ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉన్నా ఆ అసంతృప్తిని, ప్రజా ఆగ్రహానికి ఒక ఉద్యమ రూపం ఇచ్చి లక్ష్యాలవైపు నడిపించే పార్టీ కానీ, వ్యక్తులు కానీ, శక్తులు కానీ లేకుండా ఏ ఉద్యమం విజయవంతం కాదు. అటువంటి శక్తులను ఆంధ్రపాలకులు ఎదగకుండా చేశారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి న సందర్భంలో ఉద్యమాన్ని రాజీలేకుండా సరైన దారిలో నడిపించాలి.ఎంతో పోరాట, ఉద్యమాల చరిత్ర ఉన్న తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ఉద్యమంలో 650 మంది పైచిలుకు యువతీయువకులు ఆత్మహత్యలు చేసుకోవడం అందరిని కలచివేస్తున్న అంశం.
ఢిల్లీలో తెలంగాణ కోసం యాదిడ్డి ఆత్మహత్య మరచిపోకముందే, తెలంగాణలో ఆ కంట తడి ఆరకముందే.., ఆదిలాబాద్ జిల్లా మందమపూరిలో గని కార్మికుడి కొడుకు, ఎంటెక్ విద్యార్థి రాంటెంకి శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆత్మహత్యలకు ప్రధానంగా ఏం చేయలేమన్న ఆత్మనూన్యత భావమే కారణమని చెప్పవచ్చు. నిరాశా నిసృ్పహలు చెందిన యువకుల నిరసనలు ఆత్మహత్యల రూపంలో బహిర్గతమవుతున్నాయి. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న నిరాశ నిసృ్పహలకు కారణం ఏమిటి? అవి వ్యక్తిగతమైనవా? సామాజికమైనవా? ఇతరేతర కారణాలున్నాయా? అన్నది పరిశీలించవలసిన అంశం.
ఇవాళ్టి తెలంగాణ ఉద్యమంలోనే కాదు, దాదాపు రెండు దశాబ్దాల కాలంగా తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెద్ద సంఖ్యలో జరిగాయి. చేనేత కార్మికులకు కేంద్రమైన సిరిసిల్ల ‘ఉరిఖిల్లా’గా మారిపోయింది. దేశంలో ఏ ప్రాంతంలో జరగనటువంటి రైతుల ఆత్మహత్యల పరంపర తెలంగాణలో కొనసాగుతున్నది. అందుకు కారణం తెలంగాణలో వ్యవసాయం భారమైంది. చెరువులు, కుంటలు మాయమైనవి. నీటి వసతి కరువైంది. లక్షలు ఖర్చు చేసి బోరుబావులు, మోటారు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేయడం తడిసి మోపెడు అవుతున్నది. ఇక కరెంటు కోత సరేసరి.
తెలంగాణ బొగ్గు సంపద దక్షిణ భారతదేశ విద్యుత్ అవసరాలు తీరుస్తున్నది. కానీ తెలంగాణ రైతుల మోటార్ పంపుసెట్లకు మాత్రం ‘లో వోల్టేజి’ సమస్య మోటార్లు కాలిపోయే పరిస్థితి కల్పిస్తున్నది. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సబ్సిడీలు పైరవీలమయమైపోయి ఏవో కొద్దిమంది ధనిక రైతులకు లబ్ధి చేకూరినా, మెజారిటీ చిన్నకా రు, సన్నకారు రైతులకు అందడం లేదు. గిట్టుబాటు ధరల చెల్లింపు విషయంలోనూ తెలంగాణ రైతులు వివక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రణాళికబద్ధంగా ఆంధ్రవలస పాలకులు సాగించిన వివక్షలు,అన్యాయాల నేపథ్యంలోనే తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలకు ప్రధాన కారణ మై అది వివిధ రూపాలలో వ్యక్తమైంది. చూడటానికి రైతుల ఆత్మహత్యలకు వ్యక్తిగత కారణా లుగా కనిపించినప్పటికీ మూల కారణం మాత్రం పాలకుల వివక్ష, అన్యాయమే.
సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అధ్యయనం చేసినవాళ్ళు, వాటి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల సహాయ ప్యాకే జీ ప్రకటించాలని కోరారు. కానీ చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు అయ్యింది. ఒకవైపు పాలకులు తెలంగాణ భూములను సెజ్‌ల పేర, ఐటీ పార్కుల పేర వేల కోట్ల రూపాయల విలు వ చేసే భూములను పారిక్షిశామిక అభివృద్ధి పేరు మీద అప్పనంగా కట్టబెట్టి లోపాయకారి గా వేల కోట్లు కాజేసి, వారికి వందల కోట్ల ప్యాకేజీలు ఇస్తున్నారు. కానీ వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవడానికి ముందుకు రాలేకపోయారు.
1969నాటి తెలంగాణ ఉద్యమంలో 369 మంది తమ తెలంగాణ వీరకిశోరాలు ఆంధ్ర వలస పాలకుల తుపాకి గుండ్లకు అమరులయ్యారు. విద్యార్థుల రక్తంతో తెలంగాణ నేల తడిసింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం తుపాకి గుండ్లకు ఎదురొడ్డి పోరాడారు తప్ప ఇప్పటిలా తమకు తాము ఆత్మహత్యలు చేసుకుని చనిపోలేదు. నాటి పోరాటాలు విఫలమై వీరులను సృష్టిస్తే, ఇవ్వాళ్టి పోరాటంలో యువకులు ఒంటరివారిగా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఆలోచించాలి. యువకుల్లో ఈ పరిణామాలు ఒక్కసారిగా వచ్చినవి కావు. విద్యార్థుల్లో సహజంగా ఉండే పోరాడే తత్వాన్ని నిర్వీర్యం చేయడానికి పెద్ద కుట్ర జరిగింది.
ఒక ప్రణాళికబద్ధంగా ఒక తరం తరాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు పకడ్బందీగా సాగాయి. నాటి విద్యార్థులు, యువకులకు చదువులతోపాటు సామాజిక సంబంధాలుండేవి. సమాజంలో జరిగే అన్ని రకాల అచివేతలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమించే చైతన్యం ఉండేది. విశ్వవిద్యాలయాలు, విద్యార్థి సంఘాల పాత్ర, ఎన్నికలు రాజకీయ చైతన్య కేంద్రాలుగా ఉండేవి. ఫలితంగా వారిలో విశాల దృక్పథం, అవగాహన పెంపొంది సమస్యలు వచ్చినపుడు పారిపోవడం కాకుండా పోరాడే చైతన్యం కల్గించింది.
ప్రపంచవ్యాప్తంగా వామపక్ష ప్రభుత్వాలు కూలిపోవడం, అమెరికా సామ్రాజ్యవాద శక్తులకు ఎదురులేకుండా పోయింది. వరల్డ్‌బ్యాంక్, ఐఎంఎఫ్, డబ్ల్యుటీవో రూపంలో అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచీకరణ పేరుమీద మూడవ ప్రపంచ దేశాల మీద ఆర్థిక రాజకీయ ఆధిపత్యం నెలకొల్పుకునే క్రమంలో ఆయా దేశాల్లో విద్యా సంస్కరణలు రూపుదిద్దుకున్నాయి. విశ్వవిద్యాలయాల్లో సామాజిక శాస్త్రాల ప్రాధాన్యం తగ్గించి వృత్తి విద్యా ప్రాముఖ్యం పెంచడం పేరుతో సామాజిక శాస్త్రాలకు విద్యార్థులను దూరం చేశారు. తద్వారా విద్యార్థులను పుస్తకాల పురుగులుగా మార్చారు.
వీటికి తోడు సాంస్కక్షుతిక దండయాత్ర టీవీ, సినిమా వంటి ప్రచార మాధ్యమాల రూపంలో అభూత కల్పనలకు, సెక్స్, క్రైమ్ వంటి అంశాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసి మొత్తంగా ఒక తరాన్ని నిర్వీర్యం చేసింది. ఆటపాటలు, సామాజిక సంబంధాలను వదులుకుని పుస్తకాల పురుగుల్లా బాల్యం యవ్వనం అంటూ లేకుండా చదివి బయటికి వచ్చిన లక్షలాది మందికి వందల్లో ఉపాధి దొరకడం గగనమైంది. సమస్యలు ఎట్లా ఎదుర్కోవాలో తెలియని గందరగోళ పరిస్థితి నిరాశ నిసృ్పహకు గురిచేసి పలాయనవాదిగా మార్చింది.
తెలంగాణలో ప్రపంచీకరణ దోపిడీకి అదనంగా అంతర్గత వలస దోపిడీ తోడైంది. తెలంగాణ విద్యార్థి యువజనుల ఉద్యోగ ఉపాధి అవకాశాలనూ సీమాంవూధులు కాజేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమం కొత్త ఆశలను రేకెత్తించింది. అంతవరకు ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదించి ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొనేలా చేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న శక్తులు ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా పెంపొందించి, వారిలో సంఘటితశక్తిని, పోరాట పటిమను పెంపొందించకపోగా, ప్రజలను నామమావూతులుగా చేసి అన్నీ నాయకులే చక్కబెడతారన్న రీతిలో సాగుతోంది. ఎన్నికలకు ఉద్యమాన్ని పరిమితం చేయడం, ఎత్తులు ఫలించక ఆంధ్ర వలసవాద సంపన్న వర్గాల కుట్రల్లో ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మళ్ళీ విద్రోహానికి గురవుతుందనే సందేహాలు అనివార్యంగా రాజ్యమేలుతున్నా యి. ఈ పరిస్థితులే నిరాశ నిసృ్పహలు ఆవహిం చి ఆత్మహత్యలు పెరిగిపోవడానికి దారితీస్తోంది.
ఆంధ్రవలసవాదులు మొదటినుండి ఒక ప్రణాళికబద్ధంగా తెలంగాణలో స్వతంత్ర నాయకత్వం ఎదగకుండా చేశారు. న్యాయమైన సమస్యలపై ఉద్యమించే సంస్థలను పార్టీలను ఎటువంటి ప్రజాస్వామిక విలువలు పాటించకుండా అణచివేశారు. ముఖ్యంగా శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటాన్ని అణచివేసిన తరువాత, తెలంగాణలో నక్సలైట్ సాయుధ పోరాట రాజకీయాలు కరీంనగర్-ఆదిలాబాద్ రైతాంగ పోరాటాల రూపంలో బహిర్గతమయ్యాయి. ఈ పోరాటాలను ఆంధ్ర వలస పాలకులు అత్యంత దారుణంగా అణిచివేసి తెలంగాణను రక్తం మడుగు చేశారు.
ఈ కాలంలో కనిపించని ఫాసి స్టు పాలన తెలంగాణలో సాగించారు. అదే సమయంలో ఆంధ్ర, సీమ ప్రాంతాలకు చెందిన ఫ్యాక్షనిస్టులు, లిక్కర్ వ్యాపారులు, బడా కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు రాజకీయ నాయకులుగా మారి ఎటువంటి విలువలు లేకుండా అరాచకా లు సృష్టించి అడ్డదారిన అధికారంలోని ఎగబాకారు. తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి తెలంగాణలో దోపిడీ సాగించారు. సాం ప్రదాయ తెలంగాణ నాయకులను కూడా ఎదగకుండా, గూండాలను, బ్రోకర్లను, ల్యాండ్ మాఫియాలను ప్రోత్సహించి యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు.
ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉన్నా ఆ అసంతృప్తిని, ప్రజా ఆగ్రహానికి ఒక ఉద్యమ రూపం ఇచ్చి లక్ష్యాలవైపు నడిపించే పార్టీ కానీ, వ్యక్తులు కానీ, శక్తులు కానీ లేకుండా ఏ ఉద్యమం విజయవంతం కాదు. అటువంటి శక్తులను ఆంధ్రపాలకులు ఎదగకుండా చేశారు.
ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి న సందర్భంలో ఉద్యమాన్ని రాజీలేకుండా సరైన దారిలో నడిపించాలి. అప్పు డే దశాబ్దాల తరబడి అన్యాయాలకు, వివక్షలకు, దోపిడీకి గురి చేయబడి నిరాశ నిసృ్పహలకు గురైన ప్రజల్లో విశ్వాసం సంఘటిత శక్తిని, విశాల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. ఈ సంఘటిత శక్తి నుంచి విశ్వాసం నుంచి పిరికితనం పోయి పొరాడే చైతన్యం వెల్లివిరుస్తుంది. అప్పుడిక ఆత్మహత్యలకు తావుండదు. పోరాడే చైతన్యం కలిగిన సంఘటితమైన ప్రజలను ఓడించడానికి ఇంతవరకు ప్రపంచంలో ఏ శక్తి లేదు. ప్రజల శక్తి ముందు అన్ని కుట్రలు, కుతంవూతాలు గాలి పింజల్లా తేలిపోతాయి. లక్ష్యం నెరవేరుతుంది. యుద్ధంలో నిజం, అబద్ధం రెండూ ఉంటాయి. నిజమే చివరికి జయిస్తుంది. లక్ష్యం కోసం యుద్ధం చేద్దాం. పోరాట ఉద్యమాల సాంప్రదాయాలను కొనసాగిద్దాం.
-ఎండీ. మునీర్