నవ్వే గాయం సింగరేణి


Sat,October 6, 2012 04:55 PM

Raju1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaసింగరేణి అంటేనే నవ్వే గాయం. తిరగేసిన చెమ్మసు. ఎగురుతున్న సుత్తి కొడవలి. సింగరేణి కార్మికులు తెలంగాణ ఆకాంక్ష సాకారం కోసం 32 రోజులుగా సమ్మె చేస్తున్న సందర్భంలో సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం రాజ్యం నల్ల నేలను యుద్ధభూమిగా మార్చినా రాజీ పడడం లేదు. రాజ్యం విధానా ల ఫలితంగా ఎన్నో గాయాలు ఇప్పటికే ఉన్నప్పటికి, వాటిని పెద్దగా పట్టించుకోకుండానే ఉద్యమాలే ఊపిరిగా బతికే ఉద్యమ కెరటాలున్న నేల ఇది. నక్సలైట్ల పేరుమీద ఇప్పటి దాకా 69 మంది నేల బిడ్డలు ఎన్‌కౌంటర్‌ల పేరిట కాల్చివేతకు గురయ్యారు. 1942 నుంచి ఉద్యమిస్తున్న ఈ గడ్డలో అప్పటి శేషగిరి మొదలు మొన్నటి సికాస నేతలు రమాకాంత్, విశ్వనాథ్, కట్ల మల్లేష్, వరకు ఎన్‌కౌంటర్‌లలో మరణించారు. అలాగే గోదావరిఖనిలో జరిగిన రెండు అతి పెద్ద ప్రమాదాలపై కోర్టు ఆఫ్ ఎంకై్వయిరీ వేసి దాని విచారణను జస్టిస్ బిలాల్ నఖ్వీ చేపట్టి రిపోర్ట్ ఇచ్చినా దానిపై చర్యలు లేవు. అయినా ఉద్యమాలలో సింగరేణి కార్మికులు అన్ని దిగమింగుకుంటూనే ముందున్నారు.

123 సంవత్సరాల చరిత్ర గల సంస్థలో కేవలం 65 శాతం మందికే గృహ వసతిని యాజమాన్యం కల్పించింది. మిగతా వారంతా అద్దె ఇండ్లలో, స్వంత ఇండ్లలోనే ఉంటున్నారు. అక్కడ గడప, గడప మానవీయత ఉట్టిపడుతుంది.అసలు సిసలైన మట్టిమనుషులు జీవించే ప్రాంతమది. ఎదనిండ ఎన్నో వెతలు మోస్తూ మదినిండా మమతలు పంచే అమ్మకలక్కలు ఎంతో మంది దసరా పూట ఉద్యమంలో ఉన్నరు. 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం వీధులకు వీధులే కదిలి కదం కదం తొక్కుతున్నాయి. యాజమాన్యం రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసిన లొంగలేదు. గనులన్నీ పోలీసుల మయం చేసినా పట్టించుకోలేదు. మడిమతిప్పే మనస్తత్వం వారికి లేదు. ఓటమి ఎరుగని నల్ల నేల సింగరేణి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒక పూజలాగా, ప్రార్థనలాగా ఎలాంటి శషభిషలు లేకుండా దినచర్యగా కొనసాగిస్తున్నా రు. దసర పూట కూడా సమ్మెలోనే ఉన్నారు... దసర నాడు సింగరేణి కార్మికుడికి జీతంతో కూడి న సెలవు దినం ఇస్తా రు.

ఈ సెలవు దినం దసర కన్నా ఒక రోజు ముందు లేదా దసర తరువాత దినం విధులకు హాజరయితేనే ఆ మస్టర్ దొరుకుతుంది... కాని కార్మికులు విధులకు హాజరు కాలేదు... అక్టోబర్ 2 గాంధీ జయంతినాడు కూడా జీతంతో కూడిన సెలవు దినమే... అయినా ఆ రోజును కూడా త్యాగం చేశారు... ఇదం తా ప్రత్యేక తెలంగాణ కోసం. కులమతాలకు అతీతంగా అలయ్, బలయ్‌లు తీసుకునే రోజు. అయితే సమ్మె కారణంగా కొత్తబట్టలు లేవు. అయినా డోంట్ కేర్. ఫికర్ నహీ అంటున్నారు కార్మికులు.
తమ నేలలో తమ రాజ్యం ఉండాలని ఆకాంక్షతో ఎన్నో త్యాగాలు, పోరాటాలతో రక్తసిక్తమయిన నల్ల నేల ఈ రోజు తమ నేల మీద తాము పరాయి మనుషులుగా బ్రతకడం ఇక అంగీకరించే ప్రసక్తే లేదని సమ్మె కట్టారు. బుక్కెడు బువ్వ కోసం భూమి పొరల్లో ఊపిరిసల్పని గర్మి ఫేసుల్లో బొగ్గు పెల్లలకు నెత్తు రు అద్ది లోకానికి వెలుగు పంచే చీకటి బతుకుల్లో రవ్వంత వెలుగు కోసం ఇదం తా ఆరాటం. తప్పదు పోరాటం అంటున్నారు కార్మికులు.

తమ త్యాగం 700 మంది దాకా తెలంగాణ కోసం బలిదానం ఇచ్చిన పిల్లలకన్నా ఏమంతా పెద్దది కాదని చెబుతున్నారు. సింగరేణి అధికారులు సమ్మె చేయకపోతే చేయకపాయే, సమ్మె విచ్ఛిన్నకారులుగా మారిపోయిండ్రు. షార్ట్ ఫైరర్ చేసే పని అండర్ మేనేజర్ చేస్తుండు. ఎలక్షిక్టీషియన్ చేసే పని ఇంజనీర్ చేస్తుండు. సూపర్‌వైజర్ చేసే పని జీఎం చేస్తుండు. సీమాంధ్ర అధికారుల కన్నా మిన్నగా మన పోలీసుల మాదిరే తెలంగాణ అధికారులే విర్రవీగుతున్నారు. ద్రోహులుగా ఇప్పటికే ముద్ర వేసుకున్నారు. 500 మందికి పైగా కేసుల్లో ఇరికించినప్పటికీ ఉద్యమం మాత్రం ఆగడం లేదు. తెలంగాణ వచ్చేదాకా సింగరేణి బిడ్డలలో ఈ పట్టుదల యథాతథంగా ఉంటుంది.

ఏది ఏమయినా 123 సంవత్సరాల సింగరేణి సుదీర్ఘ చరివూతలో ఇలా దసరా పండుగ ఒక ఉద్యమ వాతావరణంలో కనిపించడం ఇక్కడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నల్లనేల ప్రాంత ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది... ఇప్పటికయినా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయకుండా తెలంగాణను ప్రకటించాల్సిన అవసరం ఉంది... ఒక జర్నలిస్టుగా పాతిక సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల ఆరాట పోరాటాలను చూసిన వాడిగా..., ఇక్కడే పుట్టి పెరిగిన ‘సన్ ఆఫ్ ద సాయిల్’గా ఈ నల్ల బంగారు నేలతో ఉన్న పేగు బంధంతోనయితేనేమి, ఇలాంటి ఉద్యమ దసరాను నేను చూసి ఎరుగను... ఏది ఏమయినా ఈ రోజు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికే కేంద్ర బిందువుగా తయారయిన బొగ్గు గని కార్మికులు, వారి కుటుంబాలకు పాదాపాదాన పరిపరిదండాలు... బొగ్గు గని కార్మికుల, సంఘా ల ఐక్యత వర్ధిల్లాలి... జల్ జమీన్ జంగల్ వర్ధిల్లాలి... మా బొగ్గు బావులు మాకు కావాలి... మా తెలంగాణ మాకు ఇవ్వాలి... తెలంగాణ వచ్చేదాక కార్మిక సంఘాలన్ని ఐక్యంగా ముందుకు సాగాలి... 60 ఏండ్ల ఆకాంక్ష కోసం ఆమాత్రం సమ్మె పోరాటంలో కలిసి రాకుంటే, కలిసి ఉండకపోతే నవ్వేటోని ముంగట జారిపడ్డట్టు అవుతుంది.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన