బొగ్గు బావుల్లో విషవాయువు


Sat,October 6, 2012 04:49 PM

సింగరేణి బొగ్గు గనుల్లో విషవాయువులు ప్రాణా లు తీస్తున్నా అధికారుపూవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారు. ఈ మధ్యనే రామకృష్ణాపూర్‌లోని ఆర్కే 1ఏ గనిలో ఇద్దరు జనరల్ మజ్దూర్ కార్మికులు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రాణా లు కోల్పోయారు. సింగరేణి బొగ్గు బావుల్లో కార్బన్ మోనాక్సైడ్ 50 పీపీఎం (పార్ట్ ఫర్ మిలియన్) దాటితే ప్రమాదం. దీనికన్నా ఎక్కువ ‘పీపీఎం’ వస్తే వెంటనే అధికారులు ముందుజాక్షిగత్త చర్యలు తీసుకోవాలి. విషవాయువు ప్రమాణాన్ని గుర్తించడానికి టెస్టింగ్ యాంత్రాలు కూడా ఉంటాయి.

విష వాయువు ముఖ్యంగా మూసి వేసిన గనుల్లో తయారవుతుంది. కార్బన్‌డయాక్సైడ్ గని లోపల ఉన్న గాలిలో 17.5 శాతానికి మించి ఉంటే పెద్ద ప్రమాదసూచికగా భావించాలి. మీథేన్ లాంటి గ్యాస్ భూగర్భగనుల్లో 5.3 శాతం పెరిగితే కార్మికులు ఆ ప్రాంతంలో ఉన్న బొగ్గు కాలి బూడిదయ్యే పరిస్థితి ఉంటుంది. పని స్థలాల్లో సాధారణ ఉష్ణోక్షిగత 30.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 32.5 వరకు ఉండాలి. అయితే ఇది పెరుగుతూ వస్తుందని కార్మికులు వాపోతున్నారు.

గనుల్లో వెలువడే వివిధ విషవాయువులను గ్యాస్ డిటెక్టర్లతో పరీక్షలు జరుపుతారు. కార్బన్ మోనాక్సైడ్‌ను పరీక్షించడానికి టాక్సీమీటర్, ఆక్సీజన్ కోసం ఆక్సీమీటర్, మిథేన్ కోసం మిథనోమీటర్ అలాగే ఉష్ణోక్షిగతను పరిశీలించడానికి హైబ్రోమీటర్, కార్బన్‌డయాక్సైడ్‌ను పరీక్షించడానికి సేప్టీ ల్యాంప్‌లను ఉపయోగిస్తారు. ఇలా వీటిని గుర్తించి అరికట్టడానికి గాలి గోడలను, ఫైర్‌ఫీల్‌లను ఏర్పాటు చేస్తారు. రక్షణ ఏర్పాట్లు చేసిన తర్వాతనే ఎక్కడైనా పనులు చేపడతారు. అయితే ఈ నిబంధనలను వేటినీ సక్రమంగా పరిశీలించకుండా అధికారులు కార్మికులను పనులకు పంపుతున్నారు. దీంతో విషవాయువులు కార్మికుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి సంఘటనే ఆర్కే 1ఏ గనిలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి యాజమాన్యం వద్ద ఎలాంటి సమాధానం లేదు. కిలోమీటర్ల లోతుకు కార్మికులు వెళ్ళి ప్రమాదకరమైన పనులను చేయాల్సి వచ్చినప్పుడు దీనికి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవేవీ చేయకపోవడంతో 2003 జూన్ 16న గోదావరిఖనిలోని 7 ఎల్‌ఈపీ గనిలో 17 మంది, అదే యేడాది అక్టోబర్ 10న పది మంది కార్మికులు మరణించారు. 196 మార్చి 26న గోదావరిఖని 9 గనిలో గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు మరణించారు.

అలాగే 2012 జనవరి 30న జీడీకే 3 గనిలో ఓసీపీ 1 కన్వేయర్ బెల్ట్ తగిలి ఓ కార్మికుడు మరణించాడు. ఇలా విషవాయువుల ఘటనలు సింగరేణి కాలరీస్‌లో కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. ఆర్కే 1ఏ గనిలో మూసివేసిన పని స్థలంలో 7ఏ లెవల్‌లోని 3 డిప్‌లో కార్మికులిద్దరూ ఉదయం ఏడు గంటలకు షిప్టు లో దిగితే మధ్యాహ్నం ఒంటిగంటలోపే మరణించారు. అయితే రెండవ బదిలీ రాత్రి 11 గంటలకు గానీ వారు చనిపోయినట్లు అధికారులు గుర్తించలేకపోయారు. ఇం త దారుణమైన సంఘటన సింగరేణి చరివూతలో ఎన్న డూ జరుగలేదు. దాదాపు 12 గంటల అనంతరం కార్మికుల కుటుంబ సభ్యులు గనులపైకి వచ్చి తమ వారు ఇంటికి రాలేదని చెప్తేగానీ అధికారులకు సోయి రాలేదు. ఈ విషయంపై సమక్షిగమైన విచారణ జరిపిం చాలని కార్మికులు కోరుతున్నారు.బాధ్యులైన గని మేనేజర్‌తో సహా అధికారులందరినీ శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. భూగర్భ గనిలో పని చేసే కార్మికుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అంటు న్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని, భవిష్యత్తులో గ్యాస్ ప్రమాదాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలి.

-ఎండీ మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన