అమెరికాలో నయా బానిసలు..


Sat,October 6, 2012 05:08 PM

ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికాలో సరికొత్త వ్యాపారం వర్ధిల్లుతోంది. జైళ్ల లో ఉండే ఖైదీలను కట్టుబానిసలుగా మార్చి బహుళజాతి కంపెనీలు వంద ల కోట్లు గడిస్తున్నాయి. శతాబ్దాల క్రితం డబ్బూ మందీ మార్బలం ఉన్న తెల్ల దొరలు ఆఫ్రికా అడవుల నుంచి నల్ల జాతీయులను బంధించి తెచ్చి బానిసలుగా ఉపయోగించుకోవడం గురించి మనకు తెలుసు. కాని కుట్రపూరితంగా నేరాలను ప్రోత్సహిస్తూ, తదనుగుణంగా చట్టాలనూ, శిక్షలనూ ఇష్టానుసారం మార్చుకుంటూ ఖైదీలను నయా బానిసలుగా ఉపయోగించుకుంటున్న వైనం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ దేశంలోని ఫెడరల్, స్టేట్, కౌంటీ, ప్రైవేట్ జైళ్లలో ఉన్న సుమారు 23 లక్షల మంది ఖైదీలు రాత్రిళ్లు ఇరుకు గదుల్లో మగ్గుతూ పగటి పూట వివిధ పరిక్షిశమల్లో నామమావూత పు వేతనాలకు పని చేస్తున్నారు. బహుళజాతి కంపెనీలు ఈ జైళ్లతో కాంట్రాక్టు కుదుర్చుకుని లేదా తామే జైళ్లను నిర్వహిస్తూ సుమారు 30 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసుకుంటున్నాయి. కనీస వేతన చట్టం ప్రకారం గంటకు 7.25 డాలర్ల చొప్పున ఇవ్వాల్సివుండగా ఈ ఖైదీ శ్రామికులకు గంటకు 20 నుంచి 50 సెంట్లు మాత్రమే చెల్లిస్తున్నారు. నాటి బానిసల్లాగే వీరికి స్వేచ్ఛ లేదు. ఓటు హక్కుతో సహా ఏలాంటి హక్కులు లేవు. ప్రశ్నించే అధికారం లేదు. ఎదురు తిరిగితే గొడ్డును బాదినట్లు బాదుతారు. ఏ కంపెనీ లో పని చేయాలి? ఎంత కూలీకి పని చేయాలి? ఎన్ని గంటలు పని చేయాలి? ఇవేవీ వీరి చేతుల్లో ఉండవు. తిండి కూడా యజమానుల భిక్షే. జ్వరమొచ్చినా పట్టించుకునే నాథుడుండడు. జైలు పరిక్షిశమల అభివృద్ధి పేరుతో రిపబ్లికన్ రీగన్ హయాంలో మొదలైన ఈ నయా వ్యాపారం డెమోక్షికాట్ క్లింటన్ పాలనలో బాగా విస్తరించింది. నల్ల సూరీడుగా వినుతికెక్కిన ఒబామా నేతృత్వంలో ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఈ కొత్త వ్యాపారంతో పుంజుకోజూస్తున్నది.


ఈ బానిస వ్యాపారం ఉనికిలోకి రావడానికి బీజం 1980లలోనే పడింది. సంక్షోభం సుడిలో చిక్కుకున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేయడానికి స్వేచ్ఛా విపణి సిద్ధాంతం ప్రాతిపదికగా అభివృద్ధి పేరుతో, అవుట్ సోర్సింగ్ పేరుతో, సెజ్‌ల పేరుతో మూడవ ప్రపంచ దేశాల కార్మికశక్తిని కొల్లగొట్టడంతో పాటు స్వదేశంలోని జైళ్లలో మగ్గుతున్న లక్ష లాది మంది ఖైదీలను ఉపయోగించుకోవడానికి అమెరిక న్ ప్రభుత్వం, బహుళజాతి సంస్థలు వ్యూహాలు రచించా యి. బానిస వ్యవస్థను రద్దు చేస్తూనే ఖైదీలకు మినహాయింపునిచ్చిన 13వ రాజ్యాంగ సవరణను, తర్వాతి కాలంలో ఆ సవరణకు తూట్లు పొడుస్తూ దొడ్డిదారిన పెట్టుబడిదారు లు అమలు చేసిన ఖైదీలను లీజుకు తీసుకునే పద్ధతిని స్ఫూర్తిగా తీసుకుని కొత్త చట్టాలకు, విధానాలకు శ్రీకారం చుట్టాయి. బహుళజాతి సంస్థలు, చట్టసభల ప్రతినిధులతో కలిపి ఏర్పాటుచేసిన ది అమెరికన్ లెజిస్లేటర్స్ ఎక్స్చేంజ్ కౌన్సిల్ ఈ విధానాల రూపకల్పనకు వేదికైంది. ప్రిజన్ ఇండవూస్టీస్ యాక్ట్, ప్రిజన్ ఇండవూస్టీస్ ఎన్‌హాన్స్‌మెంట్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం తదితర చట్టాలు ఈ కాలంలోనే ఆమో దం పొందాయి. ఈ చట్టాల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న, అలాగే ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్న జైళ్లలోని ఖైదీలతో నిర్వాహకులు పని చేయించుకోవచ్చు. పని చేయ నిరాకరించిన వారిని వివిధ రకాల ఒత్తిడులకు గురి చేసే అధికారాన్ని ఈ చట్టాలు కల్పించాయి. వేతనాల రూపంలో వచ్చిన డబ్బును జైలు నిర్వహణ కోసం ఉపయోగించవచ్చు. ప్రైవేట్ కంపెనీలయితే లాభా లు రాబట్టుకోవచ్చు.

ఖైదీల సంఖ్యాబలాన్ని పెంచడానికి కూడా కొత్త చట్టాలను, విధానాలను అమలులోకి తెచ్చారు. తీవ్రమైన నేరా లు మూడుసార్లు చేసిన వారిని జీవితాంతం జైలులోనే ఉంచే చట్టం ఇందులో ఒకటి. దీంతో పాటు మత్తు పదార్థాలపై యుద్ధం పేరుతో ఒక కేంపెయిన్ ప్రారంభించారు. అతి తక్కువ పరిమాణంలో మత్తు పదార్థాలను కలిగివున్నా 5 నుంచి 10 ఏళ్ల ఖైదును విధించే అధికారం కోర్టులకిచ్చారు. 5 గ్రాముల రాక్ కొకెయిన్ లేదా 110 గ్రాముల హెరాయిన్ కలిగివున్నవారికి పెరోల్ లేకుండా ఐదేళ్ల శిక్ష, రెండు ఔన్సుల కంటే తక్కువ పరిమాణంలో రాక్ కొకెయిన్‌ను కలిగివున్న వారికి పదేళ్ల శిక్ష, 500 గ్రాముల కొకెయిన్‌ను కలిగివున్న వారికి ఐదేళ్ల శిక్ష విధించడానికి ఈ చట్టాలు వీలు కల్పిస్తాయి. విచివూతమేమిటంటే తెల్ల దొరలు, ధనిక వర్గాలు ఎక్కువగా ఉపయోగించే కొకెయిన్ 500 గ్రాములు దొరికినా, నల్ల జాతీయులు, పేద మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా వాడే రాక్ కొకెయిన్ 5 గ్రాములు దొరికినా ఒకటే శిక్షట. ఇక్కడే అమెరికన్ పాలకుల వివక్ష నగ్నంగా బయటపడుతుంది.

దరిమిలా అమెరికాలో రెండు ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి. జైళ్లలో శిక్షననుభవిస్తున్న ఖైదీలతో వారికిష్టమున్నా లేకున్నా పని చేయించడం మొదలైంది. కేంద్ర, రాష్ట్రాల జైళ్లలో వివిధ పరిక్షిశమలను స్థాపించి అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేయనారంభించారు. అనతికాలంలోనే ఈ జైలు పరిక్షిశమలు అతివేగంగా అభివృద్ధి చెందాయి. వాల్‌వూస్టీట్‌లో ఈ పరిక్షిశమల షేర్లకు డిమాండ్ పెరిగింది. లెఫ్ట్ బిజినెస్ అబ్జర్వర్ పత్రిక ప్రకారం మిలిటరీ ఉపయోగించే హెల్మెట్లు, ఆమ్యునిషన్ బెల్టులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తదితరం నూటికి నూరు శాతం ఈ పరిక్షిశమలే సరఫరా చేస్తున్నాయి. సైనికేతర ఉత్పత్తుల్లో పరికరాల అసెంబ్లీయింగ్‌లో 98 శాతం, పెయింట్లు, బ్రష్‌ల తయారీలో 93 శాతం, స్టౌలలో 92 శాతం, దేహధారణ వస్తువుల్లో 46 శాతం, గృహోపకరణాల్లో 36 శాతం, స్పీకర్లు, మైక్రోఫోన్లు, హెడ్‌ఫోన్లలో 30 శాతం, ఆఫీస్ ఫర్నిచర్‌లో 21 శాతం మార్కెట్ వాటాను ఈ పరిక్షిశమలు కలిగివున్నాయి. విమానాల విడిభాగాలు.. మందులు.. కాల్ సెంటర్ ఆపరేటర్లు.. చివరకు అంధులకు దారి చూపే శునకాలను పెంచే పనిని కూడా ఖైదీలు చేస్తున్నారు.

జైళ్ల ప్రైవేటీకరణ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. అమెరికాలో మొట్టమొదటి ప్రైవేట్ జైలు 1984లో నిర్మితమైంది. కరెక్షన్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా(సీసీ ఏ) పేరుతో ఓ బహుళజాతి కంపెనీ స్థాపించిన సంస్థ జైళ్లను నిర్మించి నిర్వహించడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అప్పటి నుంచి ప్రైవేట్ రంగం వేగంగా విస్తరించింది. 1987లో ప్రైవేట్ జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్య కేవలం 3,122 కాగా 2010 కల్లా ఆ సంఖ్య లక్షా 20 వేలకు చేరుకుంది. స్మిత్-బార్నీ, అమెరికన్ ఎక్స్‌వూపెస్, జనరల్ ఎలక్షిక్టిక్, ఏటీ అండ్ టీ, స్ప్రింట్ వంటి పేరొందిన సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించా యి. ప్రస్తుతం అక్కడ తక్కువ మంది గార్డులతో ఎక్కువ మంది ఖైదీలకు కాపలా కాసే అత్యాధునిక వ్యవస్థ కలిగిన సూపర్‌మ్యాక్స్ జైళ్ల యుగం నడుస్తోంది. శ్రమశక్తిపై తక్కువ వ్యయంతో ఎక్కువ లాభాలు ఆర్జించే ఉద్దేశంతో బహుళజాతి సంస్థలు ప్రైవేట్ జైళ్ల నిర్వహణ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి పోటీ పడుతున్నాయి. వివిధ కౌంటీల్లో, రాష్ట్రా ల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను రకరకాలుగా ఆశలు చూపి లొంగదీసుకోవడం, తాము పెట్టాలనుకున్న పరిక్షిశమను నెలకొల్పడం, దాని చుట్టూ హై సెక్యూరిటీ వాల్ నిర్మించి జైలుగా మార్చడం, కోట్లల్లో లాభాలు ఆర్జించడం ఇప్పుడక్కడ సర్వసాధారణమైంది. తాము ఒప్పందం కుదుర్చుకున్న కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కో ఖైదీకి రోజుకు 50 డాలర్ల చొప్పున ప్రైవేట్ జైలు కంపెనీలు వసూలు చేస్తాయి. ఖైదీలు పారిపోకుండా భద్రతావ్యవస్థను ఏర్పరచడంతో పాటు తిండి, బట్టలు, వైద్యం తదితర బాధ్యతలన్నీ ఈ కంపెనీలవే. కాగా, తమ జైలులో ఉన్న ఖైదీలతో ఆ కంపెనీ పని చేయించుకోవచ్చు. తనే స్వయంగా ఓ పరిక్షిశమను స్థాపించి అందులో పని చేయించవచ్చు లేదా మరో సంస్థకు వీరి శ్రమశక్తిని అమ్ముకోవచ్చు. ఖైదీల ఈ కంపెనీలు బాగా తగ్గించి వారిశ్రమతో ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి.

ప్రభుత్వ జైళ్ల నిర్వహణ బాధ్యతలు చూసే అధికారులు కూడా తక్కువ తినలేదు. ప్రైవేట్ జైలు కంపెనీలకు ధీటుగా తమ జైళ్లలో ఉన్న ఖైదీలను పోటీపడి మరీ బహుళజాతి సంస్థల్లో పని చేయడానికి వీలుగా విధానాలను ఆమోదింపజేసుకున్నారు. స్వయం పోషణ పేరుతో నిర్వహణ ఖర్చులను తగ్గిస్తున్నామని చెబుతూ ఖైదీలను కాంట్రాక్టుకు ఇచ్చి ఆ సంస్థల నుంచి కమీషన్లు దండుకుంటున్నారు. అమెరికాలోని 37 రాష్ట్రాలు జైలు ఖైదీలను పని కోసం ప్రైవేట్ కంపెనీలు కాంట్రాక్టుకు తీసుకోవడాన్ని చట్టబద్ధం చేశా యి. ఐబీఎం, బోయింగ్, మోటరోలా, మైక్రోసాఫ్ట్, ఏటీ అండ్ టీ, డెల్, కంపాక్, నోర్‌టెల్, ఇంటెల్, త్రీకామ్ వంటి ప్రముఖ వ్యాపార సంస్థలన్నీ వివిధ జైలు ఖైదీలతో పని చేయించుకుంటున్నాయి. అలా ప్రైవేట్, ప్రభుత్వ జైళ్ల నిర్వాహకుల మధ్య లాభాల కోసం కొనసాగిన పోటీ అమెరికన్ ప్రభుత్వాల ఫ్రీ మార్కెట్ విధానాల దన్నుతో నయా బానిసల వ్యవస్థ వేళ్లూనుకుని విజయవంతంగా కొనసాగుతున్నది. ఖైదీలను కార్మికులుగా మార్చి వివిధ రకాల పరిక్షిశమలను నెలకొల్పి లేదా వారి శ్రమశక్తిని కాంట్రాక్టుకు అమ్ముకుని ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలు కోట్లాది డాల ర్లు గడిస్తున్నాయి. ఓపెన్ మార్కెట్‌లో గంట పనికి కనీస వేతనం 7.25 నుంచి 50 డాలర్ల వరకు చెల్లిస్తుండగా ఈ ఖైదీలకు నామమావూతపు వేతనాలు చెల్లిస్తున్నాయి. ఫలితంగా ఖైదీల సంఖ్య దినదినం పెరుగుతున్నది. ఖైదీల సంఖ్యలో ప్రపంచంలోనే అమెరికా ది అగ్రస్థానం. 1970లతో పోల్చితే ఇక్కడి వివిధ జైళ్లలో ఉన్నవారి సంఖ్య 2010కల్లా ఏడు రెట్లు పెరిగింది. 2010లో అమెరికాలో వివిధ నేరాల కింద నిర్బంధితులు 71 లక్షల 63 వేల మంది ఉన్నారు. నేరాలు చేసేవారి సంఖ్య 1.9 శాతం చొప్పున పెరుగుతూ వస్తున్నది.

ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ప్రపంచ దేశాలకు నీతులు బోధించే అమెరికాలో ఇలాంటి నీచమైన వ్యవస్థ కొనసాగుతుండడం సిగ్గుచేటు. నియంతలనీ, అరాచకాలు చేస్తున్నారనీ, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారనీ పలు సాకులతో ఇరాక్ మొదలుకొని లిబియా వరకు ఎన్నో దేశాలపై పాశవికంగా దాడి చేసిన అమెరికా మొదట తన ప్రజలపై ముఖ్యంగా నల్ల జాతీయులు, శ్వేతజాతేతరుల పైన కొనసాగిస్తున్న వివక్షను ఆపాలి. మానవ హక్కుల సంస్థలు, వామపక్ష మేధావులు చేస్తున్న ఆరోపణలు పట్టించుకుని తన జాత్యహంకార విధానాలకు స్వస్తి చెప్పాలి. లేదంటే ప్రపంచ ప్రజానీకం ఆ దేశాన్ని మరింత ద్వేషించడం, ప్రతిఘటనకు సిద్ధం కావడం తప్పదు.

- డి. మార్కండేయ

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ

Published: Sat,October 6, 2012 05:03 PM

సిరియాపై అమెరికా ‘ఉక్షిగ’నేత్రం..

అఫ్ఘనిస్తాన్.. ఇరాక్.. లిబియా.. ఇరాన్.. ఉత్తర కొరియా.. అమెరికా ఆగ్రహానికి గురైన దేశాల జాబితాలో తాజాగా సిరియా చేరింది. తనకు నచ్చితే

Published: Sat,October 6, 2012 05:03 PM

ఆ సంతోషాలు మనకెప్పుడు..?

ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ సంతోష సూచికను విడుదల చేసింది. ఇప్పటివరకూ మానవాభివృద్ధి సూచికను మాత్రమే ప్రతియేటా విడుదల చేస్తూ వస్తున

Published: Sat,October 6, 2012 05:03 PM

నక్సలిజంపై ‘కార్పొరేట్’ వార్..

నక్సలిజాన్ని అంతమొందించడంలో బహుళజాతి కంపెనీల సాయం పొందాలని కేంద్రం నిర్ణయించింది. మొన్నటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ

Published: Sat,October 6, 2012 05:04 PM

‘మానవరహిత’ యుద్ధం..

మావోయిస్టుల వేటలో మానవరహిత విమానాలను వాడాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి రెండేళ్ల క్రితమే ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంల

Published: Sat,October 6, 2012 05:04 PM

పేదరికం..అంకెల గారడీ..

దేశంలో ఎంత మంది పేదలున్నారన్న విషయంపై ఇటీవల ఉభయ సభల్లో పెద్ద దుమారం చెలరేగింది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ. 22. 42, పట్టణవూపాంతంల

Published: Sat,October 6, 2012 05:05 PM

స్వార్థం.. ఉద్యమాలపై అస్త్రం..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా ఎస్‌పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్

Published: Sat,October 6, 2012 05:05 PM

కూడంకుళం.. కుట్ర ఎవరిది?

కూడంకుళం.. ఈ పేరు ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. రష్యా సహకారం తో ₹ 17 వేల కోట్లతో తమిళనాడు కోస్తా తీరంలో ఉన్న ఈ గ్రామంలో చేపట్టి

Published: Sat,October 6, 2012 05:05 PM

‘బూర్జువా’ సైన్యంలో మావోయిస్టులు!

ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా జరగని అద్భుతం ఇప్పుడు నేపాల్‌లో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దం పాటు ఒకరినొకరు చంపుకునే పనిలో నిమగ్నమై కనీసం 13

Published: Sat,October 6, 2012 05:07 PM

రాష్ట్రాల హక్కులపై ‘ఉగ్ర’ కేంద్రం..

టెర్రరిస్టు కార్యకలాపాలను సమర్థవంతంగా అణచివేసే ఉద్దేశంతో జాతీ య ఉగ్రవాద వ్యతిరేక కేంద్రాన్ని (ఎన్‌సీటీసీ) ఏర్పాటుచేస్తూ ఫిబ్రవరి 3

Published: Sat,October 6, 2012 05:06 PM

నల్లధనం.. ‘తెల్ల’ బతుకులు..

బారతీయులకు చెందిన సుమారు 25 లక్షల కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువవున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ వెల్లడించా

Published: Sat,October 6, 2012 05:06 PM

తాగునీటి పరాయీకరణ..

పీల్చే గాలి లాగే తాగే నీరూ ఉచితమనుకుంటున్న వారికి దుర్వార్త. మినరల్ వాటర్ పేరుతో ఇప్పటికే నీటిని అమ్మకపు సరుకుగా మార్చి దండి గా

Published: Sat,October 6, 2012 05:06 PM

ఈశాన్య భారతంలో విప్లవం

జాతుల తిరుగుబాట్లకు ప్రసిద్ధిగాంచిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా మావోయిస్టుల రంగవూపవేశంతో మరోసారి వేడెక్కాయి. దశాబ్దాలుగా సాయు ధ ఉద్యమ

Published: Mon,July 15, 2013 05:26 PM

బాలలు.. హక్కులు.. చట్టాలు..

ప్రవాస భారతీయులు అనురూప్, సాగరిక భట్టాచార్యల పిల్లల కస్టడీ వ్యవహారంతో బాలల హక్కులు, చట్టాలపై మరోమారు చర్చ మొదలైంది. నార్వేలో భూవిజ

Published: Mon,July 15, 2013 05:25 PM

‘ఆధార్’ గందరగోళం..

పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులందించే ‘ఆధార్’ ప్రాజెక్టు అనిశ్చితస్థితిలో పడింది. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని టెంభ్

Published: Sat,October 6, 2012 05:08 PM

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు

ప్రపంచ పోలీసు అమెరికా తాజాగా ఇరాన్‌పై కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, పొర

Published: Sat,October 6, 2012 05:07 PM

పోస్కోపై పోరాటం..

అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మూలవాసుల బతుకులను ఆగం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా వర్తమానంలో కొనసాగుతున్న ఉద్యమాల్లో పోస్

Published: Sat,October 6, 2012 05:07 PM

పౌరులపై ‘సాయుధ’చట్టం!

ఇరోం షర్మిల చాను.. ఈ పేరు వినని వారు అరుదు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ 2000 నవంబర్ 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ

Published: Sat,October 6, 2012 05:08 PM

శ్రీలంక పాలకులకు టైగర్ ఫోబియా

మన పొరుగున ఉన్న శ్రీలంక పాలకులకు ప్రస్తుతం టైగర్ల భయం పట్టుకున్నది. రెండున్నర దశాబ్దాల పాటు ఎల్‌టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్