ఇరాన్‌పై యుద్ధ మేఘాలు


Sat,October 6, 2012 05:08 PM

ప్రపంచ పోలీసు అమెరికా తాజాగా ఇరాన్‌పై కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, పొరుగు దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతోందని, రహస్యంగా అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తూ అంతర్జాతీయ అణు ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిప్తోందని ఆరోపిస్తూ ఇరాన్‌పై సైనిక దాడికి సిద్ధమవుతోంది. కొత్త సంవత్సరానికి ముందు అధ్యక్షుడు ఒబామా ఇరాన్ సెంట్రల్ బ్యాంకుపై ఆర్థిక ఆంక్షలు విధించే ఆదేశాలపై సంతకాలు చేశారు. ఆ దేశ కరెన్సీ‘రియాల్’విలువ 12 శాతం పడిపోయేలా చర్యలు చేపట్టారు. అమెరికా సహా పశ్చిమ దేశాలు ఇరాన్ నుంచి చమురు దిగుమతిని నిలిపివేశాయి. ఇరాన్ సంస్థల వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడాన్ని నిషేధించాయి. బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశాయి. యూరోపులో ఉన్న 180 మంది ఇరాన్ రాయబార కార్యాలయాల అధికారులను దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆజ్ఞాపించాయి. కాగా, సైనికేతర అవసరాల కోసం మాత్రమే తాము అణు కార్యక్షికమాన్ని చేబట్టామని, పొరుగు దేశాలను రెచ్చగొట్టే చర్యలకు తాము పూనుకోలేదని, తన స్వప్రయోజనాల కోసమే అమెరికా ఈ ఆరోపణలు చేస్తోందని ఇరాన్ వాదిస్తోంది.

ఏకపక్షంగా ఆం క్షలు విధించడాన్ని తప్పు పడుతూ తాటాకు చప్పుళ్లకు తాము బెదరబోమని, దాడి చేస్తే ధీటుగా జవాబు చెబుతామని హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిని మూసివేసి గల్ఫ్ నుంచి యూరప్‌కు చమురు రవాణాను స్తంభింపజేస్తామని హెచ్చరించింది. సైనిక దాడికి ‘పశ్చిమ’మివూతులను ఒప్పించే పనిలో అమెరికా ఉంటే, మూడవ ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నం ఇరాన్ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ చేస్తున్నారు. ఇరాన్ అణుశాస్త్రవేత్త ముస్తఫా అహ్మదీ-రోషన్‌ను కొంతమంది ఆగంతకులు జనవరి 11న పట్టపగలు టెహరాన్‌లో హత్యచేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.ఇప్పటికి నలుగురు శాస్త్రవేత్తలను ఈ విధంగా చంపారని ఇరాన్ ఆరోపించింది. దీంతో ప్రస్తుతం గల్ఫ్‌లో యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి.

ఇరాన్-అమెరికాల వైరం ఈనాటిది కాదు. 1979లో బద్దలైన ఇరాన్ విప్లవంలో అప్పటి వరకు అధికారంలో ఉన్న రాజు షా మహ్మద్ రెజా పహ్లవిని పదవీచ్యుతుని చేసి మత నాయకుడు ఆయతుల్లా ఖొమేని నాయకత్వంలో ఇస్లామిక్ విప్లవకారులు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటి నుంచీ రెండు దేశాల మధ్య శతృత్వం కొనసాగుతోంది. విప్లవ తదనంతర కాలంలో రాజును తమ దేశానికి అప్పగించాలని విప్లవ ప్రభుత్వం అమెరికాను కోరగా, అందుకు అగ్రరా జ్యం నిరాకరించి, షాకు ఆశ్రయం కల్పించడంతో వైరానికి తెరలేచింది. అదే సంవత్సరం నవంబర్ 4న విప్లవ విద్యార్థులు కొందరు టెహరాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించి అందులోని 52 మంది అధికారులను నిర్బంధించారు. 1980 ఏప్రిల్ 7న ఇరాన్‌తో తన రాయబార సంబంధాలను అమెరికా తెంచుకుంది. 24వ తేదీన బందీలను విడిపించడానికి అమెరికన్ సైన్యం విఫలయత్నం చేసి 8మంది సైనికులను కోల్పోయింది. చివరకు, అల్జీరియా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం 1981 జనవరి 20న బందీలను ఇరాన్ విడుదల చేసింది.

1980లో మొదలై ఎనిమిదేళ్ల పాటు కొనసాగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో అమెరికా ఏకపక్షంగా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి. ఇరాక్‌తో రాయబార సంబంధాలు లేనప్పటికీ ఆ దేశానికి సైనిక సహాయం చేసిందని, ఆంత్రాక్స్, బుబోనిక్ ప్లేగ్ వంటి రసాయనిక, జీవ ఆయుధాలను సైతం సమకూర్చిందని ఇరాన్ ఆరోపించింది. మరోవైపు వివిధ దేశాల్లో అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడులు చేసి విధ్వంసం సృష్టించిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు ఇస్తోందని అమెరికా ఆరోపించింది. ఈ కారణంతో 1987-88మధ్యలో రెండు సార్లు ఇరాన్ నావికాస్థావరాలు, చమురు క్షేత్రాలపై దాడులు చేసింది. క్లింటన్ అధికారంలోకి వచ్చాక 1995లో ఇరాన్‌పై పూర్తి స్థాయి ఆర్థిక ఆంక్షలు విధించారు.

జూనియర్ బుష్ కాలం(2001-08)లో ఇరాన్‌తో శతృత్వం మరింత పెరిగింది. ఉత్తర కొరియా, ఇరాక్‌లతో కలిపి ఇరాన్‌ను ఆయన దుష్టవూతయంగా వర్ణించారు. ఇరాక్‌పై దాడి నేపథ్యంలో ఇరాన్‌తో సంబంధాలు మెరుగుపడవచ్చన్న పరిశీలకుల అంచనాలకు భిన్నంగా అమెరికా ఆ దేశంతో శత్రుపూరిత వైఖరిని కొనసాగించింది. ఇరాక్ భూభాగం నుంచి మానవ రహిత విమానాలను పంపి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడం, ప్రభుత్వ వ్యతిరేక సంస్థలను చేరదీసి వారితో బాంబు దాడులు చేయించ డం, ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి అమెరికా దళాలు తూర్పు ఇరాన్‌లోకి చొచ్చుకురావడం వంటి ఘటనలు ఈ కాలంలో జరిగాయి.

2005లో మార్చ్‌లో అణ్వాయుధ రహిత దేశాలు ఆ ఆయుధాలను సమకూర్చుకునేందుకు చేసే ప్రయత్నాలను నివారించేందుకు లేదా అడ్డుకునేందుకు అవసరమైతే అణ్వాయుధాలను సైతం ప్రయోగించేలా అమెరికా తన విధానాన్ని సవరించుకుంది. ఆగస్టులో సంప్రదాయవాదీ, అమెరికా ఆధిపత్యవాదానికి బద్దవ్యతిరేకీ అయిన ప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ పగ్గాలు చేబట్టారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.2006 లో ఇంటెలిజెన్స్ సమాచార సేకరణకు ప్రత్యేక ఇరానియన్ డైరెక్టరేట్‌ను పెంటగాన్ ఏర్పాటు చేసింది. రెండు దేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించే దిశలో కొన్ని ప్రతిపాదనలతో నెజాద్ బుష్‌కు లేఖ రాయగా దానిని అమెరికా తిరస్కరించింది. పైగా, యురేనియం శుద్ధి ప్రక్రియను చేబడుతున్నందుకు ఇరాన్‌పై చర్య తప్పదని బుష్ హెచ్చరించారు. ఇదేకాలంలో ఇరాన్ భూభాగంలో అమెరికా ప్రత్యక్ష పరోక్ష దాడులు క్రమంగా పెరిగాయి. అధ్యక్షుని ఆమోదంతోనే సీఐఏ, జాయింట్ ఫోర్సెస్8 కమాండ్‌ల సారథ్యంలో దక్షిణ ఇరాక్ స్థావరంగా ఇరాన్ సరిహద్దుల్లోకి పలుమార్లు అమెరికన్ బలగాలు చొచ్చుకెళ్లాయి. ఇరాక్‌లోని ఎర్బిల్‌లో ఉన్న ఇరాన్ కాన్సులేట్‌పై దాడి చేసి ఐదుగురు రాయబార సిబ్బందిని బంధించి కీలక పత్రాలు ఎత్తుకెళ్లాయి.

2009లో ఒబామా పగ్గాలు చేబట్టాక ఇరాన్-అమెరికా సంబంధాల్లో గణనీయ మార్పు వస్తుందని ఆశించిన పరిశీలకులు మరోసారి భంగపడ్డారు. ప్రారంభంలో ఇరుపక్షాల నుంచీ సానుకూల సంకేతాలు వెలువడ్డా అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. 2009 మేలో ఇరాన్‌కు చెందిన అణుశాస్త్రవేత్త షహ్రామ్ అమీరీని అమెరికా బలగాలు ఎత్తుకెళ్లడంతో రెండు దేశాల మధ్య మరోసారి పగ రగిలింది. ప్రతీకార చర్యగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాను నిషేధిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
మరోవైపు, మధ్యధరా ప్రాంతంలో బలీయమైన శక్తిగా ఎదగడం కోసం ఇరాన్-సౌదీ అరేబియా దేశాల మధ్య పోటీ తీవ్రమైంది. అమెరికా అండదండలు దండిగా ఉన్న సౌదీ అరేబియా ఇరాన్‌కు వ్యతిరేకంగా పొరుగు దేశాలను కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నది. ఇరాన్‌తో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వుతూ అమెరికాను రంగంలోకి దించడానికి తహతహలాడుతున్నది.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సంక్షోభానికి తెరలేచింది. ఫోడ్రో యురేనియం శుద్ధి కర్మాగారం త్వరలో తన పనిని ప్రారంభించబోతున్నదని ఇరాన్ అణుశక్తి సంస్థ అధినేత ఫెరిడూన్ అబ్బాసీ-దవానీ ప్రకటించడంతో ఉద్రిక్తతలకు తెరలేచింది. అయితే, ఈ కర్మాగారంలో తయారయ్యే యురేనియం న్యూక్లియార్ వార్‌హెడ్‌లకు ఉపయోగపడదని, విద్యుత్, సైనికేతర అవసరాలకు ఉపయోగపడే 3.5 శాతం, 4 శాతం, 20 శాతం రకాల యురేనియంను మాత్రమే తాము తయారుచేయ తలపెట్టామని ఆయన స్పష్టం చేశారు. ఈ వాదనలను అమెరికా తిరస్కరిస్తోంది. శాంతియుత అవసరాలకు మాత్రమే అణుశక్తిని ఉపయోగించేటట్టయితే అంతర్జాతీయ పరిశీలకుల పర్యవేక్షణను ఇరాన్ ఎందుకు నిరాకరిస్తోందని ప్రశ్నిస్తోంది. కుక్కను పిచ్చి కుక్కగా ప్రచారం చేసి న్యాయబద్ధంగా, చట్టబద్దంగా చంపడమన్నది అమెరికా పాలకులు అనుసరిస్తున్న పద్ధతి. కొరియా నుంచి ఇరాక్ వరకు, నొరీగా నుంచి గఢాఫీ వరకు జరిగిందిదే. ఇదే విధానాన్ని ప్రస్తుతం ఇరాన్ విషయంలోనూ అనుసరిస్తోంది. అమెరికా ఏకపక్ష ధోరణిని, ఇరాన్‌పై తలపెట్టిన దాడిని ప్రపంచ దేశాలు ముక్తకం వ్యతిరేకించాలి. శాంతియుత అవసరాలకు అణుశక్తిని వాడుకునే హక్కు ప్రతి దేశానికీ ఉందన్న ఇరాన్ వాదనకు మద్దతునివ్వాలి. ప్రపంచ శాంతిని కాపాడాలి.
- డి. మార్కండేయ
dmk@namasthetelangaana.com

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్