‘మానవరహిత’ యుద్ధం..


Sat,October 6, 2012 05:04 PM

మావోయిస్టుల వేటలో మానవరహిత విమానాలను వాడాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి రెండేళ్ల క్రితమే ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంలో ప్రయోగాత్మక పరీక్షలు చేసింది. దంతేవాడ జిల్లా చింతల్‌నార్‌లో మావోయిస్టులు చేసిన దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన నేపథ్యంలో మొదటిసారి 2010 ఏప్రిల్ 14న అమెరికా తయారీ టీ-హెచ్‌ఎంఏవీ రకం మానవ రహిత విమానాన్ని బస్తర్ అడవుల మీదుగా గంట ల పాటు తిప్పారు. విమానం పంపిన చిత్రాలు, వీడియో ఫుటేజీ ఆధారంగా మావోయిస్టుల స్థావరాలను, కదలికలను,మందుపాతరలను ఏ మేరకు గుర్తించవచ్చునో అంచనా వేశారు. ఫలితాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ‘రా’ ఆధ్వర్యంలో పనిచేసే జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ(ఎన్‌టీఆర్‌ఓ) వద్ద ఉన్న మరికొన్ని రకాల విమానాలను సైతం ఈ అడవులపై ప్రయోగించి చూశారు. ఇవేవీ దట్టంగా ఉన్న అడవిలో నక్సల్స్ కదలికలను పసిగట్టలేకపోయాయి. తర్వాత 2011 డిసెంబర్‌లో ఇజ్రాయెల్‌లో తయారైన హెరాన్ మానవ రహిత విమానాలను హైదరాబాద్‌లోని బేగంపేట విమానాక్షిశయం నుంచి ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, గడ్‌చిరోలి, ఏటూరు నాగారం అడవులపై పలుమార్లు ప్రయోగించి సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో హెరాన్ విమానాలను మావోయిస్టుల వేటకు ఉపయోగించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది.

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో ఉన్న ‘జంగిల్ వార్‌ఫేర్’ స్కూలు నుంచి, జగ్దల్‌పూర్ విమానాక్షిశయం నుంచి ఈ విమానాలు పనిచేస్తాయి. రాజమండ్రి సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న మధురపూడి విమానాక్షిశయంలో రూ 30 కోట్ల విలువ చేసే ఒక మానవ రహిత హెరాన్ విమానాన్ని మోహరిస్తున్నట్లు, దీని సహాయంతో విశాఖ ఏజెన్సీలోనూ, ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు(ఏఓబీ)వూపాంతంలోనూ మావోయిస్టుల ఆట కట్టించనున్నట్లు మన రాష్ట్ర డీజీపీ దినేష్‌డ్డి ప్రకటిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యుద్ధశాస్త్రంలో మానవ రహిత విమానాల యుగం నడుస్తోంది. ‘అన్‌మాన్‌డ్ ఏరియల్ వెహికిల్’ (యుఏవీ) లేదా ‘డ్రోన్’గా పిలిచే ఈ విమానాలను మొదట 1916లో అమెరికా కనుగొన్నది. ప్రాబల్య శక్తులుగా ఉన్న అనేక దేశాలు ప్రస్తుతం ఈ విమానాలను తయారుచేస్తున్నప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్‌లు ఈ రంగంలో పేరుపొందాయి. ఈ విమానాలు నాలుగువేల నుంచి 40 వేల అడుగుల ఎత్తు వరకు జెట్ ఇంజిన్ సాయంతో ఆకాశంలో ఎగురుతూ వాటిలో అమర్చిన ఇన్‌ఫ్రా రెడ్ కెమెరాలు, రాడార్లు, సెన్సర్లు, స్కానర్ల సాయంతో శత్రువు గురించిన సమాచారాన్ని లైవ్‌గా గ్రౌండ్ స్టేషన్‌కు పంపిస్తాయి. లక్ష్యాల ధ్వంసానికి క్షిపణులు, బాంబులను ప్రయోగించే మాన వ రహిత విమానాలను అన్‌మాన్‌డ్ కంబాట్ ఏరియల్ వెహికిల్ (యుసీఏవీ) అనీ, టార్గెట్ తో పాటు తామూ ధ్వంసమయ్యే విమానాలను ‘కమికాజె’లనీ, అతి తక్కువ బరువు కలిగిన తేలికరకం విమానాలను మైక్రో ఏరియల్ వెహికిల్ (ఎంఏవీ) అనీ, తక్కువ ఎత్తులో ఎక్కువ కాలం గాలిలో ఎగిరే రకాలను ‘మేల్’ (మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూన్స్)లనీ వ్యవహరిస్తున్నారు.

1999లో కార్గిల్ యుద్ధానంతరం మన దేశం మానవ రహిత విమానాల ఆవశ్యకతను గుర్తించింది. పార్లమెంటు భవనంపై 2002లో ఉగ్రవాదులు చేసిన దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి వంద సెర్చర్, హెరాన్ రకం యుఏవీలను, హార్పీ, హరోప్ రకం కమికాజెలను కొనుగోలు చేసింది. ఆ దేశ సహకారంతో మన రక్షణశాఖ ఆధ్వర్యంలో పనిచేసే డీఆర్‌డీఓ లక్ష్య, నిశాంత్, రుస్తోం, పవన్, గగన్ వంటి పలు రకాల యుఏవీలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. భారత సైన్యాన్ని అవసరాలకు దీటుగా ఆధునీకరించేందుకు వచ్చే 12 ఏళ్లలో 10 లక్షలకోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం తలపెట్టగా ఈ మొత్తంలో అధిక భాగాన్ని మానవరహిత విమానాల కొనుగోలుకు, అభివృద్ధికి కేటాయించారు. ప్రస్తుతం భారత వైమానిక దళం వంద సెర్చర్ యుఏవీలతో పాక్, చైనా, నేపాల్, బర్మా, బంగ్లా సరిహద్దుల్లో సమాచార సేకరణ, నిఘా కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది.12వ పంచవర్ష ప్రణాళిక ముగిసే నాటికి జమ్మూ-కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రతి బెటాలియన్ ఆధీనంలోనూ ఓ ఎంఏవీ ఉండేలా ప్రతిపాదనలు రూపొందించింది.

యుఏవీలను ఉపయోగించి పాక్-అఫ్ఘాన్ సరిహద్దుల్లో తాలిబన్, అల్ ఖాయిదా ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడంలో అమెరికా సాధించిన విజయాలు నక్సల్స్ వేటలో మానవ రహిత విమానాలను వినియోగించవచ్చన్న ఆలోచనలకు బీజం వేశాయి. ‘బహుళజాతి’ మిత్రులు మన్మోహన్, చిదంబరానికి ఇది సహజంగానే ఉత్సాహపరచింది. ఖనిజ వనరులు అధికంగా గల మధ్య భారత అడవుల్లో ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ప్రారంభించాడు. అది అనుకున్న ఫలితాలను సాధించకపోగా మావోయిస్టుల దాడుల్లో భారీ సంఖ్యలో జవాన్లను కోల్పోతుండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో యుఏవీల మోహరింపునకు తెరతీశాడు. శత్రు దేశాల బలగాలపై ప్రయోగించాల్సిన అస్త్రాన్ని తన స్వంత ప్రజలపై సంధించడానికి సిద్ధపడ్డాడు. ఈ విమానాలను నక్సల్స్ సమాచార సేకరణకే కాకుండా అవసరమైతే వారి స్థావరాలపై బాంబు దాడులు చేయడానికి కూడా వాడుకోవాలని ఆయన వాదించినట్లు, అందు కు కేబినెట్ కమిటీ నిరాకరించినట్లు సమాచారం. గ్రీన్‌హంట్‌లో భాగంగా సైన్యాన్ని దింపడాన్ని గతంలో వ్యతిరేకించిన త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి ఆంటోనీ తదితరులు యుఏవీలను దాడుల కోసం వాడవద్దని, ప్రస్తుతానికి సమాచార సేకరణకు మాత్రమే పరిమితం చేయాలని షరతు విధించినట్లు తెలుస్తోంది.

ప్రిడేటర్ యుఏవీలతో తాలిబన్-అల్‌ఖాయిదా స్థావరాలపై అమెరికా చేసిన దాడుల్లో ఉగ్రవాదులే కాకుండా వేలాదిమంది ప్రజలు చనిపోయారు. 40వేల అడుగుల ఎత్తున విహరించే విమానం నేలపై సంచరించే మానవుల్లో ఉగ్రవాదులు ఎవ రు? మామూలు పౌరులు ఎవరన్న విషయంలో స్పష్టమైన సమాచారం అందించే అవకాశం లేదు. డాటాను విశ్లేషించే సిబ్బంది ఏమాత్రం పొరబడినా సామాన్య ప్రజ లు సమిధలుగా మారతారు. 2011 డిసెంబర్ రెండవ వారంలో దంతేవాడలో జరిగిన ఓ ఘటన మన భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరిస్తుంది. పరీక్ష కోసం పంపిన యుఏవీ జిల్లాలోని తెరివాల్ గ్రామ పరిసర అడవుల్లో మావోయిస్టుల క్యాంపు ఉన్నట్లు గుర్తించింది. కొన్ని గుడిసెలు, టెంట్లు ఉన్నాయని, ఎక్కువ సంఖ్యలో మనుషులు తిరుగుతున్నారని అది పంపిన విజువల్స్ ఆధారంగా అంచనా వేశారు. ఈ సమాచారం ఆధారంగా కొన్ని బలగాలను హుటాహుటిన కాలిదారిన పంపిన అధికారులు హెలికాప్టర్లలో కమాండోలను సైతం రంగంలో దించారు. తీరా అక్కడకు వెళ్లిచూస్తే అదో ఆదివాసీ గ్రామం. రాబోవు కాలంలో నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో ఏం జరగబోతోందో ఈ ఘటన మనకు తెలియజెబుతుంది. ఉద్యమాల అణచివేత పేరిట, ఉగ్రవాద నిర్మూలన పేరిట దేశంలోని వివి ధ ప్రాంతాల్లో సైనిక, పారామిలిటరీ, పోలీసు బలగాలు చేబట్టిన చర్యలన్నింటిలోనూ అకృత్యాలు, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. ఉద్యమకారుల చేతుల్లో ప్రభుత్వ బలగాలు దెబ్బతిన్నప్పుడల్లా మామూ లు ప్రజలు సమిధలు కావడమూ మనకు తెలుసు. సింగారం,గోంపాడు,సింగనమడుగులో ఇదే జరిగింది. కాశ్మీర్‌లో, ఈశాన్యంలోను ఇలాంటి ఎన్నో ఘటన లు జరిగాయి. గ్రీన్‌హంట్‌లో భాగంగా ఆగస్టు 10, 2009 నుంచి డిసెంబర్ 31, 2010 వరకు ఒక్క దండకారణ్యంలోనే 11 మంది నిరాయుధులు ప్రభుత్వ బలగాల చేతిలో ప్రాణాలు కోల్పోయారని పౌరహక్కుల సంఘాల నివేదికలు చెబుతున్నాయి.

యుక్తాయుక్త విచక్షణ కలిగిన మానవమావూతులు పాల్గొంటున్న చర్యల్లోనే పరిస్థితి ఇలా ఉంటే యంత్రా లు ఇచ్చిన సమాచారంతో హెలికాప్టర్లలో వెళ్లిన బలగాలు విచక్షణారహితంగా జరిపే కాల్పులు ఎలాంటి ఉల్లంఘనలకు దారితీస్తాయో, ఎందరిని బలి తీసుకుంటాయో!మధ్యభారతంలో అపారంగా నిక్షిప్తమై ఉన్న ఖనిజనిల్వలను బహుళజాతి కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టే క్రమానికి అడ్డుపడుతున్న విప్లవోద్యమం లక్ష్యంగా ప్రస్తుత యూపీ ఏ ప్రభుత్వం పనిచేస్తున్నది. మన్మోహన్ వ్యాఖ్యలనైనా, చిదంబరం చేతలనైనా, గ్రీన్‌హంట్ లక్ష్యాలనైనా మనం ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాల్సివుంటుంది. ఒక్క దండకారణ్యంలోనే 60వేల పారా మిలిటరీ బలగాలను దించినా, వైమానిక దళ సేవలను వినియోగించుకున్నా, శిక్షణ పేరుతో సైన్యాన్ని దించినా సాధించలేని ఫలితాలను మానవ రహిత విమానాల ద్వారా సాధిస్తామనుకోవడం భ్రమే. ప్రజల మద్దతు ఉన్నంతవరకు మావోయిస్టుల కార్యకలాపాలను నియంవూతించడం ఎవరి తరమూ కాదు. ప్రజల అవసరాలను, ఆకాంక్షలను పట్టించుకుని, వారెదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించాలి. అణచివేతకు కేటాయించే నిధులను ఆదివాసీల అభివృద్ధికి ఖర్చు చేయాలి. ప్రజల ఆకలి పోరాటాన్ని ఆయుధంతో కాకుండా అన్నం,అభివృద్ధితో పరిష్కరించాలి.

-డి. మార్కండేయ
dmknamaste@gmail.com

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ

Published: Sat,October 6, 2012 05:03 PM

సిరియాపై అమెరికా ‘ఉక్షిగ’నేత్రం..

అఫ్ఘనిస్తాన్.. ఇరాక్.. లిబియా.. ఇరాన్.. ఉత్తర కొరియా.. అమెరికా ఆగ్రహానికి గురైన దేశాల జాబితాలో తాజాగా సిరియా చేరింది. తనకు నచ్చితే

Published: Sat,October 6, 2012 05:03 PM

ఆ సంతోషాలు మనకెప్పుడు..?

ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ సంతోష సూచికను విడుదల చేసింది. ఇప్పటివరకూ మానవాభివృద్ధి సూచికను మాత్రమే ప్రతియేటా విడుదల చేస్తూ వస్తున

Published: Sat,October 6, 2012 05:03 PM

నక్సలిజంపై ‘కార్పొరేట్’ వార్..

నక్సలిజాన్ని అంతమొందించడంలో బహుళజాతి కంపెనీల సాయం పొందాలని కేంద్రం నిర్ణయించింది. మొన్నటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ

Published: Sat,October 6, 2012 05:04 PM

పేదరికం..అంకెల గారడీ..

దేశంలో ఎంత మంది పేదలున్నారన్న విషయంపై ఇటీవల ఉభయ సభల్లో పెద్ద దుమారం చెలరేగింది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ. 22. 42, పట్టణవూపాంతంల

Published: Sat,October 6, 2012 05:05 PM

స్వార్థం.. ఉద్యమాలపై అస్త్రం..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా ఎస్‌పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్

Published: Sat,October 6, 2012 05:05 PM

కూడంకుళం.. కుట్ర ఎవరిది?

కూడంకుళం.. ఈ పేరు ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. రష్యా సహకారం తో ₹ 17 వేల కోట్లతో తమిళనాడు కోస్తా తీరంలో ఉన్న ఈ గ్రామంలో చేపట్టి

Published: Sat,October 6, 2012 05:05 PM

‘బూర్జువా’ సైన్యంలో మావోయిస్టులు!

ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా జరగని అద్భుతం ఇప్పుడు నేపాల్‌లో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దం పాటు ఒకరినొకరు చంపుకునే పనిలో నిమగ్నమై కనీసం 13

Published: Sat,October 6, 2012 05:07 PM

రాష్ట్రాల హక్కులపై ‘ఉగ్ర’ కేంద్రం..

టెర్రరిస్టు కార్యకలాపాలను సమర్థవంతంగా అణచివేసే ఉద్దేశంతో జాతీ య ఉగ్రవాద వ్యతిరేక కేంద్రాన్ని (ఎన్‌సీటీసీ) ఏర్పాటుచేస్తూ ఫిబ్రవరి 3

Published: Sat,October 6, 2012 05:06 PM

నల్లధనం.. ‘తెల్ల’ బతుకులు..

బారతీయులకు చెందిన సుమారు 25 లక్షల కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువవున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ వెల్లడించా

Published: Sat,October 6, 2012 05:06 PM

తాగునీటి పరాయీకరణ..

పీల్చే గాలి లాగే తాగే నీరూ ఉచితమనుకుంటున్న వారికి దుర్వార్త. మినరల్ వాటర్ పేరుతో ఇప్పటికే నీటిని అమ్మకపు సరుకుగా మార్చి దండి గా

Published: Sat,October 6, 2012 05:06 PM

ఈశాన్య భారతంలో విప్లవం

జాతుల తిరుగుబాట్లకు ప్రసిద్ధిగాంచిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా మావోయిస్టుల రంగవూపవేశంతో మరోసారి వేడెక్కాయి. దశాబ్దాలుగా సాయు ధ ఉద్యమ

Published: Mon,July 15, 2013 05:26 PM

బాలలు.. హక్కులు.. చట్టాలు..

ప్రవాస భారతీయులు అనురూప్, సాగరిక భట్టాచార్యల పిల్లల కస్టడీ వ్యవహారంతో బాలల హక్కులు, చట్టాలపై మరోమారు చర్చ మొదలైంది. నార్వేలో భూవిజ

Published: Mon,July 15, 2013 05:25 PM

‘ఆధార్’ గందరగోళం..

పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులందించే ‘ఆధార్’ ప్రాజెక్టు అనిశ్చితస్థితిలో పడింది. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని టెంభ్

Published: Sat,October 6, 2012 05:08 PM

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు

ప్రపంచ పోలీసు అమెరికా తాజాగా ఇరాన్‌పై కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, పొర

Published: Sat,October 6, 2012 05:07 PM

పోస్కోపై పోరాటం..

అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మూలవాసుల బతుకులను ఆగం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా వర్తమానంలో కొనసాగుతున్న ఉద్యమాల్లో పోస్

Published: Sat,October 6, 2012 05:07 PM

పౌరులపై ‘సాయుధ’చట్టం!

ఇరోం షర్మిల చాను.. ఈ పేరు వినని వారు అరుదు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ 2000 నవంబర్ 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ

Published: Sat,October 6, 2012 05:08 PM

శ్రీలంక పాలకులకు టైగర్ ఫోబియా

మన పొరుగున ఉన్న శ్రీలంక పాలకులకు ప్రస్తుతం టైగర్ల భయం పట్టుకున్నది. రెండున్నర దశాబ్దాల పాటు ఎల్‌టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్

Published: Sat,October 6, 2012 05:08 PM

అమెరికాలో నయా బానిసలు..

ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికాలో సరికొత్త వ్యాపారం వర్ధిల్లుతోంది. జైళ్ల లో ఉండే ఖైదీలను కట్టుబానిసలుగా మార్చి బహుళజాతి కంపెనీ

Featured Articles