సీమాంధ్రవాదాన్ని బొందపెట్టారు


Wed,December 26, 2012 11:43 PM

సీ మాంధ్ర వాదాన్ని జూన్ 28వ తేదీన సింగరేణి కార్మికులు, డిసెంబర్ 22న ఆర్టీసీ కార్మికులు బొందపెట్టారు. జీహెచ్‌ఎంసీలోనూ అదే జరిగింది. ఇక అది 2013లో జరిగే స్థానిక ఎన్నికల్లో కానియ్యండి, లేదా 2014న జరిగే సార్వవూతిక ఎన్నికల్లో కానియ్యండి.. తెలంగాణలో తెలంగాణ వాదం తప్ప ఇంకోటి కనిపించదనడానికి వీలులేదన్న దానికి ఒక సంకేతంగా దీన్ని పేర్కొనవచ్చు. ఈ ఒరవడి ఇక ఆగేది కాదు. కొనసాగుడే ఉంటుంది. దీనిని ఆపే శక్తి ఎవరికి లేదు. ఎన్ని కుట్రలు, కుహకాలు చేసినా సాధ్యం కాదు. అంతిమంగా తెలంగాణ వాదమే విజయం సాధిస్తుంది. ఈ నెల 28వ తేదిన ఢిల్లీలో జరుగబోయే అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ లాంటి పార్టీలకు,తెలంగాణలో కేవలం అంబాడే దశలో ఉన్న వైఎస్సార్‌సీపీ లాంటి పార్టీలకు అగ్ని పరీక్షగా పేర్కొనవచ్చు. 28వ తేదిన తాము ఏం చెప్పినా పెద్దగా మునిగిపోయేది లేదనుకుంటే వారు పప్పులో కాలేసినట్టే.

ఆర్టీసీలో ఏం జరిగిందో ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉన్నది. వెయ్యి మందికి పైగా ప్రాణాలు తెలంగాణ కోసం ఫణంగా పెట్టడం జరిగింది. దానికి కచ్చితంగా ఈ నెల 28న గనక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలమైన ప్రకటన చేయకపోతే ప్రజావూపతినిధులు,పార్టీలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తెలంగాణకు గుండెకాయ ఎన్నో పోరాటాలకు, త్యాగాలకు కేంద్ర బిందువుగా నిలిచిన సింగరేణి బొగ్గు గని కార్మికులు జూన్ 28వ తేదిన జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో చారివూతాత్మక తీర్పు ఇచ్చారు. ఒకప్పుడు నెత్తికెత్తుకున్నోళ్లనే ఈ ఎన్నికల్లో నేలకేసి కొట్టారు. తమ కష్టాలకు కారణమైన, తమ ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోని వారికి చరమగీతం పాడారు. సింగరేణిలో 15 కార్మిక సంఘాలు ఎన్నికలలో పోటీలో ఉన్నా నాలుగు కార్మిక సంఘాలు మాత్రమే ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరుకు దిగాయి. 2007లో నాలుగవ దఫా జరిగిన యూనియన్ ఎన్నికల్లో పోటీలో దిగిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) 18 వేల ఓట్లను సాధించి ద్వితీయ కార్మిక సంఘంగా ఎదిగింది. మలి విడత ఉద్యమంలో తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర పోషించింది.

ఐదో దఫా ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీచేసి మొత్తం 23వేల 311 ఓట్లు సాధించి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం-3, భూపాలపల్లి, కొత్తగూడెం ఏరియాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఏఐటీయూసీతోపాటు ఐఎన్‌టీయూసీ లాంటి సంఘాలను మట్టికరిపించింది. సింగరేణిలో గుర్తింపును సాధించింది. తెలంగాణ వాదం ముందు ఎలాంటి బూటకపు హామీలు, మభ్యపెట్టడాలు నిలువలేవని కార్మిక వర్గం నిరూపించింది. ఈ సందర్భంగా ఎన్నో కుట్రలు, కుహకాలు జరిగాయి. తెలంగాణ వాదానికి, ఎన్నికలకు సంబంధం లేదని ప్రచారం చేశారు. కార్మి కులకు మద్యం సరఫరా చేసి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేశారు. ఇలాంటి విధానాలను వ్యతిరేకించిన కార్మికుల పిల్లలు ప్రధానంగా విద్యార్థి లోకం, మహిళలు కార్మికులకు ఏ యూనియన్‌లోనయినా సభ్యుడిగా ఉండవచ్చు కాని ఆ యూనియన్ కోసం తెలంగాణ వాదాన్ని దెబ్బతీయకండంటూ హితబోధ చేశారు. తెలంగాణ వాదానికే ఓటేయండని చెప్పారు.

రకరకాల వివక్షతో రగిలిపోతున్న కార్మిక వర్గం వేటినీ పట్టించుకోకుండా తెలంగాణ వాదం ముందు అన్ని బలాదూరేనని నిరూపించేశారు. దీంతో తెలంగాణ వాదాన్ని సింగరేణిలో బలంగా వినిపిస్తూ వస్తున్న టీబీజీకేఎస్‌కే ఓటు వేసి గెలిపించారు.

దీనికితోడు బొగ్గు బావుల్లో ఊపిరాడక మరణిస్తే కనీసం పరిహారం లేదు. డిపెండెంటు ఎంప్లాయిమెంటు పూర్తిగా పోయింది. లక్షా 20 వేల మంది ఉన్న కార్మికుల సంఖ్య 63 వేలకు పడిపోయింది. 1998లో మొదటి సారి సింగరేణిలో ఎన్నికలు జరిగినప్పుడు ఉన్న 96 వేల కార్మికుల సంఖ్య ఐదో సారి ఎన్నికల జరిగేటప్పటికి 63 వేలకు పడిపోయింది. గోల్డెన్ షేక్ హ్యాండ్ అమలు చేయడం,వేలాది మందిని బయటకు పంప డం, గైర్హాజరు కింద వేలాది మందిని డిస్మిస్ చేయడం నిత్య కృత్య మయ్యాయి.వీటికి వ్యతిరేకంగా ఇదొక రాజకీయ పోరాటంలా సింగరేణి కార్మికులు కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికి కాంగ్రెస్, టీడీపీ ప్రజావూపతినిధులైనా, రాష్ట్ర మంత్రులైనా ఇంకా విషయాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తే కార్మికులు వారికి తగు విధంగా బుద్ధిచెప్తారు. సింగరేణి కార్మికులు చేస్తున్న పోరాటాలను గమనించయినావూపజావూపతినిధులు బుద్ధి తెచ్చుకుంటారని ఆశిద్దాం.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన