పౌరులపై ‘సాయుధ’చట్టం!


Sat,October 6, 2012 05:07 PM

0militory-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఇరోం షర్మిల చాను.. ఈ పేరు వినని వారు అరుదు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ 2000 నవంబర్ 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ సంచలనం సృష్టిస్తున్నది. ఆ రాష్ట్రంలోని మలోం గ్రామ సమీపాన ఓ బస్టాపు వద్ద నిలబడివున్న ప్రయాణికులపై అస్సాం రైఫిల్స్ జవాన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 10 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన నేపథ్యంలో మరుసటి రోజు షర్మిల తన దీక్షను మొదలుపెట్టింది. ఎవరిని కాల్చుతున్నామో కూడా పట్టించుకోకుండా ప్రజలపై గుళ్ల వర్షాన్ని కురిపించే అధికారాన్ని జవాన్లకు దఖలు పర్చిన ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టా’న్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నది. నాటినుంచి ఆమె పోలీసుల నిర్బంధంలోనే ఉన్నది. భారత శిక్షాస్మృతిలోని 309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యాయత్నం కింద ఆమెపై నేరం మోపారు. ఈ నేరం కింద ఏడాది పాటు జైలుశిక్ష విధించవచ్చు.

శిక్ష విధించడం, విడుదలైన రోజునే మళ్లీ లాంఛనంగా అరెస్టు చేయడం, తిరిగి ఏడాది శిక్ష వేయడం.. ఇలా పదకొండేళ్లుగా ఇంఫాల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆస్పత్రి షర్మిల పాలిట జైలుగా మారింది. ముక్కులో చొప్పించిన పైపుల ద్వారా బలవంతంగా ఆమె శరీరంలోకి ద్రవపదార్థాలు పంపిస్తున్నారు. పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాశవిక చట్టాన్ని రద్దు చేసేవరకు తన దీక్షను విరమించేది లేదని చెప్తోంది.
షర్మిల దీక్షతో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం(ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ) వార్తల్లోకెక్కింది. 1958మే 22న ఆర్డినెన్స్‌గా అమల్లోకి వచ్చి ఆ తర్వాత పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టం సైజులో చాలా చిన్నది. అధికారాల విషయంలో అతి పెద్దది. ఒకే పేజీలో, కేవలం ఆరు సెక్షన్లలో భారత సాయుధ బలగాలకు అపరిమితమైన అధికారాలను ఇది కట్టబెట్టింది.

కల్లోలిత ప్రాంతంగా రాష్ట్ర గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఓ ప్రాంతంలో పనిచేస్తున్న పారా మిలిటరీ లేదా ఆర్మీకి చెందిన కమీషన్‌డ్ లేదా నాన్ కమీషన్‌డ్ లేదా వారంట్ అధికారులకు కార్యనిర్వాహక అధికారాలే కాకుండా మెజిస్టీరియల్ అధికారాలను కూడా ఈ చట్టం కల్పించింది. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని లేదా ఉల్లంఘించే అవకాశముందని తాము భావిస్తే చాలు.. ఎవరిపైనైనా కాల్పులు జరపొచ్చు. చంపవచ్చు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడరాదనే నిబంధనను అతిక్షికమించినా బలవూపయోగం చేయవచ్చు. సాయుధులు దాగివున్నారని లేదా మందుగుండు దాచారని భావించిన నివాసాలను ధ్వంసం చేయవచ్చు. నేరం చేశాడని భావించిన ఏ వ్యక్తినైనా వారంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు. ఈ చట్ట పరిధిలో చర్యలకు పాల్పడిన వారిని ప్రాసిక్యూట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే విచారణకు అనుమతించాలి.

కల్లోలిత ప్రాంతంగా ప్రకటించడానికి ఒక రాష్ట్రంలో లేదా రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో నెలకొని ఉండాల్సిన పరిస్థితులపై ఈ చట్టంలో ఎ లాంటి వివరణా లేదు. శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందన్న కారణంతో రాష్ట్ర గవర్నర్ కాని, కేంద్ర ప్రభుత్వం నేరుగా కాని ఒక ప్రాంతాన్ని కల్లోలితంగా ప్రకటించి మిలిటరీని దించవచ్చు. ఆయా రాష్ట్రాల శాసనవ్యవస్థల ప్రసక్తి లేకుండానే గవర్నర్ సైనిక బలగాలకు అపరిమితమైన అధికారాలను కట్టబెట్టవచ్చు. శత్రు దేశంపై యుద్ధం ప్రకటించాలన్నా అంతర్జాతీయ సమాజానికి కారణాలు చెప్పాల్సివున్న నేటి కాలంలో తనదే అయిన రాష్ట్రం లో మిలిటరీని దించడాని ఓ పెన్నుపోటు సరిపోవడం భారత ప్రజాస్వామ్యానికే చెల్లుతుంది. 53 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లో, 1990 నుంచి జమ్మూ-కాశ్మీర్‌లో ఈ చట్టం అమలులో ఉన్నది. ఆరు నెలలు లేదా ఏడాదికి ఒకసారి ఈ చట్టాన్ని కేంద్రం సూచన మేరకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు పొడిగిస్తున్నారు.

ఉగ్రవాదుల ఆగడాలు మితిమీరిపోయాయని, దేశభవూదతకు ప్రమాదముందని, స్థానిక పోలీసు బలగాలు అదుపులో చేయలేకపోతున్నాయని ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రాల్లో సైనిక పాలన సాగుతున్నది. హక్కుల ఉల్లంఘనలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో సైనిక, పారామిలిటరీ బలగాల చేతిలో వేలాది మంది మరణించారు. కస్టడీ చావులు, మహిళలపై అత్యాచారాలు,నిత్యకృత్యమయ్యాయి. గ్రామాలను చుట్టుముట్టి సోదా పేరిట ప్రజల ఆస్తులను లూటీ చేయడం సాధారణమైంది.

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీవించే హక్కును, భావవూపకటన స్వేచ్ఛను, శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛను, దేశంలో ఎక్కడైనా సంచరించే, ఏ వృత్తినైనా ఏ మతానై్ననా స్వీకరించే వీలును, విచక్షణారహిత అరెస్టుల నుంచి రక్షణను ఈ చట్టం పౌరుల నుంచి హరిస్తున్నదని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. నేరం చేశాడని నిరూపితమయ్యే వరకు ఒక వ్యక్తిని నిరపరాధిగానే భావించాలని మన సాధారణ చట్టాలు చెబుతుండగా ఏ ఆధారం లేకుండా ఓ వ్యక్తిని అరెస్టు చేసే అధికారాన్ని, బలవూపయోగం చేసైనా నేరాన్ని ఒప్పించే వీలును ఈ ప్రత్యేక చట్టం కల్పిస్తున్నదని వీరు చెబుతున్నారు. పైగా శత్రు సైన్యాలను మట్టుబెట్టడంలో ఆరితేరివుండే సైనికులకు శాంతి భద్రతల సమస్యను, రోజువారీ వ్యవహారాలను అప్పగించడం వల్ల వాళ్లు ప్రతి ఒక్కరినీ శత్రువులుగా, ఉగ్రవాదులుగా చూసే అవకాశం ఎక్కువని, ఫలితంగానే ఈశాన్యంలో, కాశ్మీర్‌లో బూటకపు ఎన్‌కౌంటర్లు, పౌరులపై కాల్పులు, వేధింపులు, ఇతర హక్కుల ఉల్లంఘనలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం కూడా ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వలసవాద యుగానికి చెందిన కాలం చెల్లిన ఈ చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలని సమితికి చెందిన మానవ హక్కుల కమిషనర్ నవనీతం పిళె్లై డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగానికి, అణచివేతకు, వివక్షకు ఈ చట్టం సాధనంగా మారిందని హ్యూమన్ రైట్స్ వాచ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించాయి. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలను అంతర్జాతీయ రెడ్‌క్షికాస్ ధృవీకరించింది. భార త రక్షణ వ్యవహారాల అధ్యయన సంస్థ(ఐడీఎస్‌ఏ) సైతం సైనిక బలగాలు హద్దుమీరి అధికార దుర్వినియోగం చేస్తున్నాయని స్థానికులు విశ్వసిస్తున్నారని తన నివేదికలో పేర్కొంది. తన లీకులతో సంచలనాలు సృష్టిస్తున్న వికీలీక్స్ సాయుధబలగాల ప్రత్యేకాధికారాల చట్టం విషయంలో కూడా నమ్మలేని కొన్ని నిజాలను బహిర్గతం చేసింది. ఈశాన్యంలో, కాశ్మీర్‌లో నిర్బంధితులను తీవ్రంగా కొట్టడం, కరెంట్ షాక్ ఇవ్వడం సాధారణమైందని, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, మణిపూర్ లో అస్సాం రైఫిల్స్ దౌర్జన్యాలను ఆ రాష్ట్ర గవర్నరే స్వయంగా అంగీకరించారని ఈ కేబుల్స్ వెల్లడిస్తున్నాయి.

ఈశాన్యంలోను, జమ్మూ-కాశ్మీర్‌లోను నిరసన వెల్లువ పెల్లుబికింది. మెజారిటీ ప్రజల అభివూపాయంతో నిమిత్తం లేకుండా భారత ప్రభుత్వం తమ రాష్ట్రాలను కుట్రపూరితంగా ఆక్రమించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలను సైనికంగా అణచివేయడానికి వ్యతిరేకంగా ఈశాన్యంలో ఎన్నో పోరాట సంస్థలు పుట్టుకొచ్చాయి. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఎత్తివేయాలని ఉద్యమాలు చేశాయి. 2000లో షర్మిల దీక్ష, 2004లో మరో మణిపురీ మహిళ మనోరమను అస్సాం రైఫిల్స్ బలగాలు బంధించి అత్యాచారం చేసి చంపడం నేపథ్యంలో ఈ చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలన్న డిమాండ్ తీవ్రమైంది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ చట్టంలోని అమానవీయ అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు జస్టిస్ బీ పీ జీవన్‌డ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిషన్‌ను ఏర్పాటుచేసింది. 2005 జూన్ 6న కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

కమిషన్ నివేదిక ఆధారంగా ఈ చట్టాన్ని ‘మానవీయం’ చేస్తామని 2006 డిసెంబర్‌లో ప్రధాని ప్రకటించారు. అయితే ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ మన్మోహన్ హామీ బుట్టదాఖలే అయింది. ఈ చట్టం ఎత్తివేతను రక్షణ మంత్రి, సైనికాధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.
ఇంత దుర్మార్గమైన చట్టం మరొకటి లేదని అంతర్జాతీయ సమాజం, దేశీయ మానవ హక్కుల సంస్థలు కోడై కూస్తున్నా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పొడిగిస్తూనే ఉన్నది. ఇటీవలికాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో మామూలు పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర హోం శాఖ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. గత పదేళ్లలో ఈ రాష్ట్రాల్లో జరిగిన హింస కూడా తక్కువే. అనేక పోరాట సంస్థలు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుని సాయుధ పోరాట విరమణను ప్రకటించాయి. కాశ్మీర్‌లో సైతం ఉగ్రవాదుల చర్యలు తగ్గిన ఫలితంగా సర్కారు పాక్షికంగా బలగాలను ఉపసంహరించుకున్నది. ఈ నేపథ్యంలో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఎత్తివేసే విషయంలో మన్మోహన్ ప్రభుత్వం చర్యలు చేబట్టాలి. పౌరుల ప్రజాస్వామిక ఆకాంక్షలను గౌరవించి అన్ని రంగాల్లో న్యాయం చేసినప్పుడే శాంతి నెలకొంటుందని గుర్తించాలి.

డి. మార్కండేయ


35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ

Published: Sat,October 6, 2012 05:03 PM

సిరియాపై అమెరికా ‘ఉక్షిగ’నేత్రం..

అఫ్ఘనిస్తాన్.. ఇరాక్.. లిబియా.. ఇరాన్.. ఉత్తర కొరియా.. అమెరికా ఆగ్రహానికి గురైన దేశాల జాబితాలో తాజాగా సిరియా చేరింది. తనకు నచ్చితే

Published: Sat,October 6, 2012 05:03 PM

ఆ సంతోషాలు మనకెప్పుడు..?

ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ సంతోష సూచికను విడుదల చేసింది. ఇప్పటివరకూ మానవాభివృద్ధి సూచికను మాత్రమే ప్రతియేటా విడుదల చేస్తూ వస్తున

Published: Sat,October 6, 2012 05:03 PM

నక్సలిజంపై ‘కార్పొరేట్’ వార్..

నక్సలిజాన్ని అంతమొందించడంలో బహుళజాతి కంపెనీల సాయం పొందాలని కేంద్రం నిర్ణయించింది. మొన్నటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ

Published: Sat,October 6, 2012 05:04 PM

‘మానవరహిత’ యుద్ధం..

మావోయిస్టుల వేటలో మానవరహిత విమానాలను వాడాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి రెండేళ్ల క్రితమే ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంల

Published: Sat,October 6, 2012 05:04 PM

పేదరికం..అంకెల గారడీ..

దేశంలో ఎంత మంది పేదలున్నారన్న విషయంపై ఇటీవల ఉభయ సభల్లో పెద్ద దుమారం చెలరేగింది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ. 22. 42, పట్టణవూపాంతంల

Published: Sat,October 6, 2012 05:05 PM

స్వార్థం.. ఉద్యమాలపై అస్త్రం..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా ఎస్‌పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్

Published: Sat,October 6, 2012 05:05 PM

కూడంకుళం.. కుట్ర ఎవరిది?

కూడంకుళం.. ఈ పేరు ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. రష్యా సహకారం తో ₹ 17 వేల కోట్లతో తమిళనాడు కోస్తా తీరంలో ఉన్న ఈ గ్రామంలో చేపట్టి

Published: Sat,October 6, 2012 05:05 PM

‘బూర్జువా’ సైన్యంలో మావోయిస్టులు!

ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా జరగని అద్భుతం ఇప్పుడు నేపాల్‌లో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దం పాటు ఒకరినొకరు చంపుకునే పనిలో నిమగ్నమై కనీసం 13

Published: Sat,October 6, 2012 05:07 PM

రాష్ట్రాల హక్కులపై ‘ఉగ్ర’ కేంద్రం..

టెర్రరిస్టు కార్యకలాపాలను సమర్థవంతంగా అణచివేసే ఉద్దేశంతో జాతీ య ఉగ్రవాద వ్యతిరేక కేంద్రాన్ని (ఎన్‌సీటీసీ) ఏర్పాటుచేస్తూ ఫిబ్రవరి 3

Published: Sat,October 6, 2012 05:06 PM

నల్లధనం.. ‘తెల్ల’ బతుకులు..

బారతీయులకు చెందిన సుమారు 25 లక్షల కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువవున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ వెల్లడించా

Published: Sat,October 6, 2012 05:06 PM

తాగునీటి పరాయీకరణ..

పీల్చే గాలి లాగే తాగే నీరూ ఉచితమనుకుంటున్న వారికి దుర్వార్త. మినరల్ వాటర్ పేరుతో ఇప్పటికే నీటిని అమ్మకపు సరుకుగా మార్చి దండి గా

Published: Sat,October 6, 2012 05:06 PM

ఈశాన్య భారతంలో విప్లవం

జాతుల తిరుగుబాట్లకు ప్రసిద్ధిగాంచిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా మావోయిస్టుల రంగవూపవేశంతో మరోసారి వేడెక్కాయి. దశాబ్దాలుగా సాయు ధ ఉద్యమ

Published: Mon,July 15, 2013 05:26 PM

బాలలు.. హక్కులు.. చట్టాలు..

ప్రవాస భారతీయులు అనురూప్, సాగరిక భట్టాచార్యల పిల్లల కస్టడీ వ్యవహారంతో బాలల హక్కులు, చట్టాలపై మరోమారు చర్చ మొదలైంది. నార్వేలో భూవిజ

Published: Mon,July 15, 2013 05:25 PM

‘ఆధార్’ గందరగోళం..

పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులందించే ‘ఆధార్’ ప్రాజెక్టు అనిశ్చితస్థితిలో పడింది. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని టెంభ్

Published: Sat,October 6, 2012 05:08 PM

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు

ప్రపంచ పోలీసు అమెరికా తాజాగా ఇరాన్‌పై కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, పొర

Published: Sat,October 6, 2012 05:07 PM

పోస్కోపై పోరాటం..

అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మూలవాసుల బతుకులను ఆగం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా వర్తమానంలో కొనసాగుతున్న ఉద్యమాల్లో పోస్

Published: Sat,October 6, 2012 05:08 PM

శ్రీలంక పాలకులకు టైగర్ ఫోబియా

మన పొరుగున ఉన్న శ్రీలంక పాలకులకు ప్రస్తుతం టైగర్ల భయం పట్టుకున్నది. రెండున్నర దశాబ్దాల పాటు ఎల్‌టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్

Published: Sat,October 6, 2012 05:08 PM

అమెరికాలో నయా బానిసలు..

ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికాలో సరికొత్త వ్యాపారం వర్ధిల్లుతోంది. జైళ్ల లో ఉండే ఖైదీలను కట్టుబానిసలుగా మార్చి బహుళజాతి కంపెనీ