వైరుధ్యాలకు అతీతంగా...


Sat,October 6, 2012 05:11 PM

Raju9 talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అశేష ప్రజానీకానికి పిడికెడు మందిలేని తెలంగాణ వ్యతిరేకులైన సీమాంధ్ర పెట్టుబడిదారుల మధ్య ఉన్న వైరుధ్యమే ప్రధాన వైరుధ్యంగా ముందుకు వచ్చింది. సీమాంధ్ర పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతున్న భారత దేశపాలక వర్గాలకు తెలంగాణ సమాజానికి మధ్య ఉన్న వైరుధ్యం స్పష్టంగా అర్థమయింది. సీమాంధ్ర రాజకీయ నాయకత్వానికి (తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ పార్టీలలో)ఊడిగం చేస్తున్న తెలంగాణ ద్రోహులైన రాజకీ య పార్టీలు,వ్యక్తులు, గ్రూపులు, తెలంగాణ ప్రజలకు మధ్య ఉన్న వైరుధ్యం కొంతవరకు స్పష్టమైంది. ఇంకా ‘మేక వన్నె పులులైన’తెలంగాణ ద్రోహుల అస లు స్వభావం బట్టబయలు కావల్సి ఉన్న ది. సీమాంవూధలోని మెజారిటీ ప్రజలు తెలంగాణ ఏర్పాటు పట్ల అనుకూలంగా ఉన్నారు.

కొందరు పెట్టుబడి దారులు మాత్రమే తెలంగాణ ఏర్పాటు ను వ్యతిరేకిస్తున్నారు. మార్క్స్ చెప్పినట్టు ‘ఇతర జాతులను పీడించే ఏ జాతి కూడా స్వేచ్ఛ’గా ఉండజాలదు. తెలంగాణ వనరులను, అవకాశాలను దోచే సీమాంధ్ర ప్రాం తం కూడా స్వేచ్ఛగా మనజాలదు. తెలంగాణ ప్రజలను దోపిడీ, పీడనలకు గురిచేస్తున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు సీమాంధ్ర ప్రజలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సీమాంధ్ర ప్రజలు ఈ పరిస్థితిని గ్రహించే స్థితిలో లేరు. పైగా తెలంగాణ విడిపోతే సీమాంధ్ర ప్రజలకు ఇబ్బందులు ఏర్పడతాయి అన్న భ్రమలో ఉన్నారు. వాస్తవానికి సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య వైరుధ్యం పెద్దగా లేదు.

తెలంగాణ ఏర్పాటుకు రెండు మార్గాలున్నాయి. సీమాంధ్ర ప్రజలు ఉద్యమించి సీమాంధ్ర పెట్టుబడిదారుల దోపిడీని వ్యతిరేకించడం, తెలంగాణ ఏర్పాటును స్వాగతించటం. మార్క్స్ చెప్పినట్టు ‘పాలకవర్గాల భావాలే ప్రజల భావాలు’ ప్రసార మాధ్యమాల మీద పెత్తనం కలిగిన సీమాంధ్ర పెట్టుబడిదారీ వర్గాలు, సీమాంధ్ర ప్రజలకు, సత్యాన్ని తెలుసుకొనే అవకాశం లేకుండా చేస్తున్నాయి. కాని గతితర్క సూత్రం అనుసరించి భవిష్యత్తులో సత్యాన్ని గ్రహిస్తారు.

రష్యా విప్లవం తర్వాత మాత్రమే, అరకోటి జనాభా కూడాలేని లిథువే నియా, లాథ్వియా, ఎస్తోనియా లాంటి దేశాలు స్వాతంవూత్యాన్ని పొందాయి. రష్యా విప్లవం ద్వారా జార్‌చక్రవర్తి పాలనలో మగ్గిపోయిన దేశాలకు, జాతుల కు విముక్తి లభించింది. పై సందర్భాలలో తప్పించి పీడకజాతి దేశాల వల్ల పీడిత జాతి విముక్తికి మార్గం ఏర్పడదు. పీడిత జాతుల ప్రజలు చేసే పోరాటం ద్వారా మాత్రమే పెత్తనం నుంచి విముక్తిని పొందగలుగుతారు. సీమాంధ్ర ప్రజలు, పార్టీలు తెలంగాణ ఏర్పాటును స్వాగతించే అవకాశాలు లేవు. రెండవది తెలంగాణ ప్రజల ఒత్తిడి, తెలంగాణ సొంత రాజకీయ అస్తిత్వం ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుంది. సీమాంవూధకు చెందిన ‘విశాల భావాలు’ ఉన్నవారు సైతం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించడం చూస్తున్నాం.

విశాల భావాలకు, ప్రగతిశీల ఆలోచనలకు తెలంగాణను సమర్థిస్తున్నారా లేదా అనేది గీటురాయి అనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. దంతపరీక్ష ద్వారా వయస్సును నిర్ణయించునట్టుగా తెలంగాణ సమస్య ద్వారా వ్యక్తుల, పార్టీల విశాల భావాలను అర్థం చేసుకోగలుగుతాం. చార్టిస్ట్ కార్మికోద్యమం నాయకులు ఐరిష్ సమస్య వచ్చేసరికి బ్రిటిష్ పాలనను సమర్థించిన సంఘటనలను, కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత ఏంజల్స్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ డం ద్వారా సీమాంధ్ర ప్రజలు అనవసర భ్రమలకుపోయి, వారి వాస్తవ సమస్యలు ముందుకు వస్తాయి. తద్వారా ప్రజాపోరాటాలు తీవ్రమై సమస్యల పరిష్కారానికి మార్గం సుగమము అవుతుంది. ఈ విషయాన్ని సీపీఎంకు చెందిన వామపక్ష నాయకులు అర్థం చేసుకుంటే ఇరు ప్రాంతాలకు మేలు జరుగుతుంది.

లేకపోతే సీమాంధ్ర పాలక వర్గాలకు మాత్రమే అనుకూలమవుతుంది.
తెలంగాణ ఉద్యమానికి ‘ప్రతిఘాత ఉద్యమంగా’ (counter move ment)గా జై ఆంధ్ర ఉద్యమం వచ్చిన విషయం మనం మరువకూడదు. ఆ ఉద్యమంలో వచ్చినవారే చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు. ముల్కీ రూల్స్‌కు, తెలంగాణ ప్రత్యేక హక్కులకు వ్యతిరేకంగా వచ్చిన జై ఆంధ్ర ఉద్య మం ఆ ప్రాంతం విడిపోవడానికి ఉద్యమించింది కాదు. కేవలం తెలంగాణ ప్రజల ప్రత్యేక హక్కులను వ్యతిరేకించటం, సీమాంధ్ర ప్రజలలో భ్రమలు వ్యా పింప చేసి ప్రజా ఉద్యమాలను పక్కదారి పట్టించే ఉద్యమం మాత్రమే. కేసీఆర్ నాయకత్వాన టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజలు చేస్తున్న త్యాగపూరిత పోరాటాల ద్వారా తెలంగాణ ప్రజల ఆశయం నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి.

రాజకీయాలలో త్యాగాలు చేయడం, ఉత్త పుణ్యానికే జరగదు. వాటి కోసం యుద్ధాలు జరగాలి. కొండాసురేఖ లాగా రాజీనామా చేయడం ప్రజల కోసం చేసిన త్యాగము కాదు. జగన్ కోసం చేసిన త్యాగం మాత్రమే. ‘పెట్టుబడిదారు ల, భూస్వాముల, సామ్రాజ్యవాదుల కోసం చేసిన త్యాగం ఈకలాగా తేలికైనదని, ప్రజల కోసం చేసిన త్యాగం హిమాలయాల కన్నా ఉన్నతమైనదని’ మావో తెలిపారు. అనేక అవమానాలకు, నిందలకు, ఓర్చి తెలంగాణ ప్రజలు ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి, ఒక రాష్ట్రంగా విడిపోయే హక్కు ఉన్నదని గుర్తించకపోవడం ఏవిధంగా చూసిన సమర్థనీయం కాదు. అహంకారపూరితంగా తెలంగాణను వ్యతిరేకించటం ఎవరికి ఉపయోగపడదు. కేవలం సీమాంధ్ర పెట్టుబడిదారులకు మాత్రమే మేలు కలిగిస్తుంది.

తెలంగాణ సమాజంలో అనేక అంతర్గ త వైరుధ్యాలు ఉన్నాయి. తెలంగాణలో ని భూస్వామ్యవర్గాలు, రైతు కూలీలకు మధ్య పెట్టుబడిదారులు, కార్మికుల మధ్య సమస్యలు అంతర్గత వైరుధ్యాలు ఉన్నా యి. దళిత, గిరిజన ప్రజల కష్టాలు, బాధ లు, దోపిడీ, పీడన లాంటి ముఖ్య సమస్యలున్నాయి. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలు నీరు, వనరులు దోపిడీ, నిరుద్యోగం, హైదరాబాద్ నగర కాలుష్యం సమస్యలున్నాయి. తెలంగాణలోఅంతర్భాగమైన ముస్లిం, క్రైస్తవులకు అనేక సమస్యలు ఉన్నాయి. తెలంగాణ సమాజంలోని అంతర్గత వైరుధ్యాల పరిష్కారానికి కేసీఆర్ ఆయా వర్గా ల, ప్రజలకు విశ్వాసం కలిగించవలసి ఉంటుంది. తెలంగాణ సమాజంలో సగభాగమైన మహిళల అభ్యున్నతికి మార్గాలు వెతకాలి. తద్వారా తెలంగాణ ప్రజలను సమైక్యంగా ముందు కు నడిపించగలుగుతాము.

ప్రస్తుత రాజకీయాలు మహా సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇదే మంచి సమయం. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర సాధన ఆశయానికి భంగం వాటిల్లకుం డా ఎత్తుగడలను ప్రదర్శించి ఆంధ్రవూపదేశ్ రాజకీయాలను తద్వారా భారత దేశ రాజకీయాలను ప్రభావితం చేసే నిర్ణయాత్మక శక్తిగా ఎదగవలసి ఉంటుంది. అంతేకానీ, కాంగ్రెస్, బీజేపీ లాంటి అవకాశవాద నాయకత్వాలను నమ్ముకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదనే విషయం గతానుభవం తెలియచేస్తున్నది. యూపీఏ, ఎన్డీఏలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండి కూడా ఏర్పాటు చేయని విషయం మనం గుర్తుంచుకోవాలి. టీఆర్‌ఎస్ బలమైన రాజకీయ శక్తిగా అవతరించటం ద్వారా కేంద్రంలో ఉండే ఏ ప్రభుత్వాన్నైనా మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును సాధించుకోగలుగుతాము.

-పెండ్యాల మంగళాదేవి


35

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ