భవిష్యత్తు తరాలకు భరోసా ఏది?


Fri,October 12, 2012 02:34 PM

ఎప్పుడు తినే కంచాన్ని గుంజుకొని ఎంగిలి మెతుకులు వెదజల్లుతూ తన ఉదారతత్వాన్ని చాటుకుంటున్నోడే పర్యావరణానికి ప్రమాదకారిగా మారాడు. అలాంటి వారే పర్యావరణ పరిరక్షకుడిగా చెలామణి అయ్యే కాలమిది. ఈ ప్రచారం ప్రస్తుతం జీవ వైవిధ్య సదస్సు పేరిట మన హైదరాబాద్ నగరంలో జరుగుతున్నది. 193 దేశాల నుంచి అధినేతలు, ప్రతినిధు లు ఇందులో హాజరయ్యారు... వీరి తిండి, తిప్పలకు ఎంత జీవహింస జరుగుతున్నదో అక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లు పరిశీలిస్తే, వారి భోజనాలను గమనిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా పక్కన పెడితే సగటు మనిషి ఆవేదన, ఆక్రందన ప్రస్తుతం అంతకంతకు మూగబోతున్న ది. మనకు తెలియకుండానే తాతా, ముత్తాతల కాలం నుంచి మనిషి మనుగడకు కేంద్రమైన, పశు పక్షాదులకు నిలయమైన ఉత్తర తెలంగాణ గ్రామాలు ఆనవాలు లేకుండా మాయమవుతున్నాయి. చుట్టు కమ్ముకున్న కృత్రిమ మట్టి కుప్పల కింద ఊర్లు బందిఖానా అవుతున్నాయి. పంట పొలాలు మాయమవుతున్నాయి. చేసేందుకు పనులే కాదు చచ్చే మనిషికి చావు గంజి పోస్తామన్నా గుక్కెడు మంచి నీళ్లు దొరకని దుస్థితి నెలకొన్నది. ఎవరి చేతికి మట్టి అంటకుండానే జీవన విధ్వంసం చేస్తూ అభివృద్ధి మంత్రం పఠించే వలస పాలనలో ఇంతకంటే జీవకారుణ్యం, అభివృద్ధి ఏముంటుంది?

ఇప్పుడు ప్రతీదీ వ్యాపారమయిపోయింది. నాలుగు డబ్బులు తమ జేబుల్లోకి వస్తాయంటే ఎంతటి దుర్మార్గాన్నయినా ఆహ్వానించే పాలకులున్న చోట, మనుషులకే దిక్కులేదు. ఇక రాళ్లు, రాప్పలకు దిక్కు ఎక్కడుంటుంది! అవునూ కాసులు చెట్లకే కాదు. రాళ్లు, రప్పలకు కూడా కాస్తాయని, గుట్టలనైనా ముక్కలు చేసి అమ్ముకునే దుర్మార్గం యథేచ్ఛగా జరిగిపోతున్నది...గుట్టలంటే బండ రాళ్లే నా..! మరి ఆ గుట్టలను కమ్ముకుని ఎదిగే చెట్టు, పుట్ట సంగతేమిటి! వాటిని ఆసరా చేసుకుని బతికే పురుగు, పుట్ర, జంతుజాలం సంగతేంది..! మేఘాలను ఆపి వర్షాలు కురిపించి సహజసిద్ధ వాటర్ ట్యాంకులయి చెరువు, కుంటలు, వాగులు, వంకలను నింపే సంగతేంది..! జేబులోకి నాలుగు డబ్బులు వస్తాయంటే దేన్నయినా అమ్ముకొని సొమ్ము చేసుకునే వాడికి తరతరాల మనిషి మనుగడకు, సంస్కృతి సాంప్రదాయాలకు, దేవుళ్ల ఆవాసమయిన గుట్టలు కూడా కాసులు కాసే చెట్టుగానే కనిపిస్తుంది.

ఇవాళ వలస పాలకులు అభివృద్ధి పేరు మీద చేస్తున్న విధ్వంసం వల్ల వేల సంవత్సరాలుగా మనిషి మనుగడకు కేంద్రంగా వర్ధిల్లిన ఉత్తర తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతపు ఉనికి కోల్పోయి ప్రమాదంలో పడింది. పచ్చ పచ్చని గోదావరి పరివాహక ప్రాంతం మన కండ్ల ముందే ఓపెన్‌కాస్టు బొగ్గు బావుల పేర గ్రైనేడ్ క్వారీల పేరు మీద ప్రమాదంలో పడిపోతున్నది. ఎడారిగా మారిపోతున్నది. అడవులు నరికి అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఎక్కడపడితే అక్క డ జంతువులను చంపి దాని మాంసం, చర్మా లు అమ్ముకుంటున్నారు. పారిక్షిశామిక అభివృద్ధికి బొగ్గు తవ్వకాలు అవసరమే కావచ్చు. కానీ ఏ ప్రకృతి, ఏ పర్యావరణం అయితే మన బతుకుకు భరోసా ఇచ్చిందో ఆ ప్రకృతిని భావితరాలకు అందించవలసిన నైతిక బాధ్యత మనకు లేదా? తాత్కాలిక లాభాల కోసం భవిష్యత్తు తరాల కు ఈ భూమి మీద బతుకు లేకుండా చేసే అధికారం వీరికి ఎవరు ఇచ్చారు.. అభివృద్ధికి బొగ్గుతవ్వకాలు అవసరమయితే పర్యావరణానికి భంగం కలిగించని భూగర్భ గనులతో బొగ్గు తవ్వకాలు సాగించాలి. ఆ అభివృద్ధి ప్రజల జీవితాలను మెరుగుపర్చాలి. కానీ అలా చేయకుం డా ప్రజల జీవితాలను ప్రశ్నార్థకం చేసే విధ్వంసానికి అభివృద్ధి ముసుగు తొడిగితే ఎలా? అభివృద్ధి పేరుతో 124 సంవత్సరాల చరిత్ర గల సింగరేణిలో పదేళ్లుగా ఓపెన్‌కాస్టుల పేర చేస్తున్న విధ్వంసం వల్ల ఈ ప్రాంత పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నది. గత పది సంవత్సరాలలో కరీంనగర్ జిల్లాలోనే వందలాది గ్రైనేడ్ క్వారీలు అవతరించాయి. వీటిలో 90 శాతం ఆంధ్రా, రాయలసీమ ప్రాంతం వారి కి చెందినవే.గుట్టలను కొల్లగొడుతూ కరీంనగర్ జిల్లాను శాశ్వత ఎడారిగా మార్చేస్తున్నారు.

అటు ఓపెన్‌కాస్టు గనులు, ఇటు గ్రైనేట్‌లు ఉత్తర తెలంగాణ అస్తిత్వాన్ని, పర్యావరణాన్ని ప్రమాదంలో పడవేశాయి. ఇంత విధ్వంసం చేస్తున్నవారే అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సును నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు స్తోత్రపాఠాలు వల్లిస్తున్నారు. తాము చేసే పర్యావరణ విధ్వంసానికి షుగర్ కోటింగ్‌లు వేస్తూ బీటీ విత్తనాల విషాన్ని మింగించే హైటెక్ కుట్రలు సాగిస్తున్నారు. తమ స్వలాభాల కోసం దేనినైనా అమ్ముకునే వాళ్లు ప్రజల బతుకులను తాకట్టు పెట్టే వాళ్లు ఉన్నంత కాలం విధ్వంసం యథేచ్ఛగా సాగుతూనే ఉంటుంది. అందులో ఈ ప్రాంతం పట్ల ప్రేమలేని వారు, ఇక్కడి ప్రజల పట్ల ఏమాత్రం కనికరం లేని ప్రాంతేతరుల పాలనలో ఈ దోపిడీ, విధ్వంసానికి అడ్డూ, అదుపు లేకుండాపోయింది. అందుకే ఇవాళ తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడుతున్నది. తన నేల మీద తన బతుకు తాము బతుకుతామని, ఈనేలకు, ఈ మట్టిని, ఆ మట్టి మీద చెట్టు, చేమ, పుట్ట, గుట్ట, సమస్త జీవరాశుల మనుగడ కోసం భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం కోసం చావుబతుకు మధ్య పెనుగులాడుతుంది. ప్రజలు అలుపెరుగని పోరాటాల ద్వారా తెలంగాణ సాధించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముం దుకు సాగుతున్నారు.

తెలంగాణ సాధించుకోవడమం వట్టిపోయిన, డొల్లయిన తెలంగా ణ కోసం కాదు. రాజ్యాధికారం కో సం కాదు. తెలంగాణ వనరులను, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం, భవిష్యత్తు తరాలకు ఈ ప్రకృతిని వారసత్వంగా అందించ డం కోసం. అందుకోసం తెలంగాణ ఉద్యమాన్ని విస్తృత పరిధిలో కొనసాగించాల్సి ఉన్నది. వలస పాలనలో తెలంగాణ ప్రాంత పర్యావరణాన్ని, ప్రకృతిని ధ్వంసం చేస్తూ సాగిస్తున్న వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సి ఉన్నది... ప్రపంచస్థాయి జీవ వైవిధ్య సదస్సు మన హైదరాబాద్‌లో జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ పర్యావరణంపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడిని, పర్యావరణ విధ్వంసాన్ని ఎలుగెత్తి చాటవలసి ఉంది.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Featured Articles