రాష్ట్రాల హక్కులపై ‘ఉగ్ర’ కేంద్రం..


Sat,October 6, 2012 05:07 PM

టెర్రరిస్టు కార్యకలాపాలను సమర్థవంతంగా అణచివేసే ఉద్దేశంతో జాతీ య ఉగ్రవాద వ్యతిరేక కేంద్రాన్ని (ఎన్‌సీటీసీ) ఏర్పాటుచేస్తూ ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ పర్యవేక్షణలో సర్వస్వతంవూతంగా పనిచేసే ఈ కేంద్రానికి ఉగ్రవాదు ల కార్యకలాపాలపై గూఢచర్యం నెరపడంతో పాటు దేశంలో ఎక్కడైనా సోదాలు చేసే, ఎవరినైనా అరెస్టు చేసే అధికారాలను కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి, ప్రజాస్వామిక విలువలకు విరుద్ధమని పలువురు విమర్శించారు. ఉగ్రవాద నిర్మూలన పేరుతో రాష్ట్రాల అధికారాలను కబళించే ప్రయత్నాలను తాము సహించబోమని కాంగ్రేసేతర పార్టీలకు చెందిన ముఖ్యమంవూతులు హెచ్చరించారు. ఉగ్రవాద నిర్మూలనకు తాము వ్యతిరేకం కాదని, తమను ఏమాత్రం సంప్రదించకుండా కేంద్రం ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం అన్యాయమని వారు ఆరోపించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం చర్యను వ్యతిరేకించిన వారిలో యూపీఏ కూటమికి చెందిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు బీహార్, ఒరిస్సా, మధ్యవూపదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్నాటక, జార్ఖండ్, హిమాచల్‌వూపదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంవూతులు ఉన్నారు. ఈ వ్యతిరేకత నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రతినిధుల తో సంప్రదించి వారు ఆమోదించిన తర్వాతే నోటిఫికేషన్‌ను అమలు చేస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ఉగ్రవాదంపై కేంద్రం పని చేయడం ఆరంభించే మార్చి 1వ తేదీ లోపలే ఈ సంప్రదింపుల ప్రక్రియను ముగించాల్సిందిగా హోం మంత్రి చిదంబరానికి సూచించారు. కాగా, ఉగ్రవాద నిర్మూలన మనంద రి సమష్టి బాధ్యతగా గుర్తించాలని, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించకుండా నిర్ణయాలు చేయాలన్నది కేంద్రం ఉద్దేశం కానేకాదని ఎన్‌సీటీసీ లక్ష్యాలను వివరిస్తూ చిదంబరం తాజాగా ఆయా ముఖ్యమంవూతులకు లేఖ రాశారు. త్వరలోనే రాష్ట్రాల డీజీపీల, ఉగ్రవాద వ్యతిరేక విభాగాధిపతుల సమావేశం ఏర్పాటుచేసి అపోహలను తొలగిస్తామని వివరించారు.

26/11(200) ముంబై దాడుల నేపథ్యంలో ఈ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రానికి బీజాలు పడ్డాయి. 9/11(2001) దాడుల అనంతరం అమెరికా ఏర్పాటుచేసిన ఎన్‌సీటీసీని స్ఫూర్తిగా తీసుకున్న చిదంబరం మన దేశంలో కూడా అలాంటి బలమైన వ్యవస్థ అవసరమని భావించారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, సింగపూర్ తదితర దేశాల్లో ఏర్పా టు చేసిన ఉగ్రవాద వ్యతిరేక కేంద్రాల విధి విధానాలను అధ్యయనం చేసి ప్రతిపాదనలు రూపొందించారు. ఈ యేడాది జనవరి రెండవ వారంలో సమావేశమైన భద్ర తా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఉగ్రవాద నిర్మూలనలో ఎన్‌సీటీసీకి విస్తృతాధికారాలు ఉంటాయి. ఐబీలో అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. పలువురు జాయింట్ డైరెక్టర్లు ఇతనికి సహకరిస్తారు. దేశవ్యాప్తంగా 500 టీంలను, రాష్ట్ర స్థాయి ఎస్‌సీటీసీలను ఏర్పాటుచేస్తారు. ఎన్‌సీటీసీలో పని చేయడం కోసం అధికారుల ను, సిబ్బందిని ఐబీ, రా(రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ విం గ్), జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ, త్రివిధ దళాలకు చెందిన గూఢచార సంస్థలు, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్‌టీఆర్‌ఓ), డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ), సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోల నుంచి రిక్రూట్ చేసుకుంటారు. టెర్రరిస్టుల, వారి అనుచరుల, మద్దతుదారు ల, స్నేహితుల, కుటుంబసభ్యుల కార్యకలాపాల గురించిన సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడమే కాకుం డా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ-1967)లోని సెక్షన్ 43(ఎ) ప్రకారం అనుమానితులను అరెస్టు చేసే, ఉగ్రవాదుల స్థావరాలుగా భావించిన స్థలాలను సోదా చేసే అధికారం కూడా ఈ కేంద్రానికి ఉంటుంది. ఇందుకోసం ఎన్‌ఎస్‌జీ, నావికాదళ ప్రత్యేక బలగాలు, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా దళాలు సహా అన్ని రకాల కమాండో బలగాల, కోవర్ట్ ఆపరేషన్స్ నిర్వహించే రహస్య సంస్థల సేవలను వాడుకోవచ్చు.

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ యంత్రాంగం, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఎన్‌సీటీసీకి సహకరించాల్సివుంటుంది. డాక్యుమెంట్లు, రహస్య నివేదికలు, రాతవూపతులు, కంప్యూటరైజ్‌డ్ డాటా తదితర ఏ రూపంలో ఉన్న సమాచారాన్నైనా అడిగిన వెంటనే అందించాల్సివుంటుంది.సీబీఐ, ఎన్‌ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ), నాట్‌క్షిగిడ్(నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్), ఎన్‌టీఆర్‌ఓ, డీఆర్‌ఐ(డైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), పారా మిలిటరీ, రాష్ట్రాల పోలీసు బలగాలు సైతం ఎన్‌సీటీసీ అడిగిన సమాచారా న్ని వెంటనే ఇవ్వాల్సివుంటుంది. ఈ కేంద్రానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వడానికి వివిధ రాష్ట్రాల ఉగ్రవాద వ్యతిరేక విభాగాల అధిపతులు సభ్యులుగా ఉండే స్టాండింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటుచేస్తారు. ఈ కౌన్సిల్ తరచూ సమావేశమవుతూ ఉగ్రవాదుల నుంచి పొంచి వున్న ముప్పును అంచనా వేస్తుంది. రోజువారీగా వీడియో కాన్ఫన్సులు నిర్వహిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తుంది.

వచ్చిన చిక్కల్లా ఎన్‌సీటీసీ విధి విధానాలతోనే. మాతృసంస్థ ఐబీకి సైతంలేని కార్యనిర్వాహక అధికారాలను ఈ ఎన్‌సీటీసీకి కట్టబెట్టడం వ్యతిరేకతకు కారణమైంది. కేంద్ర స్థాయిలో సీబీఐ, ఎన్‌ఐఏలకు, రాష్ట్ర స్థాయిలో పోలీసు బలగాలకు మాత్రమే ఇప్పటివరకు పౌరులను అరెస్టు చేసే, సోదాలు నిర్వహించే అధికారాలు ఉన్నాయి. మరే సంస్థకూ లేవు. ఆ మాటకొస్తే అమెరికన్ ఎన్‌సీటీసీకి సైతం ఇలాం టి అధికారాలు లేవు. ఎన్‌సీటీసీ లాంటి గూఢచార సంస్థకు అనుమానితులను అరెస్టు చేసే అధికారమిస్తే అది దుర్వినియోగమవుతుందని, ఉగ్రవాద నిర్మూలన కు బదులుగా రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి అస్త్రంగా మారుతుందని పరిశీలకులు అభివూపాయపడుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దేశంలో ఇప్పటివరకు జరిగిన గూఢచర్యమంతా ప్రతిపక్షాలే లక్ష్యంగా కొనసాగిందని గతంలో ఐబీలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన అధికారి ఎం కె ధర్ తను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఎమ్జన్సీలో కొనసాగిన ఆకృత్యాలను విచారించిన షా కమిషన్ నివేదిక సైతం ఇదే విషయాన్ని ధృవీకరించింది. రాజకీయ ప్రత్యర్థుల వేధింపు కోసం ఇందిరాగాంధీ సీబీఐతో పాటు ఐబీని విచ్చలవిడిగా వాడుకున్నారని తేల్చిచెప్పింది. అరెస్టు చేసే అధికారాలు లేని సమయంలోనే ఆధికార పార్టీకి ఐబీ అలా ఉపయోగపడితే ఇప్పుడు అదే సంస్థ అధిపతి కింద పనిచేసే ఎన్‌సీటీసీ ఉగ్రవాద కార్యకలాపాల అణచివేత పేరిట రాజకీయ ప్రత్యర్థులను వేధించదనే గ్యారంటీ ఎక్కడుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

విమర్శలకు తావిచ్చిన మరో అంశం ఫెడరల్ సూత్రాల ఉల్లంఘన. మమత మొదలు జయలలిత వరకు పలు రాష్ట్రాల ముఖ్యమంవూతులు ఎన్‌సీటీసీపై తమ విమర్శను ఈ అంశంపైనే ఎక్కుపెట్టారు. పైకి చెప్పకపోయినా కొందరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఈ విషయంలో తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారని సమాచారం. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం శాంతి భద్రతల అంశం పూర్తి గా రాష్ట్రాలకు సంబంధించిన విషయం. సీబీఐ సైతం ఆయా రాష్ట్రాల అంగీకారంతోనే కేసుల విచారణ చేబడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. 200లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పరచిన ఎన్‌ఐఏ మాత్రమే దేశ సమక్షిగతకు, భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాల దర్యాప్తును ఏ రాష్ట్రంలోనైనా దర్యాప్తు చేబట్టే అధికారాన్ని కలిగివుంది. ఎన్‌ఐఏ దర్యాప్తు సంస్థ కాగా ఎన్‌సీటీసీ గూఢచార సంస్థ అనీ, గూఢచార సంస్థకు దేశవ్యాప్త అరెస్టు అధికారాలను అప్పగించడం ప్రపంచం లో ఎక్కడా లేదని సీపీఐ అగ్రనేత డి రాజా విమర్శించడం గమనార్హం. ఎన్‌ఐఏ చట్టం సైతం ముంబై దాడు ల నేపథ్యంలో, ఒక భావోద్వేగ వాతావరణంలో ఆమోదించబడిందని, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్న ఆ చట్టాన్ని కూడా సమీక్షించాల్సిన అవసరముందని ఆయన అభివూపాయపడ్డారు.

ఎన్‌సీటీసీపై వాద ప్రతివాదాపూలా ఉన్నా ఉగ్రవాద నిర్మూలన పేరిట గతంలో అమలులోకి వచ్చిన చట్టాలన్నీ ప్రజాస్వామ్య విలువల ఉల్లంఘనలకు తావిచ్చాయన్నది కఠోర వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ‘టాడా’, ఎన్‌డీఏ సర్కారు ఆమోదించిన ’పోటా’ ఇలాంటి ఆరోపణల నేపథ్యంలోనే రద్దయ్యాయి. 195 నుంచి ఈశాన్యంలో, కాశ్మీర్‌లో అమలవుతున్న సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టంపై సైతం ఇవే విమర్శలు వెల్లు ఏ కారణాలు చెప్పి ఏర్పాటుచేసినా ప్రస్తుత ఎన్‌సీటీసీ కూడా ఇలాగే అప్రతిష్ఠపాలు కాకతప్పదు.

రాష్ట్రాల అధికారాలకే కాకుండా పౌర హక్కులకు సైతం ముప్పుగా మారనున్న ఎన్‌సీటీసీ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను తీర్చకుండా, వారెదుర్కుంటున్న మౌలిక సమస్యలకు పరిష్కారం చూపకుండా కొత్తగా ఎన్ని చట్టాలను తెచ్చినా, బలగాలకు ఎన్ని అధికారాలను కట్టబెట్టినా ఉగ్రవాదాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు. అంతర్గత భద్రతకు అత్యంత ప్రమాదకారిగా పరిణమించిందని ప్రధాని చెప్పిన వామపక్ష తీవ్రవాదానికైనా, జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని డిమాండు చేస్తూ ఈశాన్యంలో, కాశ్మీర్‌లో సాయుధంగా పోరాడుతున్న సంస్థలకై నా ప్రజల్లో నెలకొన్న అసంతృప్తే పునాది. దేశీయంగా అసంతృప్తి లేకుండా పాక్ తదితర పొరుగు దేశాలు టెర్రరిజాన్ని ప్రేరేపించడం సాధ్యం కాదు. అలాంటి అసంతృప్తికి, అలజడికి కారణమైన సమస్యలను పరిష్కరించడం వదిలేసి, అభివృద్ధిలో అణగారిన వర్గాలను భాగస్వాములు చేయడం మానేసి ఉద్యమాలపై ఉగ్రవాద ముద్రవేసి సైనికంగా అణచివేయజూడడం భారత్ లాంటి ప్రజాస్వామిక, సమా ఖ్య రాజ్యాంగం కలిగివున్న దేశానికి సమంజసం కాదు.

-డి. మార్కండేయ
dmknamaste@gmail.com

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ

Published: Sat,October 6, 2012 05:03 PM

సిరియాపై అమెరికా ‘ఉక్షిగ’నేత్రం..

అఫ్ఘనిస్తాన్.. ఇరాక్.. లిబియా.. ఇరాన్.. ఉత్తర కొరియా.. అమెరికా ఆగ్రహానికి గురైన దేశాల జాబితాలో తాజాగా సిరియా చేరింది. తనకు నచ్చితే

Published: Sat,October 6, 2012 05:03 PM

ఆ సంతోషాలు మనకెప్పుడు..?

ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ సంతోష సూచికను విడుదల చేసింది. ఇప్పటివరకూ మానవాభివృద్ధి సూచికను మాత్రమే ప్రతియేటా విడుదల చేస్తూ వస్తున

Published: Sat,October 6, 2012 05:03 PM

నక్సలిజంపై ‘కార్పొరేట్’ వార్..

నక్సలిజాన్ని అంతమొందించడంలో బహుళజాతి కంపెనీల సాయం పొందాలని కేంద్రం నిర్ణయించింది. మొన్నటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ

Published: Sat,October 6, 2012 05:04 PM

‘మానవరహిత’ యుద్ధం..

మావోయిస్టుల వేటలో మానవరహిత విమానాలను వాడాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి రెండేళ్ల క్రితమే ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంల

Published: Sat,October 6, 2012 05:04 PM

పేదరికం..అంకెల గారడీ..

దేశంలో ఎంత మంది పేదలున్నారన్న విషయంపై ఇటీవల ఉభయ సభల్లో పెద్ద దుమారం చెలరేగింది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ. 22. 42, పట్టణవూపాంతంల

Published: Sat,October 6, 2012 05:05 PM

స్వార్థం.. ఉద్యమాలపై అస్త్రం..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా ఎస్‌పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్

Published: Sat,October 6, 2012 05:05 PM

కూడంకుళం.. కుట్ర ఎవరిది?

కూడంకుళం.. ఈ పేరు ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. రష్యా సహకారం తో ₹ 17 వేల కోట్లతో తమిళనాడు కోస్తా తీరంలో ఉన్న ఈ గ్రామంలో చేపట్టి

Published: Sat,October 6, 2012 05:05 PM

‘బూర్జువా’ సైన్యంలో మావోయిస్టులు!

ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా జరగని అద్భుతం ఇప్పుడు నేపాల్‌లో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దం పాటు ఒకరినొకరు చంపుకునే పనిలో నిమగ్నమై కనీసం 13

Published: Sat,October 6, 2012 05:06 PM

నల్లధనం.. ‘తెల్ల’ బతుకులు..

బారతీయులకు చెందిన సుమారు 25 లక్షల కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువవున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ వెల్లడించా

Published: Sat,October 6, 2012 05:06 PM

తాగునీటి పరాయీకరణ..

పీల్చే గాలి లాగే తాగే నీరూ ఉచితమనుకుంటున్న వారికి దుర్వార్త. మినరల్ వాటర్ పేరుతో ఇప్పటికే నీటిని అమ్మకపు సరుకుగా మార్చి దండి గా

Published: Sat,October 6, 2012 05:06 PM

ఈశాన్య భారతంలో విప్లవం

జాతుల తిరుగుబాట్లకు ప్రసిద్ధిగాంచిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా మావోయిస్టుల రంగవూపవేశంతో మరోసారి వేడెక్కాయి. దశాబ్దాలుగా సాయు ధ ఉద్యమ

Published: Mon,July 15, 2013 05:26 PM

బాలలు.. హక్కులు.. చట్టాలు..

ప్రవాస భారతీయులు అనురూప్, సాగరిక భట్టాచార్యల పిల్లల కస్టడీ వ్యవహారంతో బాలల హక్కులు, చట్టాలపై మరోమారు చర్చ మొదలైంది. నార్వేలో భూవిజ

Published: Mon,July 15, 2013 05:25 PM

‘ఆధార్’ గందరగోళం..

పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులందించే ‘ఆధార్’ ప్రాజెక్టు అనిశ్చితస్థితిలో పడింది. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని టెంభ్

Published: Sat,October 6, 2012 05:08 PM

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు

ప్రపంచ పోలీసు అమెరికా తాజాగా ఇరాన్‌పై కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, పొర

Published: Sat,October 6, 2012 05:07 PM

పోస్కోపై పోరాటం..

అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మూలవాసుల బతుకులను ఆగం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా వర్తమానంలో కొనసాగుతున్న ఉద్యమాల్లో పోస్

Published: Sat,October 6, 2012 05:07 PM

పౌరులపై ‘సాయుధ’చట్టం!

ఇరోం షర్మిల చాను.. ఈ పేరు వినని వారు అరుదు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ 2000 నవంబర్ 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ

Published: Sat,October 6, 2012 05:08 PM

శ్రీలంక పాలకులకు టైగర్ ఫోబియా

మన పొరుగున ఉన్న శ్రీలంక పాలకులకు ప్రస్తుతం టైగర్ల భయం పట్టుకున్నది. రెండున్నర దశాబ్దాల పాటు ఎల్‌టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్

Published: Sat,October 6, 2012 05:08 PM

అమెరికాలో నయా బానిసలు..

ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికాలో సరికొత్త వ్యాపారం వర్ధిల్లుతోంది. జైళ్ల లో ఉండే ఖైదీలను కట్టుబానిసలుగా మార్చి బహుళజాతి కంపెనీ