ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది. అమ్మానాన్నలను జైల్లో పెడితే ప్రతి కుటుంబం జైల్లో నూ... ప్రతి బాలుడు అబ్జర్వేషన్ హోంలోనూ ఉండరా అన్నది ప్రశ్న. 15 చదరపు సెంటీమీటర్ల మేరకు వాతలు ఏడేళ్లలోపు బాలుడి శరీరం మీద ఉంటే దాన్నేమందాం అన్నది దానికి ఎదురు ప్రశ్న. సంపాదనలో పడి, వత్తిడులకు లోనై, తమచుట్టూ ఉన్న సమస్యల పై ఉన్న కోపాన్ని పిల్లలపైన తీసే తల్లిదంవూడులనుంచి వారిని ఎవరు రక్షిస్తారు? కన్నవారి నుంచి దూరమైన పిల్లలను ఆదుకోవడానికి నీతులు, చట్టాలు, నియమాలు, బాల సంక్షేమ కేంద్రాలు, సేవలు ఎన్ని ఉన్నా వాటితోపాటు అవినీతి, స్వార్థం, అందులో డబ్బు మార్కె ట్ వ్యాపారం కూడా నిండుగా ఉన్నాయి. చేయూతనిచ్చి బతుకులోకి నడిపించవలసిన వారే బెదిరించినా కొట్టినా, వెళ్లగొట్టినా, లేదా వెళ్లిపోయేట్టు చేసినా పిల్లలను ఇంకెవరు ఆదుకుంటారు?
కాల్చిన చంచాతో పెట్టిన వాతలు 15 చదరపు సెంటీమీటర్ల సైజులో ఉన్నాయనే సాక్ష్యాలు ఓస్లో కోర్టుముందు వచ్చినాయి. ఇది నిజమైతే భారతదేశంలో మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చని ఇండియన్ పీనల్ కోడ్ 323, 324 334 సెక్షన్లు వివరిస్తున్నాయి. ఇదే జరిగితే ఇది మందలింపు కాదు, నెత్తిన మొట్టడం కాదు, చిన్నతొడపాశం కాదు, ఆదరణనిండిన చేత్తో వీపుమీద చరచడం కాదు.
2007 నుంచి 9మార్చ్ 2012 మధ్యకాలంలో ఫ్రాగ్ నెర్వీన్ 39, ఓస్లోలో నగరంలోని ఇతర ప్రాంతాలలో సాయిశ్రీరాం వల్లభనేని వంటిపైన చంచాతో కాల్చినట్టు ఇతర వస్తువులతో వాతలు పెట్టినట్టు మచ్చలు ఉన్నై. చాలాసార్లు బెల్టుతో లేదా ఇతరత్రా కొట్టినట్టు దాఖలాలు ఉన్నై. చెక్క గంటెతో ఇతర వస్తువులతో కొడతామని, చెంచాతో నాలికమీద కాలుస్తామని, బెల్టు తో ఇంకా కొడతామని బెదరించినట్టు ఆరోపణలో పేర్కొన్నారు. నవంబర్ 26, 27 తేదీల్లో విచారణ జరిగింది. నిందితులు నేరం చేయలేదన్నారు. ఏడుగురు సాక్షుల వివరణను కోర్టు విన్న ది. ఇతర పత్రాలు నివేదికలు చూసింది. చంద్రశేఖర్ దంపతులు బాధ్యతాయుతంగా విచారణకు హాజరు కావడం కోసం, ఓస్లో కు వచ్చారు. పాంటు తడుపుకున్న సాయిశ్రీరాంను బడి పంతుళ్లు ఇంటికి పంపిస్తానంటే భయపడ్డాడు.
చెంచాతో నాలికమీద వాతలు పెడతారని బెదరింపు విషయం బయటకు వచ్చింది. ఆ విషయం టీచర్ చెప్పిన వెంటనే నార్వే చైల్డ్ కేర్ సర్వీసు వారు రంగంలోకి దిగారు.దంపతులను ఇంటరాగేట్ చేశారు. సాయిశ్రీరాంను కోర్స్ వోల్ అక్యూట్ పిల్లల సంస్థలో ఎనిమిది వారాలు ఉంచారు. చిన్న కొడుకును అదే భవనంలో పై అంతస్తులో ఉన్న కుటుంబానికి తాత్కాలికంగా అప్పగించారు. అయితే పిల్లవాడికి మానసికంగా చిన్న సమస్య ఉందని చిన్న సంఘటన జరిగితే ఎక్కువగా ఊహించుకుని, భయపడడం అలవాటని నిందితులు వాదించారు. కాని కోర్టు నమ్మలేదు. ఎడిహెచ్డి అనే మానసిక సమస్య వల్ల పిల్లలు తల్లిదంవూడులకు దూరమైతే ఇంకా కష్టాలు ఎక్కువే అవుతాయి కాని తగ్గుతాయా అనే కీలకమైన అంశం ట్రయల్ కోర్టు పరిశీలించిందా?
ఈ బాధిత పిల్లలను నిందితులను ఇంటరాగేట్ చేసినప్పుడు పిల్లల టీచర్ ఫాస్ ఉన్నారు. వివిధ దశల్లో టీచర్‌కు చెప్పినవి, బాలసంక్షేమ అధికారులకు చెప్పినవి, గార్డుకు చెప్పిన అంశాలు ఒకే రకంగా ఉన్నాయి. వైరుధ్యాలు లేవని కోర్టు భావించింది. అయినా తల్లిదంవూడుల మాటలకు సరైన విలువ ఇచ్చారా? ఈ పిల్లల మాతృభాష, వారు విదేశంలో మాట్లాడే భాషలో తేడా వల్ల బాధల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు భావించే ప్రమాదం ఉందని నిందితులు చేసిన వివరణను కూడా ఓస్లో కోర్టు అంగీకరించలేదు. భాషా కష్టాలు ఉన్నమాట నిజమే అయినా వాస్తవాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని కోర్టు భావించిం ది.
నిందితుల పక్షాన వచ్చిన మరొక వాదం ఏమంటే బడిలో బొమ్మలు దొంగిలించడం తప్పని కొడుకును మందలిస్తున్నపుడు చేతిలో ఉన్న చెంచా ప్రమాదవశాత్తూ మీద పడి పిల్లవాడి శరీరం మీద గాయమైందే కాని, కావాలని వాత పెట్టలేదన్నారు. నిపుణుడైన డాక్టర్ టార్క్ లిడ్ ఆస్ గాయాల స్వరూ ప స్వభావాలను పరిశీలించి అది కావాలని చేసిన గాయమేనని నిర్ధారించడం నిందితులు వ్యతిరేకంగా పనిచేసిన బలీయమైన సాక్ష్యం. మరి జనవరిలో గాయాన్ని మార్చిలో పరీక్షిస్తే ఫలితాలు ఎంతవరకు కరెక్టు? వీపుమీద వాతలు ఉన్నాయని అంటున్నారేగాని ఆ ఫోటోలు లేవు. బెల్టుతో కొట్టినాడా లేక స్కూల్ బస్సులో బెల్టు పెట్టుకునే రీతి గురించి తండ్రి చెప్పినాడా అనే పాయిం ట్ మరొకటి.
ఈ సంఘటనలన్నింటిలో తల్లి కూడా ఉంద ని అనడానికి ఆధారాలేమిటి? సహేతుకమైన అనుమానాలకు అతీతంగా నేరం రుజువైం దా? నిజాలు రుజువులు, వాటిని నమ్మిన తీరు, సందేహాలు, అనుసరించిన విధివిధానాలు, చట్టాన్ని అన్వయించిన పద్ధతి వంటి అంశాలు పునః పరిశీలించేందుకు మళ్లీ కోర్టు విచారణ జరగాలని అడగవచ్చు.
గుట్టుగా ఉండాల్సిన కుటుంబం గురించి ప్రపంచమంతా చర్చించే పరిస్థితి రావడం తీవ్రమైన అంశమే. ప్రతి టివీ ఛానెల్ కొన్నిగంటలకొద్దీ వీరి విషయమే చర్చించింది. లోతుల్లోకి వెళ్లింది ఒకరిద్దరే. తల్లిదంవూడుల పట్ల సానుభూతి అవసరమే కాని అది మాత్రమే చర్చించడం తప్పు. చాలా సందర్భాలలో నార్వేలో ఉన్నంత కఠినంగా భారత చట్టాలు లేవని చాలా మంది వాదించారు.
కన్న కొడుకును చెంచాతో కాల్చారని తల్లిదంవూడులపై పోలీసులు ఆరోపణచేసి రుజువు చేయ గలిగితే, ఆరోపణలు నిజమైతే మనదేశంలో అది కావాలని నిప్పుతో గాయపరచడం అవుతుంది కనుక సెక్షన్ 334 కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష (జరిమానాతో గానీ లేకుండాగానీ) విధించవచ్చు. సంరక్షకులకు కొన్ని మినహాయింపులు ఉంటాయి. 12 సంవత్సరాలలోపు పిల్లల ప్రయోజనం కోసం, సదుద్దేశంతో సందర్భాన్ని బట్టి అవసరం మేరకు వారిని గాయపరిచినా తల్లిదంవూడులు నేరం చేసినట్టు కాదని కనుక వారిని ఈ గాయపరిచారనే నేరాల కింద శిక్షించడానికి వీల్లేదని సెక్షన్ 9 ఒక మంచి రక్షణ కల్పించింది. 12 ఏళ్లలోపు పిల్లవాడిని దేవతకు బలి ఇస్తే పిల్లవాడు ముక్తిలాభం పొందుతాడని మనస్ఫూర్తిగా నమ్మి ఏ దురుద్దేశమూ లేకుండా కన్నతండ్రి లేదా తల్లి అతన్ని చంపితే ఈ రక్షణ లభించదు. అదేవిధంగా తీవ్రంగా గాయపరిస్తే కూడా రక్షణ లభించదు. సెక్షన్ 9 పిల్లలమీద నేరాలు చేయడానికి అమ్మానాన్నలకు అధికారం ఇచ్చే నియమం కాదు.
ప్రమాదంలో గాయపడిన పిల్లవాడికి కాలు తీసేయవలసి వస్తే డాక్టరు గారు తండ్రి ఆమో దం కోరతాడు. ఆవిధంగా ఆమోదించడం ఈ రక్షణ వల్ల నేరం కాకుండా పోతుంది. లేదా తండ్రే సర్జన్ అయితే కొడుక్కు ఆపరేషన్ చేసి కాలు తీసేయడం వల్ల అతని ప్రాణ రక్షణ కలుగుతుందనుకుంటే అది నేరం కాదు. అందుకు శిక్షా ఉండదు. అటువంటి సందర్బాలలో 12 సంవత్సరాల పిల్లలను కాపాడడానికి గాను తల్లిదంవూడులు తీసుకునే ఆపరేషన్ నిర్ణయాలను రక్షించడానికే ఈ నియమం. అందులో దురుద్దేశం లేకపోవడం ముఖ్యమైన అవసరం. చెంచాతో వాతలు పెట్టడం బెల్టుతో కొట్టడం అనేవి కూడా పిల్లవాడిని బాగుచేయడానికే అతడిని మందలించి మంచిదారిలో పెట్టడానికే కనుక ఆ అధికారం కన్నవారికి ఉందని చట్టం చెప్పడం లేదు.
స్వీడెన్ చట్టం సెక్షన్ 219 ఏమంటుందంటే: ఎవరైనా తన ప్రస్తుత లేదా మాజీ భాగస్వామి పట్ల, తన, లేదా ఆమె ప్రస్తుత, లేదా మాజీ భాగస్వామి సంతతితో, తన, లేదా ఆమె సంతతితో, కుటుంబంలో ఏ వ్యక్తితోనైనా, తన పోషణలో ఉన్న ఏ వ్యక్తి పట్లనైనా బెదరింపులతో, వత్తిడితో, స్వేచ్ఛను హరించినా, హింసించినా మరే ఇతర విధంగా పదేపదే దుర్మార్గంగా వ్యవహరించినా లేదా తీవ్రస్థాయిలో ఆ తప్పులు చేసినా మూడేళ్లకు మించని జైలుశిక్ష విధించడానికి అర్హుడవుతారు. స్వల్ప గాయం కోసం పోలీసుల, కోర్టుల సమయాన్ని వృథా చేయడం సమంజసం కాదు. రైలెక్కడానికి గట్టిగా తోయడం, మొట్టికాయ వేయడం, గట్టిగా వీపుబాదడం ... ఇవన్నీ చిన్న నేరాలు. కోర్టులు పట్టించుకోనవసరం లేదు. ఈ నియమాలతో పోల్చితే బెల్టుతో వాతలు పెట్ట డం, చెంచాతో కాల్చడం చిన్న గాయాలు కావనీ బెదిరించడం కూడా నేరమవుతుందనీ అర్థమవుతుంది.
మానసికంగా పిల్లలను వేధించడం ఎవరు చేసినా కూడా క్రూరత్వమే అవుతుంది. పిల్లపూవరూ ఫిర్యాదుచేయరు కనుక, చేయవచ్చని వారికి తెలియదు కనుక ఇతర వ్యక్తులు సాధారణంగా పట్టించుకోరు కనుక, పోలీసులకు తెలిసినా తమంత తాముగాఇటువంటి నేరపూరిత చర్యలు తీసుకునే అమ్మానాన్నల మీద దర్యాప్తు చేసే సమయం ఉండదు కను క, మనదేశంలో జనాభా వైపరీత్యం వల్ల ఇవన్నీ ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోరు కనుక నడిచిపోతున్నది. అంతే. పిల్లలు ఇంటినుంచి పారిపోయేదీ, బాలకార్మికులుగా మారేదీ, చిన్న నేరాలకు పాల్పడేదీ, లేదా మొండి వైఖరితో చెడిపోయేది కూడా తల్లిదంవూడులు వాతలు పెట్టడం వంటి అతి దౌర్జన్యాలకు పాల్పడడం వల్లనే అని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి.
పిల్లల అధీనంలో ఉన్న వ్యక్తి ఎవరైనా (కన్నవారితో సహా) దాడిచేసినా, వదిలేసినా, కావాలని నిర్లక్ష్యం చేసినా మానసిక శారీరక వేదన కు గురిచేసినా బాల న్యాయ చట్టం 2000 సెక్షన్ 23 కింద ఆరునెలల జైలుశిక్ష విధించవచ్చు జరిమానా కూడా వేయవచ్చు. రక్షించవలసిన తల్లిదంవూడులే పిల్లలను హింసిస్తే అది నేరమేనని గృహహింస నుంచి మహిళలను రక్షించే చట్టం 2005 వివరిస్తున్నది. పిల్లలు (మగపిల్లలతో సహా) రక్షణ కోరవచ్చు, హింస తీవ్రమై ఐపిసి నేరాల పరిధిలోకి వస్తే అందుకు బాధ్యులైన వారిని ప్రాసిక్యూట్ చేయాలని కోర్టులు ఈ చట్టం కింద ఆదేశించవచ్చు, రక్షణాధికారికి సూచించవచ్చు. అది ఐపిసి సెక్షన్ 334 కింద నేరమయితే మూడేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వారు కోర్టును కోరే ఈ చట్టం కింద ఉంది.
అంతర్జాతీయ చట్టాలు దేశీయచట్టాలు న్యాయ సూత్రాలు చెప్పేదేమంటే పిల్లలు వారి కుటుంబంలోనే క్షేమంగా ఉండగలుగుతారని. కాని అసాధారణమైన కారణాల వల్ల గృహం స్వర్గ సీమ కాకుండా నరకసీమ అయితే ప్రభు త్వం జోక్యం చేసుకోవాలని కూడా అంతర్జాతీయ బాలల హక్కుల ఒప్పందం సిఆర్సి 199 సూచిస్తున్నది. ప్రేమాదరాలున్న కుటుంబ వాతావరణంలో సహజంగా పిల్లలు పెరగడానికి అనువైన వనరులు కల్పించాలని సిఆర్సి సూచిస్తున్నది.
పిల్లలను అన్ని రకాల శారీరకశిక్షలనుంచి దోపిడీలనుంచి, తల్లిదంవూడుల, పోషకుల, కుటుంబ సభ్యుల, సంరక్షకుల నమ్మకాలనుంచి కూడా రక్షించాలని ఆర్టికల్ 2 స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల సంక్షేమ మే అత్యంతవూపాధాన్యత సంతరించుకోవాలని ఇతరుల హక్కుల ప్రమేయం లేకుండా బాలల హక్కులను కాపాడేడందుకు ప్రభుత్వం, శాసనసభలు, ఇతర పాలన సంస్థలు పనిచేయాలని ఆర్టికల్ 3 పేర్కొన్నది. తల్లిదంవూడుల హక్కులను విధులను కూడా సిఆర్సి గుర్తించింది. కాని పిల్లల ప్రయోజనాలకే ప్రాధమ్యం ఇవ్వాలని సిఆర్సి వివరించింది. తల్లిదంవూడుల దగ్గర బాలల ప్రయోజనాలు నెరవేరబోవని వారి సంక్షేమం కోసం తల్లిదంవూడుల నుంచి దూరంగా ఉంచడం అవసరమని న్యాయసమీక్షలో తేలిన సందర్భాలలో మాత్రమే చట్టం నిర్దేశించిన విధానాలను అనుసరించి వారిని దూరం చేయాలని ఆర్టికిల్ 9 వివరిస్తున్నది.
ఆర్టికల్ 19 ప్రకారం తల్లిదంవూడులు పోషకులు లేదా వారి బాగోగులు చూసేవారి అధీనంలో ఉన్నపుడు ఏ విధమైన మానసిక, శారీరక హింస, గాయం, దౌర్జన్యం, దుర్వ్యవహారం, దోపిడీ, తిండి పెట్టకపోవడం, లైంగిక హింస వంటి వాటికి గురికాకుండా పిల్లలను రక్షించడానికి అన్ని రకాల పాలనా, శాసన, విద్యా, సాంఘిక పరమైన చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని స్పష్టంగా వివరిస్తున్నది. తల్లిదంవూడుల వద్ద ఉండడం వారి ప్రయోజనాలకు భంగకరమైన సందర్భాలలో, అది ఆరోగ్యకరం కాదని తేలిన తరువాత అక్కడ్నుంచి తొలగించి వారికి ప్రత్యేకమైన రక్షణ ఏర్పాటు కలిగించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆర్టికిల్ 20 వివరిస్తున్నది. నార్వే ఈ సిఆర్సి పైన 26 జనవరి 1990 సంతకం చేసి, 9 డిసెంబర్ 1996న ఆమోదం తెలిపింది. మన భారత్ 11 డిసెంబర్ 1992 నాడు ఈ అంతర్జాతీయ బాలల హక్కులను అంగీకరించింది.
విధించిన శిక్ష విషయంలోనూ రెండు అంశాలున్నాయి- శిక్ష తీవ్రత, సమంజసత్వం. పిల్లలను తల్లిదంవూడులనుంచి విడదీయడం అనేది చాలా అరుదైన సంఘటనల్లో తప్పనిస్థితిలో మాత్రమే జరగాలని 199 పిల్లల హక్కుల అంతర్జాతీయ ఒప్పందం, ఇతర మానవ హక్కుల పత్రాలు పేర్కొన్నాయి.
తండ్రితోపాటు తల్లికి కూడా 15 నెలల జైలు విధిస్తే ఇద్దరు పిల్లల పరిస్థితి ఏమిటి? ఆ కుటుంబంలో తండ్రి ఒక్కడే సంపాదిస్తున్నాడు. అతనే జైల్లో ఉంటే వారి రోజువారీ పోషణ సంగతేమిటి? ఈ అంశాలు అప్పీలులో పరిశీలించాలి. కత్తితో నెత్తుటి నేరాలుచేసిన వారికి, పిల్లలను అతిగా కొట్టిన తల్లిదంవూడులకు ఒకే సెక్షన్ కింద జైలు శిక్ష వేసి ఒకేజైల్లో ఒకే సెల్లో వేయడం ఎంతవరకు సమంజసం అనేది మరో మౌలిక ప్రశ్న. ఇది నాగరిక సమాజం శాస్త్రీయ ఆలోచనా విధానం అంగీకరించకపోవచ్చు. పిల్లలు తల్లిదంవూడుల ఇంట్లో వస్తువులు బిందెలు తప్యాలలు కాదు. వారు కుటుంబానికి వంశానికి వారసులు, విశ్వ మానవజాతికే పిల్లలు భావి సంపద. వారిని ఆరోగ్యంగా ఎదగనీయడం అనేది తల్లిదంవూడుల ధర్మ కర్తృత్వ బాధ్యత. ఆ విషయాలు వారికి తెలియ జెప్పి వారిలో పరివర్తన కలిగి పిల్లలను ఆదరించే పాఠాలు చెప్పాలే కాని కరడు గట్టిన నేరస్తులకు వేసే కఠిన శిక్షలు వేయడం సిగ్గుచేటు.
ఉత్తమ శాసన, ప్రజాస్వామ్య, రాజ్యాంగ, పారదర్శక విధానాలను అనుసరించే స్కాండినేవియన్ దేశాలలో నార్వే ఒకటి. సమాచార చట్టం, సమస్యా పరిష్కార ఆంబుడ్స్మన్ వ్యవస్థలు అమలుచేయడంలో వారు ఆద్యులు. పిల్లల జననం, పెంపకం చదువు, ఆరోగ్యం అభివృద్ధిలో స్వీడెన్ మానవాభివృద్ధి సూచికలో అగ్రస్థానాన ఉంటే మనదేశం అడ్రస్‌లేని స్థానంలో ఉంది. అక్కడ కూడా పెంపకం దత్తత కుంభకోణం స్థాయికి చేరుకున్న విమర్శలు వినిపిస్తున్నాయి, పిల్లల హక్కులకు భంగం కలిగితే ఎవరూ ఫిర్యాదు చేయనవసరం లేకుండా సమాచారం అందినా చర్యలు తీసుకునే వ్యవస్థ అవసరం. కాని ఉండడం కష్టం. పిల్లలను ప్రేమతో పెంచుకోవడం తల్లిదంవూడుల బాధ్య త. పిల్లలకు మరోచోట అంతటి భద్రత ఉండదు.
-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు,
మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధనా కేంద్రం సమన్వయకర్త