భవిష్యత్తు నల్ల బంగారానిదే!


Sat,October 6, 2012 04:54 PM

దేశంలో డిమాండ్‌కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగడం లేదు... దీంతో ప్రతి సంవత్సరం 80-100 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాము. తెలంగాణలోని సింగరేణితో సహా దేశంలో 500 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతున్నది. 2020 సంవత్సరం నాటికి దేశంలో బొగ్గు డిమాండ్ 2000 మిలియన్ టన్నులు ఉంటుందని ఒక అంచనా.విద్యుత్ ప్రాజెక్టులు పెరుగుతుండటం వల్ల బొగ్గు డిమాండ్ కూడా పెరుగుతోంది.మొత్తం 197 బ్లాకులను దేశంలో ప్రైవేటీకరించారు. ఇందులో ఇప్పటి వరకు ఒక్క బ్లాకులో కూడా ప్రైవేటు యాజమాన్యాలు బొగ్గు తవ్వకాలు చేయలేదు. దేశంలో 38 మందికి ‘మీకిచ్చిన బొగ్గు బ్లాకులు ఎందుకు వాపసు తీసుకోకూడద’ని పేర్కొం టూ కేంద్ర ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసింది.ఇందులో రాష్ర్టంలోని జెన్కో, తదితర సంస్థలు కూడా ఉన్నాయి.


‘దేశీయ బొగ్గు కన్నా విదేశీ బొగ్గే ముద్దు’ అనే విధంగా పలువురు పారిక్షిశామిక వేత్తలు ఇతర దేశాలలో బొగ్గు గనులను తీసుకోవడానికి శ్రద్ధ చూపుతున్నారు.ఇండోనేషియా,ఆస్ట్రేలియా, మోజాంబీక్, సౌత్ ఆఫ్రీకా, అమెరికా లాంటి దేశాలలో బొగ్గు ఉత్ప త్తి చేసి, అమ్మకానికి దేశంలో దిగుమతి చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.మధూకాన్, అధాని, ల్యాంకో లాంటి కంపెనీలు ఇప్పటి కే బయట బొగ్గు గనులను తీసుకొని బొగ్గును అమ్ము తున్నాయి, దిగుమతి చేసుకుంటున్నాయి. కోల్ ఇండియా సైతం మోజాంబీక్ లో రెండు బ్లాకులను తీసుకున్నది... అమెరికాలో జిందాల్, స్టీల్ వర్క్స్ బొగ్గు గనులను తీసుకున్నాయి.
భారతదేశంలో బొగ్గు నిలువలు మొత్తం తొమ్మిది బిలియన్ టన్నులు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు తీసింది కేవ లం 0.5 శాతం కూడా వెలికి తీయలేదు.. వందేండ్లకు పైనుంచి బొగ్గును తీస్తున్నప్పటికి తీసిన బొగ్గు శాతం మాత్రం చాలా తక్కువగా ఉంది. తెలంగాణలోని సింగరేణిలో ఇప్పటికి గుర్తించిన బొగ్గు నిలువలు 9300 మిలియన్ టన్నులుంటే 122 ఏండ్లలో తీసింది మాత్రం 800 మిలియన్ టన్నులే... ఫారెస్టు క్లియన్సు, బొగ్గు గనుల తవ్వకంలో మాఫియాల ఆధిపత్యం లాంటి వాటితోపాటు నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యావరణ సమస్యల ను పరిష్కరించకపోవడం, ప్రభుత్వ రంగంకన్నా ప్రైవేటు రంగంపై పాలకులు శ్రద్ధ చూపడం లాంటివి బొగ్గు కొరతకు కారణాలు.

తెలంగాణలోని సింగరేణిలో రానున్న పదేళ్లలో 20 కొత్త బొగ్గు బావులు రానున్నాయి. సింగరేణికి ఇప్పుడున్న నిలువలను గనుక సక్రమంగా భూగర్భ గనుల ద్వారా తీసే పద్ధతిని అమలు చేస్తే సుమారు 200 సంవత్సరాల భవిష్యత్తు ఉంటుంది. కానీ అలా తీయడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుందని, యాంత్రీకరణ ద్వారానే బొగ్గును వెలికితీసే పద్ధతులను అవలంబించడం జరుగుతుందని అధికారులంటున్నారు. ఈ విధానాన్ని అమలు చేస్తే 800- 900 మిలియన్‌లు మాత్రమే బయటకు తీయవచ్చు.దీంతో దాదాపు ఎనభై ఏళ్ల భవిష్యత్తు ఉంటుంది... ఏడు వేల మిలియన్ ల వరకు భూగర్భంలోనే మిగిలిపోతుంది... అదే మ్యాన్ ఫవర్ తో హ్యాండ్ సెక్షన్ ద్వారా తీస్తే దీని భవిష్యత్తు రెట్టింపు అవుతుందని మైనింగ్ నిపుణులు అంటున్నారు. యాంత్రీకరణ ద్వారా బొగ్గును తీయడం వల్ల పెద్దగా ఉపాధి కూడా ఉండదు. అయితే ప్రభుత్వం ఇటీవల సుధీర్ఘమైన చర్చల ద్వారా బొగ్గు గనులు తవ్విన చోట భూములు కోల్పోతున్న నిర్వాసితులకు 26 శాతం వాటాను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇది గనుక అమలయితే కొంత నిర్వాసితులకు లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి... అలా కొన్ని గనులకు ప్రజల ద్వారా వస్తున్నటువంటి వ్యతిరేకత రాకపోవచ్చని భావిస్తున్నారు.

సింగరేణి ప్రాంతంలో ఇతరులకు కేటాయించిన ఏడు బ్లాకులలో తాడిచెర్లకు సంబంధించిన 1, 2 గనులు మాత్రమే తవ్వకానికి వీలుగా ఉన్నాయి. చెర్ల గనికింద పూర్తిగా గ్రామం ఉంటుంది కాబట్టి అక్కడ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది... ఇలా చాలా ప్రాంతాలలో పరిస్థితులు ఉన్నాయి... ఓపెన్ కాస్టు గనులు సృష్టిస్తున్న మానవ విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నా రు... ఓపెన్ కాస్టు గనులను ప్రజలు వద్దన్న చోట అక్కడక్కడ నిలిపివేస్తున్నప్పటికీ తర్వాత వాటిని తవ్వే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి... అయితే సింగరేణిలో రానున్న రోజుల్లో భూగర్బ గనులకే ఎక్కువ అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలోని బొగ్గును సక్రమంగా వినియోగించుకోకపోవడం, తవ్వకాలను ఒక పద్ధతి ప్రకారం చేయకపోవడం, కేటాయింపులలోనూ అవకతవకలు, అసలు వ్యవస్థే అస్తవ్యస్తంగా తయారు కావడం వల్ల 2020 సంవత్సరంలో నాటికి దేశానికి అవసరమైన 2000 మిలియన్ టన్నుల బొగ్గును ఎక్కడి నుంచి తీసుకువస్తారు అనేది ప్రశ్నార్థకం!

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన