కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం


Tue,January 1, 2013 05:41 PM

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసిన వ్యాఖ్య. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు రంగాడ్డి జిల్లా భూముల కేటాయింపు వివాదం కేసులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పిన తీర్పులో ఈ మాట రాస్తే రంగాడ్డి జిల్లాలో భూములు ఆక్రమించిన వ్యాపార రాజకీయ నాయకుల వర్గానికి కోపం వచ్చింది. తీర్పు నుంచి ఈ మాట తొలగించాలని సుప్రీంకోర్టుకెక్కినారు. తీర్పులో తప్పేమైనా ఉంటే దాని గురించి పరిశీలిద్దాం. ఆ మాట చెప్పడానికి వెనుక ఆయన ఏమాలోచించారో మనకు తెలియదు కదా అని న్యాయమూర్తులు అన్నరట. కొండా వెంకట రంగాడ్డి 122 వ జయంతి ఉత్సవంలోనూ జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్వయంగా రంగాడ్డి పేరు తప్ప ఆ జిల్లాలో అమాయక ప్రజలకు మిగిలిందేమీ లేదనే విషాదం వివరించడం విశేషం. రంగాడ్డి జిల్లా మొత్తం కోస్తాంధ్ర వర్తకుల భూముల వ్యాపార కేంద్రమైందని దీనర్థం. ఈ స్వార్థపరులతో ప్రభుత్వం కుమ్మక్కు కాకపోతే భూము ల దుర్మార్గ వ్యాపారం సాధ్యమే కాదు.

వనరులు, నిధులు మళ్లిస్తరనీ నీళ్లుకూడా దారి మళ్లుతయని ఉద్యోగాలు ఇక్కడి వాళ్లకు దక్కవని పెద్దమనుషుల ఒప్పందానికి ముందు కొండా వెంకట రంగాడ్డి ఊహించినవన్నీ జరిగినై. వలసవచ్చిన వారితో ఈ జిల్లా నిండా కాలనీలవుతయంటే అప్పుడు నమ్మలేదు. కాని ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ల కాలనీలే కనిపించేది. అడవులను, చెరువులను, తోటలను, గుట్టలను ఇతర భూములను కొల్లగొట్టి వాళ్ల కాలనీలుగా మార్చారు.

ఒకటి రెండు చోట్ల తప్ప రంగాడ్డి జయంతి వేడుకలు మనకు కనిపించ వు. ఆయనపేరున ఉన్న న్యాయ కళాశాలలో, ఆయన స్థాపించిన విద్యాలయ సంస్థలలో నివాళులర్పించడం జరుగుతుంది. కాని ఇంకెక్కడా జయంతి జరపలేదు. ఆయన పేరున్న జిల్లాలో కూడా ఆయన విగ్రహం ఒక్కటంటే ఒక్కటి కూడా ఎక్కడా లేదు. రంగాడ్డి విగ్ర హం పెట్టడానికి హైదరాబాద్‌లో, చేవెళ్లలో కూడా స్థలమూ అనుమతీ ఏదీ ఇవ్వలేదని రంగాడ్డి కుటుంబ సభ్యులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా రంగాడ్డి జయంతి జరుపుకుందాంలే అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ప్రకటించారు.

1956కు ముందు కాలంలో లాబీయింగ్‌కు లొంగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పడివలె మోసపూరితంగా వ్యవహరించలేదు. తప్పుడు నివేదికలు వస్తే నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించింది. తెలంగాణలో 95 శాతం మంది విలీనాన్ని వ్యతిరేకించినారన్న విషయాన్ని ఆనాటి ప్రధాని నెహ్రూకు నిర్ద్వంద్వంగా చెప్పిన నాయకుడు కొండా వెంకట రంగాడ్డి (కేవీఆర్). ‘1955లో కేంద్ర ప్రభుత్వం ఫజల్ అలీ అధ్యక్షతన పునర్విభజన కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి కాంగ్రెస్ మంత్రులు క్రమశిక్షణ పేరుతో పార్టీ అభి ప్రాయాన్నే కాకుండా తమ సొంత భావాలను యథేచ్ఛగా వెల్లడించవచ్చునన్నారు. కమిటీ వారు రాష్ట్రమంతా తిరిగారు.

అంతవరకు నేను రామకృష్ణారావు, మా అనుయాయులు పోలీసు చర్యకు పూర్వమును, తరువాతను ఆంధ్రవూపాంతము వారి చెడు ప్రవర్తన వల్ల మాకు కలిగిన అనుభవము దృష్ట్యా తెలంగాణా ఆంధ్రవూపాంతములను కలుప కూడదని ప్రచారము చేయుచుంటిమి. ఇదే విధముగా కమిషన్ ముందు కూడా వాజ్మూలములను ఇస్తిమి’ అని కేవీ రంగాడ్డిగారు తమ స్వీయచరివూతలో (పేజి 147) లో పేర్కొన్నారు. ఫజల్ ఆలీ కమిషన్ వారు అన్నిజిల్లాలు పర్యటించి, అందరి వినతులు విని, తెలంగాణమును ఆంధ్ర ప్రాంతమును వేరువేరు రాష్ట్రములుగా ఉంచవపూనని, శానసభ ఎన్నికలు జరిపిన తరువాత రెండవసారి శాసనసభలో తెలంగానా శాసనసభ్యులు రెండు రాష్ట్రములు లీనము చేయబడ వలయునని అంగీకరిస్తే రెంటినీ లీనముచేయవపూను, లేకుండే చేయకూడదు అని నివేదికలో పేర్కొన్నవిషయాన్ని కేవీఆర్ ఆత్మకథలో చెప్పా రు.

నాటి ప్రధాని నెహ్రూ నాగార్జున సాగర్ శంకుస్థాపనకు వచ్చినపుడు, బేగంపేట విమానాక్షిశయం నుంచి ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆ దారిలో తెలంగాణ స్టేటుకోసం డిమాండ్ చేస్తూ అట్టలు పట్టుకున్నారు. నినాదాలు చేసినారు, విలీన వాదులు కనిపించలేదు. ప్రజల్లో 95 శాతం మించి తెలంగాణ విడిగా ఉండాలని అనేవారే. తనను కాంగ్రెస్ అధ్యక్షుడు దేబర్, పంత్ నాలుగుసార్లు డిల్లీకి పిలిపించి విశాలాంవూధ కోసం ఒప్పించడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశా రని వివరించారు. దేబర్ కేవీఆర్‌ను రాజీ చేయమని అడిగారు. కాని అదే విధంగానూ సాధ్యం కాదన్నారు.

రెండు స్టేట్లు ఉంటే మంచిదన్నారు, బ్రిటి షు వారి వలెకాకుండా పైకి లోపల ఒకే మాట ఉంటే బాగుంటుందని కేవీ ఆర్ అంటే దేబర్ కోపించారు. తరువాత కాంగ్రెస్ పార్టీ బొంబాయి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ కె పాటిల్, అఖిల భారత కాంగ్రెస్ ఆఫీసు కార్యదర్శి గార్లు రహస్యంగా తెలంగాణ జిల్లాలలో పర్యటించి తెలంగాణ వేరే రాష్ట్రంగా ఉండాలనేదే అత్యధిక ప్రజాభివూపాయమని తెలుసుకుని అదే ఢిల్లీకి వివరించినట్టు కేవీఆర్ తన చరివూతలో వివరించారు. తరువాత నెహ్రూ తమను ఢిల్లీకి పిలిపించి, తెలంగాణ ఎంతవరకు వచ్చిందని అడిగారు, దానికి నూటికి 90 మంది వ్యతిరేకంగా ఉన్నారని కేవీఆర్ చెప్పినారు. నూటికి 90మందా అని రెండుసార్లు నెహ్రూ ఆశ్చర్యపడ్డారు. నిజానికి 95 శాతం మంది విలీనానికి వ్యతిరేకం అని కేవీఆర్ మళ్లీ అన్నారు. ఆయన రెండుసార్లు అవునా అని అక్కడే ఉన్న రామకృష్ణారావుగారివైపు తిరిగి ఏమిటన్నట్టు అడిగారు. రంగాడ్డి, చెన్నాడ్డి ఒప్పుకుంటే అందరూ ఒప్పుకోవచ్చునని వారి జవాబు. దానికి కేవీఆర్ ఎదురు వూపశ్న మేం చెపితే ఎవరు వింటారు ఎందుకు వింటారు? అని. అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ దేబర్ మీరే ఆదేశించండి అని అడిగితే 95శాతం జనం వ్యతిరేకిస్తుంటే నేనేం చెప్పగలను? అని నెహ్రూ జవాబిచ్చారు.

ఢిల్లీ వెళ్లేదాకా బల్ల గుద్ది తెలంగాణ వేరుగా ఉండాల్సిందేనన్న ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అక్కడి నుంచి రాగానే రెండు రాష్ట్రాల కన్న ఒకే రాష్ట్రం మంచిదని ప్రకటన చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు కేవీఆర్. మీ అభివూపాయం మారడానికి కారణం ఏమిటని అడిగితే ఆయన చెప్పలేదు. మిమ్మ ల్ని మార్చిన కారణాలు చెప్పండి. అవి మంచి కారణాలైతే మేం కూడా అభివూపాయం మార్చుకోవచ్చుకదా అన్నాకూడా కారణాలు చెప్పలేదు అని కేవీఆర్ తన స్వీయ చరివూతలో పేర్కొన్నారు. ఇప్పుడే కాదు అప్పుడు కూడా తెలంగాణ వారికి వ్యతిరేకంగా అబద్ధపు నివేదికలు పంపి రహస్య యంత్రాంగాలు మంత్రాంగాలు పనిచేసినట్టు ఈ చరిత్ర వివరిస్తుంది.

ఇటువంటి అనేకానేకపరిణామాలు చూసిన కొండా రంగాడ్డికి ఒకే రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్రం పట్టుదలతో ఉన్నదని, దానికి అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి కూడా అనుకూలమైనారని అర్థమైన తరువాత తెలంగాణకు ఏవైనా రక్షణలు కల్పించడానికి ఆస్కారం గురించి పరిశోధనజరిపారు. కొన్ని కచ్చితమైన షరతులు రక్షణలు విధించాలని పట్టుబట్టి పెద్ద మనుషుల ఒప్పందం రూపొందించారు. అయినా ఎవరికీ తెలియని రహస్య తంత్రాల ఫలితంగా విశాలాంధ్ర ఏర్పడింది. ఇటు దక్షిణమూ కాక అటు ఉత్తరమూ కాక, ఆ రెండు ప్రాంతాలలో ఉండే పేర్లతో కూడిన పదేశ్ అనేది ఉత్త ర ప్రాంతంలో ఉన్నపేరు) సంకీర్ణ దుష్ట సమాసం ఆంధ్రవూపదేశ్ అనే పేరున ఒక పెద్ద మనుషుల ఒప్పందంతోసహా ఏర్పాటైంది. రక్షణలు అవసరమయ్యే ప్రమాదకరస్థితిలో తెలంగాణ ఉందనడానికి ఈ ఒప్పందం ఒక సాక్ష్యం. నిరంతరం ఉల్లంఘనలకు గురైనందుననే పోరాటం తప్పలేదనడానికి కూడా ఒప్పందం ఒక ఆధారం. విడిగా ఉండాలన్న ప్రయత్నం కనీసం రక్షణల కల్పనకు దారితీసిందని వివరించారు. ప్రజాభివూపాయం అనుకూలంగా ఉన్నా తెలంగాణ నష్టపోవడం ఆనాటి నుంచే మొదలైంది. ఢిలీ ్లపెద్దలో, వారిని మభ్య పెట్టే రాష్ట్రనాయకులో తెలంగాణకు ద్రోహం చేస్తూనే ఉన్నారు.

ఉన్నదున్నట్టు మాట్లాడడం కేవీ రంగాడ్డి లక్షణం. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి కావడంలో, ఆ తరువాత ఒకటి రెండుసార్లు ఎదురైన రాజకీయ సంక్షోభాలను విజయవంతంగా దాటుకోవడంలో రంగాడ్డి కీలకపావూత పోషించారు. తను పదవిలోకి రావాలని కుట్రలకు పాల్పడలేదు. ఇచ్చి న మాట తప్పితే ముఖ్యమంత్రి అయ్యేఅవకాశం ఉన్నా అందుకు ఆపేక్షించలేదు. ప్రజాస్వామిక విలువల కోసం కట్టుబడిన వ్యక్తి. నెహ్రూను, పార్టీలో ఇతర నాయకులకు ఎదురునిలిచి నిజాలను నిర్భయంగా చెప్పిన ధైర్యశాలి.
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ 1956-2012 దాకా అనేక సార్లు ఇచ్చిన మాట దాటడం, ఏ నిర్ణయానికీ రాకపోవడం, తెలంగాణ రాష్ట్రం ఇస్తానని ఇవ్వకపోవడం, కోస్తాంధ్ర లాబీయింగ్‌కు లొంగిపోవడం జరుగుతూనే ఉన్నది.

ఇక డిసెంబర్ 28న అఖిలపక్ష సమావేశం కూడా చిల్లర వర్తక రంగంలో విదేశీ పెట్టుబడుల విధానానికి పార్లమెంటు మద్దతు కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడిని తప్పించుకోవడానికి వేసిన ఎత్తుగడే. అది కూడాజరగకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. నిజానికి అఖిలపక్షమే అవసరం లేదు. ఇదివరకు అన్ని పార్టీలు అంగీకరించిన తరువాతనే తెలంగాణ ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటు లో కూడా ధృవీకరించింది. మళ్లీ కమిటీలనీ, ఏకాభివూపాయమని, అఖిలపక్షమని తెలంగాణను నిరాకరిస్తూ వచ్చింది. మొక్కుబడి అఖిలపక్షం కూడా పార్టీకి ఇద్దరిని ఆహ్వానించడం ద్వారా వ్యర్థ ప్రయత్నమని కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది. ఇద్దర్ని రమ్మనే బదులు, ఎందరు వచ్చినా సరే పార్టీ అభివూపా యం ఇదమిత్థంగా అవుననో కాదనో చెప్పమని లేదా తెలంగాణ రాష్ట్రం ఇవ్వ డం మంచిదనో లేక కాదనో చెప్పే ఉత్తరం తెమ్మని ఉంటే సరిపోయేది.

తెలంగాణపై భిన్నాభివూపాయాలను చెప్పడానికి అన్ని ఏర్పాట్లుచేసి కాంగ్రెస్ తన నిర్ణయమేమిటో చెప్పకుండా తప్పించుకోవడానికే ఇదంతా? మొత్తం మీద హైదరాబాద్ లో మీడియా, రాజకీయ పార్టీలన్నీ తమ తమ పక్షపాతాలతో చర్చలు జరుపుకుంటూ కాలంగడపడం, వీలైతే తిట్టుకోవడం, లేదా కొట్టుకోవడం కోసం ఇదంతా ఒక ఏర్పాటు.

కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, లేదా ఒకే ఒక్క హోం శాఖలో మంత్రికి సహాయ మంత్రికి మధ్య తేడాలుండడం కూడా సాధ్యమే. ఒక హోం మంత్రి (చిదంబరం) తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందని చెప్పి ప్లేటు ఫిరాయించడం, మరొక హోం మంత్రి (సుశీల్ కుమార్ షిండే) కొత్త మంత్రి కను క మళ్లీ ఏక పక్షం అవసరం అనడం, ఆయన సహాయ మంత్రి పూర్తి మరొక రకంగా మాట్లాడడం ఢిల్లీలో కాంగ్రెస్ మార్కు రాజకీయాలకే చెల్లింది. మాతృరాష్ట్రంలో విస్తారమైన ఏకాభివూపాయం ఉంటేనే కొత్త రాష్ట్రం ఏర్పాటు సాధ్యమని రాజ్యసభలో ఒక ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి ఆర్‌పిఎస్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. భారతదేశం సమాఖ్య రాజ్యాంగం కనుక కొత్త రాష్ట్రాల ఏర్పాటు దేశ వ్యాప్తంగా చాలా సమస్యలకు కారణం కావచ్చునని మంత్రి వివరణ.

ఈ విధమైన సమాధానం చూస్తే కేంద్రవూపభుత్వం తెలంగాణ నిరాకరించడానికి రాజ్యాంగ వ్యతిరేకంగా కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉందనిపిస్తుంది. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి పాత అంతకుముందున్న రాష్ట్రం అనుమతి గానీ తీర్మానం గానీ, అందరి ఏకాభివూపాయం కాని అవసరం లేదని రాజ్యాంగం చదివితే సులువు గా అర్థం అవుతుంది. ఆర్టికల్ 3లో కేంద్రం సమంజసం అని భావిస్తే చాలు, రాష్ట్రపతి సిఫార్సు ద్వారా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి, దాన్ని శాసనసభ అభివూపాయం కోసం పంపి, శాసనసభ ఏ అభివూపాయం చెప్పినా చివరకు వ్యతిరేకించినా లెక్కచేయకుండా రాష్ట్రం ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంది. నిజానికి భారత్ అమెరికా వంటి ఫెడరేషన్ కాదు. ఇక్కడ రెండు పౌరసత్వాలు లేవు. రాష్ట్రాల మధ్య సార్వభౌమాధికార సమానత ఉంది.

మనదేశం సమాఖ్య కాదు. సార్వభౌమాధికారం పంచినా, అత్యవసర పరిస్థితుల్లో కేంద్రానికి విపరీత అధికారాలను రాజ్యాంగం ఇచ్చింది. శాసనసభను ఎన్నికైన రాష్ట్రవూపభుత్వాన్ని రద్దు చేసే అధికారం కూడా కేంద్రానికి ఉంది. ఆంగ్లేయుల పాలనలో వందలాది రాజ్యాలు ఉండడం వల్ల రాష్ట్ర పునర్విభజన పునర్నిర్మాణం అవసరమైన పరిస్థితుల్లో మాతృరాజ్యం అంగీకారం అవసరం లేకుండా రాష్ట్రాలను మళ్లీ మార్చి కొత్త హద్దులు ఏర్పాటుచేసి కొత్త రాష్ట్రాలను సృష్టించే అధికారం కేంద్రానికి ఉంది. పార్లమెంటు బిల్లును ఆమోదిస్తే చాలు. రాష్ట్రాల జాబితా ఉన్న షెడ్యూలు కొత్త రాష్ట్రం ఏర్పాటు వల్ల మారినా అందుకోసం ప్రత్యేకంగా రాజ్యాంగసవరణ కూడా అవసరం లేదని స్పష్టంగా ఉంది. మంత్రి సమాధానం రాజ్యాంగవ్యతిరేక దుర్మార్గ సమాధానం. ఇటువంటి తప్పుడు సమాధానం చెప్పినందుకు రాజ్యసభ ప్రివిపూజెస్‌ను భంగంచేసినట్టే. మంత్రి అందుకు బాధ్యుడు కావలసి ఉంటుంది.


మొత్తం ఆంధ్రవూపదేశ్‌లో ఏకాభివూపాయం ఉంటేనే తెలంగాణ ఇవ్వడం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి ప్రకటించడం ఒక రాజకీయ క్రీనీడ అనీ రాజ్యాంగ విద్రోహకర ఆలోచన అనీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు భారతదేశ సమక్షిగతను కాపాడతానని ప్రమాణం చేస్తారేగాని ఆంధ్రవూపదేశ్ సమక్షిగతను కాపాడతానని ఎవరూ ప్రమాణం చేయరు. మన రాజ్యాంగం ప్రకారం కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం, రాజ్యాంగంవూపకారం వ్యవహరించవలసిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.

సరిగ్గా ఇటువంటి సందర్భాలలోనే జనంతో ఉండే నిర్భయనాయకుడు అవసరం. తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే సమయంలో మోసాలను ఎదిరించే నాయకులు అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే నెహ్రూముందు కూడా తొణకకుండా తెలంగాణ పరిస్థితి వివరించిన కొండా వెంకట రంగా రెడ్డి వంటి వారు అవసరం. దొంగ నివేదికలు, తప్పుడు సమాచారాలు, ధనవూపలోభాలు ఇవ్వగల చిన్నసైజు వాల్ మార్ట్ కోస్తాంధ్ర వ్యాపార వాణిజ్యవేత్తల ప్రభావాన్ని తట్టుకుని వ్యవహరించే జాతీయ నాయకత్వం లేకుండా పోయిం ది. ఈ మోసాలు ఎదుర్కోవాలంటే కొండా స్ఫూర్తితో తెలంగాణ కోసం పోరాడే నేతలంతా ఏకం కాకతప్పదు.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు,
మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధనా కేంద్రం సమన్వయకర్త


35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి