బొగ్గు కుంపటిపై యూపీఏ


Tue,October 9, 2012 04:23 PM

Mining3బొగ్గు కుంభకోణం దేశాన్ని కుదిపేస్తున్నది. కాగ్ నివేదికతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా వెలుగులోకి వచ్చింది. బొగ్గు బ్లాక్‌ల కేటాయింపుపై ప్రధాని రాజీనామా చేయాలని పార్లమెంట్ దద్ధరిల్లుతున్నది. ఇంత జరుగుతున్నా ‘తాను ఏ తప్పు చేయలేదని, ఈ బొగ్గు పాలసీ 1994 నుంచే కొనసాగుతున్నద’ని వూపధాని చెప్పుకొస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం పారదర్శకత పాటించిందని అంటున్నారు.
కాగ్ నివేదిక ప్రకారం ఒక లక్షా ఎనభై ఆరు వేల కోట్ల కుంభకో ణం ఇందులో జరిగిందని, ప్రభుత్వం ఆ మేరకు ఆదాయం కోల్పోయిందని పేర్కొన్నది. వాస్తవంగా జరిగిందేమిటి? జరుగుతుందేమి టి? దీనికి పరిష్కారం ఏమిటనేది ఆలోచించే స్థితిలో రాజకీయ పార్టీలు లేవు. దరఖాస్తులు పెట్టుకున్నప్పుడే పాతిక బొగ్గు బ్లాకుల కు పైగా నకిలీ డాక్యుమెంట్‌లు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. 194 బ్లాకులు 2002- 2009 వరకు క్యాప్టీవ్ మైన్స్ కింద కేటాయింపులు జరిగాయి.

ఈ కేటాయింపులు 2006 నుంచి ఊపందుకున్నాయి. 194 బ్లాకులలో 24 బ్లాకుల్లో బొగ్గు తీశారు. ఇందులో నిర్ణీత సమయంలో బొగ్గు తవ్వలేదని కొన్ని రద్దు కాబడ్డాయి. మిగిలింది 155 బ్లాకులు. ఇందులో కూడా 25 బ్లాకులకు పైగా దరఖాస్తులు చేసుకున్న కంపెనీలు బోగస్ డాక్యుమెంట్లు అని రుజువైతే వాటిని రద్దు చేయాల్సి ఉన్నది. ఆంధ్రవూపదేశ్‌లోనూ ఇలాంటి కేటాయింపులు వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో జరిగాయి. తాడిచెర్ల బ్లాక్‌కు సంబంధించి ఒక ప్రైవేటు కంపెనీకి అప్పజెప్పడంతో దీనిపై రాజకీయ పార్టీలు, ప్రజలు నిరసన తెలపడంతో రద్దు చేశారు. దాదాపు 25 వేల కోట్ల రూపాయల స్కాం అప్పుడు వెలుగుచూసింది.

బొగ్గు కుంభకోణం యూపీఏ ప్రభుత్వానికి ఉచ్చులా బిగుసుకుంటున్నది. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ బొగ్గు బ్లాకుల కేటాయింపుల కోసం దరఖాస్తులు బొగ్గు సంస్థలు పెట్టుకున్నప్పటికీ కేటాయింపు లు ఇవ్వలేదు. అందు లో సింగరేణి కూడా ఉన్నది. దేశంలోని బడా పెట్టుబడిదారీ కం పెనీలకు చెందిన సుమా రు 289 మంది ఈ 194 బ్లాకులకు దరఖాస్తు చేయగా వాటిని వారికే కేటాయించా రు. 2009 లెక్కల ప్రకారం ప్రతియేటా వీటి ఆదాయమే సుమారు పది వేల కోట్ల రూపాయలు ఉంటుంది. రెండున్నర లక్షల కోట్ల రూపాయల బొగ్గు బ్లాకులు ప్రైవేటు పరం చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. కాగ్ ప్రాథమిక పరిశీలనలోనే లక్షా ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకు చెందిన 155 బ్లాకులు ప్రైవేటు పరం చేసినట్లు వెల్లడి అయింది. ప్రైవేటు సంస్థలైన బెంగాల్ కోల్‌మైన్స్ లిమిటెడ్, జిందా ల్ స్టీల్ పవర్ లిమిటెడ్, పంజాబ్ కోల్, పానమ్ ఇండస్ట్రీస్, జిందా ల్ పవర్, జిందాల్ కంపెనీ ఇండస్ట్రీ, మానిటీస్ స్పాట్, ప్రకాశ్ ఇండస్ట్రీస్, ఉషామార్టిన్ లిమిటెడ్, కాంటకా యంతా కోల్, శారదా ఎనజ్జీ అండ్ మినరల్ లిమిటెడ్, ఇంటిక్షిగేటెడ్ కోల్ మైనింగ్ లిమిటెడ్ లాంటి ప్రైవేటు సంస్థలలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది.

మరోవైపు ప్రైవేటు వారికి ఇచ్చిన బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే సమయం ఆసన్నమైనప్పటికీ బొగ్గు బావులను మాత్రం ఇంకా ఏ కంపెనీలకయితే కేటాయించారో ఆ కంపెనీల ఆధీనంలోనే ఉన్నా యి. బొగ్గుగనుల ను తీసుకున్న ప్రైవేటు గుత్తేదార్లు కంపెనీలు వాటి ని సబ్ లీజులకు ఇస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థలలో పాలకులు బొగ్గును ఒక పద్ధతి ప్రకారం ఉత్పత్తి చేయాలనే ఉద్దేశం లేకపోవడం ప్రభుత్వరంగంపై పెట్టుబడులు పెట్టకపోవడం వల్లనే ఈ రోజు ప్రైవేటు పెట్టుబడిదారుల ఆధిపత్యం బొగ్గు సంస్థలపై పెరిగిపోయింది. వాటిని తవ్వే సత్తా ఉన్న కోలిండియాకు, ఇటు సింగరేణికి అప్పజెప్పాల్సిన అవసరం ఉన్నది. తద్వా రా దేశ అవసరాలు కూడా తీర్చే అవకాశం ఉన్నది.

కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ‘అసలు బొగ్గే తవ్వలేదు, స్కామ్ ఎక్కడ జరిగింద’ని అంటున్నారు. తవ్వని బొగ్గు బ్లాక్‌లను తీసుకున్నవారు మరొకరికి అమ్మేసిన విషయం ఎందుకు పట్టించుకోవడం లేదు? వారికి ఇచ్చిన నిర్ణీత సమయంలో తవ్వకం జరపనప్పుడు వాటిని రద్దు ఎందుకు చేయలేదనే ప్రశ్నలకు సమాధానం లేదు. వాటిని రద్దుచేస్తే ముడుపుల వ్యవహారం వెలుగు చూస్తుందనే భయం కేంద్రానికి పట్టుకున్నది. కాబట్టే ప్రభుత్వం కేటాయింపులను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నది. జాతి సంపదను అప్పనంగా బడా కంపెనీలకు అప్పజెప్పితే జాతి క్షమించదు. రాజకీయంగా పాలక పక్షం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన