ఆదివాసులపై మరో ఆక్రమణ..


Mon,June 17, 2013 12:18 AM

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది గంటలకు ఆ జిల్లాకు చెందిన ఏటపల్లి తాలూకాలోని సుర్జాగఢ్ గుట్టల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులను నక్సల్స్ నరికి చంపారు.చనిపోయిన ముగ్గురిలో ఒకరు ప్రముఖ బహుళజాతి సంస్థ లాయిడ్స్ స్టీల్ కంపెనీకి చెందిన ఉన్నతస్థాయి అధికారి.5వేల కోట్ల టర్నోవర్ కలిగిన ఈ కంపెనీ ప్రధానంగా ఉక్కు పరిక్షిశమలను కలిగివున్నది. ఈ కంపెనీకి వైస్‌వూపెసిడెంట్ అయిన జస్పాల్ థిల్లాన్, లాయిడ్స్‌కు అనుబంధంగా ఉన్న హేమలతా మినరల్స్ ఎండీ ఆంధ్రవూపదేశ్‌కు చెందిన మల్లికార్జున్‌డ్డి కలిసి స్థానిక పోలీస్‌ప రాజు సడిమెక్ మధ్యవర్తిత్వంలో మావోయిస్టులతో చర్చలు జరిపేందుకని మంగేర్ గ్రామానికి వెళ్లారు. చర్చల్లో ఏం జరిగిందో తెలియదు. ఓ గంటలో వారి కారు డ్రైవర్ తిరిగొచ్చాడు.మిగతా ముగ్గురు శవాలుగా మారారు. లాయిడ్స్ కంపెనీ సుర్జాగడ్ గుట్టల్లో ఇనుప ఖనిజం మైనింగ్ కాంట్రాక్ట్ కోసం, మరో అనుబంధ కంపెనీ గడ్‌చిరోలి మెటల్స్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ప్రయత్నిస్తున్నదని, ఈ క్రమంలోనే మావోయిస్టులను కలిసేందుకు వెళ్లారని తెలుస్తున్నది. గతంలో థాపర్‌కు చెందిన బల్లార్‌పూర్ పేపర్ మిల్లు(బిల్ట్)లో ఉన్నతాధికారిగా పనిచేసిన థిల్లాన్‌కు నక్సలైట్లతో బాగా పరిచయముందని, ఆ నమ్మకంతోనే వారిని కలువడానికి వెళ్లాడని అంటున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో మైనింగ్‌కు అనుమతించబోమని ప్రకటించిన మావోయిస్టులు ఈ ముగ్గురిని ఎలాంటి చర్చలు లేకుండానే చంపేశారని అధికార వర్గాలు అంటున్నాయి.
మహారాష్ట్రకు తూర్పున ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న జిల్లా గడ్‌చిరోలి. మనం కరీంనగర్ జిల్లా మహదేవపూర్ ప్రాంతం నుంచి ఎక్కడ గోదావరి దాటినా ఈ జిల్లాలోనే ప్రవేశిస్తాం.ఎనభై శాతం ప్రాంతం అడవులు, గుట్టలతో కూడుకొనివున్న ఈ ఆదివా సీ జిల్లాలో అపార ఖనిజ సంపద వున్న ది.

జిల్లా మధ్యభాగం లో వున్న సుర్జాగఢ్ గుట్టలు ఇనుప ఖని జం నిల్వలకు ప్రసిది.్ధఈ గుట్టల్లో ఇనుము నిక్షేపాలు వందల మి లియన్ల టన్నుల్లోనే ఉంటాయని సెంట్రల్ జియలాజికల్ ప్రాగ్రామింగ్ బోర్డు(సీజీపీబీ) కమిటీ తేల్చింది. ఈ నిక్షేపాలపై కన్నేసిన డజనుకు పైగా బహుళజాతి కంపెనీల్లో లాయిడ్స్ ఒకటి. ఈ కంపెనీకి వార్ధా, చంద్రపూర్ జిల్లా గుగ్గుస్‌లలో ఉక్కు, స్పాంజ్‌ఐరన్ కర్మాగారాలున్నాయి. వీటికి కావాల్సిన ముడిఇనుము సరఫరాలో కొరతనెదుర్కొంటున్న నేపథ్యంలోనే లాయిడ్స్ కంపెనీ సుర్జాగఢ్ గుట్టలపై దృష్టి సారించింది. తనకూ అక్కడ క్యాప్టివ్ మైన్స్ కావాలని పైరవీలు ప్రారంభించింది. ప్రభుత్వ ఆమోదం దొరికిందనుకున్న సమయం లో మావోయిస్టుల గ్రీన్‌సిగ్నల్ కోసం ప్రయత్నిస్తోంది.

సుర్జాగఢ్ సంపదపై కన్నేసిన కంపెనీల్లో లాయిడ్స్ ఒక్కటే లేదు. ఇప్పటికే జేఎస్‌డబ్ల్యు ఇస్పాట్ స్టీల్ లిమిటెడ్ అనే మరో భారీ కంపెనీ కూడా మైనింగ్ కోసంఅనుమతులు సంపాదించింది. జిందాల్ సోదరులు నవీన్, సజ్జన్‌లు నడిపిస్తున్న ఈకంపెనీ దేశంలోని అతిపెద్ద బహుళజాతి కంపెనీల్లోఒకటి. సుర్జాగఢ్ గుట్టల్లోని దంకోడ్వాడ్వి ప్రాంతంలోని 751.04 హెక్టార్ల విస్తీర్ణంలో గనుల తవ్వకానికి ఈ కంపెనీ కేంద్రప్రభుత్వంతో ఒప్పం దం కుదుర్చుకుంది. దీంతో ఏటా5.5మిలియన్ టన్నుల చొప్పున ఇరవైఏళ్ల పాటు ఖనిజాన్ని వెలికితీస్తారు. ఈ ఖనిజాన్ని మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా డోల్విలో జేఎస్‌డబ్ల్యు ఇస్పాట్ నెలకొల్పిన ఉక్కు ఫ్యాక్టరీకి తరలిస్తారు.

ఇప్పటికే ఈ ప్రాజెక్టు పర్యావరణంపై ప్రభావ అంచనా నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. నియమానుసారం జరగాల్సిన ప్రజాభివూపాయ సేకరణను సైతం మే 8న నిర్వహించారు. త్వరలోనే మహారాష్ట్ర పర్యావరణ నియంవూతణ మండలి(పీసీబీ) ఈ మైనింగ్ ప్రాజెక్టుకు ఆమోదాన్ని తెలుపుతుందన్న ఆశాభావాన్ని జేఎస్‌డబ్ల్యు ఇస్పాట్ ప్రతినిధి రాజు మలానీ వ్యక్తం చేశారు.
ఇక్కడే మనం ఒక కీలక అంశాన్ని గమనించాలి. గట్ట, గడ్దెవాడ గ్రామపంచాయతీలకు చెందిన సుమారు 17 గ్రామాల ప్రజలను నిర్వాసితులను చేసే ఈ ప్రాజెక్టును ఆమోదించేముందు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికులను కనీసంగా కూడా సంప్రదించలేదు. ఈ పల్లెలకు 70కిలోమీటర్ల దూరంలో ప్రజాభివూపాయ సేకరణ నిర్వహించారు. దీనిలో బాధిత ప్రజపూవరూ పాల్గొనలేదు. ఈ ప్రజాభివూపాయ సేకరణ గురించిన ప్రకటనను స్థానికంగా అందుబాటులో లేని ఒక ఆంగ్ల, మరో మరాఠీ దినపవూతికల్లో ప్రచురించారు. ఏ ఊర్లోనూ నోటీసులు అంటించలేదు.

గోండి భాష తప్ప మరో భాష రాని స్థానికులకు ఇప్పుడిప్పుడే అసలు విషయం తెలుస్తున్నది. ప్రజాభివూపాయ సేకరణ విషయం తెలిసిన వెంటనే గట్ట గ్రామసభ మే-1న సమావేశమై మైనింగ్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తీర్మానించింది. అయినా జిల్లా యంత్రాంగం ప్రజాభివూపాయం ప్రాజెక్టుకు అనుకూలంగానే ఉన్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. పైగా ప్రాజె క్టు మూలంగా స్థానికంగా అభివృద్ధి జరుగుతుందని, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు లభిస్తాయని, విద్యా వైద్య వసతులు సమకూరుతాయని జోరుగా ప్రచారం చేస్తున్నది. నిజానికి ఈప్రాజెక్టు మూలంగా17ఆదివాసీ పల్లెలకు చెం దిన ఎనిమిది వేల మంది జీవనోపాధి కోల్పోతారు. వీరంతా మాడియా గోండ్ తెగకు చెందినవారు. దేశంలోనే అత్యంత ఆదిమజాతుల్లో ఒకటైన ఈ తెగ ప్రజలు అడవిపైనే ఆధారపడి బతుకుతారు. రోజంతా అడవిలో సంచారం.. రాత్రికి ఆటా పాటలతో వీరి జీవితం ప్రకృతిలో ఆహ్లాదకరంగా సాగిపోతుంది.

ఇప్పపూవు, తదితర పండ్లు-ఫలాలసేకరణ, వెదురు నరకడం, తునికాకుసేకరణ, జంతువుల చేపల వేట, వ్యవసాయం వీరి ప్రధాన వ్యాపకాలు. అడవులు, గుట్టలు లేకుండా వీరి మనుగడ అసాధ్యం. మైనింగ్ మూలంగా ఈ ప్రాంతంలోని అడవి పూర్తిగా నాశనం కావడమే కాకుండా, మరో పది కిలోమీటర్ల పరిధిలో పర్యావరణం నాశనమవుతుందని నిపుణులు అంటు న్నారు. నేల, నీరు, గాలి పూర్తిగా కాలుష్యమవుతాయని, మనుషులకే కాకుండా జంతుజాలానికీ ముప్పేనని వారంటున్నారు. మరోవైపు, పర్యావరణ అధ్యయన నివేదికలో సైతం ఈ అడవుల్లో కోతులు, కొండముచ్చులు, జింకలు, బెట్టుడతలు, కుందేళ్లు, ముంగీసలు, అడవిపిల్లులు, రేసుకుక్కలు, నక్కలు, ఝాడుంలు, ముళ్లపందులు విస్తృతంగా ఉంటాయి. అలాగే అంతరించే ప్రమాదమున్న జాబితాలో ఉన్న పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, తోడేళ్లు,అడవిబపూలు, నాలుగు కొమ్ముల జింకలు అక్కడక్కడా కనిపిస్తాయి.


ఇక ఈ ప్రాజెక్టు వల్ల స్థానికంగా అభివృద్ధి జరుగుతుందన్నదీ అబద్దమే. ఇక్కడి ఆదివాసుల్లో చదువుకున్నవాళ్లు పెద్దగా లేరు కనుక ఉద్యోగాలు రావడం భ్రమే. క్రషిం గ్ అండ్ స్క్రీనింగ్ ప్లాంట్ వల్ల కాలుష్యం తప్ప మరేముండదు. అలాగే ప్రాజెక్టు కోసం సేకరించే రెండు వేల ఎకరాలే కాకుండా మైనింగ్ ప్రక్రియలో బయటపడే ఓవర్ బ్డ న్, రోడ్లు, నిల్వలు వగైరా అవసరాలకు మరె న్నో ఎకరాలను అనధికారికంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది కనుక ఈ 1హగామాల ప్రజ లు అన్ని రకాలుగా ఉపాధి కోల్పోతారు. వ్యవసాయం చేద్దామం భూములు లేక, ఆకో అలమో పొట్ట నింపుకుందామంటే అడవులూ లేక చివరకు ఆ దివాసులందరూ నిరాశ్రయులౌతారు.రోజుకూలీలుగా మారి ఆకలితో అలమటిస్తారు.

ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మైనింగ్ ప్రా జెక్టును వ్యతిరేకిస్తున్నారు. ముప్పైఏళ్లుగా ఈ ప్రాంత ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయిన మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ఉద్యమిస్తున్నారు. శాంతియుత పోరాటాలను అనుమతించని పరిస్థితుల్లో స్థానికులు ఐక్యమై అన్ని కంపెనీల కార్యకలాపాలను, రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. వీరి నిరసనలపై ప్రభుత్వా లు ఉక్కుపాదాన్ని మోపుతున్నాయి. ప్రజాభివూపాయ సేకరణ సందర్భంగా సైతం భారీయెత్తున పోలీసు బలగాలను, కమాండోలను దించారు. మైనింగ్‌ను వ్యతిరేకించే ప్రజావూపతినిధులను సైతం బెదిరింపులకు గురి చేస్తున్నారు. భవిష్యత్‌లో మైనింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తారనే ఉద్దేశంతో ఇప్పటినుంచే మావోయిస్టుల అణచివేతకు చర్యలు చేపడుతున్నారు. సుర్జాగఢ్ పరిసరాల్లో కొత్తగా వందలాది పారామిలిటరీ బలగాలతో క్యాంపులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే థిల్లాన్, మరో ఇద్దరి హత్య జరిగింది.

ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేసే ముసుగులో స్థానిక వనరులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టే పాలకుల కుట్రలను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా,జార్ఖండ్ రాష్ట్రాల అటవీ వూపాంతాల్లోని లక్షలాది ఎకరాలను మైనింగ్ ఎంఓయూల పేరిట దేశ, విదేశీ కంపెనీలకు అప్పగించారు. అడవులను ధ్వంసం చేసి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నారు. వాయు, జల, శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారు.వందలాది పల్లెలను మరోచోటికి తరలిస్తున్నా రు. డోంగ్రియా, కుటియా కోందులు, అబూజ్‌మాడియా వంటి అరుదైన ఆదిమతెగల అస్తిత్వానికి ముప్పు తెస్తున్నారు.వానాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వానలు, రుతువుల తారుమారు వంటివన్నీ అడవుల విధ్వంసం ఫలితమే. మనం ఇంకా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని, కనీస జీవన వనరులను సైతం అందించలేని పరిస్థితులు రావడం ఖాయం.అందుకే ప్రపంచీకరణ విధానాల్లో భాగంగా జరుగుతున్న ఈ ఘోరకలిని ఆపడానికి ప్రతి ఒక్కరూ రంగంలోకి దిగాలి. మావోయిస్టులను పారదోలేందుకని చేపట్టిన ఆపరేషన్ గ్రీన్‌హంట్ నిజానికి బహుళజాతి కంపెనీల వనరుల దోపిడికి మార్గం సుగమం చేయడానికేనని గుర్తించాలి. మధ్యభారత అడవులను, సహజవనరులను కాపాడుకోవడానికి సమష్టిగా ఉద్యమించాలి.

-డి. మార్కండేయ
dmknamaste@gmail.com


35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 04:59 PM

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ

Published: Sat,October 6, 2012 05:03 PM

సిరియాపై అమెరికా ‘ఉక్షిగ’నేత్రం..

అఫ్ఘనిస్తాన్.. ఇరాక్.. లిబియా.. ఇరాన్.. ఉత్తర కొరియా.. అమెరికా ఆగ్రహానికి గురైన దేశాల జాబితాలో తాజాగా సిరియా చేరింది. తనకు నచ్చితే

Published: Sat,October 6, 2012 05:03 PM

ఆ సంతోషాలు మనకెప్పుడు..?

ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ సంతోష సూచికను విడుదల చేసింది. ఇప్పటివరకూ మానవాభివృద్ధి సూచికను మాత్రమే ప్రతియేటా విడుదల చేస్తూ వస్తున

Published: Sat,October 6, 2012 05:03 PM

నక్సలిజంపై ‘కార్పొరేట్’ వార్..

నక్సలిజాన్ని అంతమొందించడంలో బహుళజాతి కంపెనీల సాయం పొందాలని కేంద్రం నిర్ణయించింది. మొన్నటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ

Published: Sat,October 6, 2012 05:04 PM

‘మానవరహిత’ యుద్ధం..

మావోయిస్టుల వేటలో మానవరహిత విమానాలను వాడాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి రెండేళ్ల క్రితమే ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంల

Published: Sat,October 6, 2012 05:04 PM

పేదరికం..అంకెల గారడీ..

దేశంలో ఎంత మంది పేదలున్నారన్న విషయంపై ఇటీవల ఉభయ సభల్లో పెద్ద దుమారం చెలరేగింది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ. 22. 42, పట్టణవూపాంతంల

Published: Sat,October 6, 2012 05:05 PM

స్వార్థం.. ఉద్యమాలపై అస్త్రం..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా ఎస్‌పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్

Published: Sat,October 6, 2012 05:05 PM

కూడంకుళం.. కుట్ర ఎవరిది?

కూడంకుళం.. ఈ పేరు ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. రష్యా సహకారం తో ₹ 17 వేల కోట్లతో తమిళనాడు కోస్తా తీరంలో ఉన్న ఈ గ్రామంలో చేపట్టి

Published: Sat,October 6, 2012 05:05 PM

‘బూర్జువా’ సైన్యంలో మావోయిస్టులు!

ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా జరగని అద్భుతం ఇప్పుడు నేపాల్‌లో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దం పాటు ఒకరినొకరు చంపుకునే పనిలో నిమగ్నమై కనీసం 13

Published: Sat,October 6, 2012 05:07 PM

రాష్ట్రాల హక్కులపై ‘ఉగ్ర’ కేంద్రం..

టెర్రరిస్టు కార్యకలాపాలను సమర్థవంతంగా అణచివేసే ఉద్దేశంతో జాతీ య ఉగ్రవాద వ్యతిరేక కేంద్రాన్ని (ఎన్‌సీటీసీ) ఏర్పాటుచేస్తూ ఫిబ్రవరి 3

Published: Sat,October 6, 2012 05:06 PM

నల్లధనం.. ‘తెల్ల’ బతుకులు..

బారతీయులకు చెందిన సుమారు 25 లక్షల కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువవున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ వెల్లడించా

Published: Sat,October 6, 2012 05:06 PM

తాగునీటి పరాయీకరణ..

పీల్చే గాలి లాగే తాగే నీరూ ఉచితమనుకుంటున్న వారికి దుర్వార్త. మినరల్ వాటర్ పేరుతో ఇప్పటికే నీటిని అమ్మకపు సరుకుగా మార్చి దండి గా

Published: Sat,October 6, 2012 05:06 PM

ఈశాన్య భారతంలో విప్లవం

జాతుల తిరుగుబాట్లకు ప్రసిద్ధిగాంచిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా మావోయిస్టుల రంగవూపవేశంతో మరోసారి వేడెక్కాయి. దశాబ్దాలుగా సాయు ధ ఉద్యమ

Published: Mon,July 15, 2013 05:26 PM

బాలలు.. హక్కులు.. చట్టాలు..

ప్రవాస భారతీయులు అనురూప్, సాగరిక భట్టాచార్యల పిల్లల కస్టడీ వ్యవహారంతో బాలల హక్కులు, చట్టాలపై మరోమారు చర్చ మొదలైంది. నార్వేలో భూవిజ

Published: Mon,July 15, 2013 05:25 PM

‘ఆధార్’ గందరగోళం..

పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులందించే ‘ఆధార్’ ప్రాజెక్టు అనిశ్చితస్థితిలో పడింది. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని టెంభ్

Published: Sat,October 6, 2012 05:08 PM

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు

ప్రపంచ పోలీసు అమెరికా తాజాగా ఇరాన్‌పై కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, పొర

Published: Sat,October 6, 2012 05:07 PM

పోస్కోపై పోరాటం..

అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మూలవాసుల బతుకులను ఆగం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా వర్తమానంలో కొనసాగుతున్న ఉద్యమాల్లో పోస్

Published: Sat,October 6, 2012 05:07 PM

పౌరులపై ‘సాయుధ’చట్టం!

ఇరోం షర్మిల చాను.. ఈ పేరు వినని వారు అరుదు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ 2000 నవంబర్ 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ

Published: Sat,October 6, 2012 05:08 PM

శ్రీలంక పాలకులకు టైగర్ ఫోబియా

మన పొరుగున ఉన్న శ్రీలంక పాలకులకు ప్రస్తుతం టైగర్ల భయం పట్టుకున్నది. రెండున్నర దశాబ్దాల పాటు ఎల్‌టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్

Published: Sat,October 6, 2012 05:08 PM

అమెరికాలో నయా బానిసలు..

ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికాలో సరికొత్త వ్యాపారం వర్ధిల్లుతోంది. జైళ్ల లో ఉండే ఖైదీలను కట్టుబానిసలుగా మార్చి బహుళజాతి కంపెనీ