గిరిజనుల జాతర ‘నాగోబా’


Sun,February 10, 2013 12:16 AM


అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగారం చేసే రోజు. ప్రధానంగా మోస్త్రం వంశీయులు ప్రత్యేక పూజలతో నాగోబా జాతర ప్రారంభించడం ఆనవాయితీ. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు మధ్యవూపదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ జాతరకు తరలివస్తారు. పదిరోజుల ముందు నుంచే మోస్త్రం కుటుంబాలకు చెందిన గిరిపువూతులంతా వివిధ కార్యక్షికమాల్లో పాలు పంచుకుంటారు. నూతన దంపతులతో ప్రత్యేక పూజలు చేయిస్తారు. మోస్త్రం వంశంలోని కుల పెద్ద భార్య కోడళ్లను పరిచయం చేస్తారు. ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభమయిన జాతర 17వ తేదీ వరకు కొనసాగుతుంది. 12వ తేదీన జరిగే ‘నాగోబా’ జాతరతో ప్రధాన జాతరకు ప్రారం భంగా పిలుస్తారుపతియేటా పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు ఆదిలాబాద్ గిరిజనులు నాగోబా జాతర జరుపుకుంటారు. ఈ అమావాస్యకు రెండువారాల ముందు నుంచే గిరిజనులలో సంబురం మొదలవుతుంది. సరిగ్గా ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన ‘నాగోబా’ (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్యనాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. నాగోబా జాతరను గిరిజనుల సంస్కృతికి నిలువుటద్దంగా చెప్పుకోవచ్చు. ‘నాగోబా’ దేవాలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఉన్నది. ప్రతి సంవత్సరం గిరిజనులంతా తమ ఆరాధ్యదైవాన్ని సందర్శించడానికి ఈ గ్రామానికి తరలివస్తారు. అమావాస్య రోజు ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమయ్యే పూజా కార్యక్షికమాలు నాలుగురోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు గిరిజనుల స్థితిగతులను అవగాహన చేసుకోవడానికి గిరిజన సమస్యలను తెలుసుకోవడానికి ఈ జాతరకు తరలివస్తారు. రెవెన్యూ, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ, భూసార పరిరక్షణ, పశు సంవర్ధక, గిరిజనాభివృద్ధి సంస్థ, పట్టు పరిక్షిశమ, జిల్లా పరిక్షిశమలు, స్త్రీ శిశు సంక్షేమం, అటవీశాఖ, వన్యవూపాణి విభాగం వంటి అనేక ప్రభుత్వ శాఖలు ఇక్కడికి వస్తాయి. గిరిజనుల అభివృద్ధి ఛాయచిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. జిల్లా యంత్రాంగమంతా కేస్లాపూర్ తరలివచ్చి గిరిజనులకు అందుబాటులో ఉంటారు.వందలాది ఏళ్ల చరిత్ర ఉన్న నాగో బా జాతర ఆచార, వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి. వందల ఏళ్ల క్రి తం గిరిజనుల మూల పురుషులు కేవలం ఏడుగురు మాత్రమే ఉండే వా రు.

మూల పురుషులు నాలుగు శాఖలుగా విడిపోయి ఈనాలుగు శాఖలలోని మొదటి శాఖలో మడావి, మర్సకోలా, కుడ్మేల్, పూరు, పెందూర్, వెడ్మ, మోస్త్రం అనే ఏడుగురు సోదరులుండేవారు. ఈ ఏడుగురి వల్ల కాలానుగుణంగా అభివృద్ధి చెందిన గిరిజన సంతతికి పై ఏడుగురు అన్నదమ్ముల పేర్లే ఇంటి పేర్లుగా మారాయి. ఏడు ఇళ్ల పేర్లు గల గిరిజనులకు ఆరాధ్య దైవం ఆదిశేషుడు కావడం వల్ల అనాధిగా కేస్లాపూర్ గ్రామంలో వెలిసిన వారి కులదైవం ‘నాగో బా’ పూజా ఇత్యాది కార్యక్షికమాల నిర్వహణ బాధ్యత మోస్త్రంకు అప్పగించారు. కాగా పెద్దవాడన్న గౌరవంతో పుష్యమాస అమావాస్య రోజు జరిగే పూజను మడావికి అప్పగించారు. అయితే కాలానుగుణంగా పూజా కార్యక్షికమాలు నిర్వహించే మోస్త్రం వంశం రెండుగా చీలిపోయింది. వాటిలో ఒకటి నాగ్‌భిడే మోస్త్రం, రెండవది భూయ్యాడే మోస్త్రం. ఈ రెండు శాఖల వారి వృత్తుల ఆధారంగా 17శాఖలుగా చీలిపోయినారు. అయినా పూజలు నిర్వహించేది మాత్రం అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మోస్త్రం వంశస్థులకే దక్కింది.వృత్తుల ఆధారంగా 17 శాఖలుగా చీలిన మోస్త్రం వంశస్థులలోని కటోడా దివాకర్ గాయికి, ఘాడియా సంకేపాయిలర్ వాడే శాఖల వారు కేస్లాపూర్ జాతరకు 16 రోజుల ముందు పుష్యమాస పౌర్ణమికి ఒక రోజు ముందు తమ కులదైవాన్ని పుష్య అమావాస్య రోజున అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలం తేవడానికి కాలినడకన బయలుదేరి వెళతారు. ఇదే వంశంలోని మిగితా శాఖల వారు వారి వెంట వెళతారు. కాని మిగితా ఏడు శాఖల వారు క్రమం తప్పకుండా వెళ్లాలన్నది నియమం. పై ఏడు శాఖలు ముందుగా నాగోబా ఆలయం చేరుకుని కలశం తీసుకొని గోదావరి నదికి బయలుదేరుతారు. వారికి ముందుగా పరధాన తెగ, వాయిద్య గోండ్రు వాయిస్తూ ఉంటే వెనక నుంచి గిరిజనులు వెళుతుంటారు. కేస్లాపూర్‌కు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న కలమడుగు మండలం సమీపాన ఉన్న గోదావరి నదిలో అస్తమడుగు వరకు అరణ్యం గుండా నడిచి వెళ్లి గోదావరి జలం కలశంతో తీసుకుంటారు. ఈ అస్తమడుగులో గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత ప్రత్యక్షమయి దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తుంటారు.

జలంతో నిండిన కలశాన్ని ‘పూసిగూడ’ గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూర్ మండలం గురిజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒక్క రోజు ఉన్న తరువాత కలశం అదే గ్రామంలో ఉంచి గిరిజనులంతా తమ ఇండ్లకు తరలి ఒక దినమంతా పండుగ జరిపి తిరిగి కలశం ఉన్న స్థలానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి బయలుదేరి కేస్లాపూర్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలిసిన ఇంద్రాదేవికి సామూహికంగా పూజలు జరుపుతారు. ఇంద్రాదేవి వెలిసిన నాటి నుంచి ఈ గ్రామానికి ఇంద్ర పేరు వచ్చిందని గిరిజనులు భావిస్తుంటారు. ఇక్కడి నుంచి కేస్లాపూర్ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద నాలుగు రాత్రులు, ఒక పాకలో మూడు రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉ్న మర్రిచెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి, పది కిలోమీటర్ల దూరంలోని సిరికొండ చేరుకుంటారు. సరిగ్గా పుష్య అమావాస్య రోజున కలశం భద్రపరిచిన మర్రిచెట్టు దగ్గర బావినీరు మట్టి కలిపి ఒక పుట్టను తయారుచేసి ఆలయం పక్కన ఉన్న పూల మందిరాన్ని ఆ మట్టితో అలికి అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు. జాతర సందర్భంగా1942నుంచి అధికార యంత్రాంగాన్ని రప్పించి గిరిజనుల సమస్యలను పరిష్కరించే ఏర్పాటును ప్రొఫెసర్ హేమన్ డార్ఫ్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ దర్బారు యథావిధిగా కొనసాగుతున్నది. ఈ దర్భారుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతోపాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, తదితర యంత్రాంగం హాజరై గిరిజనుల సమస్యలను వింటారు. ఈ దర్బారు నిర్వహణ లాంఛనంగానే కొనసాగు తుంది తప్ప తమ సమస్యలను పరిష్కరించడం లేదనే విమర్శలున్నాయి. ప్రతి ఏటా ఈ తతంగం నడుస్తున్నా గిరిపువూతుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటున్నాయి. దీంతో దర్బారుపై గిరిజనులకు ఉన్న నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి.

-ఎండీ. మునీర్
( గిరిపుత్రుల జాతర ‘నాగోబా’ ప్రారంభమైన సందర్భంగా..)

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం