నిరుపేదల న్యాయవాది


Wed,August 7, 2013 11:15 PM

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం ఇప్పించేందుకు తాపవూతయపడ్డ ఒక మహా మనిషి. ఆయనే సీ పద్మనాభడ్డి. ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సంఘా’నికి 20 ఏండ్లు అధ్యక్షునిగా కొనసాగారు. అంతకుముందు డెమోక్షికటిక్ లాయర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షునిగా ఉండేవారు. అనంతపూర్ జిల్లా యాడికిలో మధ్యతరగతి కుటుంబంలో 1931 మార్చి 1న జన్మించిన పద్మనాభడ్డి మద్రాసు హైకోర్టులో 1953 జూలై 27న న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గుంటూరులోని హైకోర్టులో, అలాగే 1956 నుంచి హైదరాబాద్ హైకోర్టులో ఆయన ప్రాక్టీస్ ప్రారంభించారు. దేశంలోనే మంచి పేరు గడించిన క్రిమినల్ లాయర్లలో పద్మనాభడ్డిది ప్రత్యే క స్థానం. అలాంటి పద్మనాభడ్డి చాలాకాలంగా అనారోగ్యంతో ఆగస్టు 4 ఆదివారం హైదరాబాద్‌లో తన 2వ ఏట గుండెపోటు తో మరణించారు. ఆయన ఏకైక సంతానం తనయుడు జస్టిస్ సీ ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం హైకోర్టు జడ్జిగా ఉన్నారు.

దేశంలో అతిపెద్ద కుట్ర కేసులుగా చలామణి అయిన పార్వతీపురం కుట్ర కేసు, సికింవూదాబాద్ కుట్ర కేసులలో ఆయన వాదించారు. ఈ కేసులు అబద్ధపు కేసులని రుజువుచేశారు. ప్రజాస్వామ్య ఉద్యమాలకు పెద్ద అండగా నిరుపేదలకు ఆత్మస్థైర్యం, మనోధైర్యం కల్పించే మంచి న్యాయవాదిగా ఆయనకు పేరుంది. 193-4 లో నేను ఒక భూస్వామి హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న తరుణంలో పద్మనాభడ్డి మా న్యాయవాదిగా హై కోర్టులో ఉండేవారు. ఆయనను ఈ కేసులో రెక్వెస్ట్ చేసి వరంగల్ సెషన్స్ కోర్టులోమా న్యాయవాదిగా, అటు హైకోర్టులో మా న్యాయవాదిగా కొనసాగిన దివంగత ప్రముఖ న్యాయవాది మద్రాసులో పద్మనాభడ్డి సహ విద్యార్థి అయిన ప్రముఖ పౌరహక్కుల సం ఘం నాయకుడు కేజీ కన్నబీరన్ స్వయంగా చెప్పి మాట్లాడి మా కేసులో వకల్తా వేయించారు.

ఆ సందర్భంలో పద్మనాభడ్డితో ఎంతో అవినాభావ సంబంధం ఏర్పడింది. వరంగల్ జైలులో నేను స్వయంగా చూసేవాణ్ణి. నాకు స్వానుభవం ఉంది. ఎవరిని అడిగినా హైకోర్టులో మీ లాయర్ ఎవరని అడిగితే మా న్యాయవాది పద్మనాభ రెడ్డి అనే వారు. చాలా మంది నాకు తెలిసి నేను ఉన్న రెండు మూడు సంవత్సరాలలో 150 మందికి పైగా హైకోర్టులో తమ కేసును వాదించాలని, తమకు ఎవరూ లేరని, తాము ఫీజులు ఇచ్చుకోలేమని, కింది కోర్టులో జడ్జిమెంట్ కాపీలను పంపి స్తూ లేఖ రాస్తే చాలు పద్మనాభడ్డి కేసు ఫైల్ చేసేవారు. అంతేకాదు అప్పట్లో పోస్టుకార్డ్ ఉండేది. ఆ కార్డు సంబంధిత క్లయింట్ కు ఆయన స్వంత దస్తూరితో జవాబు కూడా రాసేవారు. కేసు ఎక్కడ, ఏ స్టేజీలో ఉన్నది అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేసేవారు. వరంగల్ జైళ్లోనైతే ఆయనను కనిపించని దేవుడుగా మబ్బుదిక్కు చూసుకుంటూ వందలాది మంది మొక్కేవారు. ఆయన అంతపెద్ద లాయర్ అయినా చాలా లోప్రొఫైల్‌తో ఉండేవారు. ఆయన ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరితో అప్యాయం గా మాట్లాడేవారు. నన్నైతే చాలా ఇష్టపడేవారు.

హైకోర్టులో కేసు నడుస్తున్న సందర్భంలో నేను కొంతకాలం పెరోల్‌పై వచ్చాను. అప్పుడు కన్నబీరన్‌ను, ఇటు పద్మనాభడ్డి గారిని కలిసేవాడిని. ఎంతో ఆప్యాయం గా పలకరించేవారు. భోజనం చేసినవా,భోజనానికి డబ్బు లు ఉన్నాయా అని అడిగేవారు. ప్రతిసారి ఆయనను కలిసినప్పుడల్లా కన్నతండ్రి కొడుకును పలకరించిన ట్టు, కొడుకు తండ్రితో మాట్లాడినట్టు అనిపించేది. కన్నబీరన్ సార్ అయితే ఏంరా అని పలకరించేవారు. ఆ రోజులే వేరు. ఆ వ్యక్తులే వేరు. పద్మనాభడ్డి గారి వ్యక్తిత్వం మహోన్నతమైనది. ఆయన ఒక మహా వ్యక్తి. సింగరేణి ప్రాంతంలో అక్రమంగా ఎన్నో క్రిమినల్ కేసు ల్లో ఇరికించబడి జైళ్లలో మగ్గే కార్మికులకు, ఉద్యమకారులకు ఆయన అండగా ఉండేవారు. నేనున్నాననే భరోసాను ఇచ్చేవారు. ఆయన చాలా ఉన్నత స్థానానికి వెళ్ళినప్పటికీ ఆయనను కలవడానికే సమయం దొరకని సందర్భంలో సైతం ఆయన తీసుకునే ప్రతీ కేసులో దాదాపు కోర్టుకు అటెండ్ అయ్యేవారు. మా కేసు కొట్టేయడం, మా కేసుకు సంబంధించి ఎన్నో కుటుంబాలు ఆయనను నేటికీ దేవుడుగా ఆరాధిస్తూనే ఉంటారు. ప్రతి ఇంట్లో కన్నబీరన్, పద్మనాభడ్డి ఫోటోలు ఉంటా యి. కన్నబీరన్ సారే ఒకసారి నేను ఏదో మీటింగ్‌లని ఒక్కోసారి కోర్టుకు అటెండ్ కావడం కష్టమవుతుందిరా, అదే పద్మనాభడ్డి అయితే కచ్చితంగా అటెండ్ అవుతాడు.

అందుకే ఆయన హైకోర్టులో మీకు ఉంటే మంచిదని మరీ ఫోన్ చేసి చెప్పిన వెంటనే పద్మనాభడ్డిగారు కేసు తీసుకోవడం జరిగింది. ఒక్క నయాపైసా లేకుం డా అప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద కేసుగా ఉన్న మా కేసును ఆయ న చేపట్టి అందులో నుంచి మమ్మల్ని అందరినీ విముక్తుల్ని చేసిన ఆ సందర్భం మరిచిపోలేనిది. ఇలాంటి కేసులను సింగరేణి ప్రాంతంలో ఆయన చేపట్టడం జరిగింది. ఎంతో మందికి మేలు చేశారు. ఎంతో మంది రాష్ట్రంలో న్యాయవాదులకు ఆయన ఆదర్శంగా ఉన్నారు. మంచిర్యాలలో ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్న నా తమ్ముడు సందానికి కూడా ఆయన చాలా నేర్పించారు. ఇలా కోల్‌బెల్ట్ ప్రాంతం నుంచి ఎంతోమంది న్యాయవాదులకు ఆయన తర్ఫీదు ఇవ్వడం జరిగింది. జూనియర్‌లకు ఎప్పుడూ ఆయన మనోధైర్యాన్ని నింపేవారని చాలామంది చెప్పేవారు. ప్రతి సంవత్సరం ఆయనకు నూత న సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ కార్డు పంపిస్తే తిరి గి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ కార్డు పంపేవారు. గత సంవత్సరంనా కూతురు వివాహానికి సైతం ఆయనకు కార్డు ఇచ్చినప్పుడు ఆయన సరిగ్గా పెండ్లికి ఒక్కరోజు ముందు అందేవిధంగా ఆయన దస్తూరి తో వధూవరులను ఆశీర్వది స్తూ లేఖ రాశారు. ఎంత గొప్ప మనిషి. ఇలా ఆయనతో నా కున్న అనుబంధం మరువ లేనిది.

రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఆయనకు నా లాంటి క్లయింట్‌లు ఎందరో ఆయన అభిమానిం చే వారు, ఆయనను అభిమానించే వారు వేలాదిమంది. ఈ రోజు పద్మనాభడ్డి సార్ మన మధ్యలో లేరనే విషయాన్ని జీర్ణించుకోలేము. పద్మనాభడ్డి సార్ తెలంగాణ కచ్చితంగా ఏర్పడాల్సిందేనని, ఈ ప్రాంతంలో ప్రజలకు జరిగిన అన్యాయాలపైనైతేనేమి, కార్మికులకు ఇటు ఉద్యోగాలలో, ఏజెన్సీ ప్రాంతాల్లో మరణాల విషయంలోనైతేనేమి ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యల విషయంలోనైతేనేమి ఆయన చాలా స్పష్టంగా ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రజలవైపే మాట్లాడేవారు. పద్మనాభడ్డి సార్ ఉద్యమకారులకు, ప్రజాస్వామ్యవాదులకు ఒక ఆదర్శం. తీరనిలోటు. ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన ఈ ప్రాంతంలోని నా లాంటి వారికి ఎంతో మందికి మరో జీవితాన్ని అందించిన వ్యక్తిగా గుండెల్లో నిండుగా ఉండిపోతారు.

-ఎండీ మునీర్

195

MUNEER MD

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం

Published: Sun,January 6, 2013 12:14 AM

వారి త్యాగాలు చిరస్మరణీయం

సామాజిక సంఘర్షణలే ఒక్కో సారి చారిత్రక మైలురాళ్లుగా నిలుస్తాయి. చరిత్ర గతిని మార్చే వెలుగుబాటలు వేస్తాయి. సమాజ గర్భంలోంచి విచ్చుకున

Published: Wed,December 26, 2012 11:43 PM

సీమాంధ్రవాదాన్ని బొందపెట్టారు

సీ మాంధ్ర వాదాన్ని జూన్ 28వ తేదీన సింగరేణి కార్మికులు, డిసెంబర్ 22న ఆర్టీసీ కార్మికులు బొందపెట్టారు. జీహెచ్‌ఎంసీలోనూ అదే జరిగింది.

Published: Fri,December 14, 2012 12:00 AM

తెలంగాణ కోసం పోరుబాట

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించి మూడేళ్లయింది. అయినా రాష్ట

Published: Fri,November 23, 2012 10:47 PM

బొగ్గు బావులతో... అంతరిస్తున్న అడవులు

లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతమంతా సర్వనాశనమవుతున్నది. ప్రధానం గా ఏజెన్సీ ప్రాంతాల అడవి కనుమరుగవుతున్నది. ఒక్క బొగ్గుబాయి ఏర్పడాలంటే క

Published: Fri,December 14, 2012 04:16 PM

నేతలూ మేల్కొనండి

తెలంగాణ కోసం మరో విద్యార్థి కుసుమం నేలరాలిం ది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచ్చులాపూర్ గ్రామానికి చెందిన దర్శనాల సంతోష్ ఉస్మా

Published: Fri,October 12, 2012 02:34 PM

భవిష్యత్తు తరాలకు భరోసా ఏది?

ఎప్పుడు తినే కంచాన్ని గుంజుకొని ఎంగిలి మెతుకులు వెదజల్లుతూ తన ఉదారతత్వాన్ని చాటుకుంటున్నోడే పర్యావరణానికి ప్రమాదకారిగా మారాడు. అలా

Published: Thu,October 11, 2012 05:44 PM

సకల సమ్మెను రగిలించిన బొగ్గు కణిక

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మొట్టమొదట సమ్మె చేసింది బొగ్గుగని కార్మికులే. ఆరు దశాబ్దాల తమ ఆకాంక్షను సాకారం చేసుకోవడం కోసం సింగరే

Published: Tue,October 9, 2012 04:23 PM

బొగ్గు కుంపటిపై యూపీఏ

బొగ్గు కుంభకోణం దేశాన్ని కుదిపేస్తున్నది. కాగ్ నివేదికతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా వెలుగులోకి వచ్చింది. బొగ్గు బ్లాక్‌ల కేటాయిం

Published: Sat,October 6, 2012 04:46 PM

విధ్వంసం సృష్టిస్తున్న విషాదాలు..

బొగ్గు బావుల వల్ల తెలంగాణ ప్రాంతమే కాదు, దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు విధ్వంసానికి గురవుతున్నాయి. వీటివల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ని

Published: Sat,October 6, 2012 04:46 PM

నవశకానికి నాంది..

తెలంగాణకు గుండెకాయ, ఎన్నో పోరాటాలకు, త్యాగాలకు కేంద్ర బిందువుగా నిలిచిన సింగరేణి కార్మికులు ఈ నెల 28న జరిగిన యూనియన్ గుర్తింపు ఎన

Published: Sat,October 6, 2012 04:46 PM

గని కార్మికుల కష్టాలకు కారకులెవ్వరు?

సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన భారత కార్మిక వర్గం గతంలో ఎన్నడూ లేనటువంటి సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రపంచీకరణ మొదలైన తరువా

Published: Sat,October 6, 2012 04:47 PM

కార్మికులను మరిచిన సింగరేణి ఎన్నికలు

పదేళ్ళ నుంచి లాభాల్లో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి గత నాలుగేండ్లుగా వంద కోట్ల వరకు డివ

Published: Sat,October 6, 2012 04:47 PM

సింగరేణి సొమ్ముతో ఆంధ్రా షోకులు

సింగరేణి సంస్థ వార్షిక టర్నోవర్ పదకొండు వేల కోట్లుంటే అందులో ఐదో వంతు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రాయల్టీల రూపంలో ప

Published: Sat,October 6, 2012 04:47 PM

గనులు తవ్వాలె, పర్యావరణాన్ని రక్షించాలె

దేశంలో బొగ్గును గుర్తించి 238 ఏండ్లు కావస్తున్నది. దేశంలో ప్రస్తు తం జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, ఆంధ్రవూపదేశ్, మధ్య

Published: Sat,October 6, 2012 04:48 PM

కవ్వాల్‌పై కదలని నాయకులు

కవ్వాల్ అభయారణ్యాన్ని టైగర్‌జోన్‌గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మూడు వారాలుగా వరుసగా ప్రజాందోళనలు కొనసాగుతున్నప్పటికీ ఒ

Published: Sat,October 6, 2012 04:48 PM

కోలిండియా సారథి మనోడే

కోలిండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తెలంగాణ అధికారి మెదక్ జిల్లా గొట్టిముక్కల గ్రామం నివాసి, ఐఏఎస్ అధికారి ఎస్. నర్సింగరావు న

Published: Sat,October 6, 2012 04:49 PM

సింగరేణికి లాభాలు-కార్మికులకు కష్టాలు

సింగరేణి 2011-12 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయించిన 51 మిలియన్ టన్నుల ఉత్పత్తిని ఐదు రోజుల ముందుగానే అధిగమించింది. సింగరేణి ల

Published: Sat,October 6, 2012 04:49 PM

బడ్జెట్ భారం

బొగ్గు గనుల మీద కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. మనదేశంలో 74 శాతం విద్యుత్ బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతున్నది. ఈ విద్యుత్ ఉత్పత్త

Published: Sat,October 6, 2012 04:49 PM

బొగ్గు బావుల్లో విషవాయువు

సింగరేణి బొగ్గు గనుల్లో విషవాయువులు ప్రాణా లు తీస్తున్నా అధికారుపూవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు తమ ప్రాణాలను అరచేతిల

Published: Sat,October 6, 2012 04:50 PM

సింగరేణి మిలియన్ మార్చ్..

మిలియన్ మార్చ్ ఒక అపూర్వ ఘట్టం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష పెల్లుబికిన రోజు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కోసం అరవై ఏండ్లుగా సింగరేణి కార్మ

Published: Sat,October 6, 2012 04:50 PM

ద్రోహులకు బుద్ధి చెప్పాలె

తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదవుల కోసం కక్కుర్తి పడుతున్నారు. టీడీపీ నాయకులు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. అధికార దాహం కాంగ్రెస్ నాయ

Published: Sat,October 6, 2012 04:51 PM

బతుకు చీకటి

ఓపెన్ కాస్టుల (ఓసీ) విధానం తెలంగాణ ప్రాంత పర్యావరణాన్ని అడ్డు అదుపు లేకుండావిధ్వంసం చేస్తున్నది. అండర్ గ్రౌండ్ విధానం వల్ల మానవ న

Published: Sat,October 6, 2012 04:50 PM

సింగరేణిపై వలస వివక్ష

ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తరువాత వలస పాలకుల వివక్ష వల్ల తెలంగాణలో ఏపీ స్టీల్, అజంజాహీ మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సర్‌సిల్క్, అంతర్గ

Published: Sat,October 6, 2012 04:52 PM

నాగోబా జాగోరే...

ఆరోజు అమావాస్య రోజు. లోకమంతా చిమ్మచీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగ

Published: Sat,October 6, 2012 04:51 PM

వేతన కమిటీలు ఎండమావులే!

పనిచేసే ప్రతి మనిషికి గౌరవవూపదంగా బతికే వేతనం పొందే హక్కు ఉందని ప్రపంచ మానవహక్కుల సంఘం ప్రకటించింది. కానీ ఈ హక్కుల స్ఫూర్తిని అమలు

Published: Sat,October 6, 2012 04:51 PM

బొగ్గుగని భగ్గుమన్న రోజు

అది 1979, జనవరి 6. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి భూస్వాములకు వ్యతిరేకంగా బొగ్గు గని కార్మికులలో తిరుగుబాటు వచ్చిన రోజు... గూండాల దౌర్జ

Published: Sat,October 6, 2012 04:52 PM

గాయాల సింగరేణి

సింగరేణిలో1889 నుంచి బొగ్గు ఉత్పత్తి చేయ డం ప్రారంభించినప్పటికీ, 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మారింది. దే

Published: Sat,October 6, 2012 04:52 PM

ఉద్యమ గళం సింగరేణి

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర హోంమంత్రి చిదంబరం అధికారిక ప్రకటన చేశారు. నవంబర్ 29 న

Published: Sat,October 6, 2012 04:55 PM

పోరుసాగుతోంది బిడ్దా...

ఒక మంత్రం వేసినట్లే కొనసాగింది సింగరేణి సమ్మె. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు కొంగు బంగారం, గుండెకాయ అయిన సింగరేణి కార్మికుల పాత్ర ఒక

Published: Sat,October 6, 2012 04:55 PM

నవ్వే గాయం సింగరేణి

సింగరేణి అంటేనే నవ్వే గాయం. తిరగేసిన చెమ్మసు. ఎగురుతున్న సుత్తి కొడవలి. సింగరేణి కార్మికులు తెలంగాణ ఆకాంక్ష సాకారం కోసం 32 రోజులుగ

Published: Sat,October 6, 2012 04:54 PM

బందూకులతో బొగ్గు తవ్వగలరా!

బందూకులతో బొగ్గు తవ్వే ప్రయత్నం చేస్తున్నది రాజ్యం. 60 ఏండ్లు గా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ఆకాంక్షతో, మొక్కవోని పట్టుదలతో సింగరేణి

Published: Sat,October 6, 2012 04:54 PM

గని కార్మికుల గర్జనగని కార్మికుల గర్జన

గావులలో 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఉట్టిపడింది. కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు ప్రకటన వెలువడిత

Published: Sat,October 6, 2012 04:54 PM

భవిష్యత్తు నల్ల బంగారానిదే!

దేశంలో డిమాండ్‌కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగడం లేదు... దీంతో ప్రతి సంవత్సరం 80-100 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంటున్నా

Published: Sat,October 6, 2012 04:53 PM

వివక్షతోనే ఈ విషాదాలు

ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉన్నా ఆ అసంతృప్తిని, ప్రజా ఆగ్రహానికి ఒక ఉద్యమ రూపం ఇచ్చి లక్ష్యాలవైపు నడిపించే పార్టీ కానీ, వ్యక్తులు కాన

Published: Sat,October 6, 2012 04:53 PM

గిరిపుత్రుల ఆకలి చావులు పట్టవా?

- ఎండీ. మునీర్ వర్షాకాలం అంటేనే ఆదివాసులు వణికిపోతున్నారు. ప్రతి ఏటా వర్షా కాలంలో.. గిరిజనుల చావులు పెరిగిపోతున్నాయి. అయినా.. ప్ర

Published: Sat,October 6, 2012 04:53 PM

చట్టాలు చేస్తరు, అమలు చెయ్యరు!

గిరిజనులు వలస కూలీలుగా మారటం అం కేవలం బతుకు కోల్పోవడమే కాదు. వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలను కోల్పోవడం. ఇంత వినాశనానికి గిరిజనులు ఎం