సింగరేణి సొమ్ముతో ఆంధ్రా షోకులు


Sat,October 6, 2012 04:47 PM

సింగరేణి సంస్థ వార్షిక టర్నోవర్ పదకొండు వేల కోట్లుంటే అందులో ఐదో వంతు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రాయల్టీల రూపంలో పోతున్నది. గత పదేళ్లలో బొగ్గు ఉత్పత్తులు దాదాపు రెట్టింపు అయ్యాయి. అదే సమయంలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించే మొత్తాలు 360 కోట్ల నుంచి 2000 కోట్ల రూపాయలకు చేరుకున్నది. దాదాపు ఐదున్నర రెట్లు పన్నుల రూపంలో ప్రభుత్వ బొక్కసంలోకి పోతున్నది. ఇవి కాకుండా కార్మికుల జీతాల నుంచి ఇన్‌కమ్ టాక్స్, లాభాల మీద డిపర్డ్ టాక్స్, వృత్తి పన్నులు, తదితరాల పేరు మీద మరో 500 కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి చేరుతున్నవి. ఇట్లా ప్రభుత్వ ఖాతాలోకి చేరుతున్న మొత్తం నుంచి ఈ ప్రాంతాభివృద్ధికి పదోవంతు కూడా ఖర్చు చేయడం లేదు. ఉమ్మడి రాష్ట్రం పేరు మీద 56 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా బొగ్గు తవ్వకాలు సాగి స్తూ వేలాది గ్రామాలను నామ రూపా లు లేకుండా చేశారు. భవిష్యత్తులో మానవ వికాస యోగ్యం కాని మరుభూమిగా మారుస్తు సాగిస్తున్న విధ్వంసకర అభివృద్ధి యజ్ఞంలో బలైపోతున్నది ఈ ప్రాంత వాసులే. దక్షిణాది రాష్ట్రాల బొగ్గు అవసరాలు తీరుస్తున్న సింగరేణిలో ఒక వైపు ఉత్పత్తి లక్ష్యాలు ప్రతి సంవత్సరం పెంచుకుంటూపోతూనే, మరోవైపు అందుకు అవసరమయిన ఆర్థిక వనరులను కల్పించటం లేదు. ఏయేటికాయేడేడు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతుంటే ఆ ఖర్చులకు అనుగుణంగా బొగ్గు ధరలు పెంచకుండా బొగ్గు ధరల కంట్రోలింగ్ విధానం అమలు జరుపటం వల్ల బొగ్గు వినియోగిస్తున్న సంస్థలకు లాభం కలిగిస్తూ ఆమేరకు సంస్థకు నష్టం కలిగిస్తున్నదీ ప్రభుత్వం. సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో 90 శాతం ఆంధ్రా ప్రాంతానికి వివిధ రూపాలలో తరలిస్తున్నారు. ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు పోరాడిన ప్రతిసారి అణచివేతే ఆంధ్రా పాలకుల సమాధానం అయ్యింది. దేశంలోని సకల సాయుధ బలగాలను కోల్‌బెల్ట్ ప్రాంతంలో మోహరించి కార్మికులతో నిర్బంధంగా పనిచేయిస్తున్నారు. సాయుధ పోలీసులు రంగంలోకి దిగి నల్లనేలను రక్తసిక్తం చేసి తుపాకి మొన మీద వనరుల దోపిడీ కొనసాగిస్తున్నారు. కార్మికుల సమ్మెలపై పోలీసుల జోక్యం మితిమీరిపోయింది. సమ్మె కాలంలో కార్మికుల ఇండ్లపై దాడి చేసి పోలీసులు బలవంతంగా ఎత్తుకుపోయి బావుల మీద నిర్బంధంగా పనులు చేయించటం ఆనవాయితీగా మారింది. అక్రమ కేసులు, నల్లచట్టాల ప్రయోగంలాంటి తీవ్రమైన కేసులను సమె చేస్తున్న కార్మికుల మీద నమోదు చేస్తున్నారు. మస్టర్ల కోత ను అమలు చేస్తున్నారు. నల్ల చట్టాలే కాదు, సమ్మెలను విఫలం చేయటానికి సమ్మె కాలంలో పని చేసిన వారికి ఒక మస్టర్‌కు రెండు మస్టర్‌లు, మూడు మస్టర్‌లు ఇవ్వటం వంటి విధానాలను అమలు జరుపుతూ కార్మికులను ప్రలోభపెడుతున్నారు. కోల్‌బెల్ట్‌లో ఎటువంటి ప్రజాస్వామిక విలువలను పాటించకుండా అణచివేత విధానాలను అమలు జరుపుతూ ఆంధ్రా వలస పాలకులు తమ దోపిడీని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు లో తెలంగాణ ఎన్నటికి కోలుకోని విధంగా తీవ్రంగా నష్టపోతుందనే స్పృహ తో సింగరేణి కార్మికులు ఇవ్వాళ తెలంగాణ జెండా ఎత్తిపట్టి చావో, రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. సకల జనుల సమ్మె వంటి చరివూతాత్మకమైన పోరాటాలు నిర్వహిస్తూ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. తమ విముక్తి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన పరిక్షిశమలను, నిజాం కాలం నాటి నుంచి కొనసాగుతున్న పరిక్షిశమలను ఆంధ్రా పాలకులు మూసి వేశారు. ఈ విధంగా ఐడీపీఎల్, ఆజాంజాహి మిల్లు, నిజాం షుగర్ ప్యాక్టరీ, అంతర్గాం, సర్‌సిల్క్ వంటి అనేక పరిక్షిశమలు మూసివేతకు గురయ్యా యి. వాటికి సంబంధించిన ఆస్తులను వలసవాద పెత్తందారులు కాజేశారు. ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తరువాత తెలంగాణలోని పరిక్షిశమలే మూసివేతకు గురికావడం, ఆంధ్రా పాలకుల వివక్షకు తార్కాణం. అదే సమయంలో ఆంధ్రలోని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నష్టాల బారిన పడి మూసివేతకు సిద్ధమైతే, ఆంధ్రా ప్రాంత రాజకీయ నాయకులు ఆగమేఘాల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి దాదాపు రెండు వేల కోట్ల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవడం జరిగింది. అలాగే విజయవాడలోని ఆంధ్రవూపదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఏపీహెచ్‌ఎంఈఎల్) పరిక్షిశమ నష్టాల బారినపడి మూసివేతకు దారితీస్తే, ఆంధ్రా సర్కార్ దానిని ఆదుకోవడానికి ఆ సంస్థను (ఏపీహెచ్‌ఎంఈఎల్)సింగరేణి సంస్థకు అంటగట్టారు. అప్పటికి సింగరేణి సంస్థ 1219 కోట్ల రూపాయల నష్టంలో ఉన్నది. నష్టాలతో ఉన్న సంస్థను, నష్టాలలో ఉన్న మరో సంస్థకు అంటగట్టడంలోని మతలబు ఏమిటో సీమాంధ్ర పాలకులే చెప్పాలి. ఆంధ్ర ప్రాంతంలోని పరిక్షిశమను ఆదుకోవడానికి తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి మీద రుద్దటం ఎందు కోసం? ఈ విధంగా నష్టాలలో ఉన్న ఆ సంస్థలోని 1 శాతం షేర్లను సింగరేణి చేత పాలకులు కొనిపించారు. 12 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ ఫండ్ కింద నిధులు విడుదల చేశారు. మరో మూడు కోట్ల రూపాయలు వడ్డీలేని రుణం కింద సింగరేణి సంస్థ నుంచి మళ్లించారు. ఆ సంస్థలో పనులు కల్పించటం కోసం సింగరేణి వర్క్‌షాపులను, కార్మికులు చేసే పనులను బందుపెట్టి ఆ సంస్థకు అప్పగించారు. దీనితో ఆ మేరకు వర్క్‌షాపులలో పని చేసే కార్మికులకు పని లేకుండాపోయింది. ఇంతచేసి ఏపీహెచ్‌ఎంఈఎల్ సంస్థ చేసిన పరికరాలకు అధిక ధరలు, రవాణా కలిసిమోపెడవుతున్నది. నాణ్యతా లోపం వల్ల కోట్లాది రూపాయలు విలువ చేసే సామాగ్రి బావుల మీద వృథాగా పడి ఉన్నాయి. ఫలితంగా ఏపీహెచ్‌ఎంఈఎల్ సింగరేణి పాలిట తెల్ల ఏనుగులా మారి ప్రతి సంవత్సరం సింగరేణికి కోట్లాది రూపాయలు నష్టం కలిగిస్తున్నది.

ఆంధ్ర ప్రాంత అధికారులకు సింగరేణి పునరావాస కేంద్రంగా మారింది. ఆంధ్ర ప్రాంత పరిక్షిశమలపై ఇంత ప్రేమ చూపెట్టిన ఆంధ్ర పాలకులు, తెలంగాణ పరిక్షిశమల మీద చూపే వివక్షకు రామగుండంలో ఫర్టిలైజర్ కార్పోరేషన్ ఒక ఉదాహరణ. ఎఫ్‌సీఐ కి అవసరమైన మౌలిక వనరులు, వసతులు అందుబాటులో ఉన్నాయని రామగుండంలో ఏర్పాటు చేశారు. బొగ్గు, విద్యుత్ ఆధారంగా ఎరువులను తయా రు చేసే కంపెనీకి, ఆ ఫ్యాక్టరీ చుట్టూ బొగ్గు గనులున్నప్పటికీ, బొగ్గు కొరత వల్ల 105 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అలాగే ఎఫ్‌సీఐకి, రామగుండం ఎన్టీపీసీకి మధ్య ఒక గోడ మాత్రమే అడ్డు ఉన్నది. కానీ అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఎఫ్‌సీఐకి అందలేదు. ఫలితంగా కరెంటు కొరత వల్ల మరో 293 కోట్ల రూపాయల నష్టం సంభవించి ఈ పరిక్షిశమలు నష్టాలలో కూరుకుపోయి అంతిమంగా మూసివేతకు గురయ్యాయి. ఆంధ్రా పాలకుల పక్షపాత ధోరణి వల్ల తెలంగాణలోని పరిక్షిశమలు మూసివేతకు గురై, అందులో పనిచేసే వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని పరిక్షిశమలను నిర్వీర్యం చేసి, మూసివేయడం ఆంధ్రా పాలకులకు ఆనవాయితీగా మారిం ది. ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగటం అంటే.. తెలంగాణ ప్రజలు తమ గొయ్యిని తామే తవ్వుకున్నట్లు అవుతుంది.

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

country oven

Featured Articles