తాగునీటి పరాయీకరణ..


Sat,October 6, 2012 05:06 PM

water-p talangana patrika telangana culture telangana politics telangana cinema
పీల్చే గాలి లాగే తాగే నీరూ ఉచితమనుకుంటున్న వారికి దుర్వార్త. మినరల్ వాటర్ పేరుతో ఇప్పటికే నీటిని అమ్మకపు సరుకుగా మార్చి దండి గా లాభాలు గడిస్తున్న సామ్రాజ్యవాదులు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుళాయిల వ్యవస్థను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. గత వారం (ఫివూబవరి 1-3) బెంగుళూరు నగరంలోని ఓ ఐదు నక్షవూతాల హోటల్‌లో నిర్వహించిన ప్రపంచ నీటి సదస్సు ఈ దిశలో వ్యూహాలను రచించింది.

నీటి నిర్వహణలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలువురు నిపుణులు, పరిశోధకులు, ప్రభుత్వేతర సంస్థ ల, బహుళజాతి కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశం నీటి సరఫరాకు సంబంధించి దేశం ముందున్న సవాళ్లను చర్చించింది. ప్రపంచం భవిష్యత్‌లో తీవ్ర నీటి కొరతను ఎదుర్కొనబోతున్నదని, సమగ్ర నీటి నిర్వహణకు తాగునీటి సరఫరా రంగాన్ని ప్రైవేటుకు అప్పజెప్పడం అవసరమని అభివూపాయపడింది. సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర నీటి వనరుల శాఖ ‘జాతీయ జల విధానం-2012’ ముసాయిదాను విడుదల చేసింది. నీటిని ఒక సరుకుగా గుర్తిస్తే తప్ప దాని వృథాను అరికట్టడం సాధ్యం కాదని తేల్చింది. నీటిని వ్యక్తిగత ఆస్తిగా కాకుండా సామాజిక ఆస్తిగా పరిగణించాలని, ‘భారత అనుభోగ(ఈజ్‌మెంట్స్) చట్టం-12’ను ఇందుకు అనుగుణంగా సవరించాలని ఇందులో పేర్కొన్నారు.

ప్రజలకు నీటి విలువ తెలిసిరావాలంటే జలాలకు ధరలు నిర్ణయించక తప్పదని చెప్పారు. తాగునీటి సరఫరా బాధ్యతల నుంచి ప్రభుత్వాలు వైదొలగాలని, కేవలం నియంవూతణ, పర్యవేక్షణలకు పరిమితం కావాలని సూచించారు. విచివూతమేమిటంటే 2005లో ప్రపంచ బ్యాంకు రూపొందించిన విధానపవూతంలోనూ సరిగ్గా ఇవే సూచనలున్నాయి. నీటిపారుదల, తాగునీటి సరఫరా, పారిశుధ్య రంగాల్లో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించాలని బ్యాంకు సలహా ఇచ్చింది. గత సంవత్సరం ఫిబ్రవరి 2 నుంచి మార్చి 4 వరకు బెంగుళూరు, ముంబై నగరాలను సందర్శించిన అమెరికన్ వాటర్ ట్రేడ్ మిషన్ భారత్‌లో నీటి వ్యాపారానికి గల అవకాశాలను అన్వేషించింది. ప్రముఖ వ్యాపారవేత్త లు, వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్న ఈ మిషన్ ‘భారత్‌లో దినదినం విస్తరిస్తున్న నీటి విపణిలోకి అమెరికన్ కంపెనీలను ప్రవేశపెట్టే’ దిశలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపింది.

దేశంలో తాగునీటి వ్యాపారం 1960లలో మినరల్ వాటర్ రూపంలో మొదలైంది. నీటిని కొనుక్కొని తాగే సంప్రదాయాన్ని ఇటలీ కంపెనీ బిస్లెరీ ప్రవేశపెట్టింది. గాజు సీసాల్లో నింపిన నీటి ని ప్రధాన నగరాల్లో అమ్మడం ప్రారంభించారు. ఆ తర్వాత కోకాకోలా (కిన్లీ), పెప్సీకో(అక్వాఫినా), నెస్లె (ప్యూర్‌లైఫ్) వంటి బడా సంస్థలు ప్రవేశించాయి. గాజుసీసాలు కాస్తా పీవీసీకి, అంతిమంగా పెట్‌కూ మారాయి. మొదట ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మహానగరాలే ఈ వ్యాపారానికి వేదికలుగా ఉన్నా 90లలో వచ్చిన కలర్ టెలివిజన్ విప్లవం ఈ రంగ భవితవ్యాన్ని మార్చేసింది. మినరల్ వాటర్ తాగితే రోగాలు దరిచేరవని, రుచి, శుచితో పాటు ఆరోగ్యం మీ సొంతమవుతుందం టూ టీవీ ప్రకటనలు దినదినం పెరుగుతున్న మధ్యతరగతి వర్గాలకు రంగుల కలలను చూపించాయి.

ఫలితంగా నీటి వ్యాపారం వేగంగా విస్తరించింది. మెట్రోల నుంచి నగరాలకు, పట్టణాల నుంచి పల్లెలకు మినరల్ వాటర్ బాటిళ్లు పయనమయ్యాయి. కరెంటు కూడా లేని మారుమూల పల్లెల్లో, ఆదివాసీ గూడేల్లో సైతం నేడు మినరల్ వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు దొరుకుతున్నాయంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో ఏటా ₹ 10 వేల కోట్ల మినరల్ వాటర్ వ్యాపారం వర్ధిల్లుతున్నది. ఇందులో పైన పేర్కొన్న నాలుగు బహుళజాతి సంస్థల మార్కెట్ వాటా సుమారు 0 శాతం కాగా మిగతా 20 శాతం వ్యాపారాన్ని దేశీయ కంపెనీలు చేసుకుంటున్నాయి. తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి, మూలమూలల్లోకి మినరల్ వాటర్ అలవాటును తీసుకెళ్లడానికి ఈ బహుళజాతి కంపెనీలు చేయని ప్రయత్నమంటూ లేదు.

అయితే, ఇప్పటికీ పశ్చిమ దేశాలతో పోల్చితే మన దేశంలో మినరల్ వాటర్ వినియోగం తక్కువే. అక్కడ తలసరి వినియోగం 111 లీటర్లు కాగా మన దేశంలో కేవలం అర లీటర్ మాత్రమే. ఇప్పటికీ మన పల్లెల్లో బావుల నుంచి, బోర్ల నుంచి, వాగుల నుంచి మంచినీటిని తోడుకుని తాగేవాళ్లే ఎక్కువ. దేశంలో ఉన్న 16 లక్షల గ్రామాల్లో కేవలం 4 లక్షల గ్రామాలకు మాత్రమే రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉందని స్వయంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ గత ఆగస్టులో రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

భారత నిర్దిష్ట పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన బహుళజాతి సంస్థలు ఇక్కడి నీటి విపణిలో చొరబడడానికి ద్విముఖ వ్యూహాన్ని రచించాయి. నీటిని కొనడమేమిటన్న సగటు భారతీయుని మనస్తత్వాన్ని మార్చడం ద్వారా ఓ వైపు మినర ల్ వాటర్ మార్కెట్‌ను పెంచుకుంటున్నాయి. రక్షిత మంచినీరు కరువైన చోట స్తోమ త కలిగిన వర్గాలచే మినరల్ వాటర్‌ను కొనిపిస్తున్నాయి. మరోవైపు, నగరాలు, పెద్ద పట్టణాల మంచినీటి సరఫరా రంగంలోకి ప్రవేశించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.

ఇప్పటికే కర్నాటకలోని హుబ్లీ-ధార్వాడ్, బెల్గాం, గుల్బర్గా నగరాల తాగునీటి సరఫరాను ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి సంస్థ వియోలియా నిర్వహిస్తోంది. బెంగుళూరు నగరంలోని కొన్ని ప్రాంతాలకు బ్రిటన్‌కు చెందిన థేమ్స్ నదీ నీరందిస్తోంది. సైప్రస్ కంపెనీ హైడ్రో-కాంప్ మహారాష్ట్రలోని లాతూరు, తమిళనాడులోని మధురై నగరాలను చేజిక్కించుకుంది. దేశీయ సంస్థ టాటాకు చెందిన జస్కో(జంషెడ్‌పూర్ యుటిలిటీస్ అండ్ సర్వీసెస్ కంపెనీ) కర్నాటకలోని మైసూరు, జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్, బెంగాల్‌లోని హల్దియాల్లో, మధ్యవూపదేశ్ రాజధాని భోపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటి నిర్వహణను చేపట్టింది. ఇంకా పలు నగరాలు, పట్టణాలకు తాగునీటిని సరఫరా చేయడానికి దేశ విదేశాలకు చెందిన పలు కంపెనీలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో, స్థానిక సంస్థల పాలకవర్గాలతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతోంది.

ప్రైవేటీకరణ ద్వారానే పట్టణాల నీటి సరఫరా వ్యవస్థ మెరుగుపడగలదని ప్రపంచ బ్యాంకు సహా ఈ ప్రక్రియకు అనుకూలంగా ఉన్నవారు వాదిస్తున్నారు. వాడుకునే ప్రతి లీటర్‌కు బిల్లు చెల్లించాల్సివుంటుంది కనుక పౌరులు నీటిని వృథా చేయరని వీరంటున్నారు. పైపుల లీకేజీ, బిల్లుల వసూళ్లు, కనెక్షన్ల తొలగింపు, కొత్త కనెక్షన్ల మంజూరు, ఫిర్యాదులకు స్పందన తదితర విషయాల్లో ప్రైవేట్ సంస్థలు మెరుగైన పనితీరు కనబరుస్తాయని వివరిస్తున్నారు. జాతీయ జల విధానం ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వం సైతం ఇదే అభివూపాయాన్ని వ్యక్తం చేసింది.

అయితే, వాస్తవాలు మరోలా ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన హుబ్లీ-ధార్వాడ్ నగరాల నీటి సరఫరా వ్యవస్థ పనితీరును బెంగుళూరుకు చెందిన పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. ఇక్కడ నీటి నిల్వలను లార్సెన్ అండ్ టుబ్రో కంపెనీ అందిస్తుండగా, సరఫరా-నిర్వహణ బాధ్యతలను వియోలియా సంస్థ చూస్తోంది. అధిక ఒత్తిడితో కూడిన స్వచ్ఛమైన నీటిని 24 గంటలు నిరంతర సరఫరా చేసే లక్ష్యంతో మొదలైన ఈ ప్రాజెక్టు చేదు అనుభవాల నే మిగులుస్తోందని ఈ పరిశోధకులు తేల్చిచెప్పారు. ఇదివరకటి కంటే సరఫరా సమ యం బాగా పెరిగినప్పటికీ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న చార్జీలు అంతకంటే ఎక్కువే పెరిగాయని వీరు అభివూపాయపడ్డారు. నగరంలో 0 శాతం వరకు ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలకు ఇది భారంగా మారిందని వివరించారు.

అక్రమ కనెక్షన్లక్రమబద్ధీకరణ పేరుతో మురికివాడల్లో నివసించే బడుగుల నుంచి వన్‌టైం చార్జీలు వసూలు చేశారని, వీధి కుళాయిలు కూడా కనుమరుగు కావడంతో అభాగ్యులకు తాగేందుకు నీళ్లు కూడా దొరకని స్థితి ఏర్పడిందని తెలిపా రు. కాంట్రాక్టుల నుంచి సబ్‌కాంవూటాక్టులు, సబ్ కాంవూటా క్టుల నుంచి తిరిగి సబ్‌కాంవూటాక్టుల ఫలితంగా పనుల్లో జాప్యం, పనితీరులో అసమర్థత కూడా గమనించామన్నారు.
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన చోటే ఇలా ఉంటే ఇక నగరాల, పట్టణాల తాగునీటి సరఫరా వ్యవస్థను ఏకంగా ప్రైవేట్‌కు అప్పగించిన చోట పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే బహుళజాతి సంస్థ లు, దేశీయ కంపెనీలు తక్కువ పెట్టుబడులతో, అతితక్కువ నిర్వహణ వ్యయంతో ఎక్కువ లాభాలను ఆశించడం సహజం. హుబ్లీ-ధార్వాడ్‌లలాగే మిగతా నగరాల్లో ఇదే జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు మన దేశం లో ప్రైవేటీకరణ జరిగిన ఏ రంగంలోనైనా లాభపడుతున్నది బహుళజాతి సంస్థలు, దేశీయ కంపెనీలు కాగా, అంతిమంగా నష్టపోతున్నది సగటు మానవుడేనన్నది గుర్తించాల్సిన విషయం.

మన రాజ్యాంగం గుర్తించిన ప్రాథమిక హక్కుల్లో జీవిం చే హక్కు కీలకమైంది. ఈ జీవించే హక్కుకు మూలం గాలి, నీరు. తాగునీటిని ప్రజల సమష్టి ఆస్తిగా గుర్తించి దేశంలో నివసించే ప్రతి పౌరునికి ఎలాంటి షరతులు లేకుండా అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. ఈ బాధ్యతను మరచిన ప్రభుత్వాలు వృథాను అరికట్టడం, భావి తరాలకు నీటి కొరతను నివారించడం, పర్యావరణాన్ని పరిరక్షించ డం వంటి కుంటిసాకులతో జలాన్ని సరుకుగా చూడాలనడం, ధరను నిర్ణయించ డం అసమంజసం. ప్రభుత్వ సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయితీలు లాభాపేక్ష లేకుండా దేశంలోని పలు నగరాలకు, పట్టణాలకు తాగునీటిని తరాలుగా సరఫరా చేస్తుండగా, ఆ విభాగాలను సమర్థతతో పనిచేయించాల్పిందిపోయి తన విధానాల తో ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్‌కు అంటగట్ట చూస్తుండడం తగదు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ ముసుగులో ప్రజా ప్రయోజనాలను సామ్రాజ్యవాదులకు, బహుళజాతి సంస్థలకు తాకట్టు పెడుతున్న పాలకుల విధానాలను ప్రజ లు వ్యతిరేకించాలి. స్థానిక సంస్థలకు మరిన్ని నిధులను, అధికారాలను సమకూర్చి వాటిని స్వయంపోషకంగా మార్చాలని, దాహం వేసిన ప్రతి వ్యక్తి దప్పిక తీర్చడం పౌరుల జన్మహక్కుగా గుర్తించాలని ఉద్యమించాలి.

-డి. మార్కండేయ
dmknamaste@gmail.com

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ

Published: Sat,October 6, 2012 05:03 PM

సిరియాపై అమెరికా ‘ఉక్షిగ’నేత్రం..

అఫ్ఘనిస్తాన్.. ఇరాక్.. లిబియా.. ఇరాన్.. ఉత్తర కొరియా.. అమెరికా ఆగ్రహానికి గురైన దేశాల జాబితాలో తాజాగా సిరియా చేరింది. తనకు నచ్చితే

Published: Sat,October 6, 2012 05:03 PM

ఆ సంతోషాలు మనకెప్పుడు..?

ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ సంతోష సూచికను విడుదల చేసింది. ఇప్పటివరకూ మానవాభివృద్ధి సూచికను మాత్రమే ప్రతియేటా విడుదల చేస్తూ వస్తున

Published: Sat,October 6, 2012 05:03 PM

నక్సలిజంపై ‘కార్పొరేట్’ వార్..

నక్సలిజాన్ని అంతమొందించడంలో బహుళజాతి కంపెనీల సాయం పొందాలని కేంద్రం నిర్ణయించింది. మొన్నటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ

Published: Sat,October 6, 2012 05:04 PM

‘మానవరహిత’ యుద్ధం..

మావోయిస్టుల వేటలో మానవరహిత విమానాలను వాడాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి రెండేళ్ల క్రితమే ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంల

Published: Sat,October 6, 2012 05:04 PM

పేదరికం..అంకెల గారడీ..

దేశంలో ఎంత మంది పేదలున్నారన్న విషయంపై ఇటీవల ఉభయ సభల్లో పెద్ద దుమారం చెలరేగింది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ. 22. 42, పట్టణవూపాంతంల

Published: Sat,October 6, 2012 05:05 PM

స్వార్థం.. ఉద్యమాలపై అస్త్రం..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా ఎస్‌పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్

Published: Sat,October 6, 2012 05:05 PM

కూడంకుళం.. కుట్ర ఎవరిది?

కూడంకుళం.. ఈ పేరు ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. రష్యా సహకారం తో ₹ 17 వేల కోట్లతో తమిళనాడు కోస్తా తీరంలో ఉన్న ఈ గ్రామంలో చేపట్టి

Published: Sat,October 6, 2012 05:05 PM

‘బూర్జువా’ సైన్యంలో మావోయిస్టులు!

ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా జరగని అద్భుతం ఇప్పుడు నేపాల్‌లో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దం పాటు ఒకరినొకరు చంపుకునే పనిలో నిమగ్నమై కనీసం 13

Published: Sat,October 6, 2012 05:07 PM

రాష్ట్రాల హక్కులపై ‘ఉగ్ర’ కేంద్రం..

టెర్రరిస్టు కార్యకలాపాలను సమర్థవంతంగా అణచివేసే ఉద్దేశంతో జాతీ య ఉగ్రవాద వ్యతిరేక కేంద్రాన్ని (ఎన్‌సీటీసీ) ఏర్పాటుచేస్తూ ఫిబ్రవరి 3

Published: Sat,October 6, 2012 05:06 PM

నల్లధనం.. ‘తెల్ల’ బతుకులు..

బారతీయులకు చెందిన సుమారు 25 లక్షల కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువవున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ వెల్లడించా

Published: Sat,October 6, 2012 05:06 PM

ఈశాన్య భారతంలో విప్లవం

జాతుల తిరుగుబాట్లకు ప్రసిద్ధిగాంచిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా మావోయిస్టుల రంగవూపవేశంతో మరోసారి వేడెక్కాయి. దశాబ్దాలుగా సాయు ధ ఉద్యమ

Published: Mon,July 15, 2013 05:26 PM

బాలలు.. హక్కులు.. చట్టాలు..

ప్రవాస భారతీయులు అనురూప్, సాగరిక భట్టాచార్యల పిల్లల కస్టడీ వ్యవహారంతో బాలల హక్కులు, చట్టాలపై మరోమారు చర్చ మొదలైంది. నార్వేలో భూవిజ

Published: Mon,July 15, 2013 05:25 PM

‘ఆధార్’ గందరగోళం..

పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులందించే ‘ఆధార్’ ప్రాజెక్టు అనిశ్చితస్థితిలో పడింది. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని టెంభ్

Published: Sat,October 6, 2012 05:08 PM

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు

ప్రపంచ పోలీసు అమెరికా తాజాగా ఇరాన్‌పై కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, పొర

Published: Sat,October 6, 2012 05:07 PM

పోస్కోపై పోరాటం..

అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మూలవాసుల బతుకులను ఆగం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా వర్తమానంలో కొనసాగుతున్న ఉద్యమాల్లో పోస్

Published: Sat,October 6, 2012 05:07 PM

పౌరులపై ‘సాయుధ’చట్టం!

ఇరోం షర్మిల చాను.. ఈ పేరు వినని వారు అరుదు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ 2000 నవంబర్ 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ

Published: Sat,October 6, 2012 05:08 PM

శ్రీలంక పాలకులకు టైగర్ ఫోబియా

మన పొరుగున ఉన్న శ్రీలంక పాలకులకు ప్రస్తుతం టైగర్ల భయం పట్టుకున్నది. రెండున్నర దశాబ్దాల పాటు ఎల్‌టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్

Published: Sat,October 6, 2012 05:08 PM

అమెరికాలో నయా బానిసలు..

ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికాలో సరికొత్త వ్యాపారం వర్ధిల్లుతోంది. జైళ్ల లో ఉండే ఖైదీలను కట్టుబానిసలుగా మార్చి బహుళజాతి కంపెనీ