సింగరేణిపై ఎందుకింత గుస్సా?


Thu,April 11, 2013 11:33 PM


సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది. అటు దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు రెవెన్యూ సాధించి పెడుతుంది. రాష్ట్రంలో దాదాపు ఎన్టీపీసీ, ట్రాన్స్‌కో, తదితర అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తుంది. దక్షిణ భార త దేశంలో నాలుగు వేల పరిక్షిశమలకు ఇక్కడి నుంచి బొగ్గు సరఫరా అవుతుంది. ఇంత చేస్తున్నా ఈ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అన్నా, ఈ నల్ల బంగారు నేల ప్రాంతంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కోపంగానే ఉంది. గతంలో ఖమ్మం జిల్లాలోని మణుగూరు ప్రాం తాన్ని సందర్శించి బొగ్గు బాయిలో దిగినప్పుడు అక్కడి కార్మికు లు చెప్పుకున్న సమస్యలను ఒక్కదానిని కూడా ఆయన పట్టించుకోలేదు. ఇటీవల మంచిర్యాలకు ఇందిరమ్మ కలల పేరిట ప్రారంభమైన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలుపై అవగాహన సదస్సు సందర్భంగా సింగరేణి ప్రాంత ప్రజావూపతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లిన ఒక్క సమస్యపై కూడా ఆయన స్పందించలేదు. బెల్లంపల్లి ఎమ్మెల్యే, సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేష్, చెన్నూర్ ఎమ్మెల్యే, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు నల్లాల ఓదేలు ఓపెన్ కాస్టు గనులలో భూములు కోల్పోయిన వారికి, ఇండ్లు కోల్పోయిన వారికి ఉపాధి కల్పించాలని, ఇతర రాష్ట్రాలలో ఇచ్చి న విధంగా ఎకరానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. స్వంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఐఎన్టీయూసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బీ వెంకవూటావు కూడా ఇవే సమస్యలను లేవనెత్తి పరిష్కరించాలని కోరారు. అలాగే లాభాలలో వాటాను కార్మికులకు పెంచాలని కోరారు. అయినా ముఖ్యమంత్రి స్పందించలేదు. యా భై నిముషాల ప్రసంగంలో సింగరేణి ముచ్చటే ఎత్తలేదు. సింగరేణి ప్రాంత కార్మికులు, వారి కుటుంబాలు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు రామక్షికిష్ణాపూర్‌లో, అటు కొత్తగూడెంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని, దానికి మంజూరు ఇవ్వాలని సంతకాల సేకరణచేసి అందించినా దానిపై మాట్లాడలేదు. ముఖ్యమంత్రి సింగరేణి కార్మికుల సమస్యలపై స్పందించకపోవ డం శోచనీయం.

సింగరేణి సమస్యలకు స్పందించని ముఖ్యమంత్రి సబ్‌ప్లాన్ సదస్సును రాజకీయ సభగా మార్చి సింగరేణి ప్రాంత ప్రజా ప్రతినిధులను అవమానపరిచారు. సబ్ ప్లాన్‌కు అసలు ఎవరూ మద్ద తు ఇవ్వలేదని, కొన్ని లొసుగులను ముందు పెట్టి రాకుండా ప్రయత్నించారని, సీపీఐ, సీపీఎం, టీడీపీ, టీఆర్‌ఎస్, తదితర పార్టీలన్నింటిని విమర్శించారు. సబ్ ప్లాన్ వల్ల తెలంగాణ బాగుపడుతుందని, అది వారికి ఇష్టం లేదని సీఎం పేర్కొన్నారు. విద్యుత్‌కు సంబంధించి ఎవరిపై భారం పడటం లేదని, శాసనసభ్యుడు ఓదేలుకు వాస్తవాలు తెలియవని పేర్కొన్నారు. దీనిని నిరసిస్తూ వేదికపైనే ఇద్దరు శాసనసభ్యులు ముఖ్యమంవూతితో వాగ్వాదానికి దిగారు. గుండా మల్లేష్, నల్లాల ఓదెలు దళితులని, ఈ కార్యక్షిక మం కూడా దళితుల అభివృద్ధిలో భాగం అని కూడా గుర్తించకుం డా ముఖ్యమంత్రి వారిని అవమానపరిచే విధంగా మాట్లాడారు. దీంతో వారు తమకు జరిగిన బహిరంగ అవమానానికి వారు స్పందించక తప్పలేదు. వారు ఆయన వద్దకు వచ్చి వాదానికి దిగినప్పుడు కూర్చోండీ, కూర్చోండీ అంటూ నిర్లక్ష్యంగా సీఎం చేయి పెట్టి నెట్టివేసే విధంగా ప్రవర్తించిన తీరు దళితలోకాన్నే ఆందోళనకు గురిచేసింది. తెలంగాణకు అనుకూలంగా ఉన్న పెద్దపల్లి ఎంపీ జీ వివేక్ పట్ల కూడా ముఖ్యమంవూతికి కోపమని సింగరేణి ప్రాంత ప్రజల్లో ఇప్పటికే అభివూపాయం ఉంది. ముఖ్యమంత్రి తమకు వ్యతిరేకమని ఒక ప్రాంతంలో అభివూపాయం ఏర్పడి ఉండడం మంచిది కాదు. ముఖ్యమంత్రి తన పర్యటన సందర్భంగా ఇటువంటి అభివూపాయాలు చెరిగిపోయేలా ప్రవర్తిస్తే బాగుండేది.

సింగరేణి ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి తమ పర్యటనకు వస్తున్నారు అంటే తమ సమస్యలలో ఒక్కటైనా పరిష్కారం అవుతుందని ప్రజలు ఆశించడంలో తప్పులేదు. కనీ సం రాజకీయాలు మాట్లాడకుండా స్థానిక సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నించినా ప్రజలు ఎంతో సంతోషించేవారు. కానీ ముఖ్యమంత్రి పర్యటన అలా సాగలేదు. ఆయన పర్యటన మూలంగా ప్రజలకు, ప్రత్యేకించి దళితులకు అవమానం, ఆవేదన మాత్రమే మిగిలింది.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం