తెలంగాణ కోసం తపించిన సర్దార్


Fri,December 14, 2012 05:16 PM

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్వలేదు. తెల్లారి పత్రికల్లో వస్తే చూడవలిసిందేనా? ఈ టీవీ వారికి ఇంత మాత్రం తెలియదా? ముందే తెలిసి ఉంటే చివరి చూపు చూసుకునే వారం కదా? అని ఆయన మిత్రులు బాధపడ్డారు. న్యాయమూర్తులకు ఇతర ప్రజానీకంతో అంతగా సంబంధాలు ఉండవు. ఉండకూడదని కూడా ఒక నైతిక నియమం. స్వతంవూతంగా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా న్యాయ నిర్ణయం చేయడం కోసం ఉన్నతస్థాయి న్యాయమూర్తులు కృషి చేయాలన్న లక్ష్యం. ఎందరో న్యాయమూర్తులు పదవీ విరమణ తరువాత గుర్తుండరు. కొందరినైతే ఎదురుపడినా గుర్తు పట్టరు. దానికి కారణాలు వెతకడం అనవసరం. కాని కొందరు హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నా లేకపోయినా, పదవితో అధికారంతో సంబంధం లేకుండా అందరి మన్ననలు పొందుతూ ఉంటారు. స్నేహశీలిగా మిగిలిపోతారు. వృద్దాప్యంలో మరణిస్తే వారికోసం రెండు అశ్రుకణాలు రాల్చేవారు చాలామంది ఉంటారు. 1992లో హైకోర్టు న్యాయమూర్తిగా పదవీవిరమణ చేసి రెండు దశాబ్దాలు గడిచినా గుర్తుండిపోయిన మంచి మనిషి జస్టిస్ సర్దార్ అలీఖాన్ అటువంటి వారు.టీవీ వార్తల్లో ఆయన మరణం గురించి తెలిపి ఉంటే నేను ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేవాడిని అని ప్రముఖ న్యాయశాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్ జి. మనోహర్‌రావు బాధపడ్డారు. ‘ఆయన మంచిమనిషి. అందరినీ ఆప్యాయంగా పలకరించే నిగర్వి. ఏ పదవిలో ఉన్నా మానవత్వానికి ప్రాధాన్యం ఇచ్చిన ఉన్నతుడు’అని మనోహరరావు దివంగత సర్దార్ అలీఖాన్‌ను గుర్తు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లా విభాగంలో రెండు పర్యాయాలు ఆయన డీన్‌గా పనిచేశారు. అప్పట్లో ఉస్మానియా విద్యార్థులు, అధ్యాపకులకు సంబంధించిన సమస్యలు చాలా సామరస్యంగా అందరికీ ఆమోదయోగ్యం గా పరిష్కరించడానికి ప్రయత్నంచేసేవారు. ఆయన సమస్యలను ఎప్పుడూ వాయిదా వేసే వారు కాదు. చాలా నిరాడంబరుడిగా ఉండి చిన్నా పెద్దా అనే వివక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉండడం వల్ల సమస్యల పరిష్కారం సులువుగా జరిగిపోయేది అని ప్రొఫెసర్ మనోహర్‌రావు అన్నారు.

గొప్ప న్యాయమూర్తులూ ఉంటా రు, గొప్ప వక్తలూ ఉంటారు. కాని మంచి మనుషులు చాలా అరుదు. సమాజానికి కావలసింది తోటి మనుషులతో మనుషులుగా వ్యవహరించే మంచివారే. అటువంటి మంచితనం మూర్తీభవించిన వ్యక్తి జస్టిస్ సర్దార్ అలీఖాన్.జాతీయ అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ అధ్యక్ష పదవిని అలంకరించిన ఉత్తమ వ్యక్తి సర్దార్ అలీఖాన్ తరువాత తాను ఆ పదవికి రావడం భాగ్యంగా భావించానని, ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆయనకు వాళులర్పించారు.1930 మే 5న జన్మించిన సర్దార్ అలీ ఖాన్ తండ్రి అమీర్‌ఖాన్ నిజాం పాలనలో సుబేదార్ (గవర్నర్)గా మంచి పేరు తెచ్చుకున్నారు. మలక్‌పేట (హైదరాబాద్‌లో) పుట్టి పెరిగి బి.ఎ, ఎల్.ఎల్.బి, ఆతరువాత లండన్‌లో బారిస్టర్, ఎల్.ఎల్.ఎం చదువుకున్న సర్దార్ ఆలీఖాన్ 1957లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1982లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైనారు. రాష్ట్ర హైకోర్టుకు 1992లో కొద్ది రోజులు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తిగా వ్యవహరించారు. 1992లో పదవీ విరమణచేసిన తరువాత జాతీయ మైనారిటీ కమిషన్ అధ్యక్షుడిగా 1994లో నియమితులైనారు. భారత ప్రభుత్వం పక్షాన యునైటెడ్ నేషన్స్ మైనారిటీ సబ్ కమిటీ వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. జాతీయ మానవహక్కుల కమిషన్ ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా పనిచేశారు.పేదవూపజల పక్షాన న్యాయం కోసం ఆయన పోరాడారని, చార్మినార్ పరిసరాల్లో షాపింగ్ వ్యాపారుల వివాదంలో జస్టిస్ సర్దార్ అలీఖాన్ న్యాయం కోసం అధికారులను నిలదీసిన తీరు మరిచి పోజాలమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య గుర్తు చేసుకున్నారు. ఆయన జాతీయ వాది, అభ్యుదయ భావాలున్న వ్యక్తి, జాతీయ సమక్షిగతకు సమైక్యతకు కట్టుబడిన వ్యక్తి అని ఆయన వద్ద జూనియర్ న్యాయవాది గా పనిచేసిన ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. కీలకమైన నిర్ణయ సమయాల్లో, తీర్పులు ఇవ్వవలసిన సందర్భాలలో మానవతా విలువలను పరిగణించాలని ఆయన చెప్పేవారు. న్యాయవాదిగా ఉన్నా, న్యాయమూర్తిగా పనిచేసినా, మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ, అన్నింటికీ మించివ్యక్తిగా ఆయన పేదలు, అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతి కోసం వారికి న్యాయం సాధించడం కోసం తపన పడేవారు. చైర్మన్‌గా మత కలహాల సంఘటన జరిగితే వెంటనే ఆ స్థలాలకు వెళ్లి బాధితులను పరామర్శించే వారు.

జస్టిస్ సర్దార్ అలీఖాన్ యువకుడుగా ఉన్నపుడే అనేక వక్తృత్వ పోటీలలో పాల్గొని విజయం సాధించేవారు. తరువాత గొప్పవ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. మతాలు కులాలతో తేడా లేకుండా అందరినీ అభిమానించే వారు. ఎవరైనా తనను కలవడానికి వస్తే తానే కుర్చీలోంచి లేచి ఎదురేగి కరచాలనం చేసేవారు. ముస్లిం మత సంప్రదాయాలను అభిమానిస్తూనే ఆయన అభ్యుదయవాదిగా ప్రగతిశీలిగా పేరు తెచ్చుకున్నారు. భౌగోళికంగా విశాలాంధ్ర ఏర్పడినా తెలంగాణకు తీరని అన్యాయాలు చేయడం ద్వారా తెలంగాణతో పూర్తిగా సమై క్యం కాలేదని కనుక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక తప్పదని సర్దార్ ఆలీఖాన్ చాలా స్పష్టంగా చెప్పేవారు. జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీలో సభ్యుడిగా సర్దార్ అలీఖాన్ పేరు పరిశీలనకు వచ్చినపుడు, ఆయన అంతకుముందే తెలంగాణకు అనుకూల భా వాలు వ్యక్తం చేశారు కనుక నియమించలేదు. 1969 తెలంగా ణ ఉద్యమంలో చురు గ్గా పాల్గొన్న యువ కార్యశీలి ఆయన. సెప్టెంబర్ 30 తెలంగా ణ మార్చ్‌కు ప్రభు త్వం ప్రతికూలంగా వ్యవహరిస్తున్న దశ లో ఆయన ఉద్యమ కారులకు అండగా నిలిచారు.మార్చ్ నిర్వ హించడం మౌలిక హ క్కు అని, మార్చ్‌కు అనుమతించాలని కోరుతూ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తదితర 20 మంది ప్రముఖులతో కలిసి సర్దార్ అలీఖాన్ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న వాయిదా విధానం, ఉద్యమాన్ని అణచివేసే ధోరణి, చెప్పేదొకటి చేసేదొకటి కావడం వల్ల, యువకులు నిరాశ చెంది ప్రాణాలు తీసుకుంటున్నారని అంటూ, తెలంగాణ కావాలనే కోరిక ఎంత ప్రగాఢంగా ఉన్నా అందు కు ఆత్మహత్య చేసుకోవడం సమంజసం కాదని జస్టిస్ సర్దార్ అలీఖాన్ ఆవేదన చెందేవారు.సర్దార్ మరణంతో తెలంగాణను సరిగ్గా అర్థం చేసుకుని వారి తరఫున నిలబడే ఒక పెద్ద మనిషిని మనం కోల్పోయాం. అరుదైన ఆ మంచి మనీషికి మరోసారి జోహార్లు.

-మాడభూషి శ్రీధర్

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

country oven

Featured Articles