గాయాల సింగరేణి


Sat,October 6, 2012 04:52 PM

సింగరేణిలో1889 నుంచి బొగ్గు ఉత్పత్తి చేయ డం ప్రారంభించినప్పటికీ, 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మారింది. దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ సంస్థ సింగరేణి. 2003 నుంచి సింగరేణి యాజమా న్యం సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. అప్పటి నుంచి ఏదో ఒక కార్యక్షికమాన్ని ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తోంది. అయితే ఈసారి అలాంటి ఉత్సవాలేమీ లేవు. తెలంగాణ ఉద్యమం ఒక వైపు, సకల జనుల సమ్మెలో భాగంగా 35 రోజుల సమ్మె ఫలితంగా 4.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగ లేదు. ఈ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నారు. అందుకే ఆవిర్భావ దినోత్సవాన్ని ఆర్భాటం లేకుండా నిర్వహించుకోవాలని నిర్ణయించారు. 91వ ఆవిర్భావ దినం సందర్భంగా సింగరేణి ఎన్నో ఒడిదుడుకులతో ముందుకు సాగుతున్నది. తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలకు తెగించి గనుల్లోకి వెళ్లి బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నారు.అయినా సంస్థ ఆర్థికంగా పరిపుష్ఠిగా ఎదగ డం లేదు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల విధానాల వల్ల సింగరేణి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చం దంలా ఉంది.. తమ సొంత కృషితో లాభాలతో నడుస్తున్న సింగరేణి లాంటి సంస్థల మీద ఒక్క నయాపైసా పెట్టకపోగా రకరకాల టాక్స్‌లు, రాయల్టీలు, డివిడెంటుల పేరిట, ఇచ్చిన అప్పులకు రుణాల పేరిట కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పిండుకుంటూనే పో తున్నారు. ప్రభుత్వరంగ సంస్థ అయినప్పటికీ ప్రభుత్వమే అడ్డగోలుగా సంస్థకు డబ్బులు ఇచ్చి వడ్డీ భారాన్ని వేస్తోంది. పదేండ్ల నుంచి ఒక్క సంవత్సరం కూడా ఒక్క నయాపైసా పెట్టుబడి సింగరేణి మీద పెట్టలేదు.

సంస్థ 1996 నుంచి లాభాల్లో నడుస్తున్నా కేంద్రం నుంచి తీసుకున్న సుమారు 1200 కోట్ల రూపాయలు చెల్లించడం వల్ల నెట్ ప్రాఫిట్‌లోనికి 2002కు గానీ రాలేకపోయింది. దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థ అయినా ప్రభుత్వం సింగరేణిపై పెట్టిన పెట్టుబడిని అప్పు కింద చూడటం ఏమిటి? ఆ అప్పు మీద 663 కోట్ల వడ్డీ వేయడం ఏమిటి? దానిని ఏటా 66.3కోట్ల రూపాయలను వాయిదాలుగా తీసుకోవ డం ఏమిటి? ప్రశ్నించే వారే లేరు. ఇంత జరుగుతున్నా కనీసం ఈ ప్రాంత ప్రజావూపతినిధులైన ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టనట్లు ఉండటం మన తెలంగాణ ప్రాంత ప్రజల దురదృష్టంగా భావించాల్సిందేనా! సింగరేణి కాలరీస్ కంపెనీ మీద మరో నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు భారం పడనుంది.

ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద సింగరేణి యాజమాన్యం చేపట్టిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేయనున్నది. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి సింగరేణి రుణం తీసుకుంటున్నది. సుమారు 6000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు ఖర్చవుతుండగా ఇందులో సంస్థ నుంచి సింగరేణి 30 శాతం నిధులను ఖర్చు చేయనుంది. మిగతా 70 శాతం రుణం తీసుకుంటోంది. ఈ రుణం వడ్డీ భారం కూడా సింగరేణి మీద పడుతోంది. తెలంగాణకు గుం డెకాయ అయిన సింగరేణికి లాభాలు పుష్కలంగా వ స్తున్నప్పటికి కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టడం మానెయ్యడంతోపాటు విస్తరణలో భాగంగా ప్రాజెక్టుల కోసం, భారీ లాభాల కోసం రుణాలు తప్ప డం లేదు. వడ్డీ చెల్లింపుల చట్రంలో పడక తప్పడం లేదు. గాయాల సింగరేణి ఈ దోపిడీ ఛట్రం నుంచి బయట పడాలంటే ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు కావాల్సిందే. అందుకు ఎన్నిసార్లయినా కార్మికులు ఉద్యమించాల్సిందే... సింగరేణి రుణ భారం తీరేదెన్నడు..? గాయాల సింగరేణి ఎప్పుడు బాగుపడుతుంది..?

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

country oven

Featured Articles