ఉద్యమ గళం సింగరేణి


Sat,October 6, 2012 04:52 PM

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర హోంమంత్రి చిదంబరం అధికారిక ప్రకటన చేశారు. నవంబర్ 29 నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అరెస్టుకు నిరసనగా అదే నెల 30న మొట్ట మొదటి సమ్మె చేశారు సింగరేణి కార్మికులు. డిసెంబర్ తొమ్మిది ప్రకటన వెలువడటానికి ముందు డిసెంబర్ ఏడవ తేదిన కేసీఆర్ దీక్షలో కొనసాగుతుండగా ఆయన ఆరోగ్యం క్షీణించిందనే ఆవేదనతో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా నిర్లిప్తతతో శ్రీకాంతాచారి ఆత్మహత్యకు పాల్పడితే తల్లడిల్లిపోయిన సింగరేణి కార్మికులు అదే నెల ఏడున విధులను బహిష్కరించి సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారు...

ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు కోసం మొట్టమొదలు తెలంగాణలో సమ్మె చేసింది బొగ్గు గని కార్మికులే... 60 సంవత్సరాల తమ ఆకాంక్షను సాకారం చేసుకోవడం కోసం బొగ్గు గని కార్మికులు సింగరేణిలో నిర్వహించిన పోరాటం దేశం మొత్తాన్ని ప్రభావితం చేసింది. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రకటనను వెనక్కి తీసుకున్న సందర్భంలో 2009, డిసెంబర్ 23, 24 తేదీల్లో రెండు రోజులు సమ్మె చేశారు సింగరేణి కార్మికులు. 2010, మార్చి నాలుగవ తేదీన సమ్మె చేశారు. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రానికి వచ్చినప్పుడు సింగరేణిలో అడుగుపెట్టనందుకు నిరసనగా కూడా కార్మికులు పలు ఆందోళనలు నిర్వహించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అందరికంటే ముందుగా సకల జనుల సమ్మెలో పాల్గొని 35 రోజులు మడిమెతిప్పకుండా ప్రత్యేక తెలంగాణను ఏర్పా టు చేయాలని కార్మికులు సమ్మెకు దిగారు. ఒక రాజకీయ డిమాండ్ కోసం కార్మికులు ఇలా 44 రోజులు సమ్మె చేయడం చరివూతాత్మకం... ఇది ఎక్కడా! ఎప్పుడు జరుగని విషయం. తెలంగాణ కోసం కార్మికులు గత 60 సంవత్సరాలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. సింగరేణిలో ప్రత్యేకంగా ఇందు కోసమే కార్మిక సంఘం కూడా ఏర్పడింది. ఆ (టీబీజీకేఎస్) సంఘం ప్రస్థుతం ద్వితీయ అతి పెద్ద కార్మిక సంఘంగా 11 ఏండ్లలో ఎదిగిందంటే సింగరేణి కార్మికులలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ కోసం అవసరమయితే మరో సమ్మెకు సిద్ధంగా ఉన్నామని కార్మిక వర్గం పేర్కొంటున్నది. ఎన్నో పోరాటాలకు, ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసిన సింగరేణిలో తెలంగాణ ఉద్యమం రావణకాష్ఠంలా మండుతున్నది.

తెలంగాణ ఏర్పడటం వల్ల బతుకులు బాగుపడుతాయని, ఉద్యోగాలు వస్తాయని, మన బొగ్గు మనకు, మన ఉద్యోగాలు మనకు, మన నీళ్లు మనకు దక్కుతాయని ఓపెన్ కాస్టు గనుల వల్ల జరుగుతున్న విధ్వంసం ఆగిపోతుందని, భూగర్భ గనులను తవ్వుకొని భవిష్యత్తు లో ఉద్యోగాలను కూడా తెచ్చుకోవచ్చునని, సింగరేణికి ప్రత్యేకంగా లాభాల ద్వారా అభివృద్ధి చేసుకోవచ్చునని, తమ జీతాలు తాము పెంచుకునే పరిస్థితి ఉంటుందని, ఇదంతా తెలంగాణ ఏర్పాటుతోనే సాధ్యమవుతుందని కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. అందుకే తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారు. మరో వంద రోజులయినా పర్వాలేదు ఈ సారి ప్రకటించి మరి అన్ని ఏర్పాట్లతో సమ్మెకు సిద్ధమయిపోతామంటున్నారు... తాము ఇటీవల నిర్వహించిన 35 రోజుల సమ్మెలో రాజకీయ నాయకులు కలిసిరాలేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా సంఘీభావం తెలుపలేదు. టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యే లు మినహా సకల జనుల సమ్మెకు అండగా ఎవరు నిలబడలేదు. మిగిలినవారంతా మోసమే చేశారని బాహాటంగా అంటున్నారు కార్మికు లు. ఇక రాష్ర్టమంవూతులయితే సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. కనీసం వారు మనుసున్న మనుషుల్లాగా కూడా కనిపించడం లేదు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. ఒకరి కోసం 17 మంది ఎమ్మెల్యేలు తమ పదవులను తృణవూపాయంగా వదులుకున్నారు. కానీ నాలుగున్నరకోట్ల ప్రజల ఆకాంక్ష కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు కూడా కలిసిరాలేదంటే తెలంగాణపై వారికున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికయినా మార్చుకోండి మీ విధానాలను... కలిసిరండి తెలంగాణ సాధించుకుందాం... పదవులు శాశ్వతం కాదు. డిసెంబర్ తొమ్మిది ప్రకటన అమలు కోసం అందరం కలిసి కొట్లాడుదాం... మీ పదవులు ఇడిసిపెట్టుండ్రి.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన