గిరిజనులు వలస కూలీలుగా మారటం అం కేవలం బతుకు కోల్పోవడమే కాదు. వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలను కోల్పోవడం. ఇంత వినాశనానికి గిరిజనులు ఎందుకు బలి కావాలి? వాళ్ల భూములలో సంపద ఉండటమే వాళ్లు చేసిన నేరమా? ఆ సంపద ఎవరికో లాభాలు పండిస్తే.. ఈ అన్యాయాన్ని గిరిజనులు ఎందుకు భరిం
ఆంధ్రపదేశ్ అవతరణ తరువాత..... తెలంగాణ బొగ్గు సంపద తెలంగాణకు చెందకుండా తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురి చేయబడుతున్నరు. ఈ అన్యాయంలో మరింత అన్యాయానికి గురవుతున్న వాళ్ళు గిరిజనులు... గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు గనులు నూటికి తొంభై శాతం గిరిజన ప్రాంతంలోనే ఉన్నా యి. ఆ మేరకు బొగ్గు గనుల క్రింద నిర్వాసితులు అవుతున్న వారిలో తొంభై శాతం మంది గిరిజనులే ఉన్నారు... బొగ్గు గనుల క్రింద భూములు సేకరించే సమయంలో పాటించాల్సి న నియమాల గురించి రాజ్యాంగం భూసేకరణ చట్టాలు, నిర్వాసితులకు పునరావాసం,నష్ట పరిహారం చెల్లింపులో తప్పని సరిగా పాటించాల్సిన నియమాలను చట్టాలుగా రూపొందించింది... కాని ఆచరణకు వచ్చే సరికి పునరావాస చట్టాలు యథేచ్ఛగా ఉల్లంఘించబడుతున్నాయి.
మైదాన ప్రాంతంలో ప్రజల చైతన్యం మేరకు కొంత మేరకు అమలు జరుగుతుం ది. కానీ నిర్వాసితులయ్యే గిరిజనుల విషయంలో చట్టాల ఉల్లంఘన పెద్ద ఎత్తున జరుగుతోంది. అందుకు గిరిజనుల వెనుకబాటు తనం, అమాయకత్వం కారణం అవుతోంది. భూసేకరణ సందర్భంలో తప్పని సరిగా నిర్వహించాల్సిన వంటి కార్యక్షికమాలలో మైదాన ప్రాంతంలో ఏదో ఒక మేరకు జరుగుతున్నా గిరిజన ప్రాంతంలో మొక్కుబడి తంతుగా నామమాత్రం అయిపోతోంది... చాలా వరకు అసలు ఏం జరుగుతుందో ఏమో తెలియని అమాయక స్థితిలోకి నెట్టివేసి ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి సాగించే ప్రజాభిపాయసేకరణలో గిరిజనుల గొంతు నొక్కివేస్తున్నారు.
సంప్రదాయకంగా గిరిజనులు తరతరాలుగా భూములు సాగుచేసుకుంటున్నప్పటికి చట్ట ప్రకారం భూములు రిజిస్టేషన్ వంటివి లేకుండా ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్నారు. అటువంటి భూములు సేకరించే క్రమంలో ఎటువంటి నష్ట పరిహారం లేకుండా బలవంతంగా గిరిజనుల నుంచి భూములు గుంజుకోవడం జరుగుతుంది. మొట్ట మొదటి బొగ్గు గని పారిక్షిశామిక ప్రాంతమైన ఇల్లందు పట్టణానికి ఆనుకొని ఉన్న కోయగూడెం ఓపెన్‌కాస్టు కింద దాదాపు రెండు వేల ఎకరాలు సేకరించారు. అందులో 800 ఎకరాలకు చట్టబద్ధంగా రిజిష్టర్ కాలేదన్న నెపం మీద ఎటువంటి నష్ట పరిహారం చెల్లించకుండానే సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకున్నది. ఇటువంటి విధానమే దాదాపుగా మిగతా గిరిజన ప్రాంతాలలొ కొనసాగింది. ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.
రాజ్యంగంలోని ఐదవ షెడ్యూల్ కింద రక్షిత ప్రాంతమైన గిరిజన ప్రాంతంలో భూసేకరణ కింద తప్పని సరిగా పాటించాల్సిన నియమాల గురించి ప్రత్యేకంగా పేర్కొన్నది.
అలాగే మూలవాసుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా జేనివా కాన్ఫన్స్‌లో కొన్ని సూత్రీకరణలు చేసింది. దాని ప్రకారం మూలవాసుల జీవితానికి, సంస్కృతి సాంప్రదాయాలకు భంగం కలిగించని విధంగా భూసేకరణ జరపాలని పేర్కొన్నది. ప్రజల పట్ల ప్రేమలేని ప్రభుత్వాలు... వాళ్ల భూముల్లో ఉన్న సంపద దోచుకోవడంపై ఉన్న ప్రేమ మూలవాసుల పట్ల లేకపోవడం వల్ల ఆచరణలో ఏ నియమాలు, ఏ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. అయితే తాము ఏ చట్టాలు ఉల్లంఘించడం లేదని, అన్ని సక్రమంగా పాటిస్తున్నామని ప్రచారం చేసుకోవడానికి వీలుగా ఒకటి, అరా నిర్వాసితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి అట్లా ఏర్పాటు చేసిన ఒకటి అరా పునరావాస కేంద్రాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన మండలమైన తిర్యాణిలోని గోలేటి, కైరిగూడ ఓపెన్‌కాస్టు గనుల కింద నిర్వాసితులైన గిరిజనుల కోసం అనే చోట పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. కానీ అక్కడ నీరు, కరెంటు, ఉపాధి వంటి వసతులు లేకపోవడం వలన పునరావాస కాలనీలలో ఎవరు ఉండటం లేదు... నష్ట పరిహారం చెల్లింపు విషయంలో తీవ్ర అన్యాయం, వివక్ష చోటు చేసుకుంది. దానితో కేసులు కోర్టుల దాకపోయాయి. కానీ ఏండ్ల కు ఏండ్లుగా కేసులు ఎటూ తేలకపోవడం, ఈ లోపున గిరిజనులు భూములు కోల్పోతు, బతుకుదెరువులేక వలసపోతున్నారు.
సంప్రదాయక గిరిజన జీవితం అడవితోను, సాగుచేసుకునే భూమితో ముడిపడి ఉంటుంది. గతంలోనైతే కొన్నిసార్లు సాగు చేసుకుంటున్న భూమి సారహీనమైతే మరోచోట అడవిని కొట్టి కొత్తగా భూములు వ్యవసాయ యోగ్యం చేసుకునే వాళ్లు... దీనిని పోడు వ్యవసాయంగా పిలిచే వాళ్లు... అటు తరువాత కాలంలో ప్రభుత్వ విధానాలతో ఫారెస్టు డిపార్టుమెంటు వల్ల దాదాపుగా పోడు వ్యవసాయం బందైపోయింది. ఉన్న భూముల్లోనే సంప్రదాయక వ్యవసాయం చేసుకోవడం అలవాటుగా మారింది... ఏండ్ల తరబడి అవేభూములు తరతరాలుగా సాగుచేసుకుంటూ బతుకులు వెల్లదీస్తున్నారు. భూముల విక్రయాలు గిరిజనులకు చాల అరుదు. ఒకటి, అరా ఎప్పుడైనా అమ్మకాలు జరిగిన నాటికి పెద్ద విలువుండేది కాదు. అమ్మిన భూములకైనా రిజిస్టేషన్ చేసుకోవడం కూడా అరుదుగా జరిగేది. బొగ్గు గనుల కింద భూములు సేకరించే క్రమంలో రిజిస్టేషన్ ధరలను లెక్కలోకి తీసుకొని కంపెనీ నష్ట పరిహారం కింద చెల్లించడం వల్ల చాలా తక్కువ మొత్తాలు మాత్రమే వారికి చెల్లిస్తున్నారు. అట్లా వచ్చిన పైసలతో ఏడాదో, ఆర్నెల్లో బతకడం, అటు తరువాత చేసుకోను భూములు లేక, పనులు లేక వలసపోవడం అన్నది బొగ్గు గనుల కింద నిర్వాసితులైన గిరిజనుల బతుకులు అనివార్యమైన పరిణామంగా మారింది... దీంతో నీటిలో ఉండే చేప పిల్ల ఒడ్డున పడ్డ చందంగా గిరిజనుల బతుకు తయారైంది. అడవిని విడిచి ఊరును విడిచి దూర ప్రాంతాలకు వలసపోయి కూలీలుగా బతకుతున్నారు.
గిరిజనులు వలస కూలీలుగా మారటం అం కేవలం బతుకు కోల్పోవడమే కాదు, వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలను కోల్పోవడం... ఒక్క మాటలో చెప్పాలం సర్వం కోల్పోవడం... ఇంత వినాశనానికి గిరిజనులు ఎందుకు బలికావాలి? వాళ్ల భూములలో సంపద ఉండటమే వాళ్లు చేసిన నేరమా? ఆ సంపద ఎవరికో లాభాలు పండిస్తే.. వాళ్ల బతుకు మాత్రం నాశనమతుంది... ఇంత అన్యాయాన్ని గిరిజనులు ఎందుకు భరించాలి? ఏ మేరకు బొగ్గు గనులు విస్తరించుకుపోతున్నాయో ఆ మేరకు గిరిజనుల బతుకు విధ్వంసం మరింత పెరిగిపోతుంది... వచ్చే బొగ్గు గనులన్నీ ఓపెన్ కాస్టు గనులు కావడం వల్ల ఈ విధ్వంసం కేవలం గిరిజనుల బతుకును నాశనం చేయడమే కాదు, శాశ్వతంగా ఈ ప్రాంత పర్యావరణ విధ్వంసానికి పాల్పతూ ఈ ప్రాంతాన్ని మరు భూమిగా మారుస్తున్నారు.
ఎండీ. మునీర్