అఖిలపక్షంలో తేలుస్తారా?


Mon,December 24, 2012 11:45 PM

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుందని ఎదురుచూస్తున్న రోజు. డిసెంబర్ 9 వలె చరిత్ర సృష్టిస్తుందా లేక డిసెంబర్ 23 వలె మరో విద్రోహ దినంగా నిలిచిపోతుందా? మూడు ప్రమాదాలున్నాయి. అవి. 1. ఢిల్లీ పట్టించుకోదు. 2. నిత్యనూతనమైన మోసాలకు కొందరు కోస్తా నేతలు వెనుకాడరు. 3. తెలంగాణ నుంచి విభిన్న రాజకీయపార్టీల్లో ఉన్న వారు పదవులు, వాటి మీద ఆశలు వదిలేసి రారు. తెలంగాణ కోసం పోరాడుతున్న వారి మీద తెలంగాణ వారితోనే దుమ్మెత్తి పోయించే నిందా రాజకీయాలను కోస్తానేతల చేతుల్లో ఉన్న రాజకీయ పార్టీలు వదలడం లేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 28 నాడు ఏంజరుగుతుంది. తర్వాత ఏమవుతుంది?

ఢిల్లీ పాలకులకు తెలంగాణ అసలు పట్టదు. 1947-48లో తెలంగాణ రజాకార్ల హత్యలు, మానభంగాలతో రగిలిపోతుంటే ఢిల్లీ సుల్తాన్లు 13నెలలు మౌనంగా ఉన్నారు. 1955-56లో మొత్తం తెలంగాణ విలీనం వద్దంటే మన కేం అన్నట్టు తెలంగాణకు విషాదాంధ్ర విశాలాంవూధను సృష్టించారు. 1969లో 369 మందిని నిరంకుశ కోస్తాంధ్ర సర్కారు ఊచకోత కోస్తే ఢిల్లీ తెలంగాణ ఉద్యమ ద్రోహనేతలను టోకున కొనేసే కర్కశ వ్యాపారి వలె వ్యవహరించిం ది. 2009 నుంచి ఇప్పటి వరకు 800మందికి పైగా హతులై తెలంగాణ శాంతియుత ఉద్యమంలో రగిలి నలిగిపోతూ ఉంటే కోస్తాంధ్ర లాబీయింగ్ పైరవీలలో మునిగితేలుతూ నీరో చక్రవర్తివలె వినోదాలు చేసుకుంటున్నది ఢిల్లీ. హస్తిన పాలకులకే కాదు పౌరులకు కూడా తెలంగాణ పట్టదు. సమస్య లోతుపాతులు కూడా తెలియవు. విచివూతమేమంటే దాదాపు ఎనిమిది వందలమంది విడి రాష్ట్రం కోరి ఆత్మహత్య చేసుకుంటే దానిగురించి కనీ సం చర్చించాలని కూడా అనుకోరు. తెలంగాణకు ఢిల్లీ ఎంతదూరమో ప్రజలకు కూడా అంతే దూరంగా ఉన్నది.

జనాన్ని పట్టించుకోరు. మేధావులు చర్చించాలా వద్దా అని చర్చిస్తారు. కాంగ్రెస్ పార్టీ యూపీఏ నాయకత్వం వహిస్తున్న పార్టీ కనుక తెలంగాణ గురించి ఆలోచించక తప్పదు. కానీ చిల్లర వ్యాపార రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే ఎవరికెంత లాభం, లాబీయింగ్ కోసం కేటాయించిన సొమ్ములు ఎంత లాభం ఎవరికి దక్కుతుందోఅని ఆలోచించి దక్కితేనే పనిచేసే నేతల సంఖ్య ఎక్కువవుతున్న రోజుల్లో 800 మంది ప్రాణాలు తీసుకుంటే ఎవరికేమి లెక్క?

ఇటీవల ఢిల్లీలో సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ వేదిక మీద తెలంగాణ సమస్యను చర్చకు పెడితే, వ్యతిరేకవాదులు రాలేదు. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అసలీ విషయమే చర్చించవద్దని నిరసన లేఖ ప్రతులను ఆ సభలో పంచారు. అందరికీ పంపిన సభ నేపథ్య పత్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఉందని అది తమకు సమ్మతం కాదని సమైక్యాంధ్ర జేఏసీ పేరుమీద ఇద్దరు సంతకం చేసిన ఈలేఖలో పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ ఆర్థిక వెనుకబాటుతనం అనే మిథ్యను తుంచేసిందని, అసలు సభలో పంచిన పత్రం అబద్ధమని 1969లో మరణాల సంఖ్య కూడాఅసత్యమని రాస్తూ... ముందే తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్నారనే సాకుతో సభలో పాల్గొనబోమని అందులో రాశారు. కనీసం తెలంగాణ సమస్య గురించి ప్రస్తావన ఉండకూడదని దాని పైన చర్చ ప్రారంభం కూడా కాకూడదని చేసే ప్రయత్నం ఇది. ఆ లేఖ ప్రతులు బల్ల మీద పెట్టి వెళ్లిపోయా రు. అక్కడ ఆ లేఖ గురించి మాట్లాడడానికి ఎవరూ లేరు. ఇదొక అప్రజాస్వామిక ఎత్తుగడ. సరిగ్గా ఈ దుర్మార్గం మీదనే తెలంగాణ పోరాడవలసి ఉంది. తెలంగాణవాదాన్ని వినిపించడానికి వచ్చిన వారు వినడానికి వచ్చిన వారే మిగిలారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను రచించిన మాజీ హోం సెక్రెటరీ వి.కె. దుగ్గల్ ఆలస్యంగా వచ్చి అక్కడ కోస్తాంవూధకు ప్రాతినిధ్యం వహించడం ఒక విచిత్ర సత్యం. రాజకీయపార్టీల స్వార్థ పూరిత, కోస్తాంధ్ర కాంట్రాక్టు రాజకీయుల లాబీయింగ్ దుష్ర్పభావ పూరితమై అసత్య అసందిగ్ధ పరస్పర వ్యతిరేక అర్థ సత్యాలతో కూడిన ఆ నివేదిక నెత్తిన పెట్టుకుని మోయడానికి తెలంగాణ వ్యతిరేకులకు ఒక పరికరంగా మారిపోయింది. హోంశాఖలో ఒక లా అండ్ ఆర్డర్ పేరుతో ప్రజాఉద్యమాన్ని ఏ విధంగా లాఠీలతో అణచివేయాలో కుయుక్తులతో సహా వివరించిన దారుణమైన చీకటి ఎనిమిదో అధ్యాయం చాలు ఈ నివేదికకు ఒక్క క్షణం కూడా నిలబడే విలువ లేనిదని చెప్పడానికి.

ఆ చీకటి నివేదిక చూపుతూ ప్రముఖ సామాజికశాస్త్ర ఆచార్యుడు యోగేం ద్ర యాదవ్ శ్రీకృష్ణ కమిటీ సెక్రెటరీ దుగ్గల్‌ను ఒక ప్రశ్న అడిగాడు. ఈ రహస్య భాగం నివేదికలో భాగమేనా? అని. భద్రతా కారణాల దృష్ట్యా కొంత భాగం రహస్యంగా ఉంచడం మామూలేనని ఆయన తడబడుతూ జవాబిచ్చాడు. పక్కనే ఉన్న శ్రీరాం వెదిరె ఆ నివేదిక రాసింది ఈ దుగ్గలే అని ప్రకటించగానే సభంతా గొల్లున నవ్వింది. ఈ ఎనిమిదో అధ్యాయం చదివిన తరువాత ఇక మొత్తం నివేదిక చూడవలసిన అవసరమే లేదని యోగేంద్ర యాదవ్ ఒక్కముక్కలో తేల్చి చెప్పారు. తెలంగాణ వ్యతిరేకులు సభలో లేకపోయినా, పాతుకుపోయిన ఈ తెలంగాణ వ్యతిరేకత గురించి ఢిల్లీలో ఇన్నాళ్లూ ఎవరికీ అర్థం కాలేదన్న విషయం తెలిసొచ్చింది. తెలంగాణ ఒక గుర్తింపు కోసం పోరాడుతున్నదని, తమ సంస్కృతిపైన, భాషపైన జరుగుతున్న దాడిని అవమానాలను ఎదిరిస్తున్నదని, ఇన్నాళ్లుగా సాగుతున్న ఉద్యమాన్ని, వందలాదిమంది ఆత్మాహుతిని తక్కువచేసి చూస్తూ, కించపరుస్తున్నారని జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వివరించారు.

మేధావులు మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ ఏర్పడినప్పుడు అందుకోసం డిమాండ్ లేదు, దానికీ వ్యతిరేకతా లేదు. ఉత్తరాఖండ్ కోసం మాత్రం పెద్ద ఉద్యమమే సాగింది. కాని వద్దన్న వారులేరు. ముజఫ్ఫర్‌పూర్ కోసం కొంత వివాదం వచ్చినా వేరే రాష్ట్రాన్ని వ్యతిరేకించలేదు. జార్ఖండ్ ఏర్పడిన నాటికి ఆ ఉద్యమం ముగింపు దశకు చేరుకుంది. మిగిలిన ప్రాంతాల వారు పోతే పోయిందిలే అనుకున్నారు. లాలూ యాదవ్ మొదట్లో కాదన్నా, పోవడమే మంచిదన్నట్టు వ్యవహరించారు. కాని తెలంగాణ విషయం వచ్చే సరికి ఒకవైపు జోరైన ప్రత్యేక ఉద్యమం, మరోవైపు చర్చించడానికి కూడా ముందు కు రాని వ్యతిరేకులు. మేమివ్వమనీ, మాతోనే కలిసి ఉండాలనీ మొండి వాద మే గాని ఎందుకు విడిపోతామంటున్నారని అడిగేవారు లేరంటే ఢిల్లీ మేధావులు ఆశ్చర్యపోయారు. అన్యాయాలు తీరుస్తామనకపోగా అసలు అన్యాయమే జరగలేదని దొంగ రిపోర్టులిప్పించుకోవడం, దానికోసం క్షణాల్లో కోట్ల రూపాయలు సేకరించి, చిల్లరవర్తకంలో ఎఫ్‌డీ ఐ కోసం వాల్‌మార్ట్ తరహాలో లాబీయింగ్‌కు ఖర్చు పెట్టడం జరుగుతున్నదని వారికి ఎవరు చెప్పగలరు?
వచ్చే ఎన్నికలలో గెలవడానికి ఎవరితో పొత్తు పెట్టుకుంటే మంచిదో చూస్తారే కాని తెలంగాణ వెనుబడిందంటే ఎవరికి పట్టింది? మొత్తం రాష్ట్ర పన్నుల ఆదాయంలో తెలంగాణ నుంచి మూడొంతులు వస్తుంది. కానీ 20 శాతం కూడా ఇక్కడ అభివృధ్ధికి వెచ్చించరు. నీళ్లు, నిధులు మళ్లిస్తున్నారు. ఉద్యోగాల్లో, చదువుల్లో తెలంగాణ వారికి కనీసం స్థానాలు కూడా దక్కనీయడం లేదు. హైదరాబాద్ రాజధాని కనుక వచ్చామని సమర్థించుకునే వారు, చుట్టుపక్కల జిల్లాలలో ఇతర జిల్లాలలో కూడా భూములు ఉద్యోగాలు తెలంగాణ వారికి ఎందుకు మిగలడం లేదో చెప్పరు.

ఉద్యమాలు ఉద్వేగంతో సాగుతూ ఉంటే కేవలం పదిబస్సులు పగలగొడితే ప్రత్యేక రాష్ట్రం ఇస్తారా అంటూ కాంట్రాక్టర్ ఎంపీలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. డబ్బు తప్ప వారికి దేశం అవసరం లేదు. జనాన్ని జనధనా న్ని సంపాదించి లాభాలు లెక్కపెట్టుకోవడం తప్ప జనం కష్టాల పరిష్కారం వారికి అవసరం లేదు. రాజకీయ పార్టీలు, కావాలని అబద్ధ ప్రచారం కోసం చెప్పే అర్థరహిత ప్రకటనలు, సంపన్నుల కొమ్ముకాసే కొన్ని మీడియా చానళ్లు విపరీతమైన ప్రచారం ఇస్తాయి. వందలమంది ఆత్మాహుతి వారి రాతి రాక్షస మనసులను కరిగించదు. నిజానికి పది బస్సులు పగులగొట్టి సమైక్యాంధ్ర ఉద్యమం ఉందంటూ ఢిల్లీకి నివేదికలు పంపుతున్నారు. ఒకరిద్దరు డబ్బుతో కెమెరా ఫోజులకు పరిమితమైన ఉద్యమాలు చేయడం, వారు వాటాలిచ్చి వెంట పెట్టుకున్నసొంత విధేయ మీడియాలో ప్రచారం చేయడం, డిల్లీ వాటినే నమ్మడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది.

తెలంగాణ ఉద్యమాన్ని నడిపే పార్టీ మీద నాయకుల మీద, తెలంగాణ గొంతు వినిపిస్తున్న కాంగ్రెస్ ఎంపీల మీద వ్యక్తిగత నిందలు వేయడం కోస్తాంధ్ర నేతల కొత్త దుర్మార్గం. వీరు తమ పార్టీలో ఉన్న తెలంగాణ హోం మంవూతుల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచి వేయిస్తారు. తెలంగాణ మంత్రి కన్నా డీజీపీకే ఎక్కువ అధికారాలుంటాయి. తెలంగాణకు చెందిన సేద్యపునీటి మంత్రిని బొమ్మవలె నిలబెట్టి, నదుల నీళ్లు తమ సీమలకు మళ్లించుకుంటారు. సిగ్గుపడవలిసిన వారు సిగ్గుపడడంలేదు. ఈ పాలసీలతో పాటు తెలంగాణకు చెందిన కొందరు ఎమ్మెల్యేల ద్వారా తెలంగాణ ఉద్యమనాయకులకు వ్యతిరేకంగా సభ్యతకు ఏ మాత్రం సంబంధంలేని భాషలో తిట్టిస్తారు. తెలుగు భాషాభివృధ్ధికి మీడియా గొప్ప సహాయం చేసిందని ఈ మధ్య జరిగిన సమావేశంలో చెప్పుకున్నారు. నిజమే. కానీ ఎవరి భాష అభివృద్ధి అయింది? తమ పక్షపాత అవసరాల కోసం నాయకుల ప్రసం గ పాఠాల్లో పత్రికావూపకటనల్లో, విలేకరుల సమావేశాల్లో వాడే భాషను అభివృధ్ధి చేసి ప్రచారం ఇచ్చి పోషిస్తున్నారు. బాగా బాగుపడిన రెండు మూడు జిల్లాల యాస తప్ప మిగతా ప్రాంతాల నాయకులందరి యాసను వీరు అవహేళన చేస్తారు, చేయిస్తారు.

తెలంగాణ వద్దంటారా ఇమ్మంటారా స్పష్టంగా చెప్పలేని నాయకులకు అస లు నాయకులుగా ఉండే అర్హత ఉందా? అనేది మరో ప్రశ్న. సీట్లు ఓట్లు మాత్రమే లెక్కించుకుంటూ జనాభివూపాయాన్ని లెక్కచేయకుండా ఏ విధాన మూ ప్రకటించని వారు పార్టీ అధ్యక్షుపూట్లా అవుతారు? దీన్నికాక మరి దేన్ని దివాళాకోరుతనం అంటారు. నాలుగు కోట్ల జనం సమస్య గురించి నాన్చే ధోరణిని అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక పార్టీలు మూడు: రాష్ట్రం ఇచ్చినట్టే ఇచ్చి వాపస్ తీసుకున్న కాంగ్రెస్, వచ్చిన రాష్ట్రాన్ని ఆపడానికి కుయుక్తులు పన్నిన తెలుగుదేశం, చంద్రబాబు వలె రెండుకళ్ల సిద్ధాంతాన్ని అవకాశవాద రాజకీయాన్ని అనుసరిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ వ్యతిరేకతలో ఒకటే, వారిలో ఐక్యత ఉంది. పైకి భేదాలు కనిపిస్తున్నా, ఈ మూడు పార్టీలలో కోస్తాంధ్ర నేతలు ఒకటే. వారిలో తెలంగాణ అనుచరుల విధేయత కూడా ఒకటే. వారు తెలంగాణ వ్యతిరేకులన్న విషయం పైకి చెప్ప రు. డిసెంబర్ 28న కూడా చెప్పరు. అనుకూలం అని చెప్పేదమ్ము వారికి ఉందని అనిపించడం లేదు. సీపీఎం చాలా స్పష్టంగా తాము రాష్ట్ర విభజన కు వ్యతిరేకమని చెప్పారు. సీపీఐ విశాలాంధ్ర వాదాన్ని మార్చుకున్నది. బీజేపీ కూడా చాలా స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తున్నది. హైదరాబాద్ పాతబస్తీకి మాత్రమే పరిమితమైన మజ్లిస్ వ్యూహం ఇతరులు ఇచ్చే నిధులను బట్టి వారి విధానాలను బట్టి మారుతూ ఉంటుంది.

తెలంగాణ నేతలను రకరకాలుగా విభజించి వారి బతుకులతో ఆడుకుంటున్న కేంద్ర నాయకుల విచ్ఛిన్న రాజకీయాలకు బ్రిటిష్ వారి దేశవూదోహ స్వార్థ రాజకీయాలకు పెద్ద తేడా లేదు. హైదరాబాద్‌ను పాతబస్తీగా కొత్త నగరంగా విభజించారు. సైబరాబాద్ కొత్తగా పుట్టించిన కోస్తాంధ్ర రియల్ ఎస్టేట్ దందాల కేంద్రం. పాతబస్తీని మజ్లిస్ చెరలో మగ్గిపోవడానికి వీలుగా అక్కడ మత కలహాలను పెంచి పోషిస్తారు. గూండా రాజకీయాలకు డబ్బిచ్చి రెచ్చగొడతారు. అక్కడి ప్రజలకు బడులు కట్టరు. అక్కడి గుడులను బతకనివ్వరు. ఆలయ భూములను ఆక్రమించి గూండాలు రోడ్డుమీద కొట్టుకుంటూ ఉంటే అది మనదేశం కానట్టుంటారు. రోడ్లు వెడల్పు చేయరు. వెనుకబడితనంలో కొట్టుమిట్టాడమని వదిలేసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టు చెప్పుకుంటారు. ఇన్ని దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల నిష్పాలనకు దుష్పాలనకు దశాబ్దాలకిందట ఉన్నంత వెనుకబడి ఉన్న పాతబస్తీయే ప్రత్యక్ష సాక్షి.

వేలకోట్ల రూపాయలు ఖర్చుచేసే పెద్ద పథకాలు పెట్టడం, భారీ ఎత్తున వాటాలు లంచాలు పంచుకోవడమేనా తెలంగాణను అభివృధ్ధి చేయడమంటే. జలయజ్ఞం పూర్తిగా భూముల దందాగా మారిపోయింది. రంగాడ్డి జిల్లా భూములు ఆ విధంగా నాశనమై జనజీవనం అస్తవ్యస్తమైంది. భూములు వెల పెరిగి స్థానికులు బాగుపడ్డారనే మాట నిజమే అయినా మోసాలకు, దురాక్షికమణలకు, దుర్మార్గాలకు ఈ పరిస్థితి దారి తీసినమాట అంతకన్నా వాస్తవం.

1956కు ముందు తెలంగాణను విడిగా ఉండనీయకుండా కలిపేందుకు గాను ప్రభావితం చేయగల ముగ్గురు నాయకులద్వారా 30 లక్షల రూపాయ ల లాబీయింగ్ జరిపారని విన్నట్టు ఆదిలాబాద్ సీనియర్ న్యాయవాది ఒకరు తెలిపారు. తెలంగాణ ఉద్యమం చెలరేగిన ప్రతిసారీ, ఢిల్లీపెద్దలకు జల్సాలు జరుపుకునేంత పెద్ద పండుగ. వారి తాబేదార్లకు, వారికోసం ఏమైనా చేసే అధికారులకు కూడా అంతే పండుగే. 1969, 2009, 2012 కూడా అంతే. వాల్‌మార్ట్ లాబీయింగ్ మీద దర్యాప్తు జరిపిస్తారట. తెలంగాణ వ్యతిరేక లాబీయింగ్ మీద, వారు ఢిల్లీలో ఇతరత్రా ఖర్చుచేసిన లాబీయింగ్‌పైన ఎవరి లాబీయింగ్‌కు లొంగని పెద్దమనుషులచేత దర్యాప్తు జరిపించే దమ్ముందా? తెలంగాణ ఇవ్వమంటారా వద్దంటారా?అనే ప్రశ్నకు డిసెంబర్ 28న ఒకే ముక్క సమాధానం చెప్పని పార్టీలు దివాళాకోరు పార్టీలని తెలంగాణ ప్రజలు తీర్మానించు కోవాలి. కాదన్న పార్టీలను పూర్తిగా తిరస్కరించాలి. అవునన్న పార్టీలను వెంటనే నమ్మకూడదు. తెలంగాణ అంటే మాకు ప్రేమ, తెలంగాణ బిడ్డలు బాగుండాలి, మేం ఎన్నడూ తెలంగాణ వ్యతిరేకులం కాదు అనివీరు చెప్పే మాటలన్నీ దారుణమైన అసత్యాలు. అవి తేనెపూసిన కత్తులు, చక్కెర చుట్టిన విష గుళికలు. అందరూ వీటినే తెలంగాణ మీద కురిపిస్తున్నారు. కాంగ్రెస్ ఎట్టిపరిస్థితిలోనూ తెలంగాణ ఇవ్వద్దని నమ్మితే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని వాదించే మోసం కూడా చేయవచ్చు. కాంగ్రెస్ ఇస్తుందని తలిస్తే వీరు ఇంకే ఎత్తుగడ వేస్తారో తెలియదు. నయవంచనకు గురైన తెలంగాణ కొత్త వంచనలను నమ్మకుండా జాగ్రత్త పడాలి.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు,
మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధనా కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Published: Tue,June 18, 2013 12:58 AM

ద్వేషం చిమ్మిన దమనకాండ

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Tue,June 4, 2013 04:20 AM

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,May 6, 2013 03:06 PM

ఆరని పగలు-అమాయకుల బలి

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్ట

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Sun,March 24, 2013 04:10 AM

నేరమే అధికారమైతే...!

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వ

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Tue,March 12, 2013 12:25 AM

ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 25, 2013 11:45 PM

రక్త పిపాసులకు జవాబు రక్తదానం

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 31, 2012 11:42 PM

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?

తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:11 PM

‘మార్చ్’ రాజ్యాంగం హక్కు

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న త

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన