చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!


Sat,February 2, 2013 12:11 AM

Shinde_Azadతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసింది. మరోవైపు సీమాంధ్ర దోపిడీదారులు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను బద్‌నాం చేసే కుట్రకు తెరలేపారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ రాజమంవూడిలో సభ పెట్టి ఈ కుట్రను మరింత తీవ్రతరం చేశారు. తెలంగాణ ఎంపీల ‘రాజీ’నామాల నాటకం మళ్ళీ మొదలైంది. మధుయాష్కీ అనుకున్నట్టే గోడమీది పిల్లి వా టం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటిదాకా తెలంగాణ విషయంలో ఎలాంటి మాట మాట్లాడని కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకో ప్రకటన సాకును చూపి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని తేలిందని, అందుకే రాజీనామా వాయిదాలని ప్రకటించా రు. దీంతో కాంగ్రెస్ ఎంపీల్లోనూ విభేదాలు పొడచూపాయి. కాంగ్రెస్ ఎంపీలు వివేకానంద్, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌డ్డి, కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి, రాజ య్య లాంటి వారు రాజీనామాకు సిద్ధమై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామాలు పంపినట్లు ప్రకటించి తాము తెలంగాణ వచ్చే వరకు పోరాడుతామని ప్రకటించారు. షరామామూలుగా ఇది అనుకున్నట్టే జరిగింది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేది లేనిది స్పష్టంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్రకటించలేదు. మరోవైపు ఉద్యమ నేత కేసీఆర్‌పై ప్రైవేటు కంప్లైంట్‌లు, కేసుల నమోదులాంటి కుట్రలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణ విషయాన్ని నానబెట్టుకుంటూ వస్తున్న వారిలో ప్రముఖుడు గులాం నబీ ఆజాద్. నెల రోజులు అంటే 30 రోజులు కాదని, వారం అంటే ఏడు రోజులు కాదని అతితెలివి సమాధానా లతో తెలంగాణ తొందరగా పరిష్కారమయ్యేది కాదన్నట్టుగా మాట్లాడారు.

దీంతో మరోసారి తాము మోసం చేయడానికి సిద్ధమయినట్లు చెప్పకనే చెప్పాడు. ఇక సీమాంధ్ర రాజకీయ నాయకులు ఢిల్లీలో మకాం వేసి ఆజాద్‌తో, ఇతర నాయకులతో మంతనాలు జరిపిన దానితోనే ఇదంతా అనే అనుమా నం కూడా కలుగుతున్నది. సీమాంధ్ర నేతలు తమ పబ్బం గడుపుకోవడం కోసం ప్రజల వద్ద నమ్మకాలు కోల్పోయి ఆగమాగమవుతూ వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో, లేదో అనే అనుమానంతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజల్లో లేని ఆలోచనను కలిగించడం కోసం సమైక్యాంధ్ర నినాదం ఇస్తున్నా రు. గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే నినాదంతో, ఒత్తిడితో పక్కదారి పట్టించారు. కేసీఆర్ నిరాహార దీక్ష అనంతరం కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణ అనుకూల ప్రకటన చేసిన సందర్భంలో సీమాంధ్ర నాయకులతో చంద్రబాబు తెరవెనుక నాట కాలు చేసి ప్రకటనను అడ్డుకున్నారు. రాత్రికి రాత్రి ప్రకటన చేస్తే ఎలా అని, తొండిచేసి ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకునే విధంగా చేశారు.

ఇదే నేపథ్యంలో తెలంగాణ కోసం ఎదురు చూసిన యువతీ యువకులు ఆవేదనతో ఆత్మహత్యలకు పాల్పడటం ప్రారంభమయింది. ఈ ఆత్మహత్యల సంఖ్య వెయ్యి దాటింది. ఒకరకంగా ఇది మారణహోమం అనే చెప్పాలి. ఈ మారణ హోమానికి ప్రధాన కారకుడు చంద్రబాబు. ఆ తరువాత సీమాంధ్ర నాయకులు లగడపాటి, రాయపాటి, కావూరి లాంటి వారెందరో కారణం. వారికి తెలంగాణ బిడ్డల బాధలు పట్టవు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు పట్టవు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఎందుకు కోరుకుంటున్నారో కూడా వారికి అవసరం లేదు. వారికి కావాల్సిందల్లా వారి ఆధిపత్యం నిలబడాలి. వారి ఆస్తులు కాపాడుకోవాలి. అందు కోసం ఇటీవల కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నిర్వహించిన అఖిల పక్షసమావేశంలో తెలంగాణకు సంబంధించి ఏకాభివూపాయం రావడం, నెల రోజుల్లోపు అనుకూల ప్రకటన కు కేంద్రం సిద్ధమవుతుందనే సంకేతాలు ఇవ్వడం లాంటివి వారికి మింగుడు పడలేదు.

దీంతో మళ్లీ అడ్డుకునే కుట్రలు మొదలయ్యాయి. కుట్రలు, కుహకాలతో రాజకీయాలు నడిపే సీమాంధ్ర నాయకులతో గ్రేటర్ హైదరాబాద్‌లో, గాలికి కొట్టుకొచ్చి మంత్రులయిన ముఖేష్‌గౌడ్, దానం నాగేందర్‌లాంటి వారు హైదరాబాదే వేరే రాష్ట్రం కావాలని ప్రకటనలు చేస్తున్నారు. వీరి వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం కావడంతో వాటిని వెనక్కి తీసుకోకున్నా దానం నాగేందర్ తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాలని, దానికే ఒప్పుకుంటామ ని మాట మార్చాడు. అయితే గులాం నబీ ఆజాద్ తాజాగా చెప్పిన మాటల ప్రభా వం ఆయనపై ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరోవైపు సీమాంవూధకు చెందిన కొందరు మంత్రులు, నాయకులు ఒక చోట కూర్చొని మరో కుట్రకు తెరలేపారు.
వీరి కుట్రలకు, కుహకాలకు తెలంగాణ ప్రజలు బయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ ఇస్తే రాష్ట్రం అగ్ని గుండమవుతుందట. ఎక్కడ అగ్ని గుండమవుతుంది? నీ సీమాంవూధలో అగ్ని గుండం అవుతుంది! అక్కడ ఆందోళనలు చేస్తావు. నువ్వు అక్కడ ఉద్య మం చేసుకుంటే మాకేందీ! సీమ ప్రజలు కూడా మీలాంటి నాయకులకు బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారు. దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో ఉంటున్న ప్రజలు తమపై జరుగుతున్న వివక్ష, దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడుతూ వారి ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరడం తప్పెట్లవుతుంది!

సమైక్య రాష్ట్రం కావాలంటున్న మీరు సీమాంవూధలో రాష్ట్రాన్ని సమైక్య రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోండి. మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి. మా తెలంగాణ సమైక్యంగానే ఉన్నది. 1956కు ముందు ఏ విధంగా తెలంగాణ ఉండిందో, ఎన్ని కుట్రలు పన్ని మా నాయకులను మభ్యపెట్టి మమ్ములను ఆంధ్రలో కలుపుకొని ఎంత ముంచారో ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. తెలంగాణలో పది జిల్లాల్లో ఏ మారుమూల పల్లెకు వెళ్లి అడిగినా ఈ రోజు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చిన్న రాష్ట్రాల వల్ల నష్టం జరుగుతుందని చెబుతున్న నాయకులకు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలని కోరుతున్నాను.మూడు రోజులుగా ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లో జాతీయ స్థాయి టెన్నీకాయిట్ పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలకు బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్, ఉత్తరవూపదేశ్ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్, మధ్యవూపదేశ్ నుంచి వేరుపడిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన క్రీడాకారులు కూడా వచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని అక్కడి రాష్ట్రాల పరిస్థితి గురించి అడిగినప్పుడు వారు చిన్న రాష్ట్రాల వల్లనే అభివృద్ధి జరుగుతుందని స్పష్టంగా చెప్పారు. కలిసి ఉన్నప్పుడు చాలా నష్టపోయామని, విడిపోయిన తరువాత వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చాయని, రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందిందని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుం తెలంగాణకు న్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు.

అన్నం ఉడికిందని మొత్తం అన్నాన్ని చేతిలో పట్టి చూడాల్సిన పనిలేదు. అన్నం మెతుకులు కొన్ని చూస్తే తెలిసిపోతుంది. ఆ రాష్ట్రా ల నుంచి వచ్చిన క్రీడాకారులు చెప్పిందే వాస్తవం. ఏది ఏమయినా ఈ సారి తెలంగాణ ప్రకటన చేయకుంటే సీమాంధ్ర నేతల కుట్రలకు లొంగితే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవు. వాస్తవాలను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇంత వరకు పరిస్థితిని లాక్కొచ్చినటువంటి ఉద్యమపార్టీలయినా, నాయకులయినా, ముఖ్యంగా తెలంగాణ ఎంపీలయినా పట్టువీడొద్దు. ఈసారి మనం తెలంగాణ సాధిం చి తీరాలి. ఆ దిశన ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను రెచ్చగొట్టడానికి సీమాంధ్ర నాయకులు ప్రయ త్నం చేస్తున్నారు.సీమాంధ్ర మీడియా కూడా ఇదే కుట్రలు చేస్తున్నది. ఈ కుట్రలన్నింటిని గమనించి మనం శాంతియుత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణ వచ్చేంత వరకు పట్టువిడువని పోరు సలపాలి.

ఈ సారి తెలంగాణ ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేదాకా ఉద్యమం ఆపొద్దు. ఇవ్వాళ ప్రజల చేతుల్లోకి ఉద్యమం వెళ్లిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. తెలంగాణ ప్రజల ఓపికను బలహీనత అనుకుంటే అది పప్పులే కాలేసినట్టే అవుతుంది. పుట్టగతులుండని విధంగా కాంగ్రెస్ పరిస్థితి ఇప్పటికే తెలంగాణలో ఉన్నదానికన్నా అధ్వాన్నంగా తయారవుతుంది. తెలంగాణపై చర్చల పేరుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేయనున్నదని ఆజాద్,షిండేల ప్రకటనల తో స్పష్టమైంది. ఇప్పటికయినా ఈ ప్రాంత కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు మేల్కొని ‘రాజీ’నామాల నాటకాలతో సరిపెట్టు కోకుండా ఉద్యమంలో ముందుండి పోరాడా లి. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎంపీలు రాజీనామాలు ఆమోదింపచేసుకుని ఉద్యమబాటలో పయనిస్తే తెలంగాణ ప్రజలు గౌరవిస్తారు. లేని పక్షంలో తెలంగాణ ప్రకటన అయినా చేయించాలి.

తెలంగాణ ప్రకటన రాకుండా మరోవాయిదా అంటేనే మోసమనే విషయాన్ని ఇప్పటికయినా గుర్తించి, ప్రజాభీష్టానికి అనుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కాంగ్రెస్ అధిష్ఠానం మీద నమ్మ కం ఉన్నదని కుర్చీలు, పదవులకే పరిమితమై పోకుండా ప్రజల ఆకాంక్షలను కూడా పట్టించుకున్న నాడే ఆ నేతలను ప్రజలు గౌరవిస్తారు, ప్రేమిస్తారు.

-ఎండీ. మునీర్

76

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం