గనులు తవ్వాలె, పర్యావరణాన్ని రక్షించాలె


Sat,October 6, 2012 04:47 PM

దేశంలో బొగ్గును గుర్తించి 238 ఏండ్లు కావస్తున్నది. దేశంలో ప్రస్తు తం జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, ఆంధ్రవూపదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరవూపదేశ్, అస్సాం, మేఘాలయలలో బొగ్గు నిక్షేపాలున్నాయి. ఇప్పటివర కు దేశంలో గుర్తించిన బొగ్గు సుమారు 110 బిలియన్ టన్నులు. మొట్టమొదలు రాణిగంజ్‌లో బొగ్గును గుర్తించారు. 1973, మే 1న దేశంలోని బొగ్గు గనులన్నీ జాతీయం చేయబడ్డాయి... అంతకు ముందే సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది. సింగరేణి కాలరీస్ గోదావరిలోయ లో బొగ్గును గుర్తించింది. 1889 నుంచి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి అవుతోంది. దేశంలో బొగ్గు ఉత్పత్తి పుంజుకున్నది. 220 ఏళ్ల కింద బొగ్గును గుర్తించినప్పటికి ఉత్పత్తి పుంజుకున్నది మాత్రం 1900 నుంచి. 1900 సంవత్సరం మొట్టమొదలు 6.12 మిలియన్ టన్నులు, 1920లో 18 మిలియన్ టన్ను లు, 1942 లో 29 మిలియన్ టన్నులు, 1946 లో 30 మిలియన్ టన్నులు, ఇలా మొదటి పంచవర్ష ప్రణాళిక వచ్చేసరికి 33 మిలియన్ టన్నుల ఉత్పత్తి పెరుగుతూ వచ్చింది.

దేశంలో ప్రస్తుతం గుర్తించిన బొగ్గు నిక్షేపాల ప్రకారం 170 సంవత్సరాల వరకు బొగ్గు ఉత్పత్తి చేయవచ్చు. అలాగే సింగరేణిలో గుర్తించిన 9877 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను పరిశీలిస్తే మరో 150 ఏండ్ల జీవిత కాలం సింగరేణికి ఉన్నది. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 221 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికిగాను సింగరేణి 239 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసింది. అంటే 108 శాతం సింగరేణి వృద్ధి రేటును సాధించింది. ఇది దేశంలోనే సంచలన వృద్ధిరేటుగా పేర్కొనవచ్చు... దేశంలో 3 లక్షల 80 వేల వరకు కోలిండియా ఉద్యోగులు, 65 వేల మంది సింగరేణి ఉద్యోగులు పనిచేస్తున్నారు... వీరితో పాటు మూడున్నర లక్షలమంది వరకు కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు... సింగరేణి వార్షిక టర్నోవర్ 11 వేల 400 కోట్ల రూపాయలు కాగా కోలిండియాకు సంబంధించి 45 వేల కోట్ల రూపాయలు వార్షిక టర్నోవర్ ఉన్న ది. ప్రతి సంవత్సరం సింగరేణి సంస్థ అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి మొత్తం 2465 కోట్ల రూపాయల వరకు ఎంట్రీ టాక్స్, క్లీన్ ఎనర్జీస్, వర్క్స్ కాంట్రాక్టులు, సేల్స్ టాక్స్, రాయల్టీ, డివిడెండ్ లాంటివి చెల్లిస్తున్నది. కోలిండియా కూడా ఇదే స్థాయిలో చెల్లిస్తున్నది.


మే 4న ప్రతి సంవత్సరం బొగ్గు గని కార్మిక దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇటు సింగరేణిలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని డిసెంబర్ 23న నిర్వహిస్తున్నా రు. ఈ రెండు దినోత్సవాల సందర్భంగా సింగరేణిలో, అటు జాతీయ స్థాయిలో జీతంతో కూడిన దినాలను ప్రకటించాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కోలిండియాకు ప్రతి ఏడాది 6000 కోట్ల రూపాయల వరకు లాభాలు వస్తుండగా ఇటు సింగరేణికి తాజాగా పన్నులన్నీ తీసివేసి 450 కోట్ల రూపాయలు లాభం వచ్చినట్లు యాజమాన్యం ప్రకటించిం ది. ఈ నేపథ్యంలో ఒక్కసారి దేశంలోని, ప్రపంచంలోని బొగ్గు గనుల తవ్వకాలను పరిశీలించినట్లయితే- మన దేశంలో 600 మీటర్ల లోతు వరకు వెళ్లి బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. జర్మనీలాంటి దేశంలో వెయ్యి మీటర్ల లోతుకు వరకు తవ్వకాలు చేపడు తున్నారు. ఇదే విధానాన్ని మన దేశంలో అమలుచేసి ఉంటే ఇప్పుడున్న జీవిత కాలం మరోఇంత పెరిగే అవకాశమున్నది.

అయితే ఇందుకోసం నూతన టెక్నాలజీని ఉపయోగించాలి. ప్రస్తుతం దేశ బొగ్గు అవసరాలు 680 మిలియన్ టన్నులు. కానీ 550 మిలియన్ టన్నుల బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మరో 80 నుంచి 100 మిలియన్ టన్నుల వరకు ఆస్ట్రేలియా, ఇండోనేషియా లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. దీనివల్ల బొగ్గు రేటుతో పాటు దిగుమతి ఖర్చు కూడా భారీగా పెరిగిపోతున్నది. ఈ దుస్థితి నుంచి దేశం బయటపడాలంటే కచ్చితంగా ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించినంత గా సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే భూగర్భ గనులను కూడా ఇంకా తవ్వాలి. బొగ్గు ధర ను కూడా పెంచాలి. ప్రైవేటీకరణ నుంచి దూరంగా ఉంటూ ప్రభు త్వ రంగం లో ప్రధానంగా కోల్ ఇండియాలో ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకోవాలి.

పాలకులు, ముఖ్యంగా కార్మిక శాఖ, బొగ్గు శాఖకు చెందిన మంత్రులు, అధికారులు ఆ దిశన బొగ్గు సంస్థలను ముందుకు తీసుకు కృషి చేయాలి. చిత్తశుద్ధితో, నిజాయితీతో ఆయా ప్రాంతాల ప్రజావూపతినిధులు కొత్త బావులకు అనుమతులను ఇప్పించాలి... పర్యావరణ విధ్వంసం జరుగకుండా ఓపెన్‌కాస్ట్‌ల స్థానంలో భూగర్భ గనులను తవ్వే విధంగా చర్యలు చేపట్టాలి. నిర్వాసితుల పట్ల మానవీయకోణంలో ఆలోచించాలి. బొగ్గు తవ్వకాల వల్ల ఏర్ప డుతున్న పర్యావరణాన్ని కాలుష్యాన్ని తగ్గించడానికి ఆయా ప్రాంతాలలో పెద్ద ఎత్తున చెట్లు పెంచాలి. చట్టాలను తప్పకుండా అమలు చేయాలి. ప్రధానంగా జీవించే హక్కును కాలరా స్తున్న మైనింగ్ మాఫియాను అరికట్టాలి. భూమి కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగ అవకాశశాలను కల్పించాలి.

-ఎండీ. మునీర్
(నేడు బొగ్గుగని కార్మిక దినోత్సవం)

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Featured Articles