కదిలిన సింగరేణి


Wed,February 20, 2013 11:53 PM


కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో 48 గంటల సార్వవూతిక సమ్మెను చేపట్టాయి. ఇందులోభాగంగా మొదటి రోజు సమ్మె విజయవంతమైంది. 1991లో అప్పటి ప్రధాని పీవీ, ఇప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌లు ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాలు ప్రసు తం మరింత వికృత రూపం దాల్చాయి. ఈ రెండు దశాబ్దాల్లో పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు దేశ వ్యాపితంగా 14 సార్లు సమ్మెలు నిర్వహించాయి. 2012 ఫిబ్రవరి 28న జరిగిన సార్వవూతిక సమ్మె తరువాత యూపీఏ ప్రభుత్వం మరింత మొండికేసింది. కనీసం కార్మిక సంఘాలను చర్చలకు పిలవలేదు. ఈ నేపథ్యంలో 2013 ఫిబ్రవరి 20, 21 తేదీలలో సమ్మెతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సమ్మెకు పిలుపునిచ్చాయి. సంస్కరణల పేరుతో ప్రభుత్వాలు అమలు చేస్తు న్న విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

నిత్యవసర ధరలు 20 ఏండ్లలో విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలో 76 శాతం మంది ప్రజలకు సరిపడా తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న 88 దేశాలలో భారత్ 66వ స్థానంలో ఉన్నది. మహిళల్లో 50 శాతం, పిల్లల్లో 75 శాతం పౌష్టికాహార లోపంతో బాధపడున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దేశ ప్రధానే ఒప్పుకున్నారు. దేశంలోని గోడౌన్‌లో ఆరు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు మూలుగుతున్నాయి. కానీ వాటిని పేదలకు పంపిణీ చేయలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. దేశవ్యాపితంగా పీడీఎస్‌కు ప్రతి సంవత్సరం 80 వేల కోట్ల రూపాయ లు ఖర్చవుతుంది. దీనికి మరో 80 వేల కోట్లు కేటాయిస్తే ప్రతి కుటుంబానికి 35 కిలోల బియ్యం లేదా గోధుమలు ఇవ్వవచ్చునని ఆర్థికవేత్తలు సూచించినప్పటికి ఆ విషయాన్ని ఏమి పట్టించుకోలేదు. ప్రజలపై ఒకవైపు పన్నుల భారాన్ని పెంచుతూ, వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం నగదు బదిలీ పథకాన్ని తెరమీదికి తెస్తున్నది.

కేంద్ర ప్రభుత్వ సంస్థలలో గ్రూపు -డి ఉద్యోగాలను రద్దు చేయమని ఆరో పే కమిషన్ చెప్పింది. రైల్వేలో రద్దు చేశారు. గతంలో సుమారు 18 లక్షల మంది ఉద్యోగులు పని చేసిన రైల్వే సంస్థలో 13 లక్షలకు కుదించేశారు. ఆరు లక్షలు మంది పని చేసిన బొగ్గు పరిక్షిశమలో 4.2 లక్షల మంది ప్రస్తుతం పని చేస్తున్నారు. పార్లమెంటు చట్టాల ద్వారా బ్యాంకులు, ఇన్సూన్సు, ఆయిల్, బొగ్గు, తదితర సంస్థలన్నీ జాతీయీకరణ చేయబడ్డాయి. ప్రజల ఆస్తిగా ఉన్న వీటిని స్వదేశీ, విదేశీ, కార్పోరేట్‌లకు కట్టబె వాటాల అమ్మకం తప్ప మరోటి కాదు. భారత అల్యూమినియం కంపెనీని స్టెరిలైట్‌కు విదేశీ సంచార నిగమ్ లిమిటెడ్‌ను టాటాలకు, ఐపీసీఎల్‌ను అంబానీలకు, మోడరన్ ఫుడ్స్‌ను హిందూస్థాన్ లీవర్‌కు కట్టబెట్టారు. ఇందులో అత్యధిక వాటాలు స్వదేశీ, విదేశీ కార్పోరేటు కంపెనీలే హస్తగతం చేసుకున్నాయి. లాభాలపై లేని సీలింగ్ బోనస్‌పై ఎందుకు? పెన్షన్‌ను ఒక భిక్షం వలే ఇస్తున్నారు.

ఈపీఎస్ 95లో ఖాతాదారులకు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలైనా ఉండాలని ప్రభుత్వాన్ని ప్రస్తుతం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొత్త పెన్షన్ పథకం పట్టుకొచ్చి పెన్షన్ హక్కుపై ప్రభుత్వం దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలోని లేబర్ డిపార్టుమెంట్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్‌గా మారింది. కార్మిక చట్టాలను కాపాడుతూ అమలు చేయాల్సిన లేబర్ అధికారులే యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్నారు. ఇలా దేశం మొత్తంలో కార్మిక వర్గంపై సస్పెన్షన్‌లు, వేధింపులు, జీతం కోతలు, అక్రమ కేసులు, తొలగింపులు జరుగుతున్నాయి. వాటిని లేబర్ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప వారికి చేస్తున్న కార్మికుల న్యాయం చేయడంలేదు.

ట్రేడ్ యూనియన్ హక్కులపై కూడా దాడి కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలయిన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూతోపాటు ఐఎఫ్‌టీయూ, తదితర కార్మిక సంఘాలు దేశవ్యాపితంగా ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు నిరసనగా, రిట్రెంచ్‌మెంటులకు నిరసనగా కనీస వేతనాల కోసం, ఉద్యోగ భద్రత కోసం, నిత్యవసర ధరల తగ్గింపు కోసం కార్మిక చట్టాల అమ లు కోసం దేశ వ్యాపితంగా ఈ నెల 20, 21 తేదీలలో రెండురోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. సింగరేణిలోనూ గుర్తింపు టీబీజీకేఎస్ సహా జాతీయ సంఘాలు అన్ని సమ్మెకు మద్దతును ఇస్తున్నాయి. డిపెండెంట్ ఎంప్లాయిమెంటును పునరుద్ధరించాలని, తదితర డిమాండ్లతో సింగరేణిలో సమ్మె నోటీసు ఇచ్చింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఈ సమ్మెలో పాల్గొనడం విశేషం.
-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం