సకల సమ్మెను రగిలించిన బొగ్గు కణిక


Thu,October 11, 2012 05:44 PM

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మొట్టమొదట సమ్మె చేసింది బొగ్గుగని కార్మికులే. ఆరు దశాబ్దాల తమ ఆకాంక్షను సాకారం చేసుకోవడం కోసం సింగరేణి కార్మికులు చేసిన పోరాటం దేశం మొత్తాన్ని ప్రభావితం చేసింది. 14 రోజుల్లోనే 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, తిరిగి డిసెంబర్ 23న ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నది. దీంతో డిసెంబర్ 23, 24 తేదీల్లో 48 గంటలు సమ్మె చేశారు. శ్రీకృష్ణ కమిటీ సింగరేణి ప్రాంతంలో అడుగుపెట్టనందుకు నిరసనగా కూడా కార్మికులు ఆందోళనలు నిర్వహించారు.

గత ఏడాది సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అందరికంటే ముందుగా సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మెలు పాల్గొన్నారు. తెలంగాణ కోసం 35 రోజులు మడమ తిప్పకుండా కార్మికులు సమ్మె చేశారు. ఒక రాజకీయ డిమాండ్ కోసం దేశంలో కార్మికులు ఇలా 44 రోజులు సమ్మె చేయడం చరివూతాత్మకం. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చారివూతాత్మక ఘట్టం. దీనికి శ్రీకారం చుట్టింది సింగరేణి కార్మికులే... ఈసమ్మె ప్రభావం ఢిల్లీకి తాకింది. బొగ్గు ఉత్పత్తి ఆగిపోవడంతో విద్యుత్‌పై తీవ్ర ప్రభా వం పడింది. దీంతో ప్రధాని జోక్యం చేసుకుని సమ్మె విరమణ చేయాల్సిందిగా విజ్ఞ ప్తి చేశారు. రాష్ట్ర సాధన కోసం కార్మికులు దసరా పండుగను సైతం త్యాగం చేశారు.

తెలంగాణలోని పది జిల్లాల్లో జరిగిన ఉద్యోగుల సమ్మెలో సింగరేణి కార్మికుల పాత్ర అత్యంత అపూర్వ ఘట్టం. అందరికంటే ముందు గా ఫ్రీ షిప్ట్‌లో (మిడత బదిలీ) తెల్లవారు జామున మూడు గంటల నుంచే కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా సింగరేణిలోని 13 కార్మిక సంఘాలు ఒక్కటి కావడంతో సమ్మె విజయవంతంగా కొనసాగింది. రాజీలేని పోరాటాలు చేయడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే బొగ్గుగని కార్మికులు ఈసారి తమ 60 ఏండ్ల తెలంగాణ ఆకాంక్ష సాకారం కోసం నిరవధిక సమ్మెకు దిగారు. సింగరేణి జేఏసీతో పాటు కార్మిక సంఘాలన్నీ సమ్మె ను విజయవంతం చేయడం కోసం విస్తృతంగా ప్రచారం చేశాయి. 14 ఓపెన్‌కాస్టు గనులలో 80 శాతం ఔట్‌సోర్సింగ్ పనులే జరుగుతాయి. ఈ పనులన్నీ సీమాంధ్ర కాంట్రాక్టర్లే చూస్తారు. సమ్మె జరిగినప్పుడల్లా సమ్మెకు ద్రోహం చేసేది వీరే... అయితే ఈసారి జేఏసీ చాలా స్పష్టంగా వారికి పనులు నడపవద్ద ని హెచ్చరిక చేయడంతో ఓసీల్లోనూ పనులు జరగలేదు. అంతేకాకుండా ఒక్క బొగ్గుపెల్లను కూడా గ్రౌండ్‌స్టాకు నుంచి రవాణా కాకుండా లారీలన్నీ నిలిపివేసే విధంగా కూడా కార్మిక సంఘాలు ఆందోళన చేసి విజయవంతమయ్యాయి. సింగరేణి కార్మికులు సమ్మె చేస్తే పారిక్షిశామిక సంక్షోభం ఖాయమని గత అనుభవాలు చెప్పినట్టే జరిగింది. దక్షిణ భారత దేశంపై ఈప్రభావం నేరుగా పడింది. సింగరేణి బొగ్గుతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ప్లాంట్‌లపై ఈ ప్రభావం సమ్మె ప్రారంభమైన మూడో రోజు నుంచే పడింది.

అప్పటికే ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్‌ను తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఇతర రాష్ట్రాల నుంచి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి బొగ్గును కూడా ఇక్కడ రూ. 1100 పెట్టి సింగరేణికి కోట్ల రూపాయల నష్టం చేసిన సందర్భంలో అటు ఇతర రాష్ట్రాల నుంచి రూ. 4 వేలకు టన్ను బొగ్గును తీసుకువచ్చారు. సమ్మెను అన్నిరకాలుగా విఫలం చేయడం కోసం ప్రారంభం నుంచే ప్రయత్నం చేశారు. సమ్మె నిషేధాన్ని సహజంగానే ఆరు నెలలకు ఒకసారి అత్యవసరాల సర్వీసుల కింద సింగరేణిలో ప్రకటిస్తూనే ఉంటారు. అయినా ఎస్మా ప్రయోగిస్తామని, ఒక్క రోజు సమ్మె చేస్తే ఎనిమిది మస్టర్ల కోత విధిస్తామని అప్పటికే యాజమాన్యం గనులపై ప్రచారం మొదలుపెట్టింది.

అయితే ఇలాంటి ప్రచారాలు సింగరేణి కార్మికులకు కొత్తేమీకాదు. నిర్బంధాలూ కొత్తకాదు. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా తెలంగాణ కోసం సమ్మె చేస్తామని కార్మికులు స్పష్టం చేశారు. రాష్ట్రానికి 250 మిలియన్ యూనిట్‌ల విద్యుత్ అవసరం ఉంటుంది. దీంతోపాటు మొత్తంలో నాలుగు వేల చిన్నా, పెద్ద పరిక్షిశమలకు సింగరేణి బొగ్గే సరఫరా అవుతుంది. తమిళనాడులోని రాయ్‌చూర్ సిమెంట్, ఫర్లి, అటు రాయలసీమ స్పాజ్, ఐరన్, సిరామిక్స్, ఫార్మాసెటికల్, ఫెర్టిలైజర్, స్టీల్ పరిక్షిశమలకు కూడా బొగ్గు సరఫరా జరుగుతుంది. సమారు 13 లక్షల మంది కార్మికులు పని చేస్తు న్న వేలాది పరిక్షిశమలపై సమ్మె ప్రారంభమయిన మూడో రోజే ప్రభా వం పడింది. ఎక్కడికక్కడ విద్యుత్‌ప్లాంట్లలోఉత్పత్తి నిలిచిపోయింది. ఈ సెగ ఢిల్లీ వరకు తాకింది. సమ్మె సందర్భంగా వందలాది మంది కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు సైతం అరెస్టయ్యారు. మహిళలను సైతం అరెస్టు చేసి జైళ్ళ లో పెట్టారు. ఆ కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. కార్మికులు కనీసం 35 వేల నుంచి 50 వేల రూపాయల వరకు వేతనాలను కోల్పోయారు.

సమ్మె విరమణ అనంతరం ఇచ్చిన రూ. 25 వేల అడ్వాన్స్ మాఫీ ఇంకా జరగలేదు. దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నామని నాయకు లు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మెకాలంలో స్పెషల్ లీవ్ ఇచ్చినట్లు తమను కూడా ఆ పరిధిలో ట్రీట్ చేయాలని నాయకులు కోరుతున్నారు. ఈ ప్రాంత వనరులు, ఉద్యోగాలు తమ పిల్లలకు దక్కాలంటే ఓపెన్‌కాస్టు లాంటి విధ్వంసకారిణి నాశనం కావాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందేనని కార్మికులు చెబుతున్నారు. తెలంగాణ కోసం కార్మికులు మరోసారి సమ్మెకు సిద్ధం అంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ నేతలతో, ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చర్చలు సఫలం కావాలని కార్మికవర్గం ఆశిస్తున్నది. ఈనెల 13న సింగరేణి వ్యాప్తంగా దీక్షా ప్రతిజ్ఞను చేపట్టడానికి కార్మికులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ సాధించడం కోసం తాము మరోసారి రాజీలేని పోరాటం చేస్తామంటున్న బొగ్గుగని కార్మికులకు తెలంగాణ ఉద్యమాభివందనాలు.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన