కోలిండియా సారథి మనోడే


Sat,October 6, 2012 04:48 PM

కోలిండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తెలంగాణ అధికారి మెదక్ జిల్లా గొట్టిముక్కల గ్రామం నివాసి, ఐఏఎస్ అధికారి ఎస్. నర్సింగరావు నియమితులయ్యారు. కోలిండియా పుట్టినప్పటినుంచి ఇప్పటి దాకా ఈ స్థాయికి ఎదిగిన సౌత్ ఇండియా అధికారే లేడంటే అతిశయోక్తి కాదు. ఒక సౌత్ ఇండియన్, అందులోనూ తెలంగాణవాడు కోలిండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపిక కావడం అంటే చిన్న విషయం కాదు. ఈ రోజు బొగ్గు మార్కెట్‌కు పోటీగా నిలబడుతున్న ప్రైవేట్ బొగ్గు గనుల పోటీని కోల్ ఇండియా ఎదుర్కోవాల్సి ఉంది. 2జీ స్కాం కన్నా అతి పెద్దదిగా కాగ్ సైతం మొట్టికాయలు వేసిన ప్రైవేటు వారికి బొగ్గు బావుల కేటాయింపు లాంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి ఉన్నది. మొత్తం 155 బొగ్గుబావులను ప్రైవేటు వారి కి ఇచ్చారని చెబుతున్నప్పటికీ 193 బావులు 2009 నాటికే ప్రైవేటు పరం చేశారు. పదివేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రైవేటుపరం చేశారు. ఇప్పుడు దాని విలువ దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇదో సవాల్‌గా నర్సింగరావు ముందున్న సమస్య. మరోవైపు బొగ్గు లింకేజిలకు సంబంధించిన ఒప్పందాలు కూడా ఉన్నాయి.

విదేశాలనుంచి మూడింతలు బొగ్గు ధరను చెల్లించి వంద మిలియన్ టన్నుల కంటే ఎక్కువ బొగ్గును దిగుమతి చేసుకునేటువంటి దుస్థితి ఇప్పుడున్నది. వీటన్నింటినీ కూడా రావు సవాల్ గా స్వీకరించాల్సి ఉంది. ఈ పదవికి ఆయన ఎంపిక కాగానే, కోలిండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిని సవాల్‌గా స్వీకరిస్తున్నానని యన అన్నారు. రానున్న 40 సంవత్సరాలలో బొగ్గుకు ఎలాంటి కొరత లేకుండా చూస్తానని, అవసరం ఉన్న చోట రాష్ట్రాలలో రైల్వేలైన్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయన భవిష్యత్ కార్యాచరణ గురించి ‘టీ న్యూస్’, ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను తెలిపారు. కోలిండియాలో విస్తారంగా బొగ్గు నిల్వలున్నాయి. బొగ్గుకు ఢోకా లేదు. 30 నుండి 40 మీటర్ల లోనే బొగ్గు థిక్‌నెస్ ఉంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 435 మిలియన్ టన్నులు మాత్రమే బొగ్గు వచ్చింది. వాస్తవానికి 11వ పంచవర్ష ప్రణాళిక ముగింపు నాటికి 520 మిలియన్ టన్నుల బొగ్గు రావాల్సింది, కానీ 435 మిలియన్ టన్నులు మాత్రమే వచ్చింది. 85 మిలియన్ టన్నుల బొగ్గు కొరత ఏర్పడింది. విదేశాలనుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు లక్ష్యం కోలిండియాది 470 మిలియన్ టన్నులు ఉన్నది. ఆ మేరకు ఉత్పత్తి సాధించడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. దేశంలో 2012-17 పంచవర్ష ప్రణాళికలో వెయ్యి మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది.

దేశంలో 750 మిలియన్ టన్నులకు మించి బొగ్గు ఉత్పత్తి జరిగే అవకాశం లేదు. 250 మిలియన్ టన్నుల వరకు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ప్రతియేటా విద్యుత్ అవసరాలు ఎప్పటికప్పుడు ఎనిమిది శాతం పెరుగుతూనే ఉన్నాయి. బొగ్గు ఉత్పత్తి ఏడు శాతం పెరుగుతున్నది. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేదు. 2011లో 680 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉండగా కేవలం 630 మాత్రమే ఉత్పత్తి జరిగింది. దీంత్లో రానున్న రోజుల్లో బొగ్గుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా 163 గనులను విస్తరించడం కోసం కోలిండియా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందు కోసం 42 వేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నది. 40 కోల్‌వాషరీల కోసం ఏడు వేల కోట్ల రూపాయలను కేటాయించుకున్నది. రానున్న కాలంలో 440 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే లక్ష్యంతో కొత్త గనుల విస్తరణ చేపట్టనున్నది. ఈ ప్రతిపాదనలు అటవీ శాఖ పర్యావరణ విభాగం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు దేశానికి స్టీలు, సిమెంటు కర్మాగారాలకు అవసరమయిన కోకింగ్ కోల్ సరఫరా చేస్తున్న ఆస్ట్రేలియా ఇప్పుడు థర్మల్ విద్యుత్‌కు కావాల్సిన బొగ్గును ఎగుమతి చేయాలని ప్రయత్నిస్తున్నది. అయితే ఒకేసారి బొగ్గు ఎగుమతి చేస్తే ఖరీదు తక్కువ అయ్యే అవకాశం ఉన్నందున ఆస్ట్రేలియాకు చెందిన రియోటింటో సంస్థ టాటా స్టీల్, జెఅండ్ డబ్ల్యూ స్టీల్ కర్మాగారాలకు మూడు మిలియన్‌లకుపైగా కోకింగ్ కోల్ సరఫరా చేస్తున్నది. కోకింగ్ కోల్‌తోపాటు రియోటింటో అల్యూమినియం, బోరేట్స్, ముతక డైమండ్స్ భారత కంపెనీలకు ఎగుమతి చేస్తుంది.ఈ సంస్థ తూర్పు ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి థర్మల్ కోల్‌ను భారత్‌కు ఎగుమతి చేయాలని భావిస్తోంది.

ఇండోనేషియా బొగ్గు ధర పెరుగడం వల్ల దేశంలోని విద్యుత్ సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇండోనేషియాలో లభించే బొగ్గులో 4200 కిలో కేలరీ / కేజీ రకం బొగ్గుకు టన్ను కు 30 డాలర్లు చెల్లించి దిగుమతి చేసుకుంటున్నారు. ఇండోనేషియా ప్రభు త్వ విధానం ప్రకారం బొగ్గు కనిష్ట ధర నిర్ణయిసూ-్త ప్రస్తుతం టన్నుకు గల 30 డాలర్ల ధరను 53 డాలర్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నర్సింగారావు కోలిండియాను ఎలా గట్టెక్కి స్తారోనని అందరూ చూసున్నారు. విదేశీ బొగ్గుకు మన బొగ్గుకు సగం ధర తేడా ఉన్నది. మన ధర కన్నా రెట్టింపు. విదేశీ బొగ్గు దిగుమతిని తగ్గించాలి. డిమాండ్‌కు తగ్గట్టు బొగ్గును ఉత్పత్తి చేయడమే ప్రస్తుత కర్తవ్యంగా ముందుకు సాగాలి. కచ్చితంగా దేశానికి సేవ చేయాలనే దృక్పథంతోనే, పట్టుదలతోనే కోలిండియా సీఎండీగా పదవీబాధ్యతలను స్వీకరించినట్లు నర్సింగరావు చెప్తున్నారు.

జార్ఖండ్, మహానది, ఛత్తీస్‌గడ్, ఒరిస్సా తదితర రాష్ట్రాలలో చాలా ఏళ్ళుగా 60 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి పూర్తయితే మేలు జరుగుతుంది. బొగ్గు కొరత తీరుతుంది. ఆ దిశలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాల్సి ఉన్నది. కోలిండియాకు నిధుల కొరత లేదు. చిత్తశుద్దితో, పట్టుదలతో పనిచేస్తే అన్నీ వాటంతట అవే పూర్తవుతాయి. ప్రజల అవసరాల కోసం నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కార్మికుల ఆత్మస్థైర్యం పెంచాలి. లక్ష్యాలు సాధించే పట్టుదల, నిజాయితీ ఉంటే సరిపోతుందని అయన అంటున్నారు. పని సంస్కృతితో ముందుకు పోతే సమస్యలు అవే పరిష్కార మవుతాయని అంటున్నారు. సింగరేణిలోని కార్మికుల సమస్యలు పరిష్క రించి వారి సాయంతో ముందుకు పోతానని ధీమాతో ఉన్నారు. ఏది ఏమై నా సింగరేణి నుంచి నర్సింగరావు చాలా అనుభవాలను కోలిండియా కు తీసుకుని వెళ్తున్నారు. తెలంగాణ పనితీరుతో తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవాన్ని నిలుపుతానని శపథం చేస్తున్నారు. ఆయన హయాంలో అయినా బొగ్గుగని కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండు తాయని బొగ్గుగని కార్మికు లు ఆశిస్తున్నారు.
ఎండీ మునీర్

(కోలిండియా చైర్మన్‌గా నర్సింగరావు పదవీ స్వీకారం చేస్తున్న సందర్భంగా)

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం

Published: Sun,January 6, 2013 12:14 AM

వారి త్యాగాలు చిరస్మరణీయం

సామాజిక సంఘర్షణలే ఒక్కో సారి చారిత్రక మైలురాళ్లుగా నిలుస్తాయి. చరిత్ర గతిని మార్చే వెలుగుబాటలు వేస్తాయి. సమాజ గర్భంలోంచి విచ్చుకున

Published: Wed,December 26, 2012 11:43 PM

సీమాంధ్రవాదాన్ని బొందపెట్టారు

సీ మాంధ్ర వాదాన్ని జూన్ 28వ తేదీన సింగరేణి కార్మికులు, డిసెంబర్ 22న ఆర్టీసీ కార్మికులు బొందపెట్టారు. జీహెచ్‌ఎంసీలోనూ అదే జరిగింది.

Published: Fri,December 14, 2012 12:00 AM

తెలంగాణ కోసం పోరుబాట

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించి మూడేళ్లయింది. అయినా రాష్ట

Published: Fri,November 23, 2012 10:47 PM

బొగ్గు బావులతో... అంతరిస్తున్న అడవులు

లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతమంతా సర్వనాశనమవుతున్నది. ప్రధానం గా ఏజెన్సీ ప్రాంతాల అడవి కనుమరుగవుతున్నది. ఒక్క బొగ్గుబాయి ఏర్పడాలంటే క

Published: Fri,December 14, 2012 04:16 PM

నేతలూ మేల్కొనండి

తెలంగాణ కోసం మరో విద్యార్థి కుసుమం నేలరాలిం ది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచ్చులాపూర్ గ్రామానికి చెందిన దర్శనాల సంతోష్ ఉస్మా

Published: Fri,October 12, 2012 02:34 PM

భవిష్యత్తు తరాలకు భరోసా ఏది?

ఎప్పుడు తినే కంచాన్ని గుంజుకొని ఎంగిలి మెతుకులు వెదజల్లుతూ తన ఉదారతత్వాన్ని చాటుకుంటున్నోడే పర్యావరణానికి ప్రమాదకారిగా మారాడు. అలా

Published: Thu,October 11, 2012 05:44 PM

సకల సమ్మెను రగిలించిన బొగ్గు కణిక

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మొట్టమొదట సమ్మె చేసింది బొగ్గుగని కార్మికులే. ఆరు దశాబ్దాల తమ ఆకాంక్షను సాకారం చేసుకోవడం కోసం సింగరే

Published: Tue,October 9, 2012 04:23 PM

బొగ్గు కుంపటిపై యూపీఏ

బొగ్గు కుంభకోణం దేశాన్ని కుదిపేస్తున్నది. కాగ్ నివేదికతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా వెలుగులోకి వచ్చింది. బొగ్గు బ్లాక్‌ల కేటాయిం

Published: Sat,October 6, 2012 04:46 PM

విధ్వంసం సృష్టిస్తున్న విషాదాలు..

బొగ్గు బావుల వల్ల తెలంగాణ ప్రాంతమే కాదు, దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు విధ్వంసానికి గురవుతున్నాయి. వీటివల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ని

Published: Sat,October 6, 2012 04:46 PM

నవశకానికి నాంది..

తెలంగాణకు గుండెకాయ, ఎన్నో పోరాటాలకు, త్యాగాలకు కేంద్ర బిందువుగా నిలిచిన సింగరేణి కార్మికులు ఈ నెల 28న జరిగిన యూనియన్ గుర్తింపు ఎన

Published: Sat,October 6, 2012 04:46 PM

గని కార్మికుల కష్టాలకు కారకులెవ్వరు?

సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన భారత కార్మిక వర్గం గతంలో ఎన్నడూ లేనటువంటి సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రపంచీకరణ మొదలైన తరువా

Published: Sat,October 6, 2012 04:47 PM

కార్మికులను మరిచిన సింగరేణి ఎన్నికలు

పదేళ్ళ నుంచి లాభాల్లో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి గత నాలుగేండ్లుగా వంద కోట్ల వరకు డివ

Published: Sat,October 6, 2012 04:47 PM

సింగరేణి సొమ్ముతో ఆంధ్రా షోకులు

సింగరేణి సంస్థ వార్షిక టర్నోవర్ పదకొండు వేల కోట్లుంటే అందులో ఐదో వంతు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రాయల్టీల రూపంలో ప

Published: Sat,October 6, 2012 04:47 PM

గనులు తవ్వాలె, పర్యావరణాన్ని రక్షించాలె

దేశంలో బొగ్గును గుర్తించి 238 ఏండ్లు కావస్తున్నది. దేశంలో ప్రస్తు తం జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, ఆంధ్రవూపదేశ్, మధ్య

Published: Sat,October 6, 2012 04:48 PM

కవ్వాల్‌పై కదలని నాయకులు

కవ్వాల్ అభయారణ్యాన్ని టైగర్‌జోన్‌గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మూడు వారాలుగా వరుసగా ప్రజాందోళనలు కొనసాగుతున్నప్పటికీ ఒ

Published: Sat,October 6, 2012 04:49 PM

సింగరేణికి లాభాలు-కార్మికులకు కష్టాలు

సింగరేణి 2011-12 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయించిన 51 మిలియన్ టన్నుల ఉత్పత్తిని ఐదు రోజుల ముందుగానే అధిగమించింది. సింగరేణి ల

Published: Sat,October 6, 2012 04:49 PM

బడ్జెట్ భారం

బొగ్గు గనుల మీద కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. మనదేశంలో 74 శాతం విద్యుత్ బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతున్నది. ఈ విద్యుత్ ఉత్పత్త

Published: Sat,October 6, 2012 04:49 PM

బొగ్గు బావుల్లో విషవాయువు

సింగరేణి బొగ్గు గనుల్లో విషవాయువులు ప్రాణా లు తీస్తున్నా అధికారుపూవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు తమ ప్రాణాలను అరచేతిల

Published: Sat,October 6, 2012 04:50 PM

సింగరేణి మిలియన్ మార్చ్..

మిలియన్ మార్చ్ ఒక అపూర్వ ఘట్టం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష పెల్లుబికిన రోజు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కోసం అరవై ఏండ్లుగా సింగరేణి కార్మ

Published: Sat,October 6, 2012 04:50 PM

ద్రోహులకు బుద్ధి చెప్పాలె

తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదవుల కోసం కక్కుర్తి పడుతున్నారు. టీడీపీ నాయకులు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. అధికార దాహం కాంగ్రెస్ నాయ

Published: Sat,October 6, 2012 04:51 PM

బతుకు చీకటి

ఓపెన్ కాస్టుల (ఓసీ) విధానం తెలంగాణ ప్రాంత పర్యావరణాన్ని అడ్డు అదుపు లేకుండావిధ్వంసం చేస్తున్నది. అండర్ గ్రౌండ్ విధానం వల్ల మానవ న

Published: Sat,October 6, 2012 04:50 PM

సింగరేణిపై వలస వివక్ష

ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తరువాత వలస పాలకుల వివక్ష వల్ల తెలంగాణలో ఏపీ స్టీల్, అజంజాహీ మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సర్‌సిల్క్, అంతర్గ

Published: Sat,October 6, 2012 04:52 PM

నాగోబా జాగోరే...

ఆరోజు అమావాస్య రోజు. లోకమంతా చిమ్మచీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగ

Published: Sat,October 6, 2012 04:51 PM

వేతన కమిటీలు ఎండమావులే!

పనిచేసే ప్రతి మనిషికి గౌరవవూపదంగా బతికే వేతనం పొందే హక్కు ఉందని ప్రపంచ మానవహక్కుల సంఘం ప్రకటించింది. కానీ ఈ హక్కుల స్ఫూర్తిని అమలు

Published: Sat,October 6, 2012 04:51 PM

బొగ్గుగని భగ్గుమన్న రోజు

అది 1979, జనవరి 6. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి భూస్వాములకు వ్యతిరేకంగా బొగ్గు గని కార్మికులలో తిరుగుబాటు వచ్చిన రోజు... గూండాల దౌర్జ

Published: Sat,October 6, 2012 04:52 PM

గాయాల సింగరేణి

సింగరేణిలో1889 నుంచి బొగ్గు ఉత్పత్తి చేయ డం ప్రారంభించినప్పటికీ, 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మారింది. దే

Published: Sat,October 6, 2012 04:52 PM

ఉద్యమ గళం సింగరేణి

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర హోంమంత్రి చిదంబరం అధికారిక ప్రకటన చేశారు. నవంబర్ 29 న

Published: Sat,October 6, 2012 04:55 PM

పోరుసాగుతోంది బిడ్దా...

ఒక మంత్రం వేసినట్లే కొనసాగింది సింగరేణి సమ్మె. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు కొంగు బంగారం, గుండెకాయ అయిన సింగరేణి కార్మికుల పాత్ర ఒక

Published: Sat,October 6, 2012 04:55 PM

నవ్వే గాయం సింగరేణి

సింగరేణి అంటేనే నవ్వే గాయం. తిరగేసిన చెమ్మసు. ఎగురుతున్న సుత్తి కొడవలి. సింగరేణి కార్మికులు తెలంగాణ ఆకాంక్ష సాకారం కోసం 32 రోజులుగ

Published: Sat,October 6, 2012 04:54 PM

బందూకులతో బొగ్గు తవ్వగలరా!

బందూకులతో బొగ్గు తవ్వే ప్రయత్నం చేస్తున్నది రాజ్యం. 60 ఏండ్లు గా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ఆకాంక్షతో, మొక్కవోని పట్టుదలతో సింగరేణి

Published: Sat,October 6, 2012 04:54 PM

గని కార్మికుల గర్జనగని కార్మికుల గర్జన

గావులలో 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఉట్టిపడింది. కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు ప్రకటన వెలువడిత

Published: Sat,October 6, 2012 04:54 PM

భవిష్యత్తు నల్ల బంగారానిదే!

దేశంలో డిమాండ్‌కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగడం లేదు... దీంతో ప్రతి సంవత్సరం 80-100 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంటున్నా

Published: Sat,October 6, 2012 04:53 PM

వివక్షతోనే ఈ విషాదాలు

ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉన్నా ఆ అసంతృప్తిని, ప్రజా ఆగ్రహానికి ఒక ఉద్యమ రూపం ఇచ్చి లక్ష్యాలవైపు నడిపించే పార్టీ కానీ, వ్యక్తులు కాన

Published: Sat,October 6, 2012 04:53 PM

గిరిపుత్రుల ఆకలి చావులు పట్టవా?

- ఎండీ. మునీర్ వర్షాకాలం అంటేనే ఆదివాసులు వణికిపోతున్నారు. ప్రతి ఏటా వర్షా కాలంలో.. గిరిజనుల చావులు పెరిగిపోతున్నాయి. అయినా.. ప్ర

Published: Sat,October 6, 2012 04:53 PM

చట్టాలు చేస్తరు, అమలు చెయ్యరు!

గిరిజనులు వలస కూలీలుగా మారటం అం కేవలం బతుకు కోల్పోవడమే కాదు. వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలను కోల్పోవడం. ఇంత వినాశనానికి గిరిజనులు ఎం