పోరుసాగుతోంది బిడ్దా...


Sat,October 6, 2012 04:55 PM

Singggaa-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఒక మంత్రం వేసినట్లే కొనసాగింది సింగరేణి సమ్మె. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు కొంగు బంగారం, గుండెకాయ అయిన సింగరేణి కార్మికుల పాత్ర ఒక ప్రత్యేకమైన త్యాగాలతో, ఆకాంక్షలతో కూడినది. ఒక రాజకీయ డిమాండ్‌పై 35 రోజుల సుదీర్ఘమైన సమ్మెలో సింగరేణి కార్మికులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు... సమ్మెను విఫలం చేయడం కోసం సమ్మె ప్రారంభం రోజు నుంచి సాయుధ వర్గాల మోహరింపు, ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను రప్పించడం, తాయిలాలు ప్రకటించడం, ఒక మస్టర్‌కు మూడు మస్టర్లు ఇవ్వడానికి సిద్ధపడటం, కార్మికులను ఎత్తుకుపోయి కిడ్నాప్ చేసి అప్రజాస్వామికంగా అర్ధరాత్రి తీసుకొని వచ్చి పని చేయించే ప్రయత్నం చేయడం, సెక్షన్ 7 లాంటి కేసులను బనాయించడం, వందలాది మంది కార్మికులను, కార్మిక నాయకులను జైళ్లలో పెట్టడం లాంటివి యథేచ్ఛగా కొనసాగాయి.

అయినప్పటికీ కార్మికులు వాటినన్నింటిని అధిగమించి 35 రోజుల సమ్మెను విజయవంతం చేశారు... ఇంతకు ముందే తొమ్మిది రోజుల పాటు కార్మికులు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం సమ్మె చేసి ఉన్నారు... సెప్టెంబర్ 13న తెల్లవారు జామున ఉదయం నాలుగు గంటలకే ప్రారంభమయ్యే ఫ్రీ షిప్టు నుంచి కార్మికులు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విధులను బహిష్కరించారు.
సింగరేణి కార్మికులు అందరికంటే ముందు సక ల జనుల సమ్మెను ప్రారంభించి తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువయ్యారు. తాము సమ్మె చేస్తే దక్షిణ భారతదేశంలో పారిక్షిశామిక సంక్షోభం వస్తుందని, తప్పనిసరిగా పారిక్షిశామిక సంక్షోభాన్ని తీసుకువస్తామని కార్మికులు చెప్పారు. చెప్పిన విధంగానే సంక్షోభాన్ని సృష్టించారు. కానీ శవాలపై, తెలంగాణ కోసం బలిదానాలు చేసిన విద్యార్థులపై ప్రమాణాలు చేసిన రాజకీయ నాయకులు, ముఖ్యంగా మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తామని రాజీనామాలు చేసి ఆమోదించుకుంటామని చెప్పి మాట తప్పారు.

సకల జనుల సమ్మెకు పెదవుల దాకే తమ మద్దతు ప్రకటిస్తూ తమ పదవులను పట్టుకొని వేలాడారు. రాజకీయ మద్దతు ఏమాత్రం సకల జనుల సమ్మెకు లభించలేదు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు సింగరేణి కార్మికులు మూడు చెరువుల నీళ్లు తాగించారు... వీరు కనీ సం గిలాసెడు నీళ్లు కూడా తాగించలేని విధంగా వ్యవహరించారు. ఆర్టీసీ కార్మికులు అనివార్యమైన పరిస్థితులలో సమ్మెకు తాత్కాలిక విరామం ఇవ్వాల్సి వచ్చింది... ఇటు సింగరేణిలోనూ కార్మికులు తప్పని పరిస్థితుల లో మంత్రుల, నాయకుల విద్రోహం కారణంగా మంగళవారం తాత్కాలి కంగా సమ్మెకు విరామం, వాయిదా ప్రకటించాల్సి వచ్చింది. అలలుగా పయనిస్తూ ఒక ఊపు ఊపి తమ సత్తా ఏమిటో చాటిన బొగ్గు గని కార్మికుల 35 రోజుల సమ్మె రాజకీయ నాయకులకు, వారి అనైతికమై న బాధ్య తా రహితమైన మాటలకు, నిర్ణయాలకు ఒక సవాల్‌గా పేర్కొనవచ్చు... యుద్ధంలో ఓటమి తాత్కాలికమైంది. ఇది కేవలం యుద్ధ విరామం మాత్ర మే.

ఆకాంక్ష సాకారం వరకు కచ్చితంగా ఉద్యమం ముందుకు సాగుతుం ది. సింగరేణి లో ఉద్యమాలు, పోరాటాలు, విజయాలు, ఓటములు బొగ్గు గని కార్మికులకు కొత్త కాదు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందులలో సమ్మెను విచ్ఛిన్నం చేయడంలో కొన్ని సంఘాల నాయకులు, కార్యకర్తలు తీవ్రమైన విద్రోహానికి పాల్పడ్డారు. అక్కడ ఉత్పత్తి చేసిన బొగ్గును విజయవాడ, రాయలసీమ ప్రాంతాలకు సీమాంధ్ర ప్రభుత్వం తరలించుకున్నది... అక్కడ కార్మికులకు రెండు నుంచి మూడు మస్టర్లు వేతనాన్ని కొనసాగించారు. ఈ సమ్మెలో కూడా ఎంతటి వివక్షతను చూపించారో పరిస్థితిని పరిశీలిస్తే స్పష్టంగా కనిపిస్తుంది... విద్యుత్ కోతలోనూ అలాంటి విధానాలనే అమలు చేశారు. సింగరేణి అధికారుల మోసపూరిత విద్రోహ బుద్ధితో కూడిన పాత్ర గురించి కూడా చర్చించాల్సి ఉంటుంది... బందిపోటు దొంగలకంటే అధ్వాన్నంగా సింగరేణి అధికారులు వ్యవహరించారు... ఆపరేటర్లు మొదలు ఎలక్షిక్టిషియన్‌ల పనులు కూడా అధికారులు చేశారు... కోట్ల రూపాయలు సమ్మె విచ్ఛిన్నానికి ఖర్చు పెట్టారు.

పోలీసులకు కోరిందల్లా అందించారు. గనులను సాయుధ బలగాలతో నింపివేశారు. ఆర్కే కంపెనీ లాంటి ఓపెన్ కాస్టు ప్రైవేటు కంపెనీకి అధికారులు అండగా నిలబడ్డారు. పనులను అడ్డుకోవడానికి వెళ్లిన కార్మిక నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి జైళ్లలో పెట్టించారు. అంతా అప్రజాస్వామికమైన పద్ధతులను అమలు చేస్తూ తీవ్రమై న కేసులు పెట్టించారు. పాక్షికంగా బొగ్గు బావులు నడిచిన ఖమ్మం జిల్లాలో ఒక నీతి ని, వంద శాతం సమ్మె కొనసాగిన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లా ల్లో ఒక నీతిని సింగరేణి యాజమాన్యం అమలుచేసింది. ఈ రోజు సింగరేణి కాలరీస్‌లో కార్మిక వర్గం ఒక గౌరవవూపదమైన రీతిలో తాత్కాలికంగా సమ్మె విరమించింది... విజయం తప్ప అపజయం ఎరుగని బొగ్గు గని కార్మికులు సింగరేణిలో ప్రత్యేక తెలంగాణకు సంబంధించి నిర్వహించినటువంటి పాత్ర ఎవ్వరు మరువలేరు... బొగ్గు గని కార్మికులను, వారి ఉద్యమాలను, పోరాటాలను, త్యాగాలను గతంలో ఎన్నడూ పట్టించుకోని వారు సైతం జాతీయస్థాయి మీడియాలో 35 రోజుల సమ్మెకు సంబంధిం చి పరిణామాలను, ప్రభావాన్ని కొంతయినా చూపించారు.

దానికి కార ణం సమ్మె ప్రభావం... సమ్మె వల్ల వారికి జరిగిన నష్టం, చీకటిమయమైపోయిన ఆయా రాష్ట్రాల దుస్థితి ఇవన్నీ కూడా ఈ రోజు సింగరేణి కార్మికుల విజయాలుగానే భావించవచ్చు.
ఈ రోజు దసరా లాంటి పండుగలను త్యాగం చేసి మరీ బరిలో నిలబడ్డ భయమెరుగని బొగ్గు గని కార్మికుడి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కచ్చితంగా మరో పోరాట రూపంలో, మరో ఉద్యమ రూపంలో ఎప్పటికి సజీవంగానే ఉంటుంది... ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు... చిన్న చిన్న పొరపాట్లు కొన్ని సంఘాల ఆచరణ ఫలితంగా జరిగినప్పటికి సింగరేణిలోని 12 కార్మిక సంఘాలు ఐక్యంగా సమ్మెను ప్రారంభించాయి. అలాగే రాజకీయ నాయకులు విద్రో హం తలపెట్టినప్పుడు ఐక్యంగానే గౌరవవూపదంగా సమ్మెను విరమింపజేయడం ఒక బాధ్యతాయు తమైన కర్తవ్యంగా భావించి, తాత్కాలిక విరమ ణను ప్రకటించడం కూడా ఒక సంచలనంగానే భావించవచ్చు.. ఇప్పటికయినా అనుభవాల నుంచి గుణపాఠాలను రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది... సకల జనుల సమ్మె వైపు కనీసం తొంగి చూడ ని దుర్మార్గపు (తెలంగాణ) మంత్రులను ఏమనాలి..

! వారికి కొద్దిగనయినా జ్ఞానం, సిగ్గు, శరం ఉంటే తెలంగాణకు నిజంగా వారు బిడ్డలయితే ఇప్పటికయినా తమ పదవులకు రాజీనామా చేసి ఆమోదింపజేసుకోవాలె. సింగరేణి సమ్మెలో ద్రోహుల చిట్టా తయారైంది... అయితే ఈ చిట్టా రాజకీయ నాయకులంత ప్రమా ద చిట్టా ఏమీ కాదు. అయినప్పటికీ పేరు పేరున ద్రోహులను ఎండగడుతాం. పేరు పేరున ఉద్యమకారులను నెత్తినెత్తుకుంటాం. అధికారులు ఇప్పటికయినా విద్రోహ చర్యలను మానండి. అలాగే ప్రజా ప్రతినిధులారాపైకి మద్దతు, లోపల లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్న చిట్టా కూడా తయారయింది. రానున్న రోజులలో బొగ్గు గని కార్మికులు ఇలాంటి వారందరి భరతం పడుతారు. జర జాగ్రత్త..! విద్రోహ కార్మిక నేతల్లారా ఖబర్దార్...అంటున్నారు బొగ్గు గని కార్మికులు...

బొగ్గు గని కార్మికుల పోరాట త్యాగాల ఒరవడి రానున్న రోజుల్లోనూ కొనసాగుతుంది. ఇంకా అంతిమ పోరాటం బాకీ ఉందని, ఇది కేవలం తాత్కాలిక వాయిదా, విరమణ అని కార్మిక వర్గం పేర్కొంటున్నది. నాలు గున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరే వరకు పోరాటం సాగుతనే ఉంటుంది. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు... ఏది ఏమయినా సింగరేణి కార్మికులకు మరోసారి ఉద్యమాభివందనాలు. వారి కుటుంబాలకు, అమ్మలక్కలకు, బిడ్డలకు, చెల్లెండ్లకు పాదాపాదాన దండాలు.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం

Published: Sun,January 6, 2013 12:14 AM

వారి త్యాగాలు చిరస్మరణీయం

సామాజిక సంఘర్షణలే ఒక్కో సారి చారిత్రక మైలురాళ్లుగా నిలుస్తాయి. చరిత్ర గతిని మార్చే వెలుగుబాటలు వేస్తాయి. సమాజ గర్భంలోంచి విచ్చుకున

Published: Wed,December 26, 2012 11:43 PM

సీమాంధ్రవాదాన్ని బొందపెట్టారు

సీ మాంధ్ర వాదాన్ని జూన్ 28వ తేదీన సింగరేణి కార్మికులు, డిసెంబర్ 22న ఆర్టీసీ కార్మికులు బొందపెట్టారు. జీహెచ్‌ఎంసీలోనూ అదే జరిగింది.

Published: Fri,December 14, 2012 12:00 AM

తెలంగాణ కోసం పోరుబాట

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించి మూడేళ్లయింది. అయినా రాష్ట

Published: Fri,November 23, 2012 10:47 PM

బొగ్గు బావులతో... అంతరిస్తున్న అడవులు

లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతమంతా సర్వనాశనమవుతున్నది. ప్రధానం గా ఏజెన్సీ ప్రాంతాల అడవి కనుమరుగవుతున్నది. ఒక్క బొగ్గుబాయి ఏర్పడాలంటే క

Published: Fri,December 14, 2012 04:16 PM

నేతలూ మేల్కొనండి

తెలంగాణ కోసం మరో విద్యార్థి కుసుమం నేలరాలిం ది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచ్చులాపూర్ గ్రామానికి చెందిన దర్శనాల సంతోష్ ఉస్మా

Published: Fri,October 12, 2012 02:34 PM

భవిష్యత్తు తరాలకు భరోసా ఏది?

ఎప్పుడు తినే కంచాన్ని గుంజుకొని ఎంగిలి మెతుకులు వెదజల్లుతూ తన ఉదారతత్వాన్ని చాటుకుంటున్నోడే పర్యావరణానికి ప్రమాదకారిగా మారాడు. అలా

Published: Thu,October 11, 2012 05:44 PM

సకల సమ్మెను రగిలించిన బొగ్గు కణిక

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మొట్టమొదట సమ్మె చేసింది బొగ్గుగని కార్మికులే. ఆరు దశాబ్దాల తమ ఆకాంక్షను సాకారం చేసుకోవడం కోసం సింగరే

Published: Tue,October 9, 2012 04:23 PM

బొగ్గు కుంపటిపై యూపీఏ

బొగ్గు కుంభకోణం దేశాన్ని కుదిపేస్తున్నది. కాగ్ నివేదికతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా వెలుగులోకి వచ్చింది. బొగ్గు బ్లాక్‌ల కేటాయిం

Published: Sat,October 6, 2012 04:46 PM

విధ్వంసం సృష్టిస్తున్న విషాదాలు..

బొగ్గు బావుల వల్ల తెలంగాణ ప్రాంతమే కాదు, దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు విధ్వంసానికి గురవుతున్నాయి. వీటివల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ని

Published: Sat,October 6, 2012 04:46 PM

నవశకానికి నాంది..

తెలంగాణకు గుండెకాయ, ఎన్నో పోరాటాలకు, త్యాగాలకు కేంద్ర బిందువుగా నిలిచిన సింగరేణి కార్మికులు ఈ నెల 28న జరిగిన యూనియన్ గుర్తింపు ఎన

Published: Sat,October 6, 2012 04:46 PM

గని కార్మికుల కష్టాలకు కారకులెవ్వరు?

సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన భారత కార్మిక వర్గం గతంలో ఎన్నడూ లేనటువంటి సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రపంచీకరణ మొదలైన తరువా

Published: Sat,October 6, 2012 04:47 PM

కార్మికులను మరిచిన సింగరేణి ఎన్నికలు

పదేళ్ళ నుంచి లాభాల్లో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి గత నాలుగేండ్లుగా వంద కోట్ల వరకు డివ

Published: Sat,October 6, 2012 04:47 PM

సింగరేణి సొమ్ముతో ఆంధ్రా షోకులు

సింగరేణి సంస్థ వార్షిక టర్నోవర్ పదకొండు వేల కోట్లుంటే అందులో ఐదో వంతు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రాయల్టీల రూపంలో ప

Published: Sat,October 6, 2012 04:47 PM

గనులు తవ్వాలె, పర్యావరణాన్ని రక్షించాలె

దేశంలో బొగ్గును గుర్తించి 238 ఏండ్లు కావస్తున్నది. దేశంలో ప్రస్తు తం జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, ఆంధ్రవూపదేశ్, మధ్య

Published: Sat,October 6, 2012 04:48 PM

కవ్వాల్‌పై కదలని నాయకులు

కవ్వాల్ అభయారణ్యాన్ని టైగర్‌జోన్‌గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మూడు వారాలుగా వరుసగా ప్రజాందోళనలు కొనసాగుతున్నప్పటికీ ఒ

Published: Sat,October 6, 2012 04:48 PM

కోలిండియా సారథి మనోడే

కోలిండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తెలంగాణ అధికారి మెదక్ జిల్లా గొట్టిముక్కల గ్రామం నివాసి, ఐఏఎస్ అధికారి ఎస్. నర్సింగరావు న

Published: Sat,October 6, 2012 04:49 PM

సింగరేణికి లాభాలు-కార్మికులకు కష్టాలు

సింగరేణి 2011-12 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయించిన 51 మిలియన్ టన్నుల ఉత్పత్తిని ఐదు రోజుల ముందుగానే అధిగమించింది. సింగరేణి ల

Published: Sat,October 6, 2012 04:49 PM

బడ్జెట్ భారం

బొగ్గు గనుల మీద కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. మనదేశంలో 74 శాతం విద్యుత్ బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతున్నది. ఈ విద్యుత్ ఉత్పత్త

Published: Sat,October 6, 2012 04:49 PM

బొగ్గు బావుల్లో విషవాయువు

సింగరేణి బొగ్గు గనుల్లో విషవాయువులు ప్రాణా లు తీస్తున్నా అధికారుపూవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు తమ ప్రాణాలను అరచేతిల

Published: Sat,October 6, 2012 04:50 PM

సింగరేణి మిలియన్ మార్చ్..

మిలియన్ మార్చ్ ఒక అపూర్వ ఘట్టం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష పెల్లుబికిన రోజు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కోసం అరవై ఏండ్లుగా సింగరేణి కార్మ

Published: Sat,October 6, 2012 04:50 PM

ద్రోహులకు బుద్ధి చెప్పాలె

తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదవుల కోసం కక్కుర్తి పడుతున్నారు. టీడీపీ నాయకులు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. అధికార దాహం కాంగ్రెస్ నాయ

Published: Sat,October 6, 2012 04:51 PM

బతుకు చీకటి

ఓపెన్ కాస్టుల (ఓసీ) విధానం తెలంగాణ ప్రాంత పర్యావరణాన్ని అడ్డు అదుపు లేకుండావిధ్వంసం చేస్తున్నది. అండర్ గ్రౌండ్ విధానం వల్ల మానవ న

Published: Sat,October 6, 2012 04:50 PM

సింగరేణిపై వలస వివక్ష

ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తరువాత వలస పాలకుల వివక్ష వల్ల తెలంగాణలో ఏపీ స్టీల్, అజంజాహీ మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సర్‌సిల్క్, అంతర్గ

Published: Sat,October 6, 2012 04:52 PM

నాగోబా జాగోరే...

ఆరోజు అమావాస్య రోజు. లోకమంతా చిమ్మచీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగ

Published: Sat,October 6, 2012 04:51 PM

వేతన కమిటీలు ఎండమావులే!

పనిచేసే ప్రతి మనిషికి గౌరవవూపదంగా బతికే వేతనం పొందే హక్కు ఉందని ప్రపంచ మానవహక్కుల సంఘం ప్రకటించింది. కానీ ఈ హక్కుల స్ఫూర్తిని అమలు

Published: Sat,October 6, 2012 04:51 PM

బొగ్గుగని భగ్గుమన్న రోజు

అది 1979, జనవరి 6. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి భూస్వాములకు వ్యతిరేకంగా బొగ్గు గని కార్మికులలో తిరుగుబాటు వచ్చిన రోజు... గూండాల దౌర్జ

Published: Sat,October 6, 2012 04:52 PM

గాయాల సింగరేణి

సింగరేణిలో1889 నుంచి బొగ్గు ఉత్పత్తి చేయ డం ప్రారంభించినప్పటికీ, 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మారింది. దే

Published: Sat,October 6, 2012 04:52 PM

ఉద్యమ గళం సింగరేణి

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర హోంమంత్రి చిదంబరం అధికారిక ప్రకటన చేశారు. నవంబర్ 29 న

Published: Sat,October 6, 2012 04:55 PM

నవ్వే గాయం సింగరేణి

సింగరేణి అంటేనే నవ్వే గాయం. తిరగేసిన చెమ్మసు. ఎగురుతున్న సుత్తి కొడవలి. సింగరేణి కార్మికులు తెలంగాణ ఆకాంక్ష సాకారం కోసం 32 రోజులుగ

Published: Sat,October 6, 2012 04:54 PM

బందూకులతో బొగ్గు తవ్వగలరా!

బందూకులతో బొగ్గు తవ్వే ప్రయత్నం చేస్తున్నది రాజ్యం. 60 ఏండ్లు గా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ఆకాంక్షతో, మొక్కవోని పట్టుదలతో సింగరేణి

Published: Sat,October 6, 2012 04:54 PM

గని కార్మికుల గర్జనగని కార్మికుల గర్జన

గావులలో 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఉట్టిపడింది. కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు ప్రకటన వెలువడిత

Published: Sat,October 6, 2012 04:54 PM

భవిష్యత్తు నల్ల బంగారానిదే!

దేశంలో డిమాండ్‌కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగడం లేదు... దీంతో ప్రతి సంవత్సరం 80-100 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంటున్నా

Published: Sat,October 6, 2012 04:53 PM

వివక్షతోనే ఈ విషాదాలు

ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉన్నా ఆ అసంతృప్తిని, ప్రజా ఆగ్రహానికి ఒక ఉద్యమ రూపం ఇచ్చి లక్ష్యాలవైపు నడిపించే పార్టీ కానీ, వ్యక్తులు కాన

Published: Sat,October 6, 2012 04:53 PM

గిరిపుత్రుల ఆకలి చావులు పట్టవా?

- ఎండీ. మునీర్ వర్షాకాలం అంటేనే ఆదివాసులు వణికిపోతున్నారు. ప్రతి ఏటా వర్షా కాలంలో.. గిరిజనుల చావులు పెరిగిపోతున్నాయి. అయినా.. ప్ర

Published: Sat,October 6, 2012 04:53 PM

చట్టాలు చేస్తరు, అమలు చెయ్యరు!

గిరిజనులు వలస కూలీలుగా మారటం అం కేవలం బతుకు కోల్పోవడమే కాదు. వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలను కోల్పోవడం. ఇంత వినాశనానికి గిరిజనులు ఎం