సింగరేణికి లాభాలు-కార్మికులకు కష్టాలు


Sat,October 6, 2012 04:49 PM

సింగరేణి 2011-12 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయించిన 51 మిలియన్ టన్నుల ఉత్పత్తిని ఐదు రోజుల ముందుగానే అధిగమించింది. సింగరేణి లాభాలలోకి రావడం ఇది పదోసారి పభుత్వం నిర్దేశించినదానికన్నా సంస్థ1.21 మిలియన్ టన్నుల అధిక ఉత్పత్తి సాధించింది. 123 సంవత్సరాల సింగరేణికి తెలంగాణ ప్రాంత ప్రజలకు విడదీయరాని బంధం ఉంది. నిజాం కాలంలో భూస్వాములు, దేశ్‌ముఖ్‌ల, దొరల పెత్తనాలు, ఆగడాలు భరించలేక పారిపోయి వచ్చిన వారిని సింగరేణి అక్కున చేర్చుకొని ఉపాధి కల్పించింది. ఇవాళ ఏటేట ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకుంటూ లాభాలు గడిస్తున్నా ఉపాధి మాత్రం కల్పించలేకపోతున్నది. ఉన్న కార్మికుల సంఖ్యను కూడా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నది. దీంతో ఈ ప్రాంతంలోని నిరుద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. దీన్ని ఈప్రాంత ప్రజావూపతినిధులు కూడా అడ్డుకోలేకపోతున్నారు.

సింగరేణిలో ప్రస్తుతం 65 వేలమం ది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను 35 వేలకు తగ్గించాలనే యత్నాలు సాగుతున్నాయి. ఈ సమయంలోనే సింగరేణి 123 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. గత ఏడా ది సింగరేణి దినోత్సవం సందర్భంగా ఉపాధికి సంబంధించి ఎలాంటి కార్యక్షికమాన్ని ప్రకటించలేదు. దీంతో అందరు నిరాశ చెందారు. 199-90 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి శత వార్షికోత్సవాల సందర్భంగా 2015 నాటికి 45 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రణాళిక ప్రకటించింది. 5 నూతన గనులను ప్రారంభించాల్సి ఉంది. నూతన పారిక్షిశామిక విధానాలు, గ్లోబలైజేషన్ ఫలితంగా ఇవేమి అమలు కాలేదు. పైగా ‘గోప్డూన్ షేక్ హ్యాండ్’తో కార్మికులను ఇంటికి పంపారు. ఏటా వేలకోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నప్పటికీ వీటిలో సుమా రు 00 కోట్ల రూపాయలు గతంలో ఇచ్చిన అప్పులపై వడ్డీల వసూళ్లు, పన్నులు, డివిడెంట్‌ల రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నది. కానీ 15 ఏళ్ళుగా కేంద్రం బొగ్గు సంస్థల మీద పెట్టుబడులు పెట్టడం లేదు.గతంలో బొగ్గు గనుల కింద భూములు కోల్పోయిన వాళ్ళకు, తెలంగాణలో సాగునీటి వసతి కరువై వ్యవసాయం గిట్టుబాటుకాని రైతులకు, కూలీలకు సింగరేణి లో ఉపాధి దొరికింది. సంస్థలో అండర్‌క్షిగౌండ్ విధానం ద్వారా ఉత్పత్తి జరిగేది. ఆ ఉత్పత్తిలో మానవక్షిశమ ప్రధాన పాత్ర వహించేది. దీంతో 1990 వరకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేవి. అండర్‌గ్రౌండ్ విధానం వల్ల చుట్టు పక్కల గ్రామాలలోని వ్యవసాయం మీద దుష్ర్పభావం తక్కువగా ఉండేది. అయితే తరువాత మారిన ప్రభుత్వ విధానాలతో ఈ ప్రాంత ప్రజలకు, పర్యావరణానికి, సంస్థలో పని చేసే కార్మికులకు నష్టం వాటిల్లడం ప్రారంభమైంది. ఓపెన్ కాస్టుల పేర, యాంత్రీకరణ పేర ప్రజల ప్రాణాలమీదికి తెచ్చారు. దీంతో ఉత్పత్తి గణనీయంగా పెరిగినా ఉపాధి అవకాశాలు పెరగలేదు. ఉన్న కార్మికులనే పెద్ద ఎత్తున తొలగించారు.

ఉద్యోగ నియామకాలలో స్థానికులకు తీవ్ర అన్యాయం జరిగింది. 1975 నాటి రాష్ర్టపతి ఉత్తర్వుల మేరకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో 20 శాతం, ఓపెన్ క్యాటగిరీ లో 0 శాతం స్థానికులకు ఇవ్వాలని, ఎగ్జిక్యూటివ్ పోస్టులలో 40 శాతం, ఓపెన్ క్యాటగిరీలలో 60 శాతం స్థానికులకు ఇవ్వాలని, ముల్కీనిబంధనలు సింగరేణిలో అమలు చేయాలని నిర్దేశించింది. ఇది 2007 నాటి వరకు కూడా సింగరేణిలో అమ లు జరగలేదు. 2007లో ఇచ్చిన ఉత్తర్వులలో కూడా ‘సరైన అర్హతలు లేకుంటే లోక ల్ పోస్టులలో నాన్ లోకల్ వారిని నియమించుకోవచ్చు’ అనే మినహాయింపు ఉంది. దాన్ని ఆసరగా చేసుకొని ఆంధ్ర ప్రాంతం నుంచి రిక్రూట్ చేసుకున్నారు. సింగరేణి లో ఆంధ్ర అధికారుల ఆధిపత్యానికి ఇదినిదర్శనం. 610 జీవో సింగరేణిలో ఇంతవరకు అమలు చేయలేదు. నియామకాల సమయంలో ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ పెట్టి స్థానికులకు అన్యాయం చేస్తున్నారు. ఫలితంగా అధికారులలో 0 శాతం, సూపర్‌వైజరీ వైట్ కాలర్ ఉద్యోగాలలో 60 శాతం, కార్మికులలో 40 శాతం మంది ఆంధ్ర ప్రాంత వారే వచ్చి చేరారు. కార్మికులలో కూడా తేలికైన పనులలో ఆంధ్ర ప్రాంతం వాళ్లుండగా, ప్రమాదభరితమైన కష్టతరమైన పనులలో తెలంగాణ ప్రాంత కార్మికు లు పని చేస్తున్నారు. రిక్రూట్‌మెంట్లలో, ప్రమోషన్లలోవూపాంతీయ వివక్ష యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఫలితంగా బొగ్గు బావి ప్రమాదాలలో చనిపోయేవాళ్ళు, వీఆర్‌ఎస్‌ల పేర బలవంతపు రిట్రెంచ్‌మెంట్లు అయ్యేవారిలో ఈ ప్రాంతం వాళ్ళే నూటికి తొంబై శాతం ఉంటున్నారు.

ఉత్పత్తి లక్ష్యాలు పెరిగిపోవడంతో పాటు, కొత్త బొగ్గు గనులలో ఎక్కువ భాగం ఓపెన్ కాస్టు కావడంతో పర్యావరణ విధ్వంసం పెరిగిపోతున్నది. దీంతో ఊళ్ళకు ఊళ్ళు కనుమరుగవుతున్నాయి. భూ నిర్వాసితులకు ఇచ్చే ఉద్యోగాలు కూడా కంపెనీ రద్దు చేసింది. ఇటు భూములు పోయి, అటు బతుకుదెరువుపోయి ఆకలికి మాడి సచ్చే రోజులు వచ్చాయి. చాలా గ్రామాల ప్రజలు వలస కూలీలుగా మారిపోయారు. డిపెండెంటు కింద కార్మికుల పిల్లలకు ఇచ్చే ఉద్యోగాలు కూడా నిలిపివేశారు. ఒకనాడు పల్లె నుంచి సింగరేణి బతుక వచ్చినవాళ్లు ఇవ్వాళ మళ్లీ సింగరేణి వదిలి ఉత్త చేతులతో పల్లెబాట పడుతున్నారు. వలస పాలకుల వివక్ష కారణంగానే తెలంగాణ పప్లూలు, అడవులు నాశనమయ్యాయి. ఈ ప్రాంత ప్రజల బతుకులు ఛిద్రమయ్యాయి. తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే తప్ప ఈ దుస్థితి మారదు. సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న జీవన విధ్వంసం చూసైనా తెలంగాణ కాంగ్రెస్, టీడీపీల ప్రజావూపతినిధులు నాటకా లు మానాలి. ఈ రెండు పార్టీల నేతలు తెలంగాణ కోసం రాజీనామాలు చేయకుండా రాజీనామాలు చేసిన వారిపైనే పోటీకి దిగి జాతికి ద్రోహం చేస్తున్నారు. సింగరేణి కార్మికులు తెలంగాణ కోసం విధులు బహిష్కరించి సకల జనుల సమ్మలో పాల్గొన్నా రు. తెలంగాణ కోసం ఉద్యమిస్తూనే సంస్థను కాపాడుకునే దిశన ముందుకు సాగుతున్నారు. సింగరేణి కార్మికుల స్ఫూర్తితోనైనా టీడీపీ, కాంగ్రెస్ ప్రజావూపతినిధులు ముందుకు సాగాలి. తెలంగాణ సాధించుకుం తప్ప సింగరేణి మనకు దక్కదు. మన ప్రాంతాన్ని విధ్వంసం చేసే ఓపెన్‌కాస్టు గనులు పోయి భూగర్భ గనులు ప్రారంభమవుతాయి.

దేశంలో 2012-17 పంచవర్ష ప్రణాళిక నాటికి వెయ్యి మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. కానీ దేశంలో 750 మిలియన్ టన్నులకు మించి బొగ్గు ఉత్పత్తి జరిగే అవకాశం లేదు. 250 మిలియన్ టన్నుల వర కు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుం ది. దేశంలో ప్రతియేటా విద్యుత్ అవసరాలు ఎప్పటికప్పుడు ఎనిమిది శాతం వరకు పెరుగుతూ నే ఉన్నాయి. బొగ్గు ఉత్పత్తి ఏడు శాతం పెరుగుతున్నది. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేదు. 2011లో 60 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉండగా 630 టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. దీనివల్ల రానున్న రోజులలో బొగ్గుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా సుమారు 163 గనులు విస్తరించడం కోసం కోలిండియా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం 42వేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నది. ఈ పరిస్థితులలో 390.24 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాల ఉనికిని కొత్తగా సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ శాఖ ఈ ఏడాది చేసిన డ్రిల్లింగ్‌లో కనుగొన్నది. దీనితో గోదావరిలోయ 977 మిలియన్ టన్నుల బొగ్గు ఉనికిని కలిగి ఉన్నది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఎక్స్‌ప్లొరేషన్ శాఖ లక్ష మీటర్ల డ్రిల్లింగ్ జరిపింది. ఈ డ్రిల్లింగ్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నా యి. ఈ ఏడాది 53.1 మిలియన్ టన్నులకు బొగ్గు లక్ష్యాన్ని నిర్దేశించుకొని కార్మికులు ముందుకు సాగుతున్నారు.

తెలంగాణలో ఉన్న బొగ్గుతో తొమ్మిది రాష్ట్రాలకు విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఆరు నుంచి పది గంటల విద్యుత్ కోత అన్యాయం కాక మరేమవుతుంది. ఉద్యోగాలు లభించకపోవడం, గ్రామాలకు గ్రామాలు బొగ్గు బావు ల వల్ల ఎడారులుగా మారిపోవడం లాంటి విషాదకరమైన దృశ్యాలు ఎన్నో. బొగ్గు బావులలో పనిచేయడం వల్ల ఆరోగ్యం చెడిపోయి 60 ఏండ్లు కూడా మనిషి బత క లేని పరిస్థితులు దాపురించాయి. సింగరేణి యాజమాన్యం ఓపెన్‌కాస్ట్‌ల పేరుతో తెలంగాణ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నది. సీమాంధ్ర ప్రభుత్వ నీడలో తెలంగాణకు ఎన్నటికీ న్యాయం జరగదు. మన వనరులు, మన ఉద్యోగాలు మనకు దక్కాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలె.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Featured Articles