ఈశాన్య భారతంలో విప్లవం


Sat,October 6, 2012 05:06 PM

జాతుల తిరుగుబాట్లకు ప్రసిద్ధిగాంచిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా మావోయిస్టుల రంగవూపవేశంతో మరోసారి వేడెక్కాయి. దశాబ్దాలుగా సాయు ధ ఉద్యమాలు నడిపిన అనేక సంస్థలు ఇటీవలికాలంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుని పోరాటాలను విరమించాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఈ రాష్ట్రాల్లో ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఘనమైన పోరాట చరిత్ర కలిగిన ఈశాన్య ప్రాంత ఆదివాసుల్లో ఏర్పడిన ‘ఖాళీ’ని భర్తీ చేసి వారిని విప్లవ పోరాటాల వైపు మళ్లించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తన కార్యకలాపాలను ఉధృతం చేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో జాతుల స్వయం నిర్ణయాధికారం కోరుతూ ఉద్యమాలు నిర్వహిస్తున్న సంస్థలతో ఒకవైపు సన్నిహిత సంబంధాలు నెరుపుతూనే, కొన్ని ప్రాంతాల్లో స్వయంగా ఉద్యమాలు నిర్వహించడానికి ఆ పార్టీ సమాయత్తమవుతోంది. ‘ఈస్టర్న్ రీజనల్ బ్యూరో’ సారథ్యంలో అప్పర్ అస్సాం లీడింగ్ కమిటీ(యూఏఎల్‌సీ) ఈ కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తోంది. అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో స్థానిక ఆదివాసులకు నిలువ నీడ లేకుండా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, అనుసరిస్తున్న దమననీతికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు.
అస్సాంలో ‘బృహత్ నదీబాంధ్ ప్రతిరోధ్ మంచ్’(భారీతరహా డ్యాంల ప్రతిఘటన వేదిక)ను స్థాపించి పలు జిల్లాల్లో విప్లవ పోరాటాలకు బాటలు వేశారు. తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల్లోకి వెళ్లడమే కాకుండా విద్యార్థి యువకులను, గిరిజనులను ఆకర్షించడం కోసం ఈ రాష్ట్రంలో పలు ప్రజాసంఘాలను సైతం స్థాపించారని సమాచారం. తన నియోజకవర్గంలో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్న దృష్ట్యా కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని లోహిట్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే రాష్ట్ర శాసనసభలో డిమాండ్ చేశారు.

అరుణాచల్‌వూపదేశ్‌లోని దిబాంగ్ లోయలో నెలకొల్పుతున్న 3000 మెగావాట్ల దిగువ సుబన్సిరి జల విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మావోయిస్టులు స్థానికులను సమీకరించి క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎంఎస్‌ఎస్)ని ఏర్పాటుచేశారు. సాయుధ తిరుగుబాట్లకు నెలవైన మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో సైతం పలు సాయుధ పోరాట గ్రూపులతో మావోయిస్టులు కలిసి పని చేస్తూనే.. స్వతంత్ర అస్తిత్వం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక వివిధ సంస్థలతో ద్వైపాక్షిక, త్రైపాక్షిక సమావేశాలకు మిజోరం షెల్టర్ జోన్‌గా ఉపయోగపడుతోంది. ఈ పరిణామాలన్నింటిని జాగ్రత్తగా గమనిస్తోన్న కేంద్ర హోంశాఖ ‘అప్రమత్తంగా ఉండాల్సింది’గా ఇటీవల ఈశాన్య రాష్ట్రాల పోలీసు, పారామిలిటరీ బలగాలను హెచ్చరించింది. గత డిసెంబర్‌లో మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో వివిధ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశాన్ని నిర్వహించిన ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) మావోయిస్టుల కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాల రచనకు కసరత్తు చేసింది. నేషన ల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) మావోయిస్టుల కార్యకలాపాలపై దృష్టిని కేంద్రీకరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి నిజమేనని కేంద్ర రక్షణ శాఖ సహా య మంత్రి పల్లంరాజు సైతం ఒప్పుకున్నారు.

మావోయిస్టుల ఈశాన్య ప్రవేశానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పీపుల్స్‌వార్ సంస్థాపకుడు, నక్సలైట్ ఉద్యమ అగ్రనేత కొండపల్లి సీతారామయ్య 190లో రూపొందించిన ‘గెరిల్లా జోన్ డాక్యుమెంటు’లోనే ఈ ప్రస్తావన ఉంది. ఉత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలను రక్షించుకోవడానికి ఉద్యమం దండకారణ్యానికి విస్తరించాలని చెబుతూ.. భారత విప్లవానికి ఆదిలాబాద్ నుంచి ఈశా న్య భారతం దాకా విస్తరించిన దట్టమైన అడవులే కీలకమని ఆయన ఆ డాక్యుమెంటులో ప్రస్తావించారు. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమ విస్తరణ అంతా కొండపల్లి చూపిన బాటలోనే నడిచిందని చెప్పవచ్చు. బస్తర్, గడిచిరోలి జిల్లాలగుండా గోందియా, రాజనంద్‌గావ్, దుర్గ్, బాలాఘాట్, మాండ్లా జిల్లాలకు పీపుల్స్‌వార్ దళాల కార్యకలాపాలు వేగంగా విస్తరించాయి.

199లో సీపీఐ(ఎంఎల్) పార్టీ యూనిటీతో, 2004లో మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్(ఎంసీసీ)తో విలీనం జరిగి మావోయిస్టుపార్టీగా అవతరించిన తర్వాత, దండకారణ్యానికి ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో లింకు ఏర్పడింది. దండకారణ్యం (ఆంవూధవూపదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్), ఏఓబీ(ఆంవూధ-ఒరిస్సా), జంగల్‌మహల్(జార్ఖండ్-ఒరిస్సా-బెంగాల్), బీజే(బీహార్-జార్ఖండ్) సరిహద్దులు గెరిల్లా విప్లవ కేంద్రాలుగా మారాయి. దీంతో తెలంగాణ నుంచి బెంగాల్ అడవుల దాకా దళాలు సాయుధ ఫార్మేషన్లుగా చేరుకునే సౌ లభ్యం ఏర్పడింది. ఇక మిగిలింది ఈశాన్యమే. అక్కడికి కూడా విస్తరించి ఎందందరో విప్లవకారులు కన్న కలలను సాకారం చేయడానికి, విశాలమైన ‘ఎర్ర కారిడార్’ను నిర్మించి భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసే దిశలో ముందుకు సాగడానికి మావోయిస్టు పార్టీ పక్కా వ్యూహాన్ని రచించింది.ఆ దిశలో అడుగులు వేస్తోంది.

ఏడుగురు అక్కాచెప్లూళ్లుగా కూడా పిలిచే ఈశాన్య రాష్ట్రాల్లోకి మావోయిస్టుల విస్తరణ ఇటీవల కేంద్ర బలగాల చేతిలో అసువులు బాసిన పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్‌జీ ఆధ్వర్యంలోనే జరిగింది. కేంద్ర కమిటీకి చెందిన ‘ఈస్టర్న్ రీజనల్ బ్యూరో చీఫ్’గా ఉంటూ ఆయన అస్సాం, అరుణాచల్‌వూపదేశ్, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. ఉల్ఫా నుంచి మొదలుకొని ఎన్ ఎస్ సీ ఎన్ (ఐ-ఎం) వరకు వివిధ పోరాట సంస్థలకు చెందిన కీలక నేతలను కలిశారు. పలు సంస్థలతో స్నేహపూర్వక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. భారత ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. ఈ క్రమంలోనే ‘మార్క్సిజం పూనినిజం మావోయిజం’ సిద్ధాంతానికి కట్టుబడివున్న శక్తులను కూడగట్టారు. మావోయిస్టు అప్పర్ అస్సాం లీడింగ్ కమిటీని ఏర్పరచారు. నిజానికి ఆయన కదలికల జాడ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు అక్కడే దొరికిందనే వాదన కూడా ప్రచారంలో ఉంది.

ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం అస్సాంలో పరేశ్ బారువా నేతృత్వంలో పని చేస్తున్న ‘ ఉల్ఫా’ చర్చల వ్యతిరేక వర్గంతో, ఆదివాసీ పీపుల్స్ ఆర్మీ (ఏపీఏ)తో, నేషనల్ డెమోక్షికటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్‌డీఎఫ్‌బీ)లోని ఒక వర్గంతో మావోయిస్టులు సత్సంబంధాలు నెలకొల్పుకున్నారు. ఈ సంస్థల నుంచి ఆయుధాలు, సైనిక శిక్షణ తదితర విషయాల్లో సహకారం తీసుకుంటూ వారికి బెంగాల్, జార్ఖండ్‌లోని అడవుల్లో ఆశ్రయం కల్పిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. టిన్సూకియా, శివసాగర్, గోల్‌పారా, కోక్రఝార్, ధూబ్రి, కామ్‌రూప్, సోనిత్‌పూర్, దర్రాంగ్ జిల్లాల్లో ‘ యూఏఎల్‌సీ’ నాయకత్వంలో స్వయంగా కార్యకలాపాలు ప్రారంభించారు. అస్సాం స్టూడెంట్స్ యూత్ ఆర్గనైజేషన్, అస్సాం చాహ్ జనజాతి సురక్ష సమితి, ఆల్ ఆదివాసీ నేషనల్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు వాస్తవానికి మావోయిస్టులకు కవర్ సంఘాలుగా పని చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోపిస్తున్నారు. భారత ప్రభుత్వ బలగాల దాడులను సంయుక్తంగా తిప్పికొట్టే లక్ష్యంతో మణిపూర్‌లోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ), పీపుల్స్ రెవల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్ (వూపిపాక్), యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూ ఎన్ ఎల్ ఎఫ్)లతో, నాగాల పోరాట సంస్థ ఎన్ ఎస్ సీ ఎన్ (ఐఎం) తో మావోయిస్టులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

విశ్లేషకుల అంచనా ప్రకారం ఈశాన్యంలో మావోయిస్టులు నిలదొక్కుకోవడానికి కారణాలు చాలా ఉన్నా యి. జాతుల స్వయం నిర్ణయాధికారం కోసం దశాబ్దాలుగా పోరాడిన అక్కడి ఆదివాసీలు, ప్రస్తుతం పలు సంస్థలు భారత ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుని చేతుపూత్తేయడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మౌలిక సమస్యలు పరిష్కారం కాకుండానే పోరాట విరమణ చేయడాన్ని వ్యతిరేకించిన వారు సహజంగానే మావోయిస్టుల వైపు ఆకర్షితులవుతున్నారు. పైగా ప్రతి సంస్థలోనూ శాంతి చర్చలను వ్యతిరేకించే వర్గమొకటి పుట్టుకొచ్చి పోరాట కొనసాగింపులో మావోయిస్టుల సాయాన్ని అర్థిస్తున్నది.

ఇక అస్సాం, అరుణాచల్‌వూపదేశ్ రాష్ట్రాల్లో చిన్నవి, పెద్దవి కలిసి వంద వరకు డ్యాంలు నిర్మిస్తున్నారు. ఈ డ్యాంల కారణంగా నిర్వాసితులైన ప్రజల పక్షాన పోరా డే నాథుడు కరువయ్యాడు. ఈ పరిస్థితులన్నీ మావోయిస్టులకు అనుకూలంగా మారాయి. మరోవైపు, ఇటీవల ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, బెంగాల్‌లో పోలీసు, పారా మిలిటరీ బలగాలపై చేసిన భారీ దాడులతో మా వోయిస్టుల ప్రతిష్ఠ జాతీయంగా, అంతర్జాతీయంగా పెరిగింది. ఫలితంగా రాజ్యంతో పోరాటానికి సిద్ధమైన ప్రతి ఒక్కరూ మావోయిస్టుల వైపు చూసే స్థితి ప్రస్తుతం దేశంలో నెలకొన్నది.

జాతుల ఆకాంక్షను, అస్తిత్వాన్ని, ప్రజల మౌలిక సమస్యలను పట్టించుకోకుండా పాలకులు కుంభకోణాల్లో నిండా మునిగినంత కాలం మావోయిస్టు ఉద్యమం కొనసాగుతూనే వుంటుంది. ఒకచోట అణచివేయబడినా మరోచోట మొదలవుతుంది.ఆంధ్రవూపదేశ్‌లో పూర్తిగా బలహీనపడిన కాలంలోనే.. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒరిస్సాలలో విప్లవోద్యమం మరింత బలపడడానికి, బెంగాల్, ఈశాన్యాలకు విస్తరించడానికి కారణమిదేనని గుర్తించాలి. భారీ ఎన్‌కౌంటర్లు, పోలీసు బలగాలపై దాడులు జరిగినప్పుడల్లా చర్చల మంత్రం వల్లించడం, యథావూపకారం సైనిక పద్ధతుల్లో ఉద్యమ నిర్మూలనకు ప్రయత్నించడం ప్రభుత్వాలు ఇకనైనా ఆపేయాలి. కిషన్‌జీ మరణించిన వారానికి మావోయిస్టులను మరోసారి చర్చలకు ఆహ్వానించిన హోం మంత్రి చిదంబరం మొదట మధ్య భారతంలో కొనసాగుతున్న ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను నిలిపివేయాలి. మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న స్వామి అగ్నివేశ్ లాంటి సామాజిక కార్యకర్తలు, మేధావుల సహకారంతో దేశంలో ఏకైక అతిపెద్ద పోరాట సంస్థగా నిలిచిన సీపీఐ(మావోయిస్టు)పార్టీతో చిత్తశుద్ధితో శాంతి చర్చలకు చొరవ చూపాలి.
- డి. మార్కండేయ
dmk namaste @ gmail.com

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ

Published: Sat,October 6, 2012 05:03 PM

సిరియాపై అమెరికా ‘ఉక్షిగ’నేత్రం..

అఫ్ఘనిస్తాన్.. ఇరాక్.. లిబియా.. ఇరాన్.. ఉత్తర కొరియా.. అమెరికా ఆగ్రహానికి గురైన దేశాల జాబితాలో తాజాగా సిరియా చేరింది. తనకు నచ్చితే

Published: Sat,October 6, 2012 05:03 PM

ఆ సంతోషాలు మనకెప్పుడు..?

ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ సంతోష సూచికను విడుదల చేసింది. ఇప్పటివరకూ మానవాభివృద్ధి సూచికను మాత్రమే ప్రతియేటా విడుదల చేస్తూ వస్తున

Published: Sat,October 6, 2012 05:03 PM

నక్సలిజంపై ‘కార్పొరేట్’ వార్..

నక్సలిజాన్ని అంతమొందించడంలో బహుళజాతి కంపెనీల సాయం పొందాలని కేంద్రం నిర్ణయించింది. మొన్నటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ

Published: Sat,October 6, 2012 05:04 PM

‘మానవరహిత’ యుద్ధం..

మావోయిస్టుల వేటలో మానవరహిత విమానాలను వాడాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి రెండేళ్ల క్రితమే ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంల

Published: Sat,October 6, 2012 05:04 PM

పేదరికం..అంకెల గారడీ..

దేశంలో ఎంత మంది పేదలున్నారన్న విషయంపై ఇటీవల ఉభయ సభల్లో పెద్ద దుమారం చెలరేగింది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ. 22. 42, పట్టణవూపాంతంల

Published: Sat,October 6, 2012 05:05 PM

స్వార్థం.. ఉద్యమాలపై అస్త్రం..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా ఎస్‌పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్

Published: Sat,October 6, 2012 05:05 PM

కూడంకుళం.. కుట్ర ఎవరిది?

కూడంకుళం.. ఈ పేరు ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. రష్యా సహకారం తో ₹ 17 వేల కోట్లతో తమిళనాడు కోస్తా తీరంలో ఉన్న ఈ గ్రామంలో చేపట్టి

Published: Sat,October 6, 2012 05:05 PM

‘బూర్జువా’ సైన్యంలో మావోయిస్టులు!

ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా జరగని అద్భుతం ఇప్పుడు నేపాల్‌లో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దం పాటు ఒకరినొకరు చంపుకునే పనిలో నిమగ్నమై కనీసం 13

Published: Sat,October 6, 2012 05:07 PM

రాష్ట్రాల హక్కులపై ‘ఉగ్ర’ కేంద్రం..

టెర్రరిస్టు కార్యకలాపాలను సమర్థవంతంగా అణచివేసే ఉద్దేశంతో జాతీ య ఉగ్రవాద వ్యతిరేక కేంద్రాన్ని (ఎన్‌సీటీసీ) ఏర్పాటుచేస్తూ ఫిబ్రవరి 3

Published: Sat,October 6, 2012 05:06 PM

నల్లధనం.. ‘తెల్ల’ బతుకులు..

బారతీయులకు చెందిన సుమారు 25 లక్షల కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువవున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ వెల్లడించా

Published: Sat,October 6, 2012 05:06 PM

తాగునీటి పరాయీకరణ..

పీల్చే గాలి లాగే తాగే నీరూ ఉచితమనుకుంటున్న వారికి దుర్వార్త. మినరల్ వాటర్ పేరుతో ఇప్పటికే నీటిని అమ్మకపు సరుకుగా మార్చి దండి గా

Published: Mon,July 15, 2013 05:26 PM

బాలలు.. హక్కులు.. చట్టాలు..

ప్రవాస భారతీయులు అనురూప్, సాగరిక భట్టాచార్యల పిల్లల కస్టడీ వ్యవహారంతో బాలల హక్కులు, చట్టాలపై మరోమారు చర్చ మొదలైంది. నార్వేలో భూవిజ

Published: Mon,July 15, 2013 05:25 PM

‘ఆధార్’ గందరగోళం..

పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులందించే ‘ఆధార్’ ప్రాజెక్టు అనిశ్చితస్థితిలో పడింది. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని టెంభ్

Published: Sat,October 6, 2012 05:08 PM

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు

ప్రపంచ పోలీసు అమెరికా తాజాగా ఇరాన్‌పై కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, పొర

Published: Sat,October 6, 2012 05:07 PM

పోస్కోపై పోరాటం..

అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మూలవాసుల బతుకులను ఆగం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా వర్తమానంలో కొనసాగుతున్న ఉద్యమాల్లో పోస్

Published: Sat,October 6, 2012 05:07 PM

పౌరులపై ‘సాయుధ’చట్టం!

ఇరోం షర్మిల చాను.. ఈ పేరు వినని వారు అరుదు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ 2000 నవంబర్ 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ

Published: Sat,October 6, 2012 05:08 PM

శ్రీలంక పాలకులకు టైగర్ ఫోబియా

మన పొరుగున ఉన్న శ్రీలంక పాలకులకు ప్రస్తుతం టైగర్ల భయం పట్టుకున్నది. రెండున్నర దశాబ్దాల పాటు ఎల్‌టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్

Published: Sat,October 6, 2012 05:08 PM

అమెరికాలో నయా బానిసలు..

ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికాలో సరికొత్త వ్యాపారం వర్ధిల్లుతోంది. జైళ్ల లో ఉండే ఖైదీలను కట్టుబానిసలుగా మార్చి బహుళజాతి కంపెనీ

Featured Articles