బొగ్గు బావులతో... అంతరిస్తున్న అడవులు


Fri,November 23, 2012 10:47 PM

లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతమంతా సర్వనాశనమవుతున్నది. ప్రధానం గా ఏజెన్సీ ప్రాంతాల అడవి కనుమరుగవుతున్నది. ఒక్క బొగ్గుబాయి ఏర్పడాలంటే కనీసం రెండువేల ఎకరాల స్థలం కావాలి. ఇందులో దాదాపు 50 శాతం అడవేఉంటున్నది. దేశంలో ప్రస్తుతం జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, ఆంధ్రవూపదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరవూపదేశ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో బొగ్గు ఉన్నది. ఇప్పటి వరకు దేశంలో గుర్తించిన బొగ్గు సుమారు 110 బిలియన్ టన్నులు ఉంటుంది. మొట్ట మొదలు రాణిగంజ్‌లో బొగ్గును గుర్తించారు.1973 మే 1న దేశంలో బొగ్గుగనులన్నీ జాతీయమయ్యాయి. అంతకు ముందే దేశంలో మొదటిసారి ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించబడింది సింగరేణి కాలరీస్. 1889 నుంచి సింగరేణిలో బొగ్గుఉత్పత్తి అవుతున్నది. దేశం లో బొగ్గు ఉత్పత్తి పుంజుకున్నది 220 సంవత్సరాల ముందు నుంచే. 1774లో బొగ్గును గుర్తించినప్పటికీ ఉత్పత్తిని పుంజుకున్నది మాత్రం 1900 సంవత్సరం నుంచే. మొదట 6.12 మిలియన్ టన్నులు,1920లో 18, 1942 లో 29, 1946లో 30 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశారు. మొదటి పంచవర్ష ప్రణాళిక వచ్చేనాటికి 33 మిలియన్ టన్నులుగా ఉత్పత్తి పెరుగుతూనే ఉన్నది.

దేశంలో రెండు లక్షల హెక్టార్లలో బొగ్గు బ్లాకులు ఉంటే అందులో 55 వేల హెక్టార్లు అటవీ ప్రాంతం ఉన్నది. ఇటీవల 195 గనుల్లో కేవలం 13 గనులకు పర్యావరణ మంత్రిత్వశాఖ క్లియన్స్ ఇవ్వగా,ఇందులో కూడా ఎక్కువగా అటవీ ప్రాంతం ఉన్నది. అటవీ ప్రాంతమే కాదు, టైగర్ జోన్‌లు కూడా బొగ్గుబావుల పరిధిలోకి వస్తున్నాయి. పులులకు కూడా రక్షణ లేకుండా బొగ్గుబావుల వల్ల భవిష్యత్తులో ప్రమాదం ఉన్నదని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంతోపాటు టైగర్‌జోన్‌లలో సుమారు 250 పులులు ఉన్నాయని గుర్తించిన బంధావ్‌ఘర్, పెంచా, తడోబా, పాలము, హజారీబాగ్, సిమ్లిపాల్, చాప్రా, ఇంద్రావతిలలోనూ భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడబోతుందంటున్నారు. వీటితోపాటు ఏనుగులు, చిరుతపులులు ఇతర జంతువులు కూడా ఉన్నట్టు పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇవన్నీ కూడా బొగ్గుబావుల కారణం గా దెబ్బతింటాయని అంటున్నారు.అలాగే 1980 నాటికే దేశంలోని 254 బొగ్గుగనుల కింద 50,818 హెక్టార్ల అడవి నాశనమైనట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నా యి. ఆంధ్రవూపదేశ్‌లో 12,709 ఎకరాలు, అరుణాచల్ ప్రదేశ్‌లో 43 హెక్టార్లు, ఛత్తీస్‌ఘడ్‌లో 12,579 హెక్టార్లు, జార్ఖండ్‌లో 7545 హెక్టార్లు, మధ్యవూపదేశ్‌లో 10,980 హెక్టార్లు, మహారాష్ట్రలో 10,820 హెక్టార్ల అడవి నాశనమైంది. ఇప్పటి వరకు బెంగాల్‌లోనే 50,818 హెక్టార్ల అడవి బొగ్గుగనుల కింద కనుమరుగైనట్లు లెక్కలే చెప్తున్నాయి.

గత సంవత్సరం చంద్రాపూర్ సమీపంలోని తడోబా అడవుల్లో టైగర్‌జోన్‌ను రక్షించాలని అక్కడ గనులకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని ప్రజలు ఆందోళనబాట పట్టారు.అన్ని రాజకీయ పార్టీలు ఏకమై నెలరోజులపాటు బంద్ లు,ధర్నాలు, నిరాహారదీక్షలు చేశారు.దీంతో గనికి ఇచ్చిన అనుమతిని రద్దు చేశా రు. అప్పట్లో కేంద్రమంత్రి జైరాం రమేష్ స్వయంగా ఈ విషయంలో ప్రకటన కూడా చేశారు. ఇదిలా ఉంటే.. 7,39,000 హెక్టార్లలో దట్టమైన అడవి ఉంటే అందులో 26 వేల హెక్టార్లు అటవీ ప్రాంతం భవిష్యత్తులో బొగ్గుగనుల పాలు కానుందని వారు ఆందోళన చెందుతున్నారు. మొత్తం 3,54,000 హెక్టార్ల అటవీ ప్రాంతంపై ఓపెన్‌కాస్టు గనుల ప్రభావం పడబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అటవీ ప్రాంతాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో బొగ్గు బావుల విస్తరణకు సంబంధించి దేశంలో పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పర్యావరణ విధ్వంసం జరుగ కుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.పర్యావరణ విధ్వంసానికి వ్యతిరే కంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఇటు సింగరేణిలోనూ ఓపెన్ కాస్ట్‌ల విధ్వంసంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయినా ఈ సమస్యపై ఆయా ప్రాంతాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వం యథేచ్ఛగా ఓపెన్ కాస్టు గనులను తవ్వుకుంటూనే పోతున్నది. ఆయా ప్రాంతాలను ఎడారులుగా మారుస్తూనే ఉన్నది. వందలాది గ్రామాలు కనుమరుగవుతున్నాయి. లక్షలాదిమంది నిరాశ్రయులు అవుతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని పరిశీలించాల్సి ఉన్నది. మైనింగ్ నిబంధనల మేరకు గనుల తవ్వ కాలు జరిగిన చోట పూర్తిగా మట్టితో, ఇసుకతో పూడ్చాలి. పర్యావరణ పరి రక్ష ణ కోసం మొక్కలు పెంచాలి. గనుల కారణంగా కనుమరుగైన అడవికి ప్రత్యా మ్నాయంగా మరోచోట పెంచాలి. ఇదంతా తూతూమంవూతంగా కొనసాగుతున్నది.ఈ విషయాలేవి ప్రజావూపతినిధులకు పట్టకపోవడం శోచనీయం. ప్రజలు చైతన్యవంతులై అడవిని, గ్రామాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

country oven

Featured Articles