గని కార్మికుల కష్టాలకు కారకులెవ్వరు?


Sat,October 6, 2012 04:46 PM

Raju28 talangana patrika telangana culture telangana politics telangana cinemaసుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన భారత కార్మిక వర్గం గతంలో ఎన్నడూ లేనటువంటి సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రపంచీకరణ మొదలైన తరువాత కార్మికుల పరిస్థితి మరింత దిగజారింది...ఎన్నో ఏండ్లు పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు హరించివేస్తున్నాయి. ఉద్యోగ భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో జాతీయ కార్మిక సంఘాలు కార్మికులను సంఘటిత పరిచి ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా మిలిటెంటు ఉద్యమాలు నిర్వహించటంలో విఫలమయ్యాయి. సింగరేణిలో పనిచేస్తున్న జాతీయ సంఘాల వైఫల్యాల వల్లనే సింగరేణిలో ప్రయివేటీకరణ, ఔట్‌సోర్సింగ్ పెరిగిపోయిం ది. జాతీయ సంఘాలు 1998, జూన్‌8న చేసుకున్న ఒప్పందం వలన వారసత్వ ఉద్యోగాలు బందయ్యాయి. తెలంగాణ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడడంలో వైఫల్యం చెందాయి. అప్పుడు సింగరేణిలో విప్లవ కార్మిక సంఘాలు ఆవిర్భవించి నూతన చరిత్ర సృష్టించాయి.

అయితే తరువాత కాలంలో ఆంధ్ర పాలకులు విప్లవ కార్మిక సంఘాలను అణచివేశారు. తదనంతరం తెలంగాణ ఉద్యమం మళ్లీ ఊపందుకోవడంతో కార్మికులలో తెలంగాణ ఆకాంక్షలు బలంగా పాదుకొని కార్మిక సంఘం ఆవిర్భవించింది. దీంతో తెలంగాణ అనకుంటే తమకు పుట్టగతులు లేకుండాపోతాయని భావించిన జాతీయ సంఘనాయకులు, తాము తెలంగాణ వాదులమే అంటూ ప్రచారం చేసుకుంటూ స్వరాష్ట్రం కోసం కార్మికులు సమ్మెలు చేస్తే వాటి ని నీరుగార్చాయి.

యూనియన్ ఎన్నికల పేరుతో కార్మికుల విశ్వాసం కోల్పోయిన జాతీయ సంఘాలను ప్రధానంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలను అధికారంలోకి తీసుకొచ్చి, సింగరేణిలో ప్రయివేటీకరణ, యాంత్రీకరణ పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. కార్మికుల హక్కులపై ఉక్కుపాదం మోపారు. ప్రయివేటీకరణ పెరిగిన కొలది ఆ మేరకు కార్మికులకు పనులు లేకుండాపోయింది. ఇట్లా మిగులు కార్మికులను వీఆర్‌ఎస్, అబ్‌సెంటిజం పేరుమీద పెద్ద ఎత్తున తొలగించుకుంటూపోయారు. ఒకప్పుడు ఈ ప్రాంతవాసులకు ఉపాధి వనరుగా ఉన్న సింగరేణిలో ఉపాధి అవకాశాలు లేకుండాపోయాయి. అదే సమయంలో ఉత్పత్తులు మూడింతలు పెరిగాయి. 1995 తరువాత మళ్లీ మొగ్గతొడిగిన తెలంగాణ ఆకాంక్షలు సింగరేణి కార్మికులలో కొత్త ఆశలు కలిగించింది. ఆ విధం గా తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక వంటి తెలంగాణ వాదుల కార్యక్షికమాలు సింగరేణిలో ఆరంభమయ్యాయి.

అయితే ఆంధ్ర వలస పాలకులు మరోమారు సింగరేణిలో తెలంగాణ ఆకాంక్షలను తుడిచివేయడానికి మళ్లీ నిర్బంధం అమలు జరిపారు. తెలంగాణపై ఉద్యమించే కార్యకర్తలను అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో, మేనేజ్‌మెం టు ట్రాన్స్‌ఫర్లు, డిస్మిస్‌లతో పెద్ద ఎత్తున వేధించింది. ఇట్లా రగులుకున్న తెలంగాణ ఆకాంక్షలు 2001 తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత, దానికి అనుబంధంగా 2003, జనవరి 27వ తేదీన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భవించడంతో సింగరేణి కార్మికోద్యమ చరివూతలో ఒక కొత్త శకం ఆరంభమైంది.

ఆంధ్ర వలసపాలనలో సింగరేణి అధికారులు ఎన్ని అక్రమాలు చేసినా కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడి అన్నింటికి అన్ని మాపీ చేసే విధానం చెలామణి అవడం నేటి విచిత్రం. అధికారుల అవినీతిపై గతంలో అనేక కమిషన్లు, ఎంక్వయిరీ జరిపాయి. రిపోర్టులు ఇచ్చాయి అయినా అవన్ని చెత్తబుట్టలో వేశారు,తప్ప ఏ ఒక్క ఆంధ్ర అధికారిపై చర్య తీసుకోలేదు. వలస పాలకులు ఈ ప్రాంతం నుంచి తక్కువ కాలంలో ఎక్కువ సంపద కొల్లగొట్టే క్రమంలో పూర్తిగా ప్రైవేటు కాంట్రాక్టర్ల నిర్వాహణలో నడిచే ఓపెన్ కాస్టు విధానం అమలులోకి తెచ్చారు. అండర్ గ్రౌండ్‌లను మూసివేసి ఉత్పత్తిలో ఓపెన్ కాస్టుల పాత్ర గణనీయంగా పెరిగిపోయింది. ఓపెన్ కాస్టులు పర్యావరణ పరంగా అతి పెద్ద ప్రమాదకారిగా పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రాంత ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమలేని ఆంధ్ర పాలకులు ఓపెన్ కాస్టు విధానాలను అమలులోకి తెచ్చారు. జాతీయ సంఘాలు అందుకు వంతపాడాయి.

1997 జనవరిలో శర్మ సీ అండ్ ఎండీగా వచ్చిన తరువాత సంస్కరణలు తెచ్చి భూనిర్వాసితులకు ఇచ్చే ఉద్యోగాలు బందు చేయటం వల్ల నిర్వాసితుల పరిస్థితి కడుధీనంగా మారిపోయింది... ఈ ప్రాంతంలో ఇంత బీభత్సం సృష్టించి సాధించిన ఉత్పత్తులు ఎవరికి లాభాలు పండించింది? ఎవని ఇంట్ల వెలుగు నింపింది? ఎవరి బతుకును చీకటి చేసింది? ఇంత వినాశకరమైన అభివృద్ధిని ఓపెన్ కాస్టు విధానాన్ని సమర్థించింది ఈ జాతీయ సంఘాల నాయకులు కాదా? ఎట్లా నాయకులుగా గుర్తించాలి? సింగరేణి ఎన్నికల అనంతరం 14 ఏళ్లు కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయి. సాధించింది ఏమి లేకపోగా అంతకు ముందు పోగొట్టుకున్న డిపెండెంటు ఎంప్లాయిమెంటు సాధిస్తామని అధికారంలోకి వచ్చిన యూనియన్‌లు చెప్పుకుంటూ వచ్చాయి. కానీ ఒక్కసారి కూడా దాని కోసం ప్రయత్నం చేసింది లేదు.

1989లో సింగరేణి శతవార్షికోత్సవాల సందర్భంగా యాజమాన్యం అధికారికంగా 85 బొగ్గు గనులను నూతనంగా తవ్వడం, 55 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు కల్పించడం లాంటి ప్రణాళికలను లిఖిత పూర్వకంగా బ్రోచర్ల ద్వారా విడుదల చేసి, ప్రచారం చేసింది. అనంతరం దాన్ని చెత్తబుట్టలో పడేసింది. దాని గురించి ఒక్క జాతీయ సంఘం కూడా మాట్లాడిన దాఖలా లేదు. 20 ఏండ్లుగా ఐటీ మాఫీ చేయిస్తామని వేదికలు ఎక్కి ఉపన్యాసాలు ఇచ్చారు. దానిపై ఇంత వరకు ప్రయత్నం లేదు. 20, 30 డిమాండ్లతోని మ్యానిఫెస్టోలు తయారు చేసుకొని కార్మికులను మభ్య పెట్టడానికి విడుదల చేయడం 14 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు డిపెండెంటు ఎంప్లాయిమెంటు విషయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కార్మి క శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయం పట్టించుకోలేదని మాట్లాడుతున్నారు. తప్ప దీనిపై చిత్తశుద్ధితో ప్రయత్నం చేసిన దాఖలా లేదు.

రఘునాథడ్డి అవార్డు ద్వారా కోలిండియాకు అదనపు క్యాటగిరీలు ఇక్కడనే ఆందోళనలు చేసి సాధించలేదా? డిపెండెంటు ఎంప్లాయిమెంటును సాధించడం సాధ్యం కాదా? దానికి కేంద్ర ప్రభుత్వ వేజిబోర్డు ఆమోదమే అవసరమా? సింగరేణిలోనే ఒప్పందం చేసుకొని మహిళల డిపెండెంటు ఉద్యోగాలను రద్దు చేసింది జాతీయ సంఘాలే కదా! ఉద్యోగానికి బదులు డబ్బులు ఇప్పించడానికి ఒప్పందాలు చేయలేదా..! అట్లనే సకల జనుల సమ్మె చేసి తెలంగాణ సాధించారా అని ప్రశ్నిస్తున్నారు. సమ్మె ప్రభావం దేశం మొత్తం పడితే స్వయంగా ప్రధాని జోక్యం చేసుకొని సమ్మె విరమణకు ప్రయత్నాలు చేయమ ని మంత్రులను, అధికారులను కోరిన విషయం నిజం కాదా..! ఐక్య ఉద్యమాలను దెబ్బతీసింది జాతీయ సంఘాలు కాదా..! 1998లో మొదటి ఎలక్షన్ల సమయంలో కార్మికుల సంఖ్య 96 వేల 75 ఉంటే ఈ రోజు 63 వేల 429కి పడిపోయింది. దీనికి కారణం ఎవరు? 16 సార్లు గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకాన్ని అమలు చేసి 20 వేల మందికిపైగా కార్మికులను బయటకు పంపారు ఇది నిజం కాదా! తెలంగాణ పల్లెల బతుకులను విధ్వంసం చేసే ఓపెన్ కాస్టు గనులుగా మార్చే ప్రణాళికలను రూపొందించిన మాట నిజం కాదా..!

యాంత్రీకరణను విచ్ఛలవిడిగా పెంచేస్తూ కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడుతున్న అధికారుల పట్ల ఉదాసీన వైఖరిని అవలంబించిన విషయం నిజం కాదా..! వీటన్నింటిని ప్రశ్నిస్తున్న వారు ఉద్యమకారులంటే మీకు మింగుడు పడటం లేదు. వాస్తవాన్నిలు మాట్లాడితే ఉలికి పడటం ఎందుకు?
ఐక్య ఉద్యమాలే సింగరేణిని కాపాడుతాయి.. తెలంగాణ ఏర్పాటుతోనే సింగరేణి కాపాడబడుతుంది.వనరులు కాపాడబడుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఓపెన్ కాస్టు గనుల స్థానంలో భూగర్భ గనులు వస్తాయి. మరో 150 ఏండ్లదాక జీవిత కాలం ఉన్న సింగరేణిలో రానున్నవన్ని భూగర్భ గనులే కావాలని, అందుకోసం రానున్న ఎన్నికలలో విజయం సాధించే కార్మిక సంఘంతోపాటు ఆయా ప్రాంతాల స్థానిక ప్రజావూపతినిధులు కలిసి కట్టుగా కృషి చేయాలి.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం

Published: Sun,January 6, 2013 12:14 AM

వారి త్యాగాలు చిరస్మరణీయం

సామాజిక సంఘర్షణలే ఒక్కో సారి చారిత్రక మైలురాళ్లుగా నిలుస్తాయి. చరిత్ర గతిని మార్చే వెలుగుబాటలు వేస్తాయి. సమాజ గర్భంలోంచి విచ్చుకున

Published: Wed,December 26, 2012 11:43 PM

సీమాంధ్రవాదాన్ని బొందపెట్టారు

సీ మాంధ్ర వాదాన్ని జూన్ 28వ తేదీన సింగరేణి కార్మికులు, డిసెంబర్ 22న ఆర్టీసీ కార్మికులు బొందపెట్టారు. జీహెచ్‌ఎంసీలోనూ అదే జరిగింది.

Published: Fri,December 14, 2012 12:00 AM

తెలంగాణ కోసం పోరుబాట

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించి మూడేళ్లయింది. అయినా రాష్ట

Published: Fri,November 23, 2012 10:47 PM

బొగ్గు బావులతో... అంతరిస్తున్న అడవులు

లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతమంతా సర్వనాశనమవుతున్నది. ప్రధానం గా ఏజెన్సీ ప్రాంతాల అడవి కనుమరుగవుతున్నది. ఒక్క బొగ్గుబాయి ఏర్పడాలంటే క

Published: Fri,December 14, 2012 04:16 PM

నేతలూ మేల్కొనండి

తెలంగాణ కోసం మరో విద్యార్థి కుసుమం నేలరాలిం ది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచ్చులాపూర్ గ్రామానికి చెందిన దర్శనాల సంతోష్ ఉస్మా

Published: Fri,October 12, 2012 02:34 PM

భవిష్యత్తు తరాలకు భరోసా ఏది?

ఎప్పుడు తినే కంచాన్ని గుంజుకొని ఎంగిలి మెతుకులు వెదజల్లుతూ తన ఉదారతత్వాన్ని చాటుకుంటున్నోడే పర్యావరణానికి ప్రమాదకారిగా మారాడు. అలా

Published: Thu,October 11, 2012 05:44 PM

సకల సమ్మెను రగిలించిన బొగ్గు కణిక

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మొట్టమొదట సమ్మె చేసింది బొగ్గుగని కార్మికులే. ఆరు దశాబ్దాల తమ ఆకాంక్షను సాకారం చేసుకోవడం కోసం సింగరే

Published: Tue,October 9, 2012 04:23 PM

బొగ్గు కుంపటిపై యూపీఏ

బొగ్గు కుంభకోణం దేశాన్ని కుదిపేస్తున్నది. కాగ్ నివేదికతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా వెలుగులోకి వచ్చింది. బొగ్గు బ్లాక్‌ల కేటాయిం

Published: Sat,October 6, 2012 04:46 PM

విధ్వంసం సృష్టిస్తున్న విషాదాలు..

బొగ్గు బావుల వల్ల తెలంగాణ ప్రాంతమే కాదు, దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు విధ్వంసానికి గురవుతున్నాయి. వీటివల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ని

Published: Sat,October 6, 2012 04:46 PM

నవశకానికి నాంది..

తెలంగాణకు గుండెకాయ, ఎన్నో పోరాటాలకు, త్యాగాలకు కేంద్ర బిందువుగా నిలిచిన సింగరేణి కార్మికులు ఈ నెల 28న జరిగిన యూనియన్ గుర్తింపు ఎన

Published: Sat,October 6, 2012 04:47 PM

కార్మికులను మరిచిన సింగరేణి ఎన్నికలు

పదేళ్ళ నుంచి లాభాల్లో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి గత నాలుగేండ్లుగా వంద కోట్ల వరకు డివ

Published: Sat,October 6, 2012 04:47 PM

సింగరేణి సొమ్ముతో ఆంధ్రా షోకులు

సింగరేణి సంస్థ వార్షిక టర్నోవర్ పదకొండు వేల కోట్లుంటే అందులో ఐదో వంతు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రాయల్టీల రూపంలో ప

Published: Sat,October 6, 2012 04:47 PM

గనులు తవ్వాలె, పర్యావరణాన్ని రక్షించాలె

దేశంలో బొగ్గును గుర్తించి 238 ఏండ్లు కావస్తున్నది. దేశంలో ప్రస్తు తం జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, ఆంధ్రవూపదేశ్, మధ్య

Published: Sat,October 6, 2012 04:48 PM

కవ్వాల్‌పై కదలని నాయకులు

కవ్వాల్ అభయారణ్యాన్ని టైగర్‌జోన్‌గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మూడు వారాలుగా వరుసగా ప్రజాందోళనలు కొనసాగుతున్నప్పటికీ ఒ

Published: Sat,October 6, 2012 04:48 PM

కోలిండియా సారథి మనోడే

కోలిండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తెలంగాణ అధికారి మెదక్ జిల్లా గొట్టిముక్కల గ్రామం నివాసి, ఐఏఎస్ అధికారి ఎస్. నర్సింగరావు న

Published: Sat,October 6, 2012 04:49 PM

సింగరేణికి లాభాలు-కార్మికులకు కష్టాలు

సింగరేణి 2011-12 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయించిన 51 మిలియన్ టన్నుల ఉత్పత్తిని ఐదు రోజుల ముందుగానే అధిగమించింది. సింగరేణి ల

Published: Sat,October 6, 2012 04:49 PM

బడ్జెట్ భారం

బొగ్గు గనుల మీద కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. మనదేశంలో 74 శాతం విద్యుత్ బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతున్నది. ఈ విద్యుత్ ఉత్పత్త

Published: Sat,October 6, 2012 04:49 PM

బొగ్గు బావుల్లో విషవాయువు

సింగరేణి బొగ్గు గనుల్లో విషవాయువులు ప్రాణా లు తీస్తున్నా అధికారుపూవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు తమ ప్రాణాలను అరచేతిల

Published: Sat,October 6, 2012 04:50 PM

సింగరేణి మిలియన్ మార్చ్..

మిలియన్ మార్చ్ ఒక అపూర్వ ఘట్టం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష పెల్లుబికిన రోజు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కోసం అరవై ఏండ్లుగా సింగరేణి కార్మ

Published: Sat,October 6, 2012 04:50 PM

ద్రోహులకు బుద్ధి చెప్పాలె

తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదవుల కోసం కక్కుర్తి పడుతున్నారు. టీడీపీ నాయకులు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. అధికార దాహం కాంగ్రెస్ నాయ

Published: Sat,October 6, 2012 04:51 PM

బతుకు చీకటి

ఓపెన్ కాస్టుల (ఓసీ) విధానం తెలంగాణ ప్రాంత పర్యావరణాన్ని అడ్డు అదుపు లేకుండావిధ్వంసం చేస్తున్నది. అండర్ గ్రౌండ్ విధానం వల్ల మానవ న

Published: Sat,October 6, 2012 04:50 PM

సింగరేణిపై వలస వివక్ష

ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తరువాత వలస పాలకుల వివక్ష వల్ల తెలంగాణలో ఏపీ స్టీల్, అజంజాహీ మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సర్‌సిల్క్, అంతర్గ

Published: Sat,October 6, 2012 04:52 PM

నాగోబా జాగోరే...

ఆరోజు అమావాస్య రోజు. లోకమంతా చిమ్మచీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగ

Published: Sat,October 6, 2012 04:51 PM

వేతన కమిటీలు ఎండమావులే!

పనిచేసే ప్రతి మనిషికి గౌరవవూపదంగా బతికే వేతనం పొందే హక్కు ఉందని ప్రపంచ మానవహక్కుల సంఘం ప్రకటించింది. కానీ ఈ హక్కుల స్ఫూర్తిని అమలు

Published: Sat,October 6, 2012 04:51 PM

బొగ్గుగని భగ్గుమన్న రోజు

అది 1979, జనవరి 6. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి భూస్వాములకు వ్యతిరేకంగా బొగ్గు గని కార్మికులలో తిరుగుబాటు వచ్చిన రోజు... గూండాల దౌర్జ

Published: Sat,October 6, 2012 04:52 PM

గాయాల సింగరేణి

సింగరేణిలో1889 నుంచి బొగ్గు ఉత్పత్తి చేయ డం ప్రారంభించినప్పటికీ, 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మారింది. దే

Published: Sat,October 6, 2012 04:52 PM

ఉద్యమ గళం సింగరేణి

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర హోంమంత్రి చిదంబరం అధికారిక ప్రకటన చేశారు. నవంబర్ 29 న

Published: Sat,October 6, 2012 04:55 PM

పోరుసాగుతోంది బిడ్దా...

ఒక మంత్రం వేసినట్లే కొనసాగింది సింగరేణి సమ్మె. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు కొంగు బంగారం, గుండెకాయ అయిన సింగరేణి కార్మికుల పాత్ర ఒక

Published: Sat,October 6, 2012 04:55 PM

నవ్వే గాయం సింగరేణి

సింగరేణి అంటేనే నవ్వే గాయం. తిరగేసిన చెమ్మసు. ఎగురుతున్న సుత్తి కొడవలి. సింగరేణి కార్మికులు తెలంగాణ ఆకాంక్ష సాకారం కోసం 32 రోజులుగ

Published: Sat,October 6, 2012 04:54 PM

బందూకులతో బొగ్గు తవ్వగలరా!

బందూకులతో బొగ్గు తవ్వే ప్రయత్నం చేస్తున్నది రాజ్యం. 60 ఏండ్లు గా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ఆకాంక్షతో, మొక్కవోని పట్టుదలతో సింగరేణి

Published: Sat,October 6, 2012 04:54 PM

గని కార్మికుల గర్జనగని కార్మికుల గర్జన

గావులలో 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఉట్టిపడింది. కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు ప్రకటన వెలువడిత

Published: Sat,October 6, 2012 04:54 PM

భవిష్యత్తు నల్ల బంగారానిదే!

దేశంలో డిమాండ్‌కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగడం లేదు... దీంతో ప్రతి సంవత్సరం 80-100 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంటున్నా

Published: Sat,October 6, 2012 04:53 PM

వివక్షతోనే ఈ విషాదాలు

ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉన్నా ఆ అసంతృప్తిని, ప్రజా ఆగ్రహానికి ఒక ఉద్యమ రూపం ఇచ్చి లక్ష్యాలవైపు నడిపించే పార్టీ కానీ, వ్యక్తులు కాన

Published: Sat,October 6, 2012 04:53 PM

గిరిపుత్రుల ఆకలి చావులు పట్టవా?

- ఎండీ. మునీర్ వర్షాకాలం అంటేనే ఆదివాసులు వణికిపోతున్నారు. ప్రతి ఏటా వర్షా కాలంలో.. గిరిజనుల చావులు పెరిగిపోతున్నాయి. అయినా.. ప్ర

Published: Sat,October 6, 2012 04:53 PM

చట్టాలు చేస్తరు, అమలు చెయ్యరు!

గిరిజనులు వలస కూలీలుగా మారటం అం కేవలం బతుకు కోల్పోవడమే కాదు. వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలను కోల్పోవడం. ఇంత వినాశనానికి గిరిజనులు ఎం

Featured Articles