రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!


Fri,December 14, 2012 05:15 PM

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ్ రాష్టా న్ని ఏర్పాటు చేయాలని కోరుతూ 1996లో జరిగిన ఉద్యమానికి వ్యతిరేకం గా నాటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దారుణ దమనకాండను అవలంబించింది. ఉద్యమంలో పాల్గొన్న యువకులను తీవ్రంగా గాయపరచడం, చంపడమే ఘోరమనుకుంటే, యువతులపై అత్యాచారం చేయడం దారుణం. పోలీసులు సాగించిన మానవహక్కుల హననా న్ని అలహాబాద్ హైకోర్టు దృష్టికి తెచ్చి ఉత్తరాఖండ్ సంఘర్ష్ సమితి న్యాయాన్ని అర్థించిం ది. పరిహారాలు కోరింది. నేరాలకు పాల్పడిన పోలీసుల ప్రాసిక్యూషన్ ప్రారంభించాలని కోరింది. దీంతో పోలీస్ అధికారుల మీద కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రాణం కోల్పోయిన వారి బంధువులకు పది లక్షల రూపాయలు, గాయపడి శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రెండున్నర లక్షలు , అక్రమంగా బంధింపబడిన వారికి యాభై వేల రూపాయల చొప్పున ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. అటువంటివారు కనీసం 400 మంది ఉంటారని అంచనా. అత్యాచారం హత్యతో సమానమైన దారుణ నేరం కనుక అత్యాచారానికి గురయిన మహిళకు కూడా 10లక్షల రూపాయలు చెల్లించాలని, అసభ్య ప్రవర్తనకు అవమాన పడిన మహిళకు 5 లక్షల రూపాయలను చెల్లించాలని కూడా ఆదేశించింది.

కొందరికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిహారం కూడా చెల్లించింది. మూడేళ్ల తరువాత అలహాబాద్ హైకోర్టు తీర్పు పై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అప్పీలు చేయాలని నిర్ణయించింది. మామూలుగా ఇద్దరు ప్రత్యర్థుల మధ్య వివాదంలో నష్టపోయిన పార్టీ అప్పీలు చేసుకోవడం ఒక హక్కుకు సంబంధించిన విషయమే. కాని ఒక ప్రభుత్వం సంక్షేమానికి సంబంధించిన ఒక మంచి తీర్పును సవాలుచేయడం చూస్తే బాధితులైన ప్రజలను ప్రభుత్వం ఒక కక్షిదారుడిగా పరిగణించి తానూ ఒక కక్షిదారుగా వ్యవహరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరు ద్ధం. ఉద్యమాన్ని అణచడానికి పోలీసులు హత్య, రేప్ వంటి హీనమైన నేరాలు చేయలేదనా లేక చేయడం సరైనదనా లేక ఆనేరాల దర్యాప్తు కూడదనా లేక బాధితులకు పరిహారం చెల్లించడం రాజ్యాంగ విరుద్ధమనా? ఈ అప్పీలును సుప్రీంకోర్టు 1999లో అనుమతించింది. ఇంతభారీ సొమ్ము పరిహారంగా చెల్లించాలని ట్రయల్ కోర్టులో విచారణ ముగియకుండానే నిర్ణయించడం అలహాబాద్ న్యాయమూర్తులకు న్యాయం కాదని సుప్రీంకోర్టు ఆ తీర్పును రద్దు చేసింది. పరిహారాలు చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది. అయితే ఇచ్చి న సొమ్ము వాపస్ తీసుకోరాదని, విచారణ కొనసాగించాలని మాత్రం సుప్రీంకోర్టు ఆదేశించింది.

మానవూపాణాలు కోల్పోయిన ఉద్యమకారులకు నష్టపరిహారాలు ఇవ్వాలన్న ఆదేశం మీద అప్పీలుకు వెళ్లడం పూర్తిగా ప్రజావ్యతిరేక చర్య. తెలంగాణ ఉద్యమకారులు ఉత్తరాఖండ్ ఉద్యమం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రభుత్వం ఎంత ప్రజావ్యతిరేకంగా ఉద్యమ అణచివేత వ్యూహాలు రచిస్తుం దో, పోలీసులను ఏ విధంగా దారుణాలు చేయడానికి సాయుధ సాధికార సాధనాలుగా దుర్వినియోగం చేస్తుందో, ప్రభు త్వం రాజ్యాంగం ప్రకారం ఏవిధంగా పరిహారం చెల్లించాల్సి వస్తుందో, ఒక్కోసారి న్యాయస్థానాలను ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక చర్యలకు ఏవిధంగా వాడుకుంటాయో, న్యాయం రూపు ఏవిధంగా మారుతుందో ఎందుకు మారుతుందో, న్యాయమైన రాష్ట్రం కోసం పోరాటం ఏవిధంగా ఉంటుందో, ఉద్యమమహిళలను రేప్ ద్వారా అణచివేయాలనే వ్యూహం అమలు పరిణామాలు వివరిస్తాయి.

లాఠీతో కొట్టినా, బుల్లెట్ తో చీల్చినా, బాష్పవాయువుతో విషం చిమ్మినా ఉద్యమ కారుడిని చంపితే అతని బతికే హక్కును హరించినట్టే. రాజిడ్డికి రాజ్యాంగంలోని ఆర్టికిల్ 21 కింద బతికే హక్కు ఉంది. తెలంగాణ అడిగే హక్కు ఉంది. జెండా పట్టుకుని జై తెలంగాణ అంటున్న గుడి రాజిడ్డి (42) నోట్లోకి బాష్పవాయువు దూరింది. నోరెత్తనీయలేదు. ఊపిరితిత్తులలోకి బాష్పవాయు గోళం పేల్చిన విషవాయువు జొరబడింది. రక్తం కక్కుకున్నాడు. ఆ వాయువు ఊపిరితిత్తులతోపాటు ఇతర శరీరావయవాలను దెబ్బతీసింది. తరువాత 25 రోజులకు అతని ప్రాణం పోయింది. ఉద్యమించినందుకు ప్రాణం తీస్తారా? ఇదేం శాసనం? ఇదేం శిక్ష? రాజిడ్డిని సర్కారే హత్య చేసిందని ఉద్యమ నాయకులు పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ విమర్శ వెనుక నేరారోపణ కన్న ఒక ఉద్యమకారుడిని అన్యాయంగా బలిచేసుకున్న ఆవేదనే ఎక్కువగా ఉంది.

ఇంతకూ ఈ చర్య ఏమిటి? హత్యానేరమేనా కాదా? రాజిడ్డినే హత్యచేసే ఉద్దేశంతో పోలీసు అధికారి అతనికే గురిపెట్టి బాష్పవాయుగోళం పేల్చిఉంటే హత్య అయ్యే అవకాశం ఉంది. అందుకు సెక్షన్ 302 కింద హత్యానేరం విచారించాలని చట్టాలు ఘోషిస్తున్నాయి. ఆత్మరక్షణ లేదా ఐపిసి ఆమోదించిన మినహాయింపులు తప్ప మిగతా సందర్భాలలో చంపిన వారు హంతకులుగా ఆరోపణకుగురై కోర్టు విచారణకు నిలబడవలసి వస్తుంది. ఈ దేశ పౌరుడు కాకపోయినా ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందని, ఆ హక్కును చట్టబద్ధ విధానం ద్వారా తప్ప మరొక రకంగా హరించడానికి వీల్లేదని ఆర్టికిల్ 21 వివరిస్తున్నది. మొత్తం వ్యవస్థ ఈ మాట నిజం చేయడానికి ప్రయత్నించవలసి ఉంది. రూల్ ఆఫ్ లా అంటే అదే. మరణ శిక్షలు విధించదగిన నేరాలు చేసి పారిపోయేవ్యక్తిని పట్టుకోవడానికి మరో మార్గం లేకపోతే కాల్చి చంపే అధికారం పోలీసులు ఉంది. రాజిడ్డి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి మాత్రమే. బాష్పవాయుగోళంలో వాయువు మామూలుగా ఉండవలిసిన పదార్థం కన్న ప్రమాదకరమైన రసాయనం ఉన్నా, వాయుగోళం గురిపెట్టడం, అందులో ప్రమాదకర రసాయనం ఉండడానికి నిర్లక్ష్యం కారణమైతే 304 ఎ (ఐపిసి) కింద నేరారోపణ చేయవచ్చు. ప్రాసిక్యూట్ చేయవచ్చు. కాని చాలా తక్కువ సందర్భాలలో నేరారోపణ జరిగి ఉండవచ్చు.

నష్టపరిహారం కోరే అధికారం బాధితులకు ఉంది. వారికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత నేరాలకు పాల్పడిన వారిపై ఉంటుంది. పోలీసు అధికారులు వారి బాధ్యతలో భాగంగా ఎవరిపైనా దురుద్దేశంలేకుండా బహిరంగ ప్రదేశాలలో శాంతి రక్షణకోసం బాష్పవాయుగోళాలు విసిరినా బుల్లెట్లు కురిపించినా లాఠీలు ఝళిపించినా వారి వ్యక్తిగత నేరంగా పరిగణించ వీల్లేదు. అందుకు వారిని పరిహారం చెల్లించాలని ఆదేశించడానికి ఎవరికీ అధికారం లేదు. కాని అమాయకులైన వారు, ఉద్యమించే వారు, ప్రభుత్వ విధానాలను విమర్శించే వారు, బుల్లెట్లకు, లాఠీలకు, వాయుగోళాలకు బలికావడం నిర్దేశిత విధా నం కాదు. ప్రభుత్వం అందుకు బాధ్యత వహించాలి. బాధితులకు పరిహారం చెల్లించవలసి ఉంటుంది. పోలీసు అధికారులు నేరం చేస్తే వారు వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి. కాని విధినిర్వహణలో సార్వభౌమ అధికార పరిధిలో వ్యవహరించి ఉంటే వ్యక్తిగత బాధ్యత వహించడానికి వీల్లేదు. ఈ సందర్భాలలో వారికి మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వం వల్ల కొందరికి జరిగిన ఈ నష్టాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలె.

ఇంగ్లాండ్‌లో సార్వభౌమ సౌకర్యం ఒకటుంది. ప్రభువులు తప్పు చేయరని చేసినా అందుకు వారిని కోర్టులలో నిలబెట్టరాదని ఒక సూత్రం. 1948 తరువాత దాన్ని మార్చుకున్నారు. కాని ఆ సూత్రాన్ని స్వతంత్రం వచ్చిన తరువాత కూడా కొన్ని దశాబ్దాలు అనుసరించిన దేశం ఏదైనా ఉందంటే అది భారత దేశమే. కస్తూరీలాల్ అనే బంగారు వర్తకుడిని మీరట్ పోలీసులు అనుమానించి అతని బంగారు వెండి నగల్ని స్వాధీనంచేసుకున్నారు. తరువాత ఆయన దొంగకాదని తేలింది.

అతని నగల్ని అతనికి ఇవ్వాల్సిందే. కానీ అప్పడికే హెడ్ కానిస్టేబుల్ ఆ నగల్ని ఠానా నుంచి దొంగిలించి పాకిస్తాన్‌కు పారిపోయాడు. తన బంగారం ఇవ్వమని కస్తూరీ లాల్ అడిగితే కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది. అప్పడికి రాజోద్యోగులకు బాధ్యతలనుంచి మినహాయింపు ఇచ్చే బ్రిటిష్ సూత్రమే అమలవుతున్నదని, ఉద్యోగులు చేసే పనుల వల్ల నష్టపోయిన పౌరులకు పరిహారం ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే అని భారత పార్లమెంటు చట్టం చేయకపోవడం వల్ల కస్తూరీలాల్ కు నగలు ఇవ్వనవసరం లేదని అన్యాయమైన తీర్పు ఇచ్చింది. ఇది అన్యాయమే అని అంగీకరిస్తూనే చట్టం లేదు కనుక తామేమీ చేయలేమని న్యాయస్థానం వివరించింది. ఈ అన్యాయం చాలా కాలం కొనసాగింది. ఎవరో ఒక పోలీసు దొంగతనం చేసి పారిపోతే మిగిలిన వారిని తప్పుబట్టలేము. కాని ఒక ప్రభుత్వ ఉద్యోగి చర్య వల్ల పౌరుడు నష్టపోవడం, దానికి పరిహారం లేకపోవడం అన్యాయం, రాజ్యాంగంలో రాసుకున్న సమన్యాయ సూత్రానికి విరుద్ధం. నీలబతి బెహరా కేసులో ఒక యువకుడిని పోలీసు లాకప్‌లో చంపినందుకు పోలీసుల పక్షాన ప్రభుత్వం లక్షాయాభైవేలరూపాయల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఊరేగింపులు సమ్మెలు జరుగుతున్నపుడు పోలీసులు ఒక్కోసారి ప్రభుత్వం తీసుకున్న అనవసరపు నిర్ణయాలకు, అమలు చేయని వాగ్దానాలకు, చేసిన అన్యాయాలకు ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రజలు శత్రువులు కాదని, ప్రభుత్వ విధానాలను నిరసించడం, ఆందోళన చేయడం ప్రజల హక్కని, ఆ హక్కులను ఉపయోగించుకున్నందుకు పౌరులను గాయపరచడానికి, చంపడానికి ఎవరికీ అధికారం ఇవ్వలేదని పోలీసులు గమనించాలి. పోలీసులు న్యాయంగా వ్యవహరించినపుడు కూడా కొంద రు గాయపడుతుంటారు, నష్టపోతుంటారు, అప్పుడు వారికి పరిహారం చెల్లించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో తీర్పు చెప్పింది.

సార్వభౌమ బాధ్యతారాహిత్య సూత్రం చెల్లదని చెప్పింది. కనుక మూడురకాల బాధ్యతలుంటాయి. ఆందోళన చేస్తున్న పౌరులపై దురుద్దేశపూరితంగా పోలీసులు హాని చేస్తే అందుకు సంబంధిత పోలీసు అధికారి, అతని తరఫున ప్రభుత్వం బాధ్యత వహించాలి. పోలీసు అధికారి నేరం రుజువైతే శిక్ష అనుభవించాలి. పరిహారం కూడా అతనే చెల్లించాలి. దురుద్దేశ పూరితం కాకపోయినా నిర్లక్ష్య చర్య ద్వారా ఆ అధికారి పౌరుడికి నష్టం చేస్తే అందుకు కూడా అతను, అత ని తరఫున ప్రభుత్వం బాధ్యత వహించాలి. పోలీసు అధికారి తప్పులేకపోయినా, అతని నేరం కాకపోయినా, అతని నిర్లక్ష్యం లేకపోయినా కూడా నష్టపోయిన పౌరుడికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఆ అధికారిని చట్టపరంగా ఏమీ చేయడానికి వీల్లేదు. కాని ఆయన విధినిర్వహణలో చేసిన పనుల వల్ల నష్టపోయిన పౌరులకు పరిహారం చూపడం న్యాయం.

ఉత్తరాఖండ్ రాష్ట్రం కోసం పోరాడిన మహిళలపైన అత్యాచారం చేయడం నేరం. లాఠీ విసరడం బుల్లెట్లు కురిపించడం కూడా ఒక్కోసారి విధినిర్వహణలో భాగం అనుకోవచ్చు. కాని ఊరేగింపులో పాల్గొన్న మహిళపై అత్యాచారం చేయడం విధినిర్వహణ అయ్యేఅవకాశం లేదు. కనుక ఆ పోలీసులపైన నేరారోపణ చేసి దర్యాప్తుచేసి, శిక్షపడేట్టు చేయడం ప్రభుత్వధర్మం. బాధితులకు ఈ నేరస్తులచేత పరిహారం ఇప్పించడం లేదా ప్రభుత్వమే ఇవ్వడం రాజ్యాంగ లిఖిత కర్తవ్యం. లేకపోతే మనకు రాజ్యాంగపరమైన న్యాయం లభించే యంత్రాంగం ఉందనుకోవడం అనవసరం. అందుకే వారికి పరిహారం చెల్లించాలన్న అలహాబాద్ హైకోర్టుతీర్పును ఏవో సాంకేతిక కారణాలతో సుప్రీంకోర్టు కొట్టి వేయడం సామాన్యునికి అర్థం కాని బాధాకరమైన విషయం. రాజిడ్డిని బాష్పవాయుగోళం ద్వారా గాయపరచడం యాదృచ్ఛికంగా జరిగిందా లేదా ఎవరైన కావాలని గాయపరిచారా లేదా దురుద్దేశంతో చంపడానికి ప్రయత్నం జరిగిందా, లేక విష రసాయనం మోతాదు నిర్లక్ష్యంగా పెంచారా అనే అంశాలు విచారించాల్సిందే. రాజిడ్డి మరణానికి ఇవేవీ కారణాలు కాకపోయినా, అన్యాయంగా ఆయన ప్రాణం పోయినందుకు అందుకు కారణమైన ప్రభుత్వమే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం కాదు. ఈ సూత్రం అర్థం ఏమంటే, జనం ప్రాణాలు తీయకుండా ఉండాలని. ఇటువంటి ఆందోళనలలో అనవసరంగా జనం గాయపడకుండా మరణించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా బాధ్యతే.

-మాడభూషి శ్రీధర్
రచయిత నల్సార్ యూనివర్సిటీలో ఆచార్యుడు, మీడియా లా సెంటర్ అధిపతి

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి