కార్మికులను మరిచిన సింగరేణి ఎన్నికలు


Sat,October 6, 2012 04:47 PM

పదేళ్ళ నుంచి లాభాల్లో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి గత నాలుగేండ్లుగా వంద కోట్ల వరకు డివిడెంట్‌ను కూడా సింగరేణి ఇస్తూ వస్తున్నది. 2000 కోట్ల రూపాయల వరకు వివిధ పన్నులను కడుతున్నది. రాష్ట్రం మాత్రం సింగరేణికి ఒక్క పైసా ఇవ్వడం లేదు. కనీసం సింగరేణి ప్రాంతాలలో అభివృద్ధి చేస్తున్న దాఖలాలు లేవు. ఒక్క పైసా ఖర్చు చేస్తున్న దాఖలా లేదు. సింగరేణి ప్రాంతాలకు చెందిన కోల్‌బెల్ట్ అభివృద్ధిని ఒక్కసారి పరిశీలిస్తే విషయం తెలుస్తుంది. కోల్‌సెస్‌ను కూడా బంద్ చేసేశారు. సింగరేణి తన స్వంత బడ్జెట్ నుంచే నూతన ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టుకోవడం జరుగుతుంది తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నయాపైసా ఇవ్వడం లేదు. ఈ విషయాలపై ఎన్నడూ సింగరేణిలోని యూనియన్‌లు ప్రశ్నించిన దాఖలా లేదు. ఈ ప్రాంత ప్రజావూపతినిధులు కూడా ఒత్తిడి చేసిన దాఖలా లేదు. సౌకర్యాల విషయానికి వచ్చినప్పుడు మిగితా పరిక్షిశమలను పోల్చితే చాలా తక్కువే. సింగరేణి కాలరీస్ కంపెనీకి 123 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇందులో కార్మికోద్యమ చరివూతకు 80 సంవత్సరాలు ఉంటుంది.

సింగరేణి అవతరించిన తర్వాత 70 ఏండ్లకు కార్మిక సంఘం ఏర్పడినది. మొదట ఎలాంటి సంఘం లేకుండా నే కార్మికులు ఉబ్బసిలాల్‌పాసి అనే కార్మికుడి నేతృత్వంలో సింగరేణిలో 13రోజులు సమ్మె చేశారు. అప్పటినుంచి ఇటీవల ప్రత్యేక తెలంగాణ సాధన కోసం 35 రోజుల పాటు సకల జనుల సమ్మె పోరాటం దాకా సింగరేణిది ఘనమైన పోరాటాల చరిత్ర. సింగరేణిలో నేటికి గృహ వసతి లేని కార్మికులు 37 శాతం ఉంటారు. గృహ వసతే 100 శాతం కల్పించలేని దుస్థితి ఉన్నది. ఈ పరిస్థితులలో సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు ఈ నెల 28న జరుగనున్నాయి. అందులో పోటీ చేసి విజయం సాధించడానికి 14 సంఘాలు రంగ ప్రవేశం చేశాయి. అడ్డగోలు, అమలుకు సాధ్యం కాని వాగ్ధానాలు, హామీలతో ప్రచారంలోకి దిగాయి. ఒక్కసారి సింగరేణి గురించి.., సంఘాల గురించి.., కార్మికుల పోరాటాల గురించి తెలుసుకున్నట్లయితే ఎన్నికలు ఎందుకు వచ్చినట్టు? వచ్చి ఏమి సాధించినట్టు? అనే విషయం తేలిపోతుంది.

తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కార్మికులలో ఆకాంక్ష రగలిపోతున్నది. సింగరేణి కార్మికుల ఆకాంక్షకు 61 ఏండ్లు. అన్యాయం, అక్రమం మీద తిరుగుబాటు స్వభావాన్ని రంగరించుకున్న గని కార్మికులు ఉద్యమాల్లో, పోరాటాల్లో రాటుదేలి ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 78 కార్మిక సంఘాలు సింగరేణిలో ఉన్నాయి. జాతీయ కార్మిక సంఘాల విధానాల మూలంగా సింగరేణి వృత్తి సంఘాలు, ప్రాంతీయ సంఘాలు ఏర్పడ్డాయి. జాతీయ సంఘాలు కార్మికుల హక్కులు పరిరక్షించడంలో విఫలం కావడం, అవినీతి, అక్రమాలు పెరిగిపోవడం వల్ల సికాస, ఇఫ్టూ లాంటి విప్లవ సంఘాలు ఆవిర్భవించాయి. పాలకపార్టీల అనుబంధ సంఘాలు చేయలేని విధంగా పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాదించాయి.
ఈ నేపథ్యంలో సంస్కరణల పేరిట, స్టాండింగ్ ఆర్డర్‌ల పేరిట సంస్థలో సీమాంధ్ర అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి, వివక్ష సింగరేణి కార్మికులపై పెరిగింది.

యాజమాన్యం కార్మికుల నిజ జీవితంలో కూడా ప్రవేశించి అనేక రకాలుగా వేధింపులకు దిగింది. కార్మికుల కుటుంబ సభ్యులు ఏ విధమైన వ్యాపారాలు చేయరాదని ఆంక్షలు విధించారు.అనేక రకాలుగా రకరకాల పేర్లతో కార్మికుల జీవితాలను శాసించడం చేశారు. వ్యాపారాలున్న కుటుంబంలోని కార్మికులను బదిలీలు చేయడం, సస్పెండ్‌లు చేయడం లాంటి చర్యలకు సింగరేణి యాజమాన్యం దిగింది. అయినా యూనియన్‌లు ఏమి చేయలేకపోయాయి. వీటన్నింటిని ఎదుర్కోవడం కోసం, సమస్యల పరిష్కారానికి కార్మికులు విప్లవసంఘాల బాట పట్టారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు సుదీర్ఘ సమ్మెలు చేశారు. ఈ సమస్యల కారణంగా ప్రతియేటా 35 నుంచి 56 రోజుల సమ్మెలు నమోదు అయ్యాయి.దీంతో బొగ్గు ఉత్పత్తి తగ్గడం, బొగ్గు ధర పెరగకపోవడం, సీమాంధ్ర దోపిడీ పెరగడం, కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు సంస్థ భారీ నష్టాలకు కారణమై బీఐఎఫ్‌ఆర్‌లోనికి వెళ్ళింది.ఈ పరిస్థితుల్లో ఖాయిలా మార్క్ పడకుండా కార్మికులు మూడేండ్లు కష్టపడి అధికోత్పత్తి సాధించి కంపెనీని కాపాడుకున్నారు. ఇదంతా 1993 నుండి 1996 మధ్యన జరిగింది. దేశంలో యూనియన్ ఎన్నికలు ఎక్కడా లేని విధంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగరేణిలో ఉద్యమాలు, పోరాటాలు అణిచి వేయడానికి 1998లో మొదటిసారి యూనియన్ గుర్తింపు ఎన్నికలు నిర్వహించారు.

ఎన్నికల ద్వారా కేవలం 1998లో 16 సంఘాలకు మాత్రం అర్హత లభించింది. 62 సంఘాలు అస్థిత్వం కోల్పోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేటీకరణ పేరిట అవుట్ సోర్సింగ్ పెరిగింది. 16 సార్లు గోల్డెన్ షేక్ హ్యాండ్ అమలు చేసి 25 వేల కార్మికులను తగ్గించేశారు. దారుణమైన నిర్భంధాన్ని అమలు చేశారు. చార్జ్‌షీట్లు, సస్పెన్షన్లు, ట్రాన్స్‌ఫర్లు పెరిగాయి. గైర్హాజరు పేరిట వేలాది మంది కార్మికులను డిస్మిస్ చేశారు. ఎనిమిదేండ్లలో 40 మంది డిస్మిస్ అయిన కార్మికులు అనారోగ్యాలతో మరణించడం, సగం మందికిపైగా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. సంవత్సరాల తరబడి దీక్షా శిబిరాలు పెట్టినా వారిని పట్టించుకున్న వారు లేరు. వేలాది మంది సింగరేణిపైనే ఆధారపడ్డ నిరుద్యోగులు పనులు లేక ఆగమాగమవుతున్నారు. దీనికంతా గ్లోబలైజేషన్, నూతన ఆర్థిక పారిక్షిశామిక విధానాలు సింగరేణిలో అమలు కావడమే కారణం. మరోవైపు సింగరేణికి అనుబంధంగా పరిక్షిశమలు రాకపోవడం, పెట్టుబడులన్నీ, లాభాలన్నీ సీమాంవూధకే తరలిపోవడం లాంటివే కారణంగా పేర్కొనవచ్చు. ఈ సమస్యలపై ఇప్పుడున్న కార్మిక సంఘాలు దృష్టిని ఏనాడు కేంద్రీకరించలేదు.పోగా పైరవీలకు, లంచాలకు మరిగిన ట్రేడ్ యూనియన్ నాయకులు కార్మికుల పాలిటి గద్దలుగా తయారయ్యారు. ఈ క్రమంలో సింగరేణిలో అశాంతి, సాంఘీక నేరాలు కూడా పెరిగిపోయాయి. నియామకాల్లో అన్యాయం, తెలంగాణవాదులైన కార్మికులను వేధించడం ప్రారంభమైంది. సమ్మె చేస్తే మస్టర్ల కోత చట్టం అమలు చేశారు. సమ్మెలను నిషేధించారు.

డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ పోయింది. భూగర్భ గనుల త్రవ్వకం స్థానే పర్యావరణ విధ్వంసం సృష్టించే ఓపెన్‌కాస్టు గనుల తవ్వకం మొదలయ్యింది. మూత పడ్డ భూగర్భ గనులను ఓపెన్ కాస్టులుగా మార్చారు. లక్ష నుంచి కార్మికుల సం ఖ్య 64వేలకు కుదించా రు. ఓసీలన్నింటిలో కాం ట్రాక్ట్ పనులు సీ మాంధ్ర కాంట్రాక్టర్లపరం అయ్యాయి. కార్మికుల ఇష్టంతో పని లేకుండా గెల్చిన యూనియన్‌కు వేతనాల నుంచి పేషీట్ రికవరీ ద్వారా లక్షల రూపాయల చందా చేరడం మొదలయ్యింది.ఇలాంటి పనులకోసమేనా అన్నట్లు కార్మికుల సమస్యలు ఎన్నడూ పట్టించుకోని యూనియన్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎప్పు డూ లేని విధంగా ఈ సారి తెలంగాణవాదం ప్రధానంగా ఎన్నికల్లో వినిపిస్తున్నది. ఆయా రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,మంత్రులు,ఎంపీలు తమపార్టీల అనుబంధ యూనియన్‌ల గెలుపుకోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సింగరేణి గనుల్లో సాధారణ ఎన్నికలను తలపించే విధంగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఈ ఎన్నికల జోరు పోటాపోటీగా సాగుతున్నది.

16 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను ప్రభావితం చేసే ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి రాజకీయ నేతలు ఉత్సాహం చూపుతున్నారు. 2014లో వచ్చే సార్వవూతిక ఎన్నికల్లో తమకు యూనియన్‌ల మద్దతు అవసరమనే ఆశతో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరో వైపు కార్మికుల సమస్యలు పట్టించుకోని కార్మిక సంఘాలను కాల దన్ని కార్మికుల కోసం అనన్య త్యాగాలు చేసిన సీకాసా లాంటి కార్మిక సంఘం అండలేకపోవడం కార్మికులు పెద్ద లోటుగా భావిస్తున్నారు. ఏది ఏమైనా కార్మిక ప్రయోజనాలు పట్టని యూనియన్ ఎన్నికలు ఎవరి కోసమని ప్రశ్నిస్తున్నారు. కార్మికుల కోసం త్యాగాలు చేసే వారి కోసం ఎదిరి చూస్తున్నారు.

-ఎండీ మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Featured Articles