శ్రీలంక పాలకులకు టైగర్ ఫోబియా


Sat,October 6, 2012 05:08 PM

ltte053-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaమన పొరుగున ఉన్న శ్రీలంక పాలకులకు ప్రస్తుతం టైగర్ల భయం పట్టుకున్నది. రెండున్నర దశాబ్దాల పాటు ఎల్‌టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం)తో కొనసాగిన యుద్ధంలో రెండున్నరేళ్ల కిందట ప్రభుత్వ బలగాలు నిర్ణయాత్మ క విజయం సాధించాయి. టైగర్ల అగ్రనేత వేలుపిళ్లె ప్రభాకరన్‌తో సహా కీలక నేతలు, కమాండర్లు ఆ పోరులో నేలకొరిగారు. మిగిలిన వారు యుద్ధఖైదీలుగా చిక్కి శ్రీలంకలోని వివిధ జైళ్లలో విచారణ నెదుర్కొంటున్నారు. సుదీర్ఘకాలం సింహళ సైన్యాలతో పోరాడి చివరకు ఓడిపోయి నైతిక స్థయిర్యం కోల్పోయి దీనస్థితిలో తమిళ ప్రజలున్నారు. ఈ పరిస్థితుల్లో హుందాగా వ్యవహరించాల్సిన శ్రీలంక పాలకవర్గాలు తమిళ ప్రాంతాలను సైనిక బలగాలతో నింపి ప్రజలను భీతావహులు చేస్తున్నాయి.

భవిష్యత్తులో ఏ సంస్థా సాయుధంగానో, శాంతియుతంగానో తమిళజాతిపై కొనసాగుతున్న వివక్షపై పోరాడలేని స్థితిని తేవడానికి శతవిధాలా యత్నిస్తున్నారు. ఉత్తర, తూర్పు రాష్ట్రా ల్లో సర్వాధికారాలు మిలిటరీ అధికారులకే కట్టబెట్టారు. తమిళులు మెజారిటీగా ఉండే ఈ ప్రాంతాలను యుద్ధవూపాతిపదికన సింహళీయుల ‘వలసలు’గా మార్చేస్తున్నారు. సైనిక కంటోన్మెంట్ల పేరుతో, హైసెక్యూరిటీ జోన్లు, అభివృద్ధి ప్రాజెక్టులు, చారివూతక, పవిత్ర స్థలాల పరిరక్షణ పేరుతో ఈ రెండు రాష్ట్రాల విస్తీర్ణంలో 37 శాతం భూభాగాన్ని ఇప్పటికే ప్రభుత్వ బలగాలు, సింహళ వలసవాదులు వశం చేసుకున్నారు. ఇక్కడి వనరులపై కన్నేసిన సింహళ పెట్టుబడిదారులు ఇదే అదునుగా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. దక్షిణాది నుంచి ఇక్కడికి భారీ ఎత్తున వలసలు సాగుతున్నాయి. టైగర్లకు మద్దతుదార్లని, సానుభూతిపరులని వేలాదిమందిని రకరకాల వేధింపులకు గురిచేస్తున్నారు. బతికుంటే బలుసాకు తినవచ్చనే రీతిలో ఇతర దేశాలకు పారిపోయే స్థితిని కల్పిస్తున్నారు. తమిళ ఈలంలో తమిళులను మైనారిటీలుగా మార్చడమే వారి ప్రధాన వ్యూహంగా వ్యవహరిస్తున్నారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తమను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తూ సింహళీయులే రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో వివక్షకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో, వివిధ సంస్థలు, పార్టీల నేతృత్వంలో పోరాడిన శ్రీలంక తమిళులు చివరకు ఎల్‌టీటీఈ నాయకత్వంలో సాయుధపోరుకు సిద్ధపడ్డారు, మెజారిటీ ప్రాంతాలను సింహళ సైన్యాల నుంచి విముక్తం చేసి ‘స్వయం పాలన’ను ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 26ఏళ్ల పాటు ‘యుద్ధం-శాంతి-యుద్ధం’ పద్ధతుల్లో బతికారు.చివరకు 2009 మేలో జరిగిన అంతిమ పోరులో ఓడిపోయారు. ఈ యుద్ధంలో 28 వేల మంది తమిళ గెరిల్లాలు, 24 వేల మంది శ్రీలంక సైనికులు, పోలీసులు, 1155 మంది భారత సైనికులతోపాటు కనీసం 40-50 వేల మందికి పైగా సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

2009 జనవరి నుంచి మే మధ్య సాగిన అంతిమ సమరంలోనే ఐదువేల మంది టైగర్లతో పాటు సుమారు 40వేల మంది తమిళ ప్రజలు ఊచకోతకు గురైనట్లు అంతర్జాతీయ సంస్థల అంచనా.
ఓడిపోయిన ప్రజల పట్ల కనీస యుద్ధనీతిని, మానవతను కూడా ప్రదర్శించకుండా శ్రీలంక ప్రభుత్వం ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఘోర దమనకాండకు పూనుకుంటున్నది. యుద్ధం ముగిసి రెండున్నరేళ్లు దాటినా అనధికారికంగా సైనిక పాలనే కొనసాగిస్తున్నది. అంతర్జాతీయ వేదికలపైన ఎల్‌టీటీఈ టెర్రరిజాన్ని మాత్రమే అంతం చేశామ ని, తమిళులు తమ దేశంలో అంతర్భాగమనీ, ఈలం యుద్ధంలో పౌరుల ఊచకోతలు జరగలేదనీ, త్వరలోనే సమస్యను రాజకీయంగా పరిష్కరిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే ప్రభుత్వ పెద్దలు.. స్వదేశంలో మాత్రం దమన నీతినే అమలుచేస్తున్నారు. ‘రాజకీయ పరిష్కారం గురించి మాట్లాడడం అనవసరమని, టైగర్లను అంతం చేయడమే అసలు విషయమ’ని స్వయంగా ఆ దేశ రక్షణ మంత్రి, అధ్యక్షుడు మహింద రాజపక్సేకు సోదరుడు అయిన గోతభయ రాజపక్సే ప్రక టించాడు. అధ్యక్షుడు మహింద కూడా విజయగర్వంతో తాను ప్రవచించిందే ప్రజాస్వామ్యమన్న రీతిలో ప్రవర్తిస్తున్నాడు.

భయంకరమైన ఓ భూతాన్ని కష్టమో నష్టమో ఓర్చుకుని అంతం చేశామని, తమిళులు మళ్లీ తలెత్తుకోకుండా, సమైక్యం కాకుండా, సంస్థలు పెట్టుకోకుండా ఎంతకైనా తెగిద్దామనే తీరుతో సింహళ పాలకవర్గాలున్నాయి. అందుకే 2009 మే తదనంతర కాలంలో తమిళ జాతి ఆత్మగౌరవాన్ని, పోరాట పటిమను నీరుగార్చడానికి వారికి స్వంత భూభాగం లేకుండా చేస్తున్నారు.
ఈ కుట్రల్లో ముఖమైనది వలసీకరణ. ఉత్తర, తూర్పు రాష్ట్రాల విస్తీర్ణం 18,800 చ.కి.మీ. కాగా అందులో 7వేల చ.కి.మీ. భూభాగాన్ని మిలిటరీ తమ స్వాధీనంలోకి తీసుకున్నది. పౌరవూపాంతాల్లో కనీసం మూడవ వంతు మిలిటరీ ఆధీనంలో ఉండాలనే విధానాన్ని కొనసాగిస్తున్నది. తమిళులు నివసించే పలు పట్టణాలను, గ్రామాలను వివిధ చట్టాలు, సర్క్యులర్ల ద్వారా వశం చేసుకుంటూ ఈ ప్రాంతాలకు సింహళీయుల వలసను ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం పట్టణాభివృద్ధి శాఖను గోతభయ ఆధీనంలో ఉన్న రక్షణ శాఖ పరిధిలోకి తెచ్చారు. తమిళుల ఆధీనంలో ఉన్న ప్రైవేటు భూములను కూడా దఖలు పరుచుకునే అధికారమిచ్చే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆర్డినెనెన్స్-2011 బిల్లు రూపొందించారు.

ఇప్పుడక్కడ సైన్యం, పట్టణాభివృద్ధి అధికారులు కలిసి తిరుగుతూ వ్యూహాలు రచిస్తున్నారు. జాఫ్నా జిల్లా విస్తీర్ణంలో 30 శాతం భూభాగాన్ని మిలిటరీ హైసెక్యూరిటీ జోన్‌గా ప్రకటించింది. కంకేశన్‌తురై, కిలాలి, మాతక్కల్, మందైత్తీవు, కెయిట్స్ తదితర అనేక దీవులు ఇందులో భాగంగా సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయాయి. భట్టికలోవా జిల్లాలో కూడా 15-20 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం వశం చేసుకోజూస్తున్నది. జిల్లా సరిహద్దు గ్రామం మంగ్‌కలఆరులోని 2500 ఎకరాల భూమిని సింహళ, విదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టారు. ఈ ఊరి పేరును సైతం మంగళగామగా సైన్యం మార్చేసింది. అలాగే, పద్దిపజయి డివిజన్‌కు చెందిన దేవులాలకులం గ్రామానికి చెందిన పచ్చని పంటపొలాలను సైనికుల సహాయంతో సింహళీయులు ఆక్రమించారు. సహజవనరులు అధికంగా ఉన్న మరో ఆరు గ్రామాలను ముస్లింలు అధికంగా నివసించే అంపరాయ్ జిల్లాలో విలీనం చేస్తున్నారు.

కబ్జాలకు ఇది మొదటిమెట్టని వేరే చెప్పనక్కరలేదు. ఈ గ్రామాల్లో ఒకటైన కెవులియమడులోని 114 తమిళ కుటుంబాలకు చెందిన భూములను 108 సింహళ కుటుంబాలు కబ్జా చేశాయి. మన్నార్ జిల్లా చెల్వియారి ప్రాంతంలో కంటోన్మెంట్ నిర్మాణం పేరుతో వేల ఎకరాల భూమిని కాజేశారు. బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పేరుతో ట్రింకోమలి జిల్లాలోని చంపూరు ఏరియాలో 10 వేల ఎకరాలను ‘హై సెక్యూరిటీ జోన్’గా ప్రకటించారు. ఫలితంగా 10వేల మంది తమిళులు నిరాక్షిశయులయ్యారు. ఇదే జిల్లాలోని తిరియాయ్ అనే తమిళ గ్రామంలోని బుద్ధ విహార్ పరిరక్షణ మిషతో 3వేల ఎకరాలను కాజేశారు. అభివృద్ధి పథకాల పేరుతో వన్ని అడవుల్లో అధికభాగాన్ని సైన్యం ఆక్రమించుకునివుంది.

తమిళ ప్రజలపై ఆగని వేధింపులు మరోగాథ. యుద్ధం ముగిసినా, పూర్తిస్థాయిలో టైగర్ల భౌతిక నిర్మూలన జరిగినా ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో ప్రభుత్వ బలగాల దమనకాండ ఆగలేదు. ఒకప్పుడు ఎల్‌టీటీఈలో పని చేశారనో, ఆ సంస్థకు వివిధ రకాలుగా మద్దతు ఇచ్చారనో, ఇక్కడి విషయాలను విదేశాల్లో ఉన్న టైగర్ల సానుభూతిపరులకు చేరవేస్తున్నారనో, సైన్యానికి సహకరించడం లేదనో పోలీసులు, సైనికులు తమిళులను వేధిస్తున్నారు. తమిళుల రోజువారీ జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు. అరెస్టులు, జైలునిర్బంధాలు కొనసాగుతూనేవున్నాయి. తమిళ పౌరుల ఊచకోతకు సాక్షులుగా ఉన్నారనే మిషతో ఇటీవల వివిధ జిల్లాల్లో ఇంటెలిజెన్స్ సంస్థలు అనేక మందిని నిర్బంధించాయి. జాఫ్నా, భట్టికలోవా, అంపరాయ్, ట్రింకోమలి, మన్నార్ తదితర జిల్లాల్లో పోలీసులు ఇల్లిల్లు తిరిగి వ్యక్తుల సమాచారం సేకరించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

మరోవైపు, ధరల నియంవూతణ పేరుతో, తూనికలు-కొలతలు, క్వాలిటీ కంట్రోల్ పేరుతో, విద్యుత్ మీటర్ల తనిఖీ పేరుతో అధికారులు తమిళులను నంజుకుతింటున్నారు. 49సీసీ మోపెడ్లకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించినా, తమిళుల నుంచి పోలీసు లు బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. ఇక, పగలు రాత్రనకుండా గుర్తుతెలియని వ్యక్తులు ఇళ్లల్లో చొరబడి సామగ్రి లూటీ చేయడం సాధారణమై పోయింది. పోలీసులకు ఫి ర్యాదు చేసినా పట్టించుకోరు. ఈ వేధింపులన్నింటి సందే శం ఒకటే. ‘ఇక్కడుండదలుచుకుంటే బానిసలుగా బతకండి లేదంటే వేరే దేశం వెళ్లిపోండి’అని. తమిళులకు ఓ జాతిగా ఇక్కడ చోటులేదు. దీనంతటికి కారణం ముందే చెప్పినట్లు సింహళ పాలకులకు పట్టుకున్న టైగర్ ఫోబియా.

అయితే, ఇంత చేస్తున్నా మొన్న నవంబర్ 27న ‘హీరోస్ డే’ (అమరుల దినం) సందర్భంగా చారివూతక జాఫ్నా విశ్వవిద్యాలయంలో హాస్టల్ భవనంపై భారీ కాగడా వెలిగించారు. భట్టికలోవాలో ప్రభాకరన్ పుట్టిన రోజును ప్రజలు కేకులు, స్వీట్లతో ఘనంగా జరుపుకున్నారు. ఉత్తర, తూర్పు ప్రాంతమంతటిలో ఊరేగింపులను, సమావేశాలను, దేవాలయాల్లో పూజలను, చర్చిల్లో ప్రార్థనలను సైన్యం నిషేధించినా ప్రజలు ధిక్కరించారు. అమరుల స్మృతిలో ఇంటింటా దీపాలు వెలిగించారు. గల్లీల్లో కాగడాలు మండించారు. గుళ్లలో గంటలు మోగించారు. బ్రిటన్, నెదర్లాండ్స్, అమెరికా వంటి దేశాల్లో తమిళులు కూడా ‘హీరోస్ డే’ ను జరుపుకున్నారు.

శతాబ్దాలుగా స్వతంత్ర అస్తిత్వాన్ని కలిగివున్న ఓ జాతి ఆకాంక్షలను సైనికంగా అణచివేయడం సాధ్యం కాదని ఇప్పటికైనా సింహళ పాలకవర్గాలు గుర్తించాలి. పాతికేళ్ల పాటు సాయుధంగా పోరాడి తమిళులు సాధించుకున్న సార్వభౌమత్వాన్ని గౌరవించా లి. సుదీర్ఘ యుద్ధంలో టైగర్లు సహా ఇప్పటికే సుమారు లక్ష మంది తమిళుల నిర్మూలన, మరో 8 లక్షల మంది విదేశాలకు వలస వెళ్లిన నేపథ్యంలో సింహళ జాత్యహంకారుల చేతుల్లో తమిళ జాతి నాశనం జరుగకుండా, తమిళ ఈలం మరో పాలస్తీనా కాకుండా చూడాల్సిన బాధ్యత శ్రీలంక పాలకులపై ఉంది. అంతర్జాతీయ సమాజం కూడా వెంటనే జోక్యం చేసుకుని తమిళ జాతి సమస్యను న్యాయబద్ధంగా పరిష్కరించే దిశలో చర్యలు తీసుకోవాలి. వలసీకరణను, మానవహక్కుల ఉల్లంఘనలను, మిలిటరీ వేధింపులను ఆపేలా శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. తమిళజాతిని రక్షించుకోవాలి.

- డి.మార్కండేయ

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్