‘బూర్జువా’ సైన్యంలో మావోయిస్టులు!


Sat,October 6, 2012 05:05 PM

ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా జరగని అద్భుతం ఇప్పుడు నేపాల్‌లో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దం పాటు ఒకరినొకరు చంపుకునే పనిలో నిమగ్నమై కనీసం 13వేల ప్రాణాలు బలికావడానికి కారణమైన వైరి పక్షాలు త్వర లో ఒకే సంస్థలో కదం కదం కలిపి దేశరక్షణ విధులను నిర్వర్తించబోతున్నాయి. యునిఫైడ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(మావోయిస్టు) నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)కి చెందిన తొమ్మిది వేల మందికి పైగా గెరిల్లా సైనికులు ప్రభుత్వ సైన్యంలో భాగమయ్యే ప్రక్రియ ఇటీవల అక్కడ మొదలైంది. ఇందుకోసం ఏర్పరచిన ఆర్మీ ఇంటిక్షిగేషన్ స్పెషల్ కమిటీ మావోయిస్టు గెరిల్లాలకు మూడు ఆప్షన్లనిచ్చింది. ప్రభుత్వ సైన్యంలో చేరడం, స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడం, పునరావాస ప్యాకేజీ పొందడం.. మొత్తం 16వేల 92 మంది గెరిల్లాల్లో 9వేల 690 మంది సైన్యంలో చేరడానికి నిశ్చయించుకోగా, ఏడువేల 26 మంది పదవీ విరమణకు ఇష్టపడ్డారు. ఆరుగురు మాత్రం పునరావాస ప్యాకేజీ వైపు మొగ్గుచూపారు. పదవీ విరమణను ఎంచుకున్న వారికి చెక్కుల పంపిణీ కార్యక్షికమం గత నెల 11న ముగియగా పునరావాస ప్యాకేజీని ఎంచుకున్న ఆరుగురికి కూడా జీవనోపాధి కల్పించారు.

ప్రభుత్వ బలగాల్లో చేరడానికి నిర్ణయించుకున్న గెరిల్లాలకు పోస్టింగ్ ఇచ్చే క్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. మావోయిస్టులకు అఖిల పక్షాల కు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ గెరిల్లాల కోసం నేపాల్ సైన్యంలో ఒక ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పరుస్తారు. పీఎల్‌ఏకు చెందిన వ్యక్తికి బ్రిగేడియర్ లేదా కల్నల్ హోదా కల్పించి ఈ డైరెక్టరేట్‌కు అధిపతిని చేస్తారు. వివిధ స్థాయిల్లో ఉన్న ఇతర కమాండర్లకు కూడా తగిన ర్యాంకులు కల్పిస్తారు. ప్రస్తుతానికి వీరిని అభివృద్ధి ప్రాజెక్టుల పర్యవేక్షణకు, పరిక్షిశమల భద్రతకు, అడవుల రక్షణకు ఉపయోగిస్తూ భవిష్యత్తులో పూర్తి స్థాయి సైనికులుగా ఉపయోగించుకుంటారు.

తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని భూస్వాములు, పెట్టుబడిదారులపై వర్గపోరు కొనసాగించిన మావోయిస్టులు ‘బూర్జువా’ సైన్యంలో భాగమయ్యే క్రమానికి పెద్ద చరిత్రే ఉంది. మొన్నటి వరకు రాచరిక పాలనలో మగ్గిన నేపాల్‌లో 1940లలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఉద్యమాలు మొదలయ్యాయి. ఉద్యమ జోరుకు అప్పటి రాజు త్రిభువన్ తలొగ్గి ప్రజాస్వామిక ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించినా అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. 1959 - 9 వరకు పార్టీ రహిత ‘పంచాయితీ’ పద్ధతిలో ఎన్నికలు జరుగుతూ రాజ్యాంగబద్ధ రాచరిక పాలన కొనసాగింది. 1990లో నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరోసారి ఉద్యమం తీవ్రతరం కాగా త్రిభువన్ మనుమడు బీరేం ద్ర రాజ్యాంగ సంస్కరణలకు అంగీకరించి బహుళ పక్ష పార్లమెంటరీ పద్ధతిలో పాలన సాగించడానికి ఒప్పుకున్నారు. అయితే, 1991-200 వరకు 17 ఏళ్ల కాలం లో 13 ప్రభుత్వాలు మారి వరుస రాజకీయ సంక్షోభాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది.

నేపాలీ ఫ్యూడల్ సమాజంలో నెలకొన్న దోపిడీ, అణచివేత, నిరంకుశత్వాలపై పోరాడే లక్ష్యంతో 1994లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(మావోయిస్టు) ఏర్పడిం ది. 1996 ఫిబ్రవరి 13 నుంచి నూతన ప్రజాస్వామిక విప్లవ కోసం దేశవ్యాప్తంగా ప్రజాయుద్ధాన్ని ప్రారంభించింది. రాజు నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించింది. ప్రజాస్వామ్య ఉద్యమాల పేరి ట పోరు సలుపుతూ అవకాశవాద పద్ధతుల్లో ప్రభుత్వాలనేర్పరుస్తున్న బూర్జువా పార్టీల డొల్లతనాన్ని బయటపెట్టింది. వరుస సంక్షోభాలకు కారణం ఈ పార్టీలేనని ప్రకటించి నిజమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రజాయుద్ధం ద్వారానే సాధ్యమని చాటిచెప్పింది. యువతను పీపుల్స్ లిబరేష న్ ఆర్మీలో పెద్దయెత్తున చేరి రాచరికాన్ని అంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చింది. నేపాలీలు మావోయిస్టుల పిలుపునకు సానుకూలంగా స్పందించా రు.

2004కల్లా ఖాట్మండూ లాంటి నగరాలు, పెద్ద పట్టణాలు తప్ప మిగతా ప్రాం తాలన్నీ గెరిల్లా బలగాల వశమయ్యాయి. ఆరంభంలో రెండు మూడు ప్లాటూన్లుగా ఉండిన పీఎల్‌ఏ కంపెనీలుగా, బెటాలియన్లుగా అభివృద్ధి చెంది ప్రభుత్వ బలగాలను కంటోన్మెంట్‌లకే పరిమితంచేసే స్థాయికి ఎదిగింది. విప్లవ శక్తులను కట్టడిచేయడంలో నిస్సహాయుడైన రాజు జ్ఞానేంద్ర 2005 ఫిబ్రవరి 1న ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా ప్రభుత్వాన్ని రద్దు చేసి అన్ని అధికారాలు తన చేతిలోకి తెచ్చుకున్నాడు. ఫలితంగా మరోసారి ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమానికి తెరలేచింది. ఈ ఉద్యమాన్ని విప్లవోద్యమంతో మేళవించే ఎత్తుగడలను చేపట్టిన మావోయిస్టు పార్టీ చైర్మన్ ప్రచండ అలియాస్ పుష్పకుమార్ దహల్ తమ పంథాను మార్చుకుని సెప్టెంబర్‌లో ఏకపక్ష కాల్పుల విరమణను ప్రకటించారు. ఉద్యమంలో కల్సిరావాల్సిందిగా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. అటు మావోయిస్టుల సాయుధపోరు, ఇటు అఖిలపక్షాల చట్టబద్ధ ఉద్యమం కలిసి లోక్‌తాంవూతిక్ ఆందోళన్‌గా ఉప్పెనలా ఎగిసింది. చివరకు, 2006 ఏప్రిల్ 24న జ్ఞానేంద్ర దిగివచ్చి తన సార్వభౌమాధికారాన్ని వదులుకుంటున్నట్లు, ప్రతినిధుల సభను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ పరిణామాన్ని నేపాల్ సుదీర్ఘ రాజకీయ చరివూతలో కీలక మలుపుగా భావించవచ్చు. పునరుద్ధరించిన ప్రతినిధుల సభ ఆ వెంటనే రాజు అధికారాలకు కత్తెర వేస్తూ తీర్మానించింది. దేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. జీ పీ కోయిరాలా నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది. కొత్త రాజ్యాంగాన్ని లిఖించడం కోసం కానిస్టిట్యూషనల్ అసెంబ్లీ (రాజ్యాంగ సభ) ఏర్పాటుచేసి వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. మరోవైపు 2006 సెప్టెంబర్ 21న కోయిరాలా ప్రభుత్వంతో సమగ్ర శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన మావోయిస్టులు ప్రజాస్వా మ్య ప్రక్రియలో భాగం కావడానికి అంగీకరించారు. పదేళ్ల అంతర్యుద్ధం ముగిసిందని, మావోయిస్టులు ఇక సాయుధపోరును విరమించి పార్లమెంటరీ బాటలో విప్ల వ విజయానికి కృషి చేస్తారని ప్రచండ ప్రకటించారు. 17 వేల బలగాలున్న పీపుల్స్ లిబరేషన్‌ఆర్మీ ఫార్మేషన్లను ‘ఐక్యరాజ్యసమితి-నేపాల్ మిషన్’ ఆధ్వర్యంలో ప్రత్యేక కంటోన్మెంట్లలో ఉంచడానికి, వారికి నెలవారీ భత్యాలను చెల్లించడానికి నిర్ణయమైంది. కోయిరాలా సర్కారులో మావోయిస్టు నేతలు మంత్రులుగా చేరారు.
తదనంతరం 200 ఏప్రిల్ 10న రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 575 సీట్లకు గాను 220 సీట్లు సాధించి మావోయిస్టులు అతి పెద్ద పార్టీగా నిలిచా రు. 601 మంది సభ్యులతో మేలో సమావేశమైన సభ కొన్ని చారివూతాత్మక నిర్ణయాలు చేసింది. 597-4 మెజారిటీతో రాచరికానికి చరమగీతం పాడి దేశాన్ని ఫెడరల్ రిపబ్లిక్‌గా ప్రకటించింది. రాజు స్థానంలో జూలై 23న నేపాలీ కాంగ్రెస్‌కు చెంది న రాంభరణ్ యాదవ్‌ను దేశాధ్యక్షునిగా ఎన్నుకుంది. మూడు నెలల పాటు అనిశ్చితి కొనసాగిన అనంతరం ఆగస్టు 15న మావోయిస్టు చైర్మన్ ప్రచండ ప్రధానిగా సీపీఎన్(యూఎంఎల్)తో కల్సి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.

అయితే, ఆర్మీ చీఫ్ తొలగింపు వివాదం నేపథ్యంలో ప్రచండ ప్రభుత్వం కేవలం తొమ్మిది నెలల్లోనే కుప్పకూలింది. తర్వాత పగ్గాలు చేపట్టిన మిగతా పార్టీల ప్రభుత్వాలు కూడా ఎక్కు వ కాలం నిలదొక్కుకోలేకపోయాయి. రెండేళ్లలో రెండు ప్రభుత్వాలు మారి శాంతి ప్రక్రియకు విఘాతమేర్పడే వాతావరణంలో చివరకు 2011 ఆగస్టు 2న మరోసారి రాజ్యాంగసభ మావోయిస్టులవైపే మొగ్గుచూపింది. మదేశీ పార్టీల కూటమి సహకారంతో యూసీపీఎన్ (ఎం) వైస్‌చైర్మన్ బాబూరామ్ భట్టరాయ్ నేపాల్ 36వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రెండు నెలలకు నవంబర్ 1న ప్రధాన పక్షాలైన నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్క్సిస్టు-పూనినిస్టు)లకు, మావోయిస్టులకు మధ్య చారివూతాత్మక ఏడు సూత్రాల ఒప్పందం జరిగింది. మావోయిస్టు పీఎల్‌ఏ గెరిల్లాలను నేపాల్ సైన్యం లో చేర్చుకోవడం, వీలైనంత త్వరగా అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని లిఖించి, సార్వవూతిక ఎన్నికలు జరిపి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఇందులోని ముఖ్యాంశాలు. ఈ ఒప్పందం వెలుగులోనే ప్రస్తుతం నేపాలీ రాజకీయాలు నడుస్తున్నాయి.

మావోయిస్టుల పార్లమెంటరీ ప్రవేశాన్ని, విప్లవ గెరిల్లా యోధులకు ‘బూర్జువా’ సైనిక పోస్టింగులను పలువురు వ్యతిరేకించారు. పార్టీ లోపల సైతం వూపచండ పంథాను వ్యతిరేకించే ఓ బలమైన వర్గం ఉంది. వైస్ చైర్మన్ మోహ న్ వైద్య, ప్రధాన కార్యదర్శి రాంబహదూర్ థాపా సీసీ సమావేశాల్లో ప్రచండ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.అంతర్యుద్ధ కాలంలో మావోయిస్టుల నాయకత్వంలో ఆక్రమించిన భూములకు పట్టాలిచ్చే చట్టాన్ని ఆమోదించే విషయంలో రాజీ వైఖరి అవలంబిస్తున్నారం టూ ప్రచండపై, ప్రధాని బాబూరామ్‌పై అతివాద వర్గం విరుచుకుపడింది. విప్లవ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి విలాస జీవితానికి అలవాటుపడ్డారని ఆరోపించింది.

మావోయిజానికి నిజమైన వారసులమని చెప్పుకుంటున్న వివిధ దేశాల విప్లవ పార్టీలు నేపాలీ మావోయిస్టుల పంథాను వ్యతిరేకిస్తున్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సైతం ప్రచండ పంథాను తూర్పారపట్టింది. గొప్ప విజయాలు సాధించిన నేపాలీ మావోయిస్టులు నూతన ప్రజాప్వామిక విప్లవాన్ని సామ్రాజ్యవాద శక్తులకు తాకట్టు పెట్టారని విమర్శించింది. విముక్తి ప్రాంతాలను వదిలేసి, ప్రజాసైన్యాన్ని నిరాయుధం చేసి ప్రభుత్వ బలగాల్లో కలిపేయడం అక్కడి ప్రజలకు ద్రోహం చేయడమేనని వ్యాఖ్యానించింది. మితవాద అవకాశవాద రాజకీయాల ప్రచండ పంథాను నిర్ద్వంద్వంగా తిరస్కరించి పోరుబాటను కొనసాగించాల్సిందిగా నేపాల్ విప్లవ శ్రేణులకు పిలుపునిచ్చింది.

విముక్తి ప్రాంతాలను వదిలి ప్రభుత్వ సైన్యంలో చేరడం ద్వారా సరికొత్త ప్రయోగానికి తెరతీసిన నేపాలీ మావోయిస్టు గెరిల్లాల భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. నూతన ప్రజాస్వామ్యాన్ని 21వ శతాబ్దపు బహుళ పార్టీ ప్రజాస్వామ్యం గా ప్రవచించడం ద్వారా ఎన్నికల్లో పాల్గొని అధికారం చేపట్టిన ప్రచండ పంథా నిజంగా కార్మికవర్గ విప్లవాన్నే తెచ్చిపెడుతుందో లేక మన దేశంలో సీపీఐ, సీపీఎంలలాగా రోజురోజుకు ప్రాభవం కోల్పోతూ ఓట్లకోసం, సీట్లకోసం ప్రాకులాడే పరిస్థితికి దారితీస్తుందో కాలమే సమాధానమివ్వగలదు.

-డి. మార్కండేయ
dmknamaste@gmail.com

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ

Published: Sat,October 6, 2012 05:03 PM

సిరియాపై అమెరికా ‘ఉక్షిగ’నేత్రం..

అఫ్ఘనిస్తాన్.. ఇరాక్.. లిబియా.. ఇరాన్.. ఉత్తర కొరియా.. అమెరికా ఆగ్రహానికి గురైన దేశాల జాబితాలో తాజాగా సిరియా చేరింది. తనకు నచ్చితే

Published: Sat,October 6, 2012 05:03 PM

ఆ సంతోషాలు మనకెప్పుడు..?

ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ సంతోష సూచికను విడుదల చేసింది. ఇప్పటివరకూ మానవాభివృద్ధి సూచికను మాత్రమే ప్రతియేటా విడుదల చేస్తూ వస్తున

Published: Sat,October 6, 2012 05:03 PM

నక్సలిజంపై ‘కార్పొరేట్’ వార్..

నక్సలిజాన్ని అంతమొందించడంలో బహుళజాతి కంపెనీల సాయం పొందాలని కేంద్రం నిర్ణయించింది. మొన్నటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ

Published: Sat,October 6, 2012 05:04 PM

‘మానవరహిత’ యుద్ధం..

మావోయిస్టుల వేటలో మానవరహిత విమానాలను వాడాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి రెండేళ్ల క్రితమే ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంల

Published: Sat,October 6, 2012 05:04 PM

పేదరికం..అంకెల గారడీ..

దేశంలో ఎంత మంది పేదలున్నారన్న విషయంపై ఇటీవల ఉభయ సభల్లో పెద్ద దుమారం చెలరేగింది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ. 22. 42, పట్టణవూపాంతంల

Published: Sat,October 6, 2012 05:05 PM

స్వార్థం.. ఉద్యమాలపై అస్త్రం..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా ఎస్‌పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్

Published: Sat,October 6, 2012 05:05 PM

కూడంకుళం.. కుట్ర ఎవరిది?

కూడంకుళం.. ఈ పేరు ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. రష్యా సహకారం తో ₹ 17 వేల కోట్లతో తమిళనాడు కోస్తా తీరంలో ఉన్న ఈ గ్రామంలో చేపట్టి

Published: Sat,October 6, 2012 05:07 PM

రాష్ట్రాల హక్కులపై ‘ఉగ్ర’ కేంద్రం..

టెర్రరిస్టు కార్యకలాపాలను సమర్థవంతంగా అణచివేసే ఉద్దేశంతో జాతీ య ఉగ్రవాద వ్యతిరేక కేంద్రాన్ని (ఎన్‌సీటీసీ) ఏర్పాటుచేస్తూ ఫిబ్రవరి 3

Published: Sat,October 6, 2012 05:06 PM

నల్లధనం.. ‘తెల్ల’ బతుకులు..

బారతీయులకు చెందిన సుమారు 25 లక్షల కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువవున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ వెల్లడించా

Published: Sat,October 6, 2012 05:06 PM

తాగునీటి పరాయీకరణ..

పీల్చే గాలి లాగే తాగే నీరూ ఉచితమనుకుంటున్న వారికి దుర్వార్త. మినరల్ వాటర్ పేరుతో ఇప్పటికే నీటిని అమ్మకపు సరుకుగా మార్చి దండి గా

Published: Sat,October 6, 2012 05:06 PM

ఈశాన్య భారతంలో విప్లవం

జాతుల తిరుగుబాట్లకు ప్రసిద్ధిగాంచిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా మావోయిస్టుల రంగవూపవేశంతో మరోసారి వేడెక్కాయి. దశాబ్దాలుగా సాయు ధ ఉద్యమ

Published: Mon,July 15, 2013 05:26 PM

బాలలు.. హక్కులు.. చట్టాలు..

ప్రవాస భారతీయులు అనురూప్, సాగరిక భట్టాచార్యల పిల్లల కస్టడీ వ్యవహారంతో బాలల హక్కులు, చట్టాలపై మరోమారు చర్చ మొదలైంది. నార్వేలో భూవిజ

Published: Mon,July 15, 2013 05:25 PM

‘ఆధార్’ గందరగోళం..

పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులందించే ‘ఆధార్’ ప్రాజెక్టు అనిశ్చితస్థితిలో పడింది. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని టెంభ్

Published: Sat,October 6, 2012 05:08 PM

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు

ప్రపంచ పోలీసు అమెరికా తాజాగా ఇరాన్‌పై కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, పొర

Published: Sat,October 6, 2012 05:07 PM

పోస్కోపై పోరాటం..

అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మూలవాసుల బతుకులను ఆగం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా వర్తమానంలో కొనసాగుతున్న ఉద్యమాల్లో పోస్

Published: Sat,October 6, 2012 05:07 PM

పౌరులపై ‘సాయుధ’చట్టం!

ఇరోం షర్మిల చాను.. ఈ పేరు వినని వారు అరుదు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ 2000 నవంబర్ 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ

Published: Sat,October 6, 2012 05:08 PM

శ్రీలంక పాలకులకు టైగర్ ఫోబియా

మన పొరుగున ఉన్న శ్రీలంక పాలకులకు ప్రస్తుతం టైగర్ల భయం పట్టుకున్నది. రెండున్నర దశాబ్దాల పాటు ఎల్‌టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్

Published: Sat,October 6, 2012 05:08 PM

అమెరికాలో నయా బానిసలు..

ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికాలో సరికొత్త వ్యాపారం వర్ధిల్లుతోంది. జైళ్ల లో ఉండే ఖైదీలను కట్టుబానిసలుగా మార్చి బహుళజాతి కంపెనీ