి ఆ తెలంగాణ వ్యతిరేక మీడియాను, తెలంగాణ అనుకూల జనం బుర్రలను మార్చడానికి వినియోగించాలని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. బొంబాయి తమదే అనడానికి గుజరాతీలు రకరకాల వాదాలు లేవనెత్తారు. ‘బొంబాయి ఎన్నడూ మహారాష్ట్రలో భాగం కాదనీ, మరాఠా రాజవంశాల చరిత్రలో కూడా ఎక్కడా బొంబాయి ఉన్నట్టు లేదు. బొంబాయి నగరంలో మరాఠీ మాట్లాడే వారి జనాభా తక్కువ, గుజరాతీలే బొంబాయి లో చాలా కాలం నుంచి ఉంటున్నారు. ప్రసిద్ధ వాణిజ్య కేంద్రమైన బొంబాయిలో వ్యాపారాలు మహారాష్ట్రకు ఆవలి ప్రాంతాలతో సంబంధాలు కలిగి ఉన్నాయి కనుక బొంబాయి తమదే అని మరాఠీలు అనడానికి వీల్లేదు. బొంబాయి మొత్తం భారతదేశానికి చెందుతుంది. బొంబాయిలో పరిశ్రమలను, వాణిజ్యాన్ని పెంచిపోషించింది గుజరాతీలే. ఇక్కడి మరాఠీలు కూలీలు, గుమాస్తాలు మాత్రమే. వ్యాపారం, పరిశ్రమల యజమానులు సొంతదారులైన గుజరాతీలను పనివారయిన మరాఠీల రాజకీయ ఆధిపత్యంలో మనుగడ సాగించాలనడం సమంజసం కాదు.’ మొదలైన వాద నలు వినిపించారు.


ఆనాడు రాష్ట్ర పునర్విభజన సంఘం సిఫార్సులకు వ్యతిరేకంగా బొంబాయిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. అందువల్ల బొంబాయిని కొన్నేళ్లు మహారాష్ట్రకు దక్కనీయకుండా చేయడం తప్ప గుజరాతీలు సాధించిందేమీ లేదు. మరాఠీల ఉద్యమం చెలరేగింది. 80మంది నేలకొరిగారు. నాలుగేళ్ల పోరాటం తరువాత సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం విజయవంతమై 1960 మే1న బొంబాయి రాజధానిగా మహారాష్ట్ర ఏర్పడింది. బొంబాయిలో కేంద్రపాలన అంతమైంది. మరాఠీలకు న్యాయం జరిగింది. కొత్త రాజధాని నిర్మించుకున్న గుజరాత్‌కు ఏ నష్టమూ జరగలేదు. పునర్విభజన కమిటీ మాత్రం బాషా ప్రయుక్త రాష్ట్రాలను సమర్థించలేదు. ఏక భాషా రాష్ట్రం కన్న బహు భాషలు మాట్లాడే రాష్ట్రం ఏర్పాటు చేయడం మంచిదనీ లేకపోతే అల్పసంఖ్యాక వర్గాల మనుగడకు ప్రమాదమనీ, రాష్ట్రాలు భాషలు జాతుల ఆధారంగా కాకుండా సమంజసమైన ప్రయోజనాల ఆధారంగా ఏర్పడాలని అంబేద్కర్ వాదించారు. శతాబ్దాల కాలం నుంచి తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం. హైదరాబాద్ నగరం తెలంగాణదే అని చరిత్ర కూడ చాటుతున్నది. హైదరాబాద్ లో తెలంగాణేతరులు ఎంతగా పెరిగినా తెలంగాణ ప్రజానీకం మైనారిటీ కాదు. నాటి గుజరాతీల వాదనలే నేటి కోస్తాంధ్ర వర్తకులు వినిపిస్తున్నారు. తెలంగాణ వారు పనివారనీ, హైదరాబాద్‌ను వ్యాపార వాణిజ్య పారిశ్రామిక కేంద్రంగా పెంచింది కేవలం తెలివైన, సంపన్న కోస్తాంధ్ర వర్గాలేనని కనుక రాజధానిగా హైదరాబాద్ ఆంధ్రకు దక్కాలని అంటున్నారు. బొంబాయిలో మరాఠీలు మైనారిటీలే అయినా అక్కడ విభిన్న రాష్ట్రాల ప్రజలున్నా, అది మరాఠాలకే చెందుతుందనే వాదనకే బలం చేకూరింది.బొంబాయిలో మరాఠీలు మైనారిటీలుగా మారితే అది వారి తప్పుకాదు. అన్ని ప్రాంతాల వారికి, భాష ల వారికి బొంబాయితో సహా ఏ నగరంలోనైనా నివసించే అధికారం, స్వాతంత్య్రం ఉంది కనుక జనసంఖ్య నిర్ణాయక అంశం కావడానికి వీల్లేదు.


1950లలో మద్రాస్ మనదే అన్న ప్రచారోద్యమాన్ని కోస్తాంధ్రులు ప్రారంభించారు. భౌగోళికంగా ఏమాత్రం మద్రాస్ నగరం ఆంధ్రకు అనుకూలం కాకపోయినా తమిళనాడుతో సన్నిహితంగా ఉన్నప్పడికీ తమదే మద్రాస్ అని ఆంధ్రులు ప్రచారం కొనసాగించారు. ఫోర్ట్ సెయింట్ జార్జి నిర్మించిన భూమి తెలుగు రాజుకు చెందినదనీ, చుట్టు పక్కల ప్రాంతాలు కూడా తెలుగు రాజులకే చెందిన ప్రాంతాలనీ, రాజుగారు ఆ నగర నిర్మాణం కోసంభూమిని విరాళంగా ఇస్తూ మద్రాస్ తెలుగు వారి మహానగరంగా నిరంతరం భాసిల్లాలని ఆశించారనీ, అప్పడికే అక్కడ తెలుగు వారున్నారని, విదేశీ యాత్రికులకు ఈ నగరం తెలుగువారి నగరంగానే చాలా కాలం ప్రాచుర్యం పొందిందని చెప్పుకొచ్చారు. 17 వశతాబ్దం వరకు చెన్నపట్నానికి సంబంధించినంత వరకు తెలుగురాజుల ప్రమేయం ఉంది. కాని ఆతరువాత చెన్నపట్నంకు ఆవల నగర సరిహద్దులు చాలా విస్తారంగా పెరిగాయి. 1951లో తమిళుల జనాభా 67.92 శాతం అని తేల్చారు. ఆంధ్రులు వెనుకబడి ఉండడానికి కారణం విడిగా తమిళుల ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో తెలుగుజిల్లాలకు దూరంగా రాజధాని ఉండడమే అని పత్రికల్లో వార్తలు, వ్యాసాలు వచ్చాయి. ఆంధ్ర ప్రాంత మ్యాప్‌లలో మద్రాస్ లేకుండా చిత్రాలు ముద్రించారు. మద్రాస్ నగరంలో మిగులు రెవిన్యూ ఉండడం, మిగతా తెలుగు జిల్లాల్లో రెవిన్యూ లోటు కావడం కూడా వీరు మద్రాస్‌ను డిమాండ్ చేయడానికి ఒక కారణం. భాషాప్రయుక్త రాష్ట్రంలో భాగంగా తెలుగు రాష్ట్రం ఏర్పడినా ఆంధ్రులకు తమిళులకు కలిపి మద్రాస్ ఉమ్మడి రాజధాని చేయాలని, లేదా చుట్టు పక్కల కొన్ని ప్రాంతాలను కలిపి మద్రాస్‌ను విడిరాష్ట్రంగా రూపొందించాలని, మద్రాస్‌ను రెండుగా విభజించి ఉత్తర భాగాన్ని ఆంధ్రకు, దక్షిణ భాగా న్ని తమిళరాష్ట్రానికి రాజధాని చేయాలని సూచనలు వీరేచేసారు. లేదా మద్రాస్‌ను కేంద్రపాలిత ప్రాంతగా ప్రకటించడం మరొక ప్రత్యామ్నాయం అన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయవలసి వస్తే ఈ బహుభాషానగరాలన్నీ కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చవలసి వస్తుందా అని ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుపై శ్రీ.కె.వి నారాయణరావు పుస్తకంలో ప్రశ్నించారు. మద్రాసు తమిళ నాడుకు, బొంబాయి మహారాష్ట్రకు చెందినట్టే, తెలంగాణ అంతర్భాగంగా హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే చెందుతుంది. ఆయా నగరాలపైన ఆయా రాష్ట్రాలకు ఉన్న హక్కు కన్న హైదరాబాద్‌పైన తెలంగాణకు మరింత ఎక్కువ హక్కు ఉంది, ఉంటుంది.

తెలంగాణ జిల్లాలను విచక్షణా రహితంగా విభజించి, హైదరాబాద్‌ను విజయవాడకు కలపడానికి రోడ్డు వెంట కొన్ని ప్రాంతాలను కలిపి హైదరాబాద్ విస్తీర్ణాన్ని పెంచి ఉమ్మడి రాజధాని చేయాలని విచిత్రమైన వాదన చేస్తున్నారు. కానీ ఆనాడు మద్రాసు విభజన కోరినట్టే ఇప్పుడు తెలంగాణను అర్థరహితంగా ముక్కలు చేయాలన్నది కూడా సహేతుకం కాదు. చారిత్రక నేపథ్యం, జనాభా, భౌగోళిక అనుబంధం, సంస్కృతి, భాష ఏ కోణం నుంచి చూసినా తెలంగాణ నుంచి హైదరాబాద్‌ను విడదీయడం సాధ్యం కాదు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం కూడా ఏ విధంగానూ సమంజసం కాదు. తెలంగాణకు కాకుండా చేయడం తప్ప హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావడం వల్ల కోస్తాంధ్రులకు ఏ ప్రయోజనమూ లేదు. 1956నుంచి తెలంగాణకు జరిగిన అన్యాయాలను, ఒప్పందాల ఉల్లంఘనలను, ఉద్యోగుల నియామకాలలో విద్యావిషయికమైన అవకాశాలలో నిరాదరణలను, వివక్ష, దోపిడీ, అభివృధ్ది నిరాకరణ వంటి అన్ని అన్యాయాలను ఎవరూ ఏ విధంగానూ పరిష్కరించలేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆ అన్యాయాలకు పరిష్కారం చూపకపోయినా ఇకముందు కొనసాగకుండా ముగింపు పలుకుతుంది. తన నీళ్లు, తన నిధులు, తన వనరులు, తన ఆదాయం తెలంగాణకే వినియోగించేందుకు, ఏ విధమైన దారి మళ్లింపులకు గురికాకుండా తెలంగాణ అభివృధ్దికే వెచ్చించుకునే స్వపాలన కావాలి. అప్పుడు ఇక్కడున్న కోస్తాంధ్రులకు కూడా తెలంగాణ వారితో సహా ప్రయోజనాలు అందుతాయి. కోస్తాంధ్రకు మరో రాజధాని నిర్మించడం, అందాకా హైదరాబాద్‌ను తాత్కాలింగా ఉమ్మడి రాజధానిగా ఉండనీయడం, తెలంగాణ బతుకును తెలంగాణను బతకనివ్వడం మినహా మరే విధమైన పరిష్కారం లేదు.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధనా కేంద్రం సమన్వయ కర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి