నాగోబా జాగోరే...


Sat,October 6, 2012 04:52 PM

ఆరోజు అమావాస్య రోజు. లోకమంతా చిమ్మచీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగారం చేసే రోజు. ప్రకృతితో సహా ఆనందంతో పండు వెన్నెలై వెల్లివిరిసే రోజు. ప్రతి ఏడాది అంబరాన్నంటే సంబరం రోజు. అదే నాగోబా జాతర ... అదే ఈ నెల 22 న ‘నాగోబా’ జాతర ప్రారంభమయ్యే రోజుపతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజున ఆదిలాబాద్ గిరిజనులు నాగోబా జాతర జరుపుకుంటారు. ఈ అమావాస్యకు రెండు వారాల ముందు నుండే గిరిజనుల్లో సంబరం మొదలవుతుంది. సరిగ్గా ఈ అమావాస్య రోజు తమ ఆరాధ్యదైవమైన ‘నాగోబా’ (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్య మాడతాడని ఇక్కడి గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యకాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు నమ్ముతారు. అందుకే ఆదిలాబాద్ జిల్లా గిరిజనులే కాకుండా సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు నాగోబా దేవాలయానికి వచ్చి సంబరం చేసుకుంటారు.

నాగోబా జాతర ఇక్కడి గిరిజనుల సంసృ్కతికి నిలువుటద్దంగా చెప్పుకోవచ్చు. గిరిజనులకు ఆరాధ్యదైవమైన ‘నాగోబా’ దేవాలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం పుష్యమాస అమావాస్య పర్వ దినాన గిరిజనులంతా తమ ఆరాధ్యై దెవాన్ని సందర్శించటానికి ఈ గ్రామానికి కదిలిరావడం వల్ల ఇది ప్రముఖ యాత్ర స్థలంగా మారింది. అమావాస్య రోజు ఉదయం అయిదు గంటల నుంచి ప్రారంభమయ్యే పూజా కార్యక్షికమాలు నాలుగు రోజులపాటు ఘనంగా జరుగుతాయి. మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర నుండి లక్షలాది మంది గిరిజనులు ఈ స్థలానికి చేరుకోవడంతో ప్రభుత్వం ఈ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి సంవత్సరం అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు గిరిజనుల స్థితిగతులను అవగాహన చేసుకోవడానికి గిరిజన సమస్యలను తెలుసుకోవడానికి ఈ జాతరకు తరలివస్తారు. రెవెన్యూ, వ్యవసాయం, పౌర సరఫరాల, భూసార పరిరక్షణ పశు సంవర్థక, గిరిజనాభివృద్ది సంస్థ, పట్టు పరిక్షిశమ, జిల్లా పరిక్షిశమలు, స్త్రీ శిశు సంక్షేమం, అటవీ శాఖ, వన్యవూపాణి విభాగం వంటి అనేక ఇతర శాఖల ప్రదర్శనలు గిరిజనుల అభివృద్ది ఛాయా చిత్ర ప్రదర్శనలతో జిల్లా యంత్రాంగమంతా కేస్లాపూర్‌లో ఉంటారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న నాగోబా జాతర వివరాలను వారి ఆచార వ్యవహారాలను బహు విచివూతంగా ఉంటాయి. ఈ జాతర సందర్భంగా వారి ఆచారాలు నియమాలను చూసి తీరాలన్న భావన కలుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం గిరిజనుల మూల పురుషులు కేవలం ఏడుగురు. మూల పురుషులు నాలుగు శాఖలుగా వీడిపోయారు. ఈ నాలుగు శాఖలలోని మొదటి శాఖలో మడావి, మర్సకోలా, కుడ్మేల్, పూరు, పెందూర్, వెడ్మ, మెస్రిం అనే ఏడుగురు సోదరులుండేవారు.

ఈ ఏడుగురివల్ల కాలానుగుణంగా అభివృద్ది చెందిన గిరిజన సంతతికి పై ఏడుగురు అన్నదమ్ముల పేర్లు ఇంటిపేర్లుగా మారాయి. ఏడు ఇళ్ళ పేర్లు గల గిరిజనులకు ఆరాధ్య దైవం ఆదిశేషుడు కావడం వల్ల అనాదిగా కేస్లాపూర్ గ్రామంలో వెలసిన వారి కులదైవం శ్రీ ‘నాగోబా’ పూజా ఇత్యాది కార్యక్షికమాల నిర్వహణ బాధ్యత మెస్రింకు అప్పగించారు. కాగా పెద్దవాడన్న గౌరవంతో పుష్యమాస అమావాస్య రోజు జరిగే పూజను మడావికి అప్పగించారు. అయితే కాలానుగుణంగా పూజా కార్యక్షికమాలు నిర్వహించే ‘మెస్రం’ వంశం రెండుగా చీలిపోయింది. వాటిలో ఒకటి నాగ్‌భిడే మెస్రం. రెండవది భూయ్యాడే మెస్రం. ఈ రెండు శాఖలు వారి వృత్తుల ఆధారంగా 17 శాఖలుగా చీలిపోయింది. అయినా పూజలు నిర్వహించేది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మెస్రం వంశస్థులకే దక్కింది.ప్రతి సంవత్సరం నాగోబా దేవతను పూజించడానికి నెల ముందునుంచే గిరిజనులు పడే శ్రమ ఆశ్చర్యం కలిగిస్తుంది. వివిధ వృత్తుల ఆధారంగా 17 శాఖలుగా చీలిన మెస్రం వంశస్తులలోని కటోడా దివాకర్ గాయికి, ఘాడియా సంకేపాయిలర్ వాడే శాఖల వారు కేస్లాపూర్ జాతరకు 16 రోజుల ముందు పుష్యమాస పౌర్ణమికి ఒక రోజు ముందు తమ కులదైవాన్ని పుష్య అమావాస్య రోజున అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలం తేవడానికి కాలినడకన బయలుదేరి వెళతారు. ఇదే వంశంలోని మిగతా శాఖల వారు వారి వెంట వెళతారు. ఒకవేళ అత్యవసర పను లుంటే వెళ్ళకపోవచ్చు. కానీ మిగతా ఏడు శాఖల వారు క్రమం తప్పకుండా వెళ్ళాలన్నది నియమం.ఈ ఏడు శాఖలు ముందుగా నాగోబా ఆలయం చేరుకుని కలశం తీసుకుని గోదావరి నదికి బయలుదేరుతారు. వారికి ముందుగా పరధాన తెగ, వాయిద్య గాండ్రు వాయిస్తూ ఉంటే వెనకనుంచి గిరిజనులు వెళుతుంటారు. కేస్లాపూర్‌కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కలమడుగు సమీపాన ఉన్న గోదావరి నదిలోని అస్తమడుగు వరకు కీకారణ్యం గుండా నడిచి వెళ్ళి గోదావరి జలం కలశం ద్వారా తీసుకుంటారు. ఈ అస్తమడుగులో గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత ప్రత్యక్షమై దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తుంటారు.

జలంతో నిండిన కలశాన్ని 40 కిలోమీటర్ల దూరంలోని ‘పూసిగూడ’ గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూర్ మండలం గురిజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒక్కరోజు ఉన్న తరువాత కలశం అదే గ్రామంలో ఉంచి గిరిజనులంతా తమ ఇండ్లకు తరలి ఒక దినమంతా పండుగ జరిపి తిరిగి కలశం ఉన్న స్థలానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి బయలు దేరిన తరువాత కేస్లాపూర్‌కు కి.మీ. దూరంలోని ఇంద్ర అక్కడ వెలసిన ఇంద్రాదేవికి సామూహికంగా పూజలు జరుపుతారు. ఇంద్రాదేవి వెలసిన నాటి నుండి ఈ గ్రామానికి ఇంద్ర పేరు వచ్చిందని గిరిజనులు చెప్పుతారు. ఇక్కడి నుంచి బయలుదేరి కేస్లాపూర్ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రి చెట్టు క్రింద 4 రాత్రులు, ఒక పాకలో 3 రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రి చెట్టుపై పవిత్ర జల కలశం భద్రపరిచి 10 కిమీ దూరంలోని పూర్వపు గిరిజనుల రాజధాని సిరికొండకు చేరుకుంటారు. సరిగ్గా పుష్య అమావాస్య రోజున కలశం భద్రపరిచిన మర్రిచెట్టు దగ్గర బావినీరు, మట్టి కలిపి ఒక పుట్టను తయారు చేస్తారు. ఆలయం ప్రక్కన ఉన్న పూల మందిరం ఈ మట్టితో అలికి, అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో నాగదేవతను అభిషేకిస్తారు. మెస్రం వంశస్తులు దేశంలోని ఏ మారుమూల ఉన్నా తప్పనిసరిగా హాజరై నాగదేవతను పూజిస్తుంటారు.

నాగోబా జాతర సందర్భంగా కేస్లాపూర్‌లో నిర్వహించే గిరిజన దర్బార్‌కు ప్రత్యేకత ఉంది. జాతరకు జిల్లాకు చెందిన గిరిజనులందరూ పెద్ద ఎత్తున హాజరు కావడంతో 1942 ప్రాంతంలో ఇక్కడికే అధికార యంత్రాంగాన్ని రప్పించి గిరిజనుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ఏర్పాటును ప్రొఫెసర్ హేమండార్ఫ్ ఏర్పాటు చేశారు. నాటినుంచి ఈ దర్బారును యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ దర్బారుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో పాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, ఇతర అధికార యం త్రాంగం హాజరై గిరిజనుల సమస్యలను పరిష్కరించడం జరుగుతోంది. అయితే రాను రాను ప్రభుత్వ గిరిజన దర్బారు నిర్వహణ లాంఛనప్రాయం అయిపో యింది.గిరిజనులు తమ సమస్యలను పరిష్కరించడం లేదనే విమర్శిస్తున్నారు. ఈ రోజు గిరిపువూతుల సమస్యలు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా వారి బతుకులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ‘దర్బారు’పై గిరిజనులకు నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. దర్బారుకు పూర్వపు వైభవం సమకూర్చడానికి అధికారులు కృషి చేసి, ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. ఆదివాసులకు కావలసిన కనీస అవసరాలు తీర్చేందుకు కృషి చేయాలి. ప్రతి ఏడాది వస్తున్న అంటు వ్యాధుల నుంచి గిరిపుత్రులను కాపాడాలి.

- ఎండీ మునీర్
( నాగోబా జాతర సందర్భంగా..... )

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన