నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం


Sat,December 1, 2012 11:49 AM

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో తెలంగాణను సుదీర్ఘకాలం బాధించే గాయాలు. ఎందుకు? మొత్తం దేశానికి స్వాతంత్య్రం ఆగస్టు 15న వస్తే, హైదరాబాద్ రాజ్యంలో తెలుగు మాట్లాడే తెలంగాణ జిల్లాలకు రజాకార్ల ఊచకోత దుర్మార్గ రాజ్యం మరో13 నెలల నాలుగు రోజుల పాటు కొనసాగడానికి నెహ్రూ నిష్క్రియా పరత్వమే కారణం కాదా? ఎన్ని ఊళ్లు తగలబడి, ఎందరి మాన ప్రాణాలు దోచుకున్నా ఢిల్లీలో జాతీయ నాయకులకు పట్టలేదు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ధైర్య సాహసాల వల్ల తెలంగాణ బతికింది లేకపోతే, ఇంకా రక్తపాతంతో అట్టుడికిపోయేదేమో. ఇది మొదటి అన్యాయం. తరువాత తెలంగాణను భాషావూపయుక్త రాష్ట్రం అంటూ ఆంధ్ర తో విలీనం చేయడం రెండో అన్యాయం, పోచంపాడును పాడు బెట్టి నాగార్జున సాగర్‌ను పెంచి తెలంగాణను నీళ్లను దూరం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది.

హైదరాబాద్ రాజ్యం భారత దేశంలో విలీనమైన తరువాత, మద్రాస్ రాష్ట్రం నుంచి విడివడి ఏర్పడిన ఆంధ్రను హైదరాబాద్ రాజ్యంలో నుంచి విడదీసిన తెలుగు భాషా ప్రాంతాలతో కలపాలనడానికి ఏది ప్రాతిపదిక? తెలుగు మాట్లాడే వారంతా ఒక రాష్ట్రంలోనే ఉండాలనడం అంటే ఏమిటి? ఆంధ్రవూపదేశ్‌లో తెలుగు మాట్లాడని వారు ఉండకూడదని లేక తెలుగు మాట్లాడేవారు ఆంధ్రవూపదేశ్‌లో తప్ప మరెక్కడా ఉండకూడదనీ, ప్రపంచం లో ఎక్కడ తెలుగు మాట్లాడే వారున్నా ఇక్కడికి రప్పించి, తెలుగు మాట్లాడని వారిని బయటకు పంపించాలని అంటే ఎంత దారుణమో, ఎంత అసమంజస మో, ఇదీ అంతే దారుణం, అసమంజసం. చారివూతిక కారణాల వల్ల ప్రజలతో ప్రమేయం లేకుండా, తిరుగుబాట్లు, యుద్ధాలు, ద్రోహాలు, విదేశీయుల దురాక్షికమణల వల్ల ఇప్పుడు న్న రకరకాల ప్రాదేశిక రాజ్యాలు ఏర్పడ్డాయి. స్వతంవూత భారతదేశం వాటిని ఏ హేతుబద్ధ ప్రాతిపదికన పునర్విభజించాలో లేదా పునర్నిర్మించాలో తేల్చుకోకుండా ఒకే భాష ఒకే ప్రాంతం అనేది నినాదమే కాని విధానం కాదు. అదెంత మేరకు సరైందో నిర్ణయించుకోవాలి. కాని చేయలేదు. స్వయంగా జాతీయోద్యమ నేతలలో ఒక ప్రముఖుడై ఉండి కూడా జవహ ర్‌లాల్ నెహ్రూ కోట్లాది ప్రజల సంక్షేమానికి సంబంధించిన రాష్ట్ర పునర్నిర్మాణ ప్రాతిపదిక గురించి ఏమాలోచించినట్టు? నల్ల డబ్బుతో, కులబలంతో ఎన్నికల్లో గెలిచి వ్యాపారం పెంచుకునే దగుల్బాజీ ఎంపీ ఏదిబడితే అది మాట్లాడతారు, చేస్తారు కూడా. కాని జాతీయ నాయకులు ఆలోచనా వేరు గా ఉంటుంది ఉండాలి.

చరివూతను ప్రజల పక్షాన అన్వయించే టి.వివేక్ ఇటీవల భాషను రాష్ట్ర సరిహద్దుగా నిర్ణయించే విధానం పుట్టుకను మార్పులను దక్కన్ లాండ్ మాసపవూతికలో విశ్లేషించారు. ఎజి నూరానీ అనే ప్రముఖ రచయిత మరొక విశ్లేషణలో భాష ప్రాతిపదిక పూర్వాపరాలు తెలిపారు. ఆనాటి జాతీయ కాంగ్రెస్ పార్టీ, నాయకత్వం వహించిన నాయకులు, నెహ్రూవంటి పాలకులలో వచ్చిన మార్పులను తెలంగాణ పైన చేసిన మోసాల నేపథ్యం లో వివరించారు. ఒకే భాష మాట్లాడే బెంగాల్ ప్రాంతాన్ని విభజించడం పొరపాటని బ్రిటిష్ పాలకులు భావించినప్పుడు భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకావాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. 1927లో సైమన్ కమిషన్ ముందు కాంగ్రెస్ భాష ప్రాతిపదికగా ఉండాలన్నది. పంజాబ్ నుంచి సింధ్‌ను, మద్రాస్ నుంచి ఆంధ్రను వేరు చేయాలని భావించారు. 1937, 1938 లో భాషా ప్రాతిపదికను పునరుద్ఘాటించడమే కాక 1945-46 ఎన్నికల మానిఫెస్టోలో కూడా కాంగ్రెస్ భాషావూపయుక్త రాష్ట్రాలను సమర్థించింది. స్వతంత్రం సాధించిన తరువాత కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు పెరిగాయి. కన్నడ రాష్ట్రం, మహారాష్ట్ర కోసం కూడా డిమాండ్ పెరిగింది. దాంతో రాష్ట్రానికి ప్రాతిపదికను నిర్ధారించవలసి వచ్చింది.
అలహాబాద్ మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌కే దార్ అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటయింది.

ఇందులో బి సి బెనర్జీ, డాక్టర్ పన్నాలాల్ (సివిల్ సర్వీస్ అధికారి), జె నారాయణ్ లాల్ (సీనియర్ న్యాయవాది) వంటి ప్రముఖులు సభ్యులు. భౌగోళికంగా ప్రాంతం కలిసి ఉండడం, ఆర్థికంగా స్వయం సమృధ్ధి, పరిపాలనా సౌకర్యం, అభివృద్ధికి ఆస్కారం ఉంటే అత్యధిక జనామోదంతో కొత్త రాష్ట్రం ఏర్పరచడం మంచిదని దార్ కమిషన్ డిసెంబర్ 10, 1948లో ఇచ్చిన నివేదికలో వివరించింది. పాలనా సౌల భ్యం ఉంటేనే ఒకే భాష మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఇవ్వవచ్చునని దార్ కమిషన్ అంటూ, భాషను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే జాతీయ ప్రయోజనాలకు భంగకరమని కూడా స్పష్టం చేసింది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ కమిషన్ వ్యతిరేకించింది. వారం తరవాత జైపూర్ సదస్సులో కాంగ్రెస్ పార్టీ ఈ అంశం గురించి రాజకీయ నిర్ణయం తీసుకునేందుకు జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్ భాయ్ పటేల్, పట్టాభిసీతా రామయ్య గార్లతో జెవిపి కమిటీ రూపొందించారు. అసలు కొత్తగా రాష్ట్రాల ఏర్పటే ఆ పరిస్థితిలో కూడదని భావించిందీ కమిటీ. కాని జనం సెంటిమెంట్ విపరీతంగా ఉన్న చోట ప్రజాస్వామ్యం తప్పనిసరి అవుతుంది. అప్పుడ కూడా తప్పదనుకుంటే కొన్ని పరిమితులకు లోబడి, భార త దేశ సంక్షేమం కోసం ఏర్పాటు చేయాలని ఈ ముగ్గురు భావించారు.

ఇది భాషా రాష్ట్రానికి సగం తలుపులు తెరవడం అని భాషావాదులు గమనించారని, ఇది భాషోన్మాద స్థాయికి చేరిన ఈ వరదను ఎదుర్కొనడం సాధ్యమనే భ్రమలో కాంగ్రెస్ నాయకత్వం ఉందని, ఈ వరద వల్ల కలిగే తీవ్ర నష్టాల ను నాయకులు నివారించడానికి ఏ జాగ్రత్తలూ తీసుకోలేదని, ప్రయత్నాలుచేస్తే కదా ఫలించడమో వైఫల్యమో, కాని వైఫల్యం అనివార్యం అయిందని, ప్రముఖ చారివూతిక విశ్లేషకుడు ఎ జి నూరాని వ్యాఖ్యానించారు. బిఆర్ అంబేద్కర్ బొంబాయి రాజధానిగా మహారాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన రాజ్యాంగ దార్శనికుడు. ఆయన ఆ విధంగా భాషా రాష్ట్ర వాదాన్ని సమర్థిస్తూ దార్ కమిషన్‌కు కూడా నివేదిక సమర్పించారు. భాష ప్రాతిపదికన మహారాష్ట్రను బొంబాయి రాజధానిగా ఏర్పాటు చేయడం మంచిది కాదని మరొక ప్రముఖ న్యాయవాది గుజరాతీ అయిన కె.ఎం. మున్షీ చేసిన హెచ్చరికను ఎవరూ పట్టించుకోలేదు. బొంబాయి మహారాష్ట్ర విషయంలో మున్షీ ప్రతిపాదనలు విఫలమైనా, భాషావూపయుక్త ప్రాతిపదికపై ఆయన చేసిన వాదం ఓడిపోలేదని నూరాని విశ్లేషించారు. ఒక రాష్ట్రంలో మరొక భాషా వర్గాన్ని వేరు చేయడం, వివక్షకు గురి చేయడం ఆగేంత వరకు భాషోద్వేగాలు తీరవు. ప్రాథమిక హక్కులు, మినహాయింపులు, రక్షణలు, షరతులు, పెద్ద మనుషుల ఒప్పందాల ద్వారా కనిపించని ఈ విద్వేషాలు మాన్పించడం సాధ్యం కాదు.

ఒక భాషా ప్రాంతంలో ఇతర భాషల వారిని శత్రువులుగా చూసే అసహన జాతీయ వాదం మొదలవుతుంది. మెజారిటీయే ప్రజాస్వామ్య సూత్రం అంటూ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే అది దారుణ నియంతృత్వంతో సమానమని ప్రొఫెసర్ ఫ్రెడరిక్ షుమన్ మాటలను నూరాని ఉటంకించారు. భాషా ప్రాతిపదిక రాష్ట్రాలను సమర్థించిన అంబేద్కర్ దానికొక తీవ్రమైన షరతును విధించారు. కేంద్రంలో ఏ అధికా ర భాష అమలులో ఉందో అదే భాష రాష్ట్రంలో కూడా ఉండాలి. కేంద్రానికి భిన్నమైన భాష రాష్ట్రంలో అధికారిక భాషగా ఉంటే పరిణామాలు చెడుగా ఉంటాయని అంబేద్కర్ హెచ్చరించారు. రాష్ట్ర భాష సహజంగానే అధికారభాషగా ఉండగలిగినా ఉండనీయకూడదని అంబేద్కర్ సూచన. ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణలో కూడా తెలుగు భాషే ఉన్నా అక్కడి మాండలికాన్ని సంస్కృతిని అన్ని రకాలుగా అవమానిస్తూ, అది భాషే కాదని ద్వేషి స్తూ, వారిని ఆర్థికంగా అణచివేసే దుర్మార్గం కొన్ని దశాబ్దాలుగా సాగుతున్నది. ఒక భాషకు మరొక భాషకు అంతరం గురించి అంబేద్కర్ ఆందోళ న పడ్డారు కాని, ఒకే భాషలో ఒకవర్గం దురహంకారానికి మరొక వర్గం మాండలికం తమ వారి ఆర్థిక బలహీనతతో పాటు బలికావడం ఇంతకుముందు లేదు. మరే ఇతర కారణాల వల్ల భాషా రాష్ట్రం మనుగడ సాధించే అవకాశం ఉంటే భాష ప్రాతిపదికను అంబేద్కర్ అంగీకరించారు. మెజారిటీ దారుణాల నుంచి మైనారిటీలకు రక్షణ కావాలన్నా రాష్ట్రం చిన్నదిగా ఉండాలని కూడా అంబేద్కర్ మరో సందర్భంలో అన్నారు.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఫజల్ అలీ అధ్యక్షతన ఏర్పటయిన రాష్ట్ర పునర్విభజన కమిషన్ కూడా భాషను ప్రాతిపదికగా ఒప్పుకోలేదు. దేశ సమైక్యత, భద్రత, పాలనా సౌలభ్యం, ఆర్థిక స్వయంవృద్ధి అనే లక్షణాలతో పాటు, కొత్త రాష్ట్రం దేశాబివృద్ధికి దోహదం చేస్తుందా అనే అంశం కూడా పరిశీలించి కొత్త రాష్ట్రం నిర్మాణం గురించి నిర్ణయం తీసుకోవాలని ఫజల్ కమిషన్ సూత్రీకరించింది. ఇవన్నీ ఉండి, ఆ తరువాత ఆ హద్దులలో జనం మాట్లాడే భాష కూడా ఒకటే అయితే ఫరవాలేదని వివరించింది. 1953 అక్టోబర్ 1 నాడు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రారంభించడాని కి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కర్నూల్ టౌనుకు వచ్చాడు. ఆ రోజు కొంతమంది విలేకరులు తెలంగాణను కలుపుకుని విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్) ఏర్పాటు గురించి ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన జవాబు ఇది: విశాలాంధ్ర అనే నినాదాన్ని ప్రస్తుత పరిస్థితులలో నేను అర్థం చేసుకోలేకుండా ఉన్నాను. విశాల శబ్దం దురాక్షికమణ చింతగల సామ్రాజ్యవాదాన్ని స్ఫురింపజేస్తుంది. ఈ విశాలాంధ్ర నినాదం వెనుక దాగిఉన్న మనస్తత్వం సామ్రాజ్యవాద తత్వంతో కూడినట్టినది. బూర్గుల రామకృష్ణారావు చాలా స్పష్టం గా తెలంగాణ వారెవరూ విశాలాంధ్ర కోరుకోవడం లేదని విడిగా ఉండేందుకే ఇష్టపడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు యు.ఎన్. ధార్‌కు ఉత్తరం కూడా పంపారు. తరువాత మారిపోయారు. విశాలాంవూధకు అంగీకరించా రు. అప్పట్లో ఢిల్లీ నాయకులతో సన్నిహితంగా ఉన్న మద్రాస్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, నీలం సంజీవడ్డి తెలంగాణను అభివృద్ది చేస్తామని, కొన్ని రక్షణలు కల్పిస్తామని తీయని వాగ్దానాలు చేస్తే నిజమే అని నమ్మిన వారిలో ఇక్కడి కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు ఢిల్లీ నాయకలు కూడా ఉన్నారు.

ఆనాటి గోవింద్ వల్లభ్ పంత్ విశాలాంవూధనే మంచిదనే అభివూపాయంతో ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే కమ్యూనిస్టుల ఆధిపత్యం ఉంటుందని కాంగ్రెస్ అనుమానించింది. అప్పుడు కూడా హైకమాండ్ ఢిల్లీకి నాయకులను పిలిపించడం, వీరు వెళ్లడం జరిగేది. నాటి ముఖ్యమం త్రి బూర్గుల రామకృష్ణారావు, తెలంగాణను ఆంధ్రతో కలపడం జరగదని ఘంటా పథంగా వాదించిన ఇతర నేతలు ఢిల్లీ యాత్ర తరువాత మారిపోయారు. బూర్గుల వారు తరువాత కేరళ గవర్నరుగా ఆ తరువాత ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా, అటుతరువాత రాజ్యసభ సభ్యులుగా వెలిగిపోయారు. ఇటు తెలంగాణ నలిగిపోతే పట్టించుకునే నాధుడే లేడు. పదవులకో ప్రలోభాలకో లొంగిపోయి తెలంగాణను బలిపెట్టిన వారు కొందరైతే పైకి తేనె మాటలు చెప్పి గుండెల్లో తీయని కత్తి దించిన వారు మరికొందరు, ఈ ప్రాంతం గురించి జనం గురించి అంత ఆసక్తిలేని జాతీయనేతలు లాబీయింగ్‌కు లొంగిపోయారు. దార్ కమిషన్ వద్దన్నా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఫజల్ అలీ కాదన్నా విశాలాంవూధను ఆంధ్ర లాబీయుస్టులు సాధించారు. విశాలాం ధ్రలో సామ్రాజ్యవాద ఛాయలు చూసిన నెహ్రూ తరువాత చాలాకీ ఆంధ్ర కు అమాయకపు తెలంగాణకు ఇది పెళ్లి అంటూ 1955 మార్చి 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు పై ఏక్ మాసూమ్ భోలీ భాలీ లడ్కీ కో ఎక్ నట్కట్ లడ్కే కే సాథ్ షాదీ కియా జా రహాహైఁ, చాహేతో వోఁ మిల్ కే రహ్ సక్తే హైఁ యా బిచడ్ సక్తే హైఁ...అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడింది కాని వద్దనుకున్నపుడు విడిపోయే అవకాశం మాత్రం దక్కనీయడం లేదు. ఏ నిర్ణయం తీసుకోకుండా ముష్కరులదారుణాలకు గురి చేసి, నిర్ణయాలు మార్చుకుంటూ స్వార్థ పరులకు బలి చేసి తెలంగాణకు నెహ్రూ చేసిన అన్యాయం నవంబర్ 14న గుర్తొస్తున్నది.

తెలంగాణ కోసం సాగిన ప్రతి ఉద్యమాన్ని ఇప్పడివరకు ఈ ప్రాంతం లో కొందరు నేతలు పదవుల కోసం దెబ్బ తీశారు. ఇప్పటికీ పదవుల కోసం తెలంగాణను, ఈ ప్రాంత ప్రజలను బలిపెడుతున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన అసలు ప్రాతిపదికలన్నీ వదిలేసి, ఏ ప్రాతిపదిక లేని కమిటీ లు కమిషన్లు వేశారు. తెలంగాణ ప్రజలంతా కాదన్నా, కొందరి పదవీ వ్యామోహాలకు, ఆంధ్రలో కొందరి స్వార్థ ప్రయోజనాలకు, ఢిల్లీలో కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం భాష అనే ఏకైక ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసమంజసంగా ఏర్పాటు చేశారు. ఇది నెహ్రూ గారి ముందుచూపుతో కూడిన వివేకమా? లేక తెలంగాణ ప్రజలకు ఆయన చేసిన అన్యాయమా? తెలంగాణను ఇతర ప్రాదేశిక భాగాలతో చేర్చారు. కాని ఆ ప్రాంతా ల ప్రజల మధ్య సమైక్యత రాలేదనే విషయం తెలుసుకోలేదు. ఇదొక అమరని కూర్పు. దీన్ని విలీనం అని కూడా అనలేము. జనం మధ్య సయోధ్య సాధించలేని ప్రభుత్వాల దుర్మార్గం వల్ల ఈ కూర్పు కుదరని చేర్పుగా మారింది. ఇందులో స్వార్థం తప్ప సమైక్యత ఎక్కడ?

-మాడభూషి శ్రీధర్
నల్సార్ యూనివర్సిటీలో ఆచార్యులు, మీడియా లా సెంటర్ అధిపతి


35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి