వేతన కమిటీలు ఎండమావులే!


Sat,October 6, 2012 04:51 PM

Raju14-10-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaపనిచేసే ప్రతి మనిషికి గౌరవవూపదంగా బతికే వేతనం పొందే హక్కు ఉందని ప్రపంచ మానవహక్కుల సంఘం ప్రకటించింది. కానీ ఈ హక్కుల స్ఫూర్తిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రతి ఐదేళ్లకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు సవరించాలనే ఉద్దేశంతో వేతన కమిటీలను ఏర్పాటు చేస్తారు. వేజ్‌బోర్డులో అటు కార్మిక ప్రతినిధులు, యాజమాన్య ప్రతినిధులతోపాటు ప్రభుత్వ ప్రతినిధులు చర్చించి వేతన నిర్ణయాలు చేస్తారు. కానీ ప్రభుత్వం ఎప్పుడు సకాలంలో వేజ్‌బోర్డులు పరిష్కరించలేదు. ఫలితంగా కార్మికుల నిజ వేతనాలు పడిపోయి జీవన ప్రమాణాలు అడుగంటిపోయా యి. కార్మికులు అసంతృప్తి చెంది సమ్మెట కడితే తప్ప ప్రభుత్వం వేజ్‌బోర్డులు పరిష్కరించటం లేదు.

దేశ వ్యాప్తంగా ఉన్న నాలుగున్నర లక్షల మంది బొగ్గు గని కార్మికుల ఎనిమిదో వేజ్‌బోర్డు 2011, జూన్‌తో ముగిసి, తొమ్మిదో వేజ్‌బోర్డు జూలై 1వ తేది నుంచి అమలులోకి రావాల్సి ఉంది. కాని చర్చల సరళి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోయింది. 1973లో బొగ్గు గనుల జాతీయీకరణ జరిగిన తరువాత దేశంలో బొగ్గు గని కార్మికుల వేజ్‌బోర్డు చరిత్ర ప్రారంభమయింది. అంతకు ముందు ఒక సింగరేణి సంస్థ తప్ప మిగితా బొగ్గు ఉత్పత్తి సంస్థలన్నీ ప్రయివేటు రంగంలో ఉండేవి. కార్మికుల వేతనాలు ప్రయివేటు యాజమానుల దయాదాక్షిణ్యాలకు వదిలివేయబడ్డాయి.

జాతి సంపదను దేశ అవసరాల కోసం శాస్త్రీయంగా తవ్వకాలు సాగించాలని, అదే సమయంలో బొగ్గు బావులలో పని చేసే కార్మికుల రక్షణ, మెరుగైన వేతనాలు అందించాలనే లక్ష్యంతో నాడు బొగ్గు గను ల జాతీయీకరణ సాగించారు. ఆ నేపథ్యంలో బొగ్గు గని కార్మికులకు జాతీయ బొగ్గు గని కార్మికుల వేతన నిర్ణయ కమిటీ ఏర్పాటు చేశారు. అంతకు ముందు బొగ్గు గని కార్మికులకు నిర్దిష్టమయిన వేతన నిర్ణయ విధానం లేకుండేది. బ్రిటీషు కాలం నాటి 1937 మొదటి వేతన కమిటీ, స్వతంత్రం వచ్చిన కొత్తలో ఏర్పాటు చేసిన 1948 నాటి ఫెయిర్ వేజ్ కమిటీ, 1957 నాటి ఇండియన్ లేబర్ కాన్ఫన్స్ నిర్ణయాల ప్రాతిపదిక కార్మికుల వేతన నిర్ణయాలు జరిగేవి. వాటి ప్రాతిపదికన బొగ్గు గని కార్మికుల వేతనాలు నిర్ణయించేవాళ్లు. డాక్టర్ అక్రాయిడ్ నిర్దేశించిన (2700) క్యాలరీలు ఒక యూనిట్‌గా తీసుకొని కార్మికుడి కుటుంబాన్ని మొదటగా మూడు వినియోగ యూనిట్లుగా తీసుకొని వాటికి అవసరమయిన తిండి, బట్ట వసతి వంటివి లెక్కలు కట్టి వేతనాలు నిర్ణయించేవాళ్లు.

బొగ్గు గని కార్మికుల ప్రత్యేక పని పరిస్థితుల దృష్ట్యా జాతీయ సంఘాలు జరిపిన పోరాటాల ఫలితంగా 1948 జోషి అవార్డు, మజుందారు ట్రిబ్యునల్ అవార్డు (1956), దాసుగుప్తా అవార్డు(1959), రఘునాథ్ రెడ్డి (1967) అవార్డుల పేరు మీద గని కార్మికుల అదనపు సౌకర్యాలు కల్పించబడ్డాయి.
1975, జనవరి ఒకటి నుంచి మొదలయిన మొదటి వేజ్‌బోర్డు నుంచి 1991, జూలై ఒకటో తేదిన ఆరంభమయిన ఐదవ వేజ్‌బోర్డ్డు కాలం వరకు వేజ్‌బోర్డులో చర్చల సరళి ఒక రకంగా ఉండేది. కార్మిక సంఘాలు కొత్తగా డిమాండ్లు పెట్టేవి. ఆ డిమాండ్లపై చర్చలు జరిగి నిర్ణయానికి వచ్చే వాళ్లు కాని అటు తరువాత కాలంలో దేశంలో నూతన ఆర్థిక పారిక్షిశామిక విధానాలు అమలులోకి వచ్చిన తరువాత వేజ్‌బోర్డ్డుల స్వరూప స్వభావాలే మారిపోయాయి. గతంలో సాధించుకున్న హక్కులనే కాపాడుకోవడం గగనమయ్యే పరిస్థితి ఏర్పడింది. అందుకు ప్రధాన కారణం మారిన ప్రభుత్వ పాలసీలు. ఆ ప్రభావం భారత బొగ్గు పరిక్షిశమ మీద కూడా పడింది .

ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు రంగానికి పెద్దపీట వేయడం మొదలయింది. దేశంలోని మొత్తం బొగ్గు అవసరాలలో 10 శాతం తీర్చుతున్న సింగరేణి పరిక్షిశమకు బడ్జెట్ కేటాయింపు లు ఎత్తివేసింది. బొగ్గు ధరల కాంట్రాక్టింగ్ విధానం పేరు మీద ఉత్పత్తి ఖర్చులకంటే తక్కువ చేసి అమ్మే విధానాన్ని అమలు చేసింది. ఫలితంగా ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలలో ఉత్పత్తులు గణనీయంగా పెరిగినా.. ఆ మేరకు నష్టాలు పెరిగాయి. అంతర్గత ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ పెంచి ప్రభుత్వరంగ బొగ్గు సంస్థలను నిర్వీర్యం చేసింది. అదే సమయంలో ప్రయివేటు బొగ్గు సంస్థలకు రాయితీలను ఇచ్చింది. నాణ్యమైన బొగ్గు బ్లాకులను అగ్గువసగ్గువకు కేటాయించింది. ప్రయివేటు సంస్థలకు బొగ్గు బ్లాకుల కేటాయింపు ‘2 జీ’ కుంభకోణం కంటే పెద్దది. విదేశీ బొగ్గుకు 90 శాతం పన్నుల రాయితీ, కోల్ లెక్కించే ప్రభుత్వ ఖర్చులతో డంపింగ్‌యార్డులు నిర్మించింది.

ఫలితంగా ప్రభుత్వరంగ బొగ్గు సంస్థలో ప్రయివేటీకరణ, కాంట్రాక్టీకరణ పెరిగిపోయింది. బొగ్గు ఉత్పత్తిలో పర్మినెంటు కార్మికుల ప్రాధాన్యం తగ్గిపోయింది. మునుపటిలా కార్మికులు సమ్మెలుచేస్తే ఉత్పత్తులు ఆగిపోయే పరిస్థితి లేకుండా పోయింది. ఎప్పుడయితే ప్రయివేటు యాజమాన్యాలు బొగ్గు రంగంలో ప్రవేశించాయో కార్మికుల పరిస్థితి బొగ్గు గనుల జాతీయీకరణ కంటే ముందు పరిస్థితి నెలకొంది. కనీస వేతనాలు అమలు కావడం లేదు. కనీస పని గంటలు అమలు కావడం లేదు. ఈ మొత్తం పరిస్థితి బొగ్గు గని కార్మికుల వేతన నిర్ణయాల మీద తీవ్ర ప్రభావం చూపింది. వేజ్‌బోర్డ్డులో కార్మికులు నూతన హక్కులను సాధించుకోలేకపోయారు. వేజ్‌బోర్డ్డు కార్మికుల హక్కులను హరించే వేదికలుగా మారిపోయాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే బొగ్గు గనులలో ప్రైవేటీకరణ పెరిగిపోయిన నేపథ్యంలో బొగ్గు గనులలో పని చేస్తున్న దాదాపు మూడు లక్షల మంది కాంట్రాక్టు కార్మికులకు ఏ వేజ్‌బోర్డ్డులు వర్తించని పరిస్థితి కల్పించారు.

కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక ప్రభుత్వ పాలసీలను నిలువరించడంలో ట్రేడ్ యూనియన్స్ విఫలమాయ్యియి. దీంతో ప్రభుత్వ విధానాలకు అడ్డూ అదుపు లేకుండాపోతున్నది.
ఇప్పుడు తొమ్మిదవ వేజ్‌బోర్డ్డు చర్చలు జరుగుతున్నాయి. ఎనిమిదవ వేజ్‌బోర్డ్డులో 24 శాతం వేతన పెరుగుదల ఉండగా ఈ సారి 50 శాతం పెరుగుదల ఉండాలని కార్మిక సంఘాలు డిమాం డ్ చేస్తుండగా యాజమాన్యం మాత్రం 25 శాతం మాత్రమే పెంపుకు అంగీకరించే పరిస్థితి నెలకొంది... ఈ నెల 10, 11, 12 తేదీలలో నాగ్‌పూర్‌లో జేబీసీసీఐ సమావేశం జరిగింది. మినిమం గ్యారెం బెనిఫిట్ 25 శాతం ఒప్పుకున్న కోలిండియా పెర్క్స్ (సౌకర్యాలపై అల పెంచడానికి ఒప్పుకోవడం లేదు... 50 శాతం పెరగాలని యూనియన్‌లు డిమాండ్ చేస్తుండగా ఒక్క శాతం కూడా యూనియన్‌లు పెంచే ప్రసక్తి లేదంటున్నాయి... ప్రయివేటు బొగ్గు సంస్థలు వేజ్‌బోర్డ్డును ఖాతరు చేయడం లేదు. బొగ్గు గని కార్మికుల జీవి తాలు రోజు రోజుకు దుర్భరమవుతున్నాయి. అత్యంత చైతన్యయుతమయిన కార్మిక రంగంలోనే ఇటువంటి పరిస్థితి నెలకొని ఉండటం పతనమవుతున్న విలువలకు నిదర్శనం.

దేశ వ్యాపితంగా బలమయిన కార్మికోద్యమ నిర్మాణం లేకపోవడం వలన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సింగరేణి వంటి చోట్ల సికాస వంటి విప్లవ కార్మిక సంఘాలు ఆవిర్భవించి సాగించిన మిలిటెంట్ పోరాటాల వల్ల గతంలో వేజ్‌బోర్డుల పరిష్కారం జరిగింది. నూతన వేతన ఒప్పం దం ఈ నెల ఆఖరుకు జరుగుతుందని యూనియన్‌లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీలలో జేబీసీసీఐ (వేతన కమిటీ) 9వ సమావేశం కోల్‌కత్తాలోజరగనుంది.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన