మృతులపైనా వివక్షే!


Mon,March 18, 2013 02:02 AM

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పంచుతున్న బొగ్గు గని కార్మికుడి బతుకులు మాత్రం బండకింద నలిగిపోతున్నాయి. భయంకరమైన పని పరిస్థితుల్లో ఎంతో మంది ప్రమాదాలకు బలి అవుతు న్నారు. ఈ అనామక మరణాలు ఏళ్లనుంచి జరుగుతూనే ఉన్నాయి. అయినా ప్రమాదాలను అదుపుచేసే వారులేరు. కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు ప్రమాదాలు జరిగినప్పుడు గనుల మీదికి వచ్చి ఉపశమన పలుకులు మాట్లాడడం, ఆందోళనలో పాలుపంచుకుని రెండు విమర్శలు చేయడం మినహా చేస్తున్నది ఏమీలేదు.కార్మికులు చనిపోతే పరిహారం ఇప్పించే విషయంలోనూ ఎవరూ శ్రద్ద తీసుకోవడం లేదు.

ఈ14 నెలల్లో జరిగిన ప్రమాదాలను పరిశీలిసే..్త 2012లో 700 ప్రమాదాలు జరిగి 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు నెలల కాలంలో ముగ్గురు కార్మికులు మరణించారు. కొత్తగూడెంలోని పీవీకే-5 గనిలో ఫిబ్రవరి 14న సెకండ్ షిప్టులో పైకప్పు బండ కింద రాయిడి శంకరయ్య అనే కోల్‌కట్టర్, అంబాల పాపయ్య అనే రూఫ్ బోల్టింగ్ చేసే కార్మికుడు మరణించారు. ఇది యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆందోళనలు చెలరేగాయి. ఈ ఘటన మరువకముందే ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్టు-2 లో డ్రిల్లింగ్ మిషన్, బండ మధ్యన చిక్కుకొని పానుగంటి లింగయ్య అనే జనరల్ మజ్దూర్ కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత సంవత్సరం కూడా అనేక ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రమాదాలలో వికలాంగులయిన వారు, అనారోగ్యానికి గురైన వారు గత సంవత్సరమే 600 మందికిపైగా ఉంటారు.

నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి శిక్షణ లేకుండా పనిలోకి పంపడం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోతున్నారని కార్మికులు వాపోతున్నారు. ఇలా యాజమాన్యం తప్పులను కప్పి పుచ్చుకోవడం కోసం ప్రమాదాలు జరిగినప్పుడల్లా ఏదో ఒక గందరగోళం చేస్తూనే ఉంటారు. సింగరేణిలో జరిగే ప్రతీ ప్రమాదంలోనూ యాజమాన్య లోపాలే ప్రధానంగా కనిపిస్తున్నా యి. ఇప్పటికయినా సింగరేణి యాజమాన్యం ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది.

మృత కార్మికుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలోనూ తెలంగాణ పట్ల వివక్ష కొనసాగుతున్నది. గత సంవత్సరం విశాఖ స్టీల్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వం 20 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది. ఇంత పరిహారాన్ని తెలంగాణలోని సింగరేణి కార్మికులకు కూడా ఇవ్వాలని అంటున్నారు. సింగరేణిలో కూడా మరణానికి నష్ట పరిహారం 20 లక్షలకు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కొత్తగూడెంలో గత నెల ఇద్దరు కార్మికులు భూగర్భ గనిలో చనిపోయిన సందర్భంలో కార్మికులు 24 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. అక్కడ యాజమాన్యం, ప్రజావూపతినిధులు ప్రభుత్వంతో మాట్లాడి పరిహారం గురించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఫలితం లేదు. చిన్న పరిక్షిశమలలో పది లక్షల నుంచి పాతిక లక్షల రూపాయల వరకు పరిహారం ఇస్తున్నారు. కానీ సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలో పరిహారం పెంచలేదు. సీమాంవూధలోని విశాఖ స్టీల్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి ఒక నియమం, తెలంగాణలో బొగ్గుబావుల్లో మరణించిన కార్మికులకు మరో నియమమా అని కార్మికులు విమర్శిస్తున్నారు. ఈ వివక్ష పోవాలని డిమాండ్ చేస్తు న్నారు.

ప్రమాదాల పట్ల యాజమాన్యాలను అప్రమత్తం చేయాల్సిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సేప్టీ లాంటి డిపార్టుమెంటులు కంటి తుడుపుగా వ్యవహరిస్తున్నాయి.కార్మికుల భద్రతపట్ల కనీస ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. కార్మికులకు శిక్షణ ఉన్నదా! లేదా? అన్నది పట్టించుకోవడం లేదు. ఉత్పత్తి పెంచడంపై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రతపై కనీసంగానైనా ఉండటం లేదు. గనుల్లో ఉత్పత్తి చేసే చోట డైరెక్టర్ జనరల్ ఆఫ్ సేప్టీ అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయాన్నికూడా చూడటం లేదు. సేఫ్టీ కమిటీ సమావేశాలు కంటి తుడుపుగా కొనసాగుతున్నాయి. పని స్థలాల్లో తగు రక్షణ కల్పించాలనేది అందరూ ఆమోదించదగిన కనీస డిమాండ్. పరిహారంలో వివక్ష పాటించ కూడదనేది కూడా న్యాయ బద్ధమైనదే. సింగరేణి యాజమాన్యం ఈ రెండు డిమాండ్లపై తక్షణం స్పందించాలె.

-ఎండీ మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం

country oven

Featured Articles