ప్రణబ్ చిలుక పలుకులు..


Sat,October 6, 2012 04:59 PM

Pranab001యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపావూతునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రమాణం పూర్తయిన వెంటనే ఆయన చేసిన తొలి ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. పేదల ఆకాంక్షలను ధనికుల సిద్ధాంతాలు పరిష్కరించలేవంటూ ఆయన చెప్పిన నీతి వాక్యాలు పలువురి దృష్టిని ఆకర్షించాయి. ఆధునిక దేశ నిర్మాణంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ఆర్థిక సమానత్వమని, పేదరికమనేది భారత నిఘంటువులో ఉండాల్సిన పదం కాదని, ఆకలి కంటే అవమానకరమైన విషయం మరొకటి ఉండదని ఆయన పేర్కొన్నారు. నత్తనడకన సాగే కృషి ఈ సమస్యలను పరిష్కరించజాలదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై చేస్తున్న పోరును నాలుగవ ప్రపంచ యుద్ధంగా అభివర్ణించారు. యుద్ధాల ద్వారా శాంతి సాధ్యం కాద ని, కండబలంతో కాకుండా ఆత్మబలంతో, విధ్వంసక జెండాతో కాకుండా అభివృద్ధి ఎజెండాతో భారత్ ప్రగతి పథాన సాగుతుందంటూ స్వామి వివేకానంద సూక్తిని ఉటంకించారు.

ప్రణబ్ చేసిన ఈ వ్యాఖ్యలను చూసి పరిశీలకులు నివ్వెరపోతున్నారు. గత నలభై ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో, పాలకపక్షంలో, అనేక సభాసంఘాల్లో, మంత్రుల గ్రూపుల్లో కీలక పదవులను చేబట్టి ఆధునిక భారత చరివూతను ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ దిశగా మలుపు తిప్పిన ముఖర్జీ ప్రథమ పౌరునిగా ప్రమాణం చేసిన వెంటనే పేదల పట్ల సానుభూతి వచనాలు పలుకడం దయ్యాలు వేదాలు వల్లించిన చందంగానే ఉందంటున్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా, అప్పుడు ఇందిరకు, ఇప్పుడు సోనియాకు ప్రధాన సలహాదారుగా ఉంటూ ఆయన ఏనాడూ పేదరిక నిర్మూలన కోసం చిత్తశుద్ధితో కృషి చేయలేదని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో జీవన విధ్వంసానికి, మూలవాసుల వినాశానికి కారణమవుతున్న విధానాల రూపకల్పనలో సోనియా, మన్మోహన్, ప్రణబ్, చిదంబరం, మాంటేక్‌సింగ్ పంచపాండవులని పేర్కొంటున్నారు. నిజానికి మన్మోహన్‌సింగ్‌లోని ప్రతిభను గుర్తిం చి రిజర్వు బ్యాంకు గవర్నర్‌ను చేసింది కూడా ప్రణబేనని వివరిస్తున్నారు.

దేశంలోనే అత్యున్నత పదవిని చేపట్టిన సందర్భంగా నాలుగు మంచి మాటలు మాట్లాడడం సంప్రదాయమని భావించి ముఖర్జీ ఆ వ్యాఖ్యలు చేసివుండవచ్చు. కాని తన జీవితకాలమం తా ధనికుల, కార్పొరేట్ల సేవలో తరించి ఇప్పుడు రాష్ట్రపతిగా పేదల పట్ల, పేదరికం పట్ల మొసలి కన్నీరు కార్చడం బాధ్యతారాహిత్యం కిందికే వస్తుంది. స్వాతం త్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచాయి. అరవై ఆరు వార్షిక బడ్జెట్లు, పదకొండు పంచవర్ష ప్రణాళికలు, వందలాది అభివృద్ధి, సంక్షేమ పథకాల అనంతరం మూడు పాళ్ల ఆకలి.. ఆరు పాళ్ల పేదరికమన్నట్లుగా ఉంది పరిస్థితి. జనాభాలో 41.6 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. రోజుకు కనీసం రూ.20 కూడా ఖర్చు పెట్టలేని వారు నూటికి 77 మంది ఉన్నారు. ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో మన దేశం 134వ స్థానాన్ని, సంతోష సూచికలో 94వ స్థానాన్ని, ఆకలి సూచికలో 45వ స్థానాన్ని ఆక్రమించింది. ఆసరా కరువై లక్షలాది రైతులు తమ ఉసు రు తీసుకుంటున్నారు. ప్రతి వేయి మందిలో 24 మంది ఆకలితో మరణిస్తున్నారు. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు రక్తహీనతతో, భారహీనతతో సతమతమవుతున్నారు.

పుట్టిన వేయి మంది శిశువుల్లో 48 మంది ఇంకా కళ్లు తెరువకముందే ఈ లోకాన్ని వీడి వెళ్తున్నారు. ఇప్పటికీ ప్రతి నలుగురిలో ఒక్కరు నిరక్షరాస్యులు. సగం మంది కి మరుగుదొడ్లు, స్నానపు గదులు, డ్రైనేజీ సౌకర్యం లేదు. మూడవ వంతు ఇళ్లకు కరెంటు లేదు. 68 శాతం మందికి రక్షిత మంచినీరు అందుబాటులో లేదు. ఇంకోవైపు, ధనికులు మరింత ధనవంతులవుతున్నారు. ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న భారతీయుల సంఖ్య, వారి ఆస్తుల విలు వ రోజురోజుకూ పెరుగుతోంది. ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కలిగిన ధనవంతులు దేశంలో 59 మంది ఉంటే, ఐదు కోట్లకు పైబడిన ఆస్తులున్న వారి సంఖ్య 2009 నాటికే లక్షా 26వేల 7వందలకు చేరింది. వీరందరి వద్ద కలిపి 30 లక్షల కోట్ల రూపాయల ధనం మూలుగుతోంది. ఇక దేశ, విదేశాలకు చెందిన కార్పొరేట్ల ఐశ్వర్యానికైతే లెక్కే లేదు. ప్రతి యేటా వేలాది కోట్ల రూపాయలను లాభాల రూపంలో ఈ కంపెనీలు వెనకేసుకుంటున్నాయి. ఒక అంచనా ప్రకారం దేశంలోని 90శాతం సంపద జనాభాలోని కేవలం పది శాతం పెద్దల వద్ద పోగుబడివుంది.

అయినా ముఖర్జీ భాగస్వామిగా ఉన్న సర్కార్లు సహా వరుస ప్రభుత్వాలు పేదరికంపై యుద్ధాన్ని నిరంతరాయంగా, నిర్విరామంగా, అప్రతిహతంగా కొనసాగిస్తూనేవున్నాయి. ఆర్థిక సమానత్వమే లక్ష్యంగా విధానాలు రూపొందాలని, భాగస్వామ్యం తో కూడిన అభివృద్ధి అవసరమని ప్రధానులు ఆగస్టు 15న, రాష్ట్రపతులు జనవరి 26న ప్రసంగాలు చేస్తూనేవున్నారు. అయితే వారి నేతృత్వంలో నడిచే కేంద్ర కేబినెట్ చేసే నిర్ణయాలు, పార్లమెంట్ ఆమోదించే చట్టాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. విశాల ప్రజానీకానికి నష్టం కలిగించే, పెట్టుబడిదారులకు, విదేశీ కంపెనీలకు లాభం చేకూర్చే నిర్ణయాలు స్వాతంవూత్యానంతర కాలంలో లెక్కకు మిక్కిలి జరిగాయి. తమ వలసవాద విధానాలకు అనుకూలంగా బ్రిటిష్ వాళ్లు చేసుకున్న చట్టాల ను స్వేచ్ఛాభారతంలోనూ యథాతథంగా అలాగే కొనసాగించడం ఒక ఎత్తయితే, ఆ చట్టాలకు సవరణల పేరిట ప్రైవేటుకు పెద్దపీట వేయడం మరో ఎత్తు. ప్రత్యేకించి 1990ల ఆర్థిక సంస్కరణల తర్వాత ‘దోచుకునే వారికి దోచుకున్నంత’ ప్రాతిపదికన కొత్త విధానాలు, చట్టాలనేకం వచ్చాయి. ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ మొదలుకొని దేశీయ మార్కెట్‌ను బహుళజాతి కంపెనీలకు బార్లా తెరవడం వరకు ఈ క్రమం విజయవంతంగా కొనసాగుతున్నది.

నూతన ఆర్థిక విధానా ల్లో భాగంగా రూపొందిన, రూపొందుతున్న పారిక్షిశామిక, వ్యాపార, బ్యాంకింగ్, కార్మిక, జల విధానాలు, భూసేకరణ, మైనింగ్, సెజ్ తదితర చట్టాలు, కంపెనీల చట్టానికి సవరణలు ఇందులో భాగమే. చివరకు చిరు వ్యాపారస్తులకు జీవనాధారంగా ఉన్న రిటైల్ రంగాన్ని సైతం విదేశీయులకు కట్టబెట్టడానికి కుట్ర జరుగుతోంది. అభివృద్ధిలో పేదలకు, స్థానికులకు, మూలవాసులకు ప్రయోజనం చేకూరే ఒక్కటంటే ఒక్క చట్టాన్ని పాలకులు ఆమోదించలేకపోయారు.

యుద్ధాల ద్వారా శాంతి సాధ్యం కాదని ప్రణబ్ సరిగ్గానే చెప్పారు. కాని దురదృష్టవశాత్తూ ఇక్కడి ఏ ప్రభుత్వమూ ఈ సూక్తిపై నమ్మకముంచలేదు. యుద్ధమార్గాన్నే అనుసరించాయి. 1947 తర్వాత కాశ్మీర్ మినహా మిగతా ప్రాంతాల్లో చెలరేగిన పోరాటాలు, సాయుధ ఉద్యమాలన్నీ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం మొదలైనవేనన్నది మరవరాదు. భారత్‌లో తమ ప్రాంతాలను బలవంతంగా విలీనం చేశారని, తమకు స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారం కావాలని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు డిమాం డు చేశారు. ప్రజాస్వామిక పద్ధతిలో వారితో చర్చలు జరిపి సానుకూలవాతావరణంలో పరిష్కరించడానికి బదులు సైన్యాన్ని దించి, మినీ ఎమ్జన్నీ విధించి అణచివేతకు పూనుకోవడంతోనే సమస్య జఠిలరూపం దాల్చింది. మరోవైపు, భారత, పాక్ పాలకుల స్వార్థపూరిత, ఓటుబ్యాంకు రాజకీయాల మూలంగానే కాశ్మీర్‌లో ఉగ్రవాదం రావణకాష్ఠంలా కొనసాగుతోందన్నది జగద్విదితం. స్థానిక ప్రజలు ఏం కోరుకుంటున్నారో పట్టించుకున్న నాథుడు లేడు.

ప్లెబిసైట్ పజాభివూపాయ సేకరణ) జరిపి సమస్యను పరిష్కరించాల న్న ఐరాస తీర్మానానికి ఇరుదేశాలూ కట్టుబడిలేవు. సైన్యాన్ని ప్రయోగించి భారత్, ఉగ్రవాదులను ప్రవేశపెట్టి పాక్ మారణకాండలకు కారణమవుతున్నాయి. ఇక, అంతర్గత భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందని ప్రధాని పదేపదే చెబుతున్న వామపక్ష ఉగ్రవాదం (మావోయిజం) సైతం మౌలిక సమస్యల నుంచి ఉద్భవించినదే. పేదరి కం, అసమానతలు, వివక్ష, అణచివేతల ఫలితంగానే ఈ ఉద్యమం విశాల ప్రజానీకం మద్దతు పొందుతోందన్నది అందరూ ఒప్పుకుంటున్న విష యం. ప్రణబ్ సహా పలువురు నేతలు ఈ విషయాన్ని పలుమార్లు నొక్కి వక్కాణించారు కూడా. అయినప్పటికీ స్వామి అగ్నివేశ్ లాంటి మేధావులు శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్న సమయంలో యూపీఏ సర్కారు 2009లో ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ప్రారంభించింది. సమస్యను సైనికంగానే పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. గ్రీన్‌హంట్ సందర్భంలో సైన్యాన్ని సైతం వినియోగించాలనే చిదంబరం వాదనను సమర్థించిన వారిలో ప్రణబ్ కూడా ఒక్కరన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం.

ప్రణబ్ సహా సర్కారీ పెద్దలు తమ చిలుక పలుకులను ఇకనైనా మానుకోవాలి. మన రాజ్యాంగ స్ఫూర్తి పౌరులందరికీ స్వేచ్ఛా సమానత్వాలను, ప్రజాస్వామ్య హక్కులను కల్పించాలని చెబుతున్నా వరుస ప్రభుత్వాలు చెప్పేదొకటి.. చేసేదొకటన్న విధానాలను అనుసరిస్తుండడం వల్లనే దేశ ప్రజలకు ఈ దుస్థితి దాపురించింది. పేదరికం విడువని శాపంగా పరిణమించింది.మూడింట రెండు వంతుల భూభాగంలో యుద్ధ పరిస్థితులు నెలకొనివున్నాయి. తాను చేసిన వ్యాఖ్యల పట్ల ప్రణబ్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాజ్యాంగాధినేతగా, ప్రజాస్వామ్య సంరక్షకునిగా తాను పదవిలో ఉండే ఐదేళ్లలో తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. రబ్బరు స్టాంపు రాష్ట్రపతిని కాద ని నిరూపించుకోవాలి. ధనికులకు, ప్రైవేట్ కార్పొరేట్లకు అనుకూలంగా, ప్రజలకు, ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలు, బిల్లులు తన ముందుకు వచ్చినప్పుడు తిరస్కరించాలి. త్రివిధ దళాల సర్వ సైన్యాధిపతిగా దేశంలోని వివిధ ప్రాంతా ల్లో కొనసాగుతున్న ఉద్యమాలపై అణచివేతను ఆపాలి. లక్షకు పైబడిన బలగాలతో మధ్యభారతంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలి.

-డి మార్కండేయ
dmknamaste@gmail.com

35

MARKANDEYA D

Published: Mon,July 15, 2013 03:22 AM

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్ సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా

Published: Mon,July 8, 2013 12:41 AM

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బి

Published: Mon,July 1, 2013 01:21 AM

అభివృద్ధి విలయం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ

Published: Mon,June 24, 2013 12:27 AM

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ

Published: Mon,June 17, 2013 12:18 AM

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది

Published: Wed,October 10, 2012 07:53 PM

అణు విద్యుత్‌తో అన్నీ అనర్థాలే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు

Published: Thu,October 11, 2012 05:50 PM

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194

Published: Sat,October 6, 2012 04:57 PM

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం క

Published: Sat,October 6, 2012 04:57 PM

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Published: Sat,October 6, 2012 04:58 PM

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోల

Published: Sat,October 6, 2012 04:58 PM

మానెసర్ హింసకు కారకులెవరు?

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం

Published: Sat,October 6, 2012 04:59 PM

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రె

Published: Sat,October 6, 2012 05:00 PM

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రి

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ ప

Published: Sat,October 6, 2012 05:00 PM

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస

Published: Sat,October 6, 2012 05:01 PM

పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకర

Published: Sat,October 6, 2012 05:01 PM

ఉద్యమబాటలో నేపాల్ మావోయిస్టులు

ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీ

Published: Sat,October 6, 2012 05:02 PM

జనాభా లెక్కలు- అపోహలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి

Published: Sat,October 6, 2012 05:02 PM

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్

Published: Sat,October 6, 2012 05:02 PM

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ

Published: Sat,October 6, 2012 05:03 PM

సిరియాపై అమెరికా ‘ఉక్షిగ’నేత్రం..

అఫ్ఘనిస్తాన్.. ఇరాక్.. లిబియా.. ఇరాన్.. ఉత్తర కొరియా.. అమెరికా ఆగ్రహానికి గురైన దేశాల జాబితాలో తాజాగా సిరియా చేరింది. తనకు నచ్చితే

Published: Sat,October 6, 2012 05:03 PM

ఆ సంతోషాలు మనకెప్పుడు..?

ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ సంతోష సూచికను విడుదల చేసింది. ఇప్పటివరకూ మానవాభివృద్ధి సూచికను మాత్రమే ప్రతియేటా విడుదల చేస్తూ వస్తున

Published: Sat,October 6, 2012 05:03 PM

నక్సలిజంపై ‘కార్పొరేట్’ వార్..

నక్సలిజాన్ని అంతమొందించడంలో బహుళజాతి కంపెనీల సాయం పొందాలని కేంద్రం నిర్ణయించింది. మొన్నటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ

Published: Sat,October 6, 2012 05:04 PM

‘మానవరహిత’ యుద్ధం..

మావోయిస్టుల వేటలో మానవరహిత విమానాలను వాడాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి రెండేళ్ల క్రితమే ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంల

Published: Sat,October 6, 2012 05:04 PM

పేదరికం..అంకెల గారడీ..

దేశంలో ఎంత మంది పేదలున్నారన్న విషయంపై ఇటీవల ఉభయ సభల్లో పెద్ద దుమారం చెలరేగింది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ. 22. 42, పట్టణవూపాంతంల

Published: Sat,October 6, 2012 05:05 PM

స్వార్థం.. ఉద్యమాలపై అస్త్రం..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా ఎస్‌పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్

Published: Sat,October 6, 2012 05:05 PM

కూడంకుళం.. కుట్ర ఎవరిది?

కూడంకుళం.. ఈ పేరు ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. రష్యా సహకారం తో ₹ 17 వేల కోట్లతో తమిళనాడు కోస్తా తీరంలో ఉన్న ఈ గ్రామంలో చేపట్టి

Published: Sat,October 6, 2012 05:05 PM

‘బూర్జువా’ సైన్యంలో మావోయిస్టులు!

ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా జరగని అద్భుతం ఇప్పుడు నేపాల్‌లో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దం పాటు ఒకరినొకరు చంపుకునే పనిలో నిమగ్నమై కనీసం 13

Published: Sat,October 6, 2012 05:07 PM

రాష్ట్రాల హక్కులపై ‘ఉగ్ర’ కేంద్రం..

టెర్రరిస్టు కార్యకలాపాలను సమర్థవంతంగా అణచివేసే ఉద్దేశంతో జాతీ య ఉగ్రవాద వ్యతిరేక కేంద్రాన్ని (ఎన్‌సీటీసీ) ఏర్పాటుచేస్తూ ఫిబ్రవరి 3

Published: Sat,October 6, 2012 05:06 PM

నల్లధనం.. ‘తెల్ల’ బతుకులు..

బారతీయులకు చెందిన సుమారు 25 లక్షల కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువవున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ వెల్లడించా

Published: Sat,October 6, 2012 05:06 PM

తాగునీటి పరాయీకరణ..

పీల్చే గాలి లాగే తాగే నీరూ ఉచితమనుకుంటున్న వారికి దుర్వార్త. మినరల్ వాటర్ పేరుతో ఇప్పటికే నీటిని అమ్మకపు సరుకుగా మార్చి దండి గా

Published: Sat,October 6, 2012 05:06 PM

ఈశాన్య భారతంలో విప్లవం

జాతుల తిరుగుబాట్లకు ప్రసిద్ధిగాంచిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా మావోయిస్టుల రంగవూపవేశంతో మరోసారి వేడెక్కాయి. దశాబ్దాలుగా సాయు ధ ఉద్యమ

Published: Mon,July 15, 2013 05:26 PM

బాలలు.. హక్కులు.. చట్టాలు..

ప్రవాస భారతీయులు అనురూప్, సాగరిక భట్టాచార్యల పిల్లల కస్టడీ వ్యవహారంతో బాలల హక్కులు, చట్టాలపై మరోమారు చర్చ మొదలైంది. నార్వేలో భూవిజ

Published: Mon,July 15, 2013 05:25 PM

‘ఆధార్’ గందరగోళం..

పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులందించే ‘ఆధార్’ ప్రాజెక్టు అనిశ్చితస్థితిలో పడింది. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని టెంభ్

Published: Sat,October 6, 2012 05:08 PM

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు

ప్రపంచ పోలీసు అమెరికా తాజాగా ఇరాన్‌పై కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, పొర

Published: Sat,October 6, 2012 05:07 PM

పోస్కోపై పోరాటం..

అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మూలవాసుల బతుకులను ఆగం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా వర్తమానంలో కొనసాగుతున్న ఉద్యమాల్లో పోస్

Published: Sat,October 6, 2012 05:07 PM

పౌరులపై ‘సాయుధ’చట్టం!

ఇరోం షర్మిల చాను.. ఈ పేరు వినని వారు అరుదు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ 2000 నవంబర్ 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ

Published: Sat,October 6, 2012 05:08 PM

శ్రీలంక పాలకులకు టైగర్ ఫోబియా

మన పొరుగున ఉన్న శ్రీలంక పాలకులకు ప్రస్తుతం టైగర్ల భయం పట్టుకున్నది. రెండున్నర దశాబ్దాల పాటు ఎల్‌టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్

Published: Sat,October 6, 2012 05:08 PM

అమెరికాలో నయా బానిసలు..

ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికాలో సరికొత్త వ్యాపారం వర్ధిల్లుతోంది. జైళ్ల లో ఉండే ఖైదీలను కట్టుబానిసలుగా మార్చి బహుళజాతి కంపెనీ