నవశకానికి నాంది..


Sat,October 6, 2012 04:46 PM

తెలంగాణకు గుండెకాయ, ఎన్నో పోరాటాలకు, త్యాగాలకు కేంద్ర బిందువుగా నిలిచిన సింగరేణి కార్మికులు ఈ నెల 28న జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో చారివూతాత్మక తీర్పు ఇచ్చారు. ఒకప్పుడు నెత్తికెత్తుకున్నోళ్లనే ఈ ఎన్నికల్లో నేలకేసి కొట్టారు. తినే కంచాన్ని గుంజుకొని ఎంగిలి మెతుకులు మిగిల్చే వారినెవరినీ సహించే ప్రసక్తి లేదని సింగరేణి కార్మికులు నిరూపించారు. తమ కష్టాలకు కారణమైన, తమ ఆకాంక్షలను ఏ మా త్రం పట్టించుకోని వారికి చరమగీతం పాడారు. సింగరేణిలో 15కార్మిక సంఘా లు ఎన్నికల్లో పోటీ చేశాయి. నాలుగు కార్మిక సంఘాలు మాత్రమే ఈ సారి హోరాహోరీ పోరుకు దిగాయి. 2007లో నాలుగవ దఫా జరిగిన యూనియన్ ఎన్నికల సందర్భంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన టీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఎన్నికలలో పోటీ చేసి 18 వేల ఓట్లతో ద్వితీయ కార్మిక సంఘంగా ఎదిగింది. మలి విడత ఉద్యమంలో తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర పోషించింది. 2007లో 70 ఏళ్ల చరివూతగల ఏఐటీయూసీ విజయం సాధించి గుర్తింపు సంఘంగా గెలిచింది. ఐదో దఫా ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీచేసి మొత్తం 23 వేల 311 ఓట్లు సాధించి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం-3, భూపాలపల్లి, కొత్తగూడెం ఏరియాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఏఐటీయూసీతోపాటు ఐఎన్టీయూసీ లాంటి సంఘాలను మట్టికరిపించింది. సింగరేణిలో గుర్తింపును సాధించింది. తెలంగాణ వాదం ముందు ఎలాంటి హామీలు, మభ్యపెట్టడాలు నిలువలేవని కార్మిక వర్గం నిరూపించింది.

ఎన్నో కుట్రలు, కుహకాలు జరిగాయి.తెలంగాణ వాదానికి, ఎన్నికలకు సం బంధం లేదని ప్రచారం జరిగింది. ఎన్నడూలేని విధంగా కార్మిక వర్గానికి మద్యం సరఫరా చేసి వారిని చీల్చే ప్రయత్నం చేశారు. రకరకాల ప్రలోభాలకు లోనుచేసే ప్రయత్నాలు చేశారు. తెలంగాణలో ఎన్నో వివక్షలతో రగిలిపోతున్న కార్మిక వర్గం అన్ని ప్రలోభాలను, కుట్రలను ఛేదించి తెలంగాణ వాదం ముందు అన్ని బలాదూరేనని నిరూపించేశారు. కార్మికుల సమస్యలను పక్కనపెట్టి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు వంతపాడిన వారికి తగిన బుద్ధి చెప్పారు. ఈ ప్రాంతం కార్మికుల రక్తం పిండి మరీ ఆస్తిపరులైన, ఎన్నో కోట్ల రూపాయలు సంపాధించుకున్న, రియల్టర్లుగా ఎదిగి వ్యాపార రంగాలలోకి వెళ్లిన నేతలకు తగిన శాస్తి చేశారు. బొగ్గుగనులలో ఈ మార్పు ఈ ఎన్నికలతో వస్తుందని భావించినప్పటికీ ఊహించని విధంగా తెలంగాణవాదానికి కార్మికులు జేజేలు పలికారు. విజయబావుటానందించారు.

ఈక్రమంలో సీమాంధ్ర నాయకత్వంలోని కార్మిక సంఘాలు కార్మికులను ఎలాగయినా తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో వారు చేయని తప్పుడు పనులంటూ లేవు. సారాకు వ్యతిరేకంగా దూబగుంటకన్నా ముందు ఉద్యమించిన కోల్‌బెల్ట్ ప్రాంతప్రజలు ఈ సందర్భంగా మద్యం పంపిణీని తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళలు చాలా చోట్ల ట్రేడ్ యూనియన్ నాయకులను నిలదీశారు. ఇలాంటి విధానాలను వ్యతిరేకించిన కార్మికుల పిల్లలు ప్రధానంగా విద్యా ర్థి లోకం, మహిళలు కార్మికులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఎంత ముఖ్యమో వివరిస్తూ.. తెలంగాణ కోసం విస్తృత ప్రచారం చేశారు.తెలంగాణ వాదాన్ని బలహీన పరచవద్దని వివిధ కార్మిక సంఘాలను హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చే ఈ ఎన్నికలో తెలంగాణ వాదానికే పట్టం కాట్టాలని పిలుపు ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌కే ఓటు వేసి గెలిపించారు.

1998 నుంచి జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు అనుభవిస్తున్న చాలా హక్కులు కోల్పోయారు. ఎప్పుడో 50,60 ఏండ్ల క్రితమే మైనింగ్ చట్టాల ప్రకారం అమలు కావాల్సిన ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు, ఆంబుపూన్సు, రెస్ట్ హాళ్లు, ఫిట్ హెడ్ బాత్ రూంలు సింగరేణిలో ఎక్కడా కనిపించవు. వాటి గురించి ప్రశ్నించినవారే లేరు. పని స్థలాల్లో నిబంధనల ప్రకారం సరఫరా చేయాల్సిన గాలి, వేడిని తగ్గించే ప్రయత్నం ఎన్నడూ జరుగలేదు. దీనికితోడు బొగ్గు బావులలో మరణిస్తే కనీసం పరిహారం లేదు. డిపెండెంటు ఎంప్లాయిమెంటు పూర్తిగా పోయింది. లక్షా 20 వేల మంది ఉన్న కార్మికుల సంఖ్య 63 వేలకు పడిపోయింది.1998లో మొదటి సారి సింగరేణిలో ఎన్నికలు జరిగినప్పుడు ఉన్న 96 వేలకార్మికుల సంఖ్య, ఐదోసారి ఎన్నికల జరిగేటప్పటికీ 63 వేలకు పడిపోయింది. గోల్డెన్‌హ్యాండ్ షేక్ అమలు చేయడం, వేలాది మందిని బయటకు పంపడం, గైర్హాజరు కింద వేలాది మందిని డిస్మిస్ చేయడం నిత్యకృత్యమైంది. న్యాయం గురించి, అవినీతి గురించి ప్రశ్నించిన కార్మికులను విజిపూన్సుల పేరిట విచారణలు జరిపి వేధించడం ఎక్కువైంది. వీటిపై ఏ గుర్తింపు యూనియన్ ప్రశ్నించింది లేదు. ఒక్కరోజు సమ్మె చేస్తే ఎనిమిది రోజుల వేతనాలు కోత పెట్టే నల్లచట్టాలను అమలు చేస్తుంటే చోద్యం చూశారు. ఔట్‌సోర్సింగ్‌ను చిత్తం వచ్చినట్లు అమలు చేయడం, ఓపెన్‌కాస్టు గనులన్నింటిలో సీమాంధ్ర కాంట్రాక్టర్లను నియమించడం లాంటివి ఎన్నో జరుగుతున్నా ఏ ట్రేడ్ యూనియన్ పట్టించుకోలేదు.

వీటన్నింటి ఫలితంగానే ఈసారి కార్మికుల కోసం పనిచేసే కార్మిక సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈ రోజు తెలంగాణ వాదం వైపు మొగ్గు చూపి, ఆ వాదాన్నే గెలిపించారు. దీనినొక రాజకీయ పోరాటంగా సింగరేణి కార్మికులు కొనసాగిస్తున్నారు. సకల జనుల సమ్మె 35 రోజులు నిర్వహించి తమ ఆకాంక్షను ఢిల్లీ వరకు వినిపించేలా చేశారు. తెలంగాణ వాదం ద్వారా ఈ రోజు సింగరేణి గుర్తింపు హోదాను పొందిన టీబీజీకేఎస్ రానున్న రోజులలో కార్మికుల ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యంగా స్వీకరించాలి. కార్మికుల ముందుంచిన 72 అంశాల మ్యానిఫెస్టోను అమలుకోసం కార్మికులతో అంటిపెట్టుకొని పోరాటాలు నిర్వహించాలి. సింగరేణి కార్మికుల చరిత్ర సుధీర్ఘమైనది. త్యాగాలతో కూడినది. బొగ్గుపొరల్లో అగ్గిరాజేసి మానవాళి విముక్తి కోసం బాటలు వేసిన కార్మికవర్గ చైతన్యానికి ప్రతీక. ఆ త్యాగాల పోరుబాటల్లో తెలంగాణ సాధన పోరు కొనసాగిస్తూనే కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కంకణబద్ధులై ఉండాలి. సమస్యల సాధన కోసం టీబీజీకేఎస్ అగ్రభాగాన నిలవాలి. తెలంగాణను బొందల గడ్డలుగా మారుస్తున్న ఓపెన్ కాస్ట్‌లకు వ్యతిరేకంగా కలిసి వచ్చే సంఘాలన్నింటితో ఐక్య పోరాటాలకు మార్గదర్శకంగా ఉండాలి.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

country oven

Featured Articles