సుప్రీం తీర్పుతో ఊరట!


Tue,July 16, 2013 12:27 AM

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కేరళకు చెందిన కొందరు భూ యజమానులు ఈ విషయంలో కోర్టుకు ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. భూమి యజమాని తన క్కును వదులుకుంటే తప్ప ప్రభుత్వానికి ఆ భూమిపై, ఆ భూమిలోని ఖనిజంపై ఎలాం టి హక్కు ఉండదని ధర్మాసనం పేర్కొన్నది.ఆదివాసులకు సంబంధించి వారి భూముల్లో బొగ్గు, ఐరన్ ఓర్, మాంగనీస్ తదితర ఖనిజాలు ఉన్నప్పుడు,వాటిని ప్రభుత్వం తీసుకున్నప్పటికీ 26 శాతం షేర్ ఇవ్వాలని ఒక ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం పార్లమెంట్‌లో ఆ బిల్లు పెండింగ్‌లో ఉంది. ఇది ఇలా ఉండగానే సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది.

దేశంలో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుం మైనింగ్ కార్యకలాపాలు ఆయా భూముల్లో చేసే అవకాశం ఉంది. ఈ తీర్పు ఇలా ఉన్న సందర్భంలోనే ఇటీవల అటవీ ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాల్సిందేనని పర్యావరణ ప్రేమికులు, పలు స్వచ్ఛంద సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ అటవీ ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తామని, రాజ్యాంగం ఇదే చెప్తుందని అన్నారు. పదిమందిని కోటీశ్వరులను చేయడం కోసం, అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకోవడం సరైందికాదని, ఆదివాసీలు తిండి దొరక్క అల్లాడుతున్నారని ఆయన ప్రభుత్వ విధానాల ను విమర్శించారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలే మావోయిస్టుల తిరుగుబాటుకు కారణమన్నారు. పారిక్షిశామికీకరణ పేరుతో ప్రభుత్వం ఆదివాసీల విషయంలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. కోట్లాది మం ది ఆకలితో అలమటిస్తుంటే పెట్టుబడిదారుల కోసం ఆదివాసులను బలిచేయడం సరికాదు.

ఆదిలాబాద్ లాంటి జిల్లాలో ఆదివాసులకు తాగడానికి మంచినీరు లేదు. ఏజెన్సీలో ప్రతియేట విష జ్వరాలతో, రక్తహీనతతో వందలాదిమంది చనిపోతున్నారు. ఆదివాసుల అభివృది ్ధకోసం ఐటీడీఏలను ఏర్పాటు చేసినప్పటికీ అవి ఒరగబెట్టిందిలేదు. బొగ్గు బావుల కింద లక్షలాది ఎకరాలు ఆదివాసుల భూము లు పోయినా పరిహారం కూడా ఇవ్వడం లేదు. వారికి పునరావాసం కల్పించడం లేదు. సింగరేణి బొగ్గు బావుల కోసం 27 వేల ఎకరాల భూమిని తీసుకున్న దాఖలాలున్నాయి. ఇందులో 75 శాతం భూములు ఆదివాసులకు చెందినవే. 90 శాతం బొగ్గు నిలువలు తెలంగాణ ప్రాంతంలోని గిరిజన ప్రాంతంలోనే ఉన్నా యి. గనుల తవ్వకం పేరు మీద నిర్వాసితులవుతున్న వారిలో 80 శాతం గిరిజనులే ఉన్నారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ కింద గిరిజనుల రక్షణ కోసం ఉన్న చట్టాలను ఉల్లంఘిస్తున్నారు.1/70 చట్టం ప్రకా రం గిరిజనుల భూములకు రక్షణను పట్టించుకోవడం లేదు. ఆదివాసుల భూ ములు ఆదివాసేతరులు కొనరాదని, ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్ట్ 1959 సూచించింది.

1996 నాటి పంచాయతీ ఎక్స్‌టెన్షన్ టూ షెడ్యూల్ ఏరియా చట్టం ప్రకారం గిరిజన, గిరిజనుల ఆచార వ్యవహారాలు సంస్కృతి ప్రత్యేకతలను, ఉమ్మ డి వనరులను కాపాడుకునే హక్కు కల్పించింది. కాని తెలంగాణ వనరుల దోపిడి మీద ఉన్న ఆకాంక్ష ఈ ప్రాంత ప్రజలపై లేని ఆంధ్ర వలస పాలకులు ఈ చట్టాలను అమలు చేయడం లేదు. సింగరేణి కారణం గా తెలంగాణలోని నాలుగు జిల్లాల్లోని 60 మండలా ల్లో ఇప్పటికే ఆరు లక్షలకు పైగా గిరిజనులు నిర్వాసితులయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆదివాసులకు కొంత మేలు జరిగే అవకాశం ఉన్నది. ‘నా భూమిలో ఉన్న ఖనిజంపై నాదే హక్కు’అని పోరాడు తున్న ఉద్యమకారులకు, విప్లవకారులకు సుప్రీం తీర్పు ఊరట. ఈ తీర్పు వెలు గులోనైనా అటవీ ప్రాంతాల్లో అక్రమ మైనింగు లను ఆపాలి. దీంతో నైనా ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నిండాలి.

-ఎండీ మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం