గని కార్మికుల గర్జనగని కార్మికుల గర్జన


Sat,October 6, 2012 04:54 PM

గావులలో 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఉట్టిపడింది. కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు ప్రకటన వెలువడితే తప్ప మా సమ్మె విరమణ చేసే ప్రసక్త్తి లేదంటున్నారు... మొత్తం 50 బొగ్గు బావులలో రోజుకు లక్షా 45 వేల టన్నుల ఉత్పత్తి అంతా ఆగిపోయింది... లక్ష టన్నులకుపైగా జరిగే రవాణా ఆగింది. రెండు, మూడు రోజులకన్నా ఎక్కువ సరిపోయే స్టాకు విద్యుత్ ప్లాంటులలో నిలువ లేదు. కార్మికులు సకల జనుల సమ్మెలో పట్టుదలతో సమ్మెలో పాల్గొంటున్నారు. పుట్టెడు బండ కిందకుపోయి రాక్షసి బొగ్గును ఉత్పత్తి చేస్తూ దక్షిణ భారతదేశానికి వెలుగును ప్రసాదిస్త్తున్న ఆ కార్మికుల వెతలు తీరాలంటే తెలంగాణ ఏర్పాటు కావాల్సిందేననే విషయాన్ని కార్మికులే కాదు వారి కుటుంబాలు నమ్ముతాయి... నమ్ముతున్నాయి....
Sakala-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఉత్తర తెలంగాణ జిల్లాల్లోని బొగ్గు గనుల ప్రాంతం ఎన్నో ఉద్యమాలకు ప్రతీక... ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు ఇక్కడ పురుడుపోసుకున్నాయి. జీవించే హక్కు కోసం ప్రతి పేదవాడు మంచిగా బతకాలని ఆశించే ఎందరో ఉద్యమ కారులు పుట్టిన గడ్డ ఇది. సింగరేణి కార్మికులు తమ హక్కుల కోసం 56 రోజుల వరకు సుదీర్ఘ సమ్మెలు చేసి న చరిత్ర ఉంది. సింగరేణిలో ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం అంటుకున్నకొలిమిలా కొనసాగుతోంది. దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా సింగరేణిలో కార్మిక వర్గం తెలంగాణ ఆకాంక్షతో ఈ ఏడాది తొమ్మిది సార్లు తమ విధులు బహిష్కరించి పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్ర బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధించేంత వరకు సమ్మె ఆపేది లేదని, బొగ్గు పెల్ల బయటకు తీసేది లేదని, పంపేది లేదని గిరిగీసి కూర్చున్నారు బొగ్గు గని కార్మికులు...

బొగ్గు గని కార్మికులు ఈ రోజు తమ బతుకులు బాగు పడటం కోసం, తమ సింగరేణిని దక్కించుకోవడం కోసం, తమ వనరులను తాము కాపాడుకోవడం కోసం, తమ పిల్లలకు ఉద్యోగాలు రావాలని తెలంగాణ రావాలని కోరుకుంటున్నారు... ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ నుంచి దూరంగా సంస్థను రక్షించుకోవడం కోసం ఉద్యమిస్తున్నారు. ఇదే సంవత్సరం తెలంగాణ మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులు సహాయ నిరాకరణలో పాల్గొన్న సందర్భంలో సింగరేణిలోనూ సహాయ నిరాకరణ కార్యక్షికమం కొనసాగింది. చాలా మంది కార్మికులు ఈ ఉద్యమంలో అరెస్టులకు కూడా గురయ్యారు... జైలుపాలయిన వారు ఉన్నారు. చరివూతలో ఎన్నడూ లేని విధంగా సంస్థలో పని చేసే అధికారులు కూడా ఈ ఏడాది జూలై ఐదు, ఆరు తేదీలలో కార్మికులతోపాటు తెలంగాణ కోసం విధులను బహిష్కరించారు. ఇది చారివూతక ఘట్టం.
సింగరేణిలో దశాబ్దాలుగా వలస వాదుల రాజ్యం కొనసాగుతుంది... అధికార గణంలో వారే మెజార్టీలో ఉన్నారు. ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కొంత తెలంగాణ వాదులకు అవకాశాలు వస్తున్నాయి...

ఇదంతా ఉద్యమ ఫలితంగానే జరుగుతున్నది. అయితే ఇప్పటికి సింగరేణిలో 610జీవో కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. సీమాంధ్ర వాసుల కోసం మూడున్నర దశాబ్దాల క్రితం క్లరికల్ ఉద్యోగానికి డిగ్రీ అర్హతగా ఉండేది. వాస్తవానికి ఈ రోజు వరకు కూడా అటు కేంద్రంలో, ఇటు రాష్ర్టంలో క్లరికల్ ఉద్యోగానికి ఎస్‌ఎస్‌సీ మాత్రమే అర్హతగా ఉన్నది. అయితే సింగరేణిలో మాత్రం డిగ్రీ అర్హతగా నిర్ణయిం చారు. కేవలం అప్పట్లో తెలంగాణలో విద్యా సౌకర్యం అతి తక్కువ ఉండటం మూలకంగా 10వ తరగతి వరకే చదువులు ఆపేసిన వారు చాలా మంది ఉండేవారు. అలాంటి వారికి క్లరికల్ ఉద్యోగం దొరకకుండా సింగరేణిలో కొంత మంది ఆంధ్రా డైరెక్టర్‌లు ఈ అర్హతను డిగ్రీగా మార్చేశారు. దానితో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వేలాది మంది వచ్చి ఇక్కడ క్లర్కులుగా చేరిపోయారు. ఇలాంటి సింగరేణిలో జరిగాయి. క్వార్టర్ల కేటాయింపులో, ప్రమోషన్‌లలోనూ ఇలా వివక్ష కొనసాగింది.

1969, 1972 ప్రాంతంలో కూడా సింగరేణిలో వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాలు పంచుకున్న వారు సింగరేణి వివక్ష గురించి ఇప్పటికి కథలు కథలు గా చెప్పుకుంటుంటారు. నాటి నుంచి రగులుకుంటూ వచ్చిన తెలంగాణ ఆకాంక్ష ఇప్పు డు ఉప్పెనలా బయటకు వచ్చింది. ఈ రోజు కార్మికులు తెలంగాణ కోసం నిరవధిక సమ్మె చేసి దక్షిణ దేశం మొత్తం కూడా పారిక్షిశామిక సంక్షోభాన్ని సృష్టించడానికి సిద్ధమయ్యారు.తెలంగాణ ప్రాంతం ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసిన నేపథ్యంలో వారిని అభినందిస్తూనే కార్మికులు రాజీనామా చేయని వారి దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తున్నారు. రాజీనామా చేయని ప్రజావూపతినిధులను బొగ్గు బావుల ప్రాంతానికి రానివ్వమని మొట్ట మొదట ఏడాది క్రితమే వారిని బహిష్కరించిన, పిలుపునిచ్చిన ఘనత కూడా బొగ్గు గని కార్మికులదే. ఈ రోజు కార్మిక సంఘాల కార్యకలాపాలకు అతీతంగా దాదాపు అన్ని కార్మిక సంఘాలు కలిసి పని చేస్తున్న ఉద్యమం కూడా ఇదే కావడం విశేషం.

అపజయం ఎరుగని తిరుగుబాటుకు మరో పేరయిన సింగరేణి బిడ్డలు ఈ రోజు తెలంగాణ కోసం ఉద్యమించడం అదికూడా తమ గమ్యాన్ని చేరుకునే వరకు ఆగేది లేదని ప్రకటించడం శుభసూచకం. సకల జనుల సమ్మె ద్వారా దక్షిణ భారతదేశంలో పారిక్షిశామిక సంక్షోభం సృష్టించయినా తెలంగాణను సాధించుకుంటామనే గట్టి నమ్మకంతో కార్మికులు ఉన్నారు. నాలుగు వేలకుపైగా దక్షిణ భారతదేశంలోని పరిక్షిశమలన్నీ గని కార్మికుల ఈ సమ్మెతో బంద్ అయిపోతాయి. సమ్మెతో స్వరాష్ట్రాన్ని సాధించుకుంటామని కార్మికులు నినదిస్తున్నారు.
-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన