తెలంగాణ ఉద్యమం- తక్షణ కర్తవ్యం


Sun,November 4, 2012 02:06 AM


తెలంగాణ రాష్ట్ర అవతరణ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే రాజ్యాంగబద్ధమైన డిమాండు పార్లమెంటులో బిల్లు పెట్టి, సాధారణ మెజారిటీతో ఆమోదం పొందడం ద్వారా నెరవేరేది. తెలంగాణ ఉద్య మం కొత్త రాష్ట్రం కోసం కాదు. గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి ఏర్పా టు చేయాలనే కోరిక మాత్రమే. ఏ రాష్ట్ర ఏర్పాటుకు లేని సమస్యలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందుకు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్య, స్వభా వం 12 ఏళ్లుగా ఉద్యమం సాధించిన విజయాలను, తక్షణ కర్తవ్యాలను చర్చించుకోవడం ఎంతైనా అవసరం. ఈ నెల (నవంబర్-2012) 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో సమావేశాలు నిర్వహించి, తక్షణ కార్యక్షికమం ప్రకటించే ఉద్దేశ్యంతో ఉద్యమంలో అగ్రగామిగా ఉన్న టీఆర్‌ఎస్ సంకల్పించింది.

తెలంగాణ రాష్ట్ర సాధన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ద్వారా సాధించుకోవాల్సిన సమస్య. అంటే.. రాష్ట్ర శాసనసభలో, పార్లమెంటులో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. సీమాంధ్ర నాయకత్వం కింద ఉన్న కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు తెలంగాణకు అనుకూలంగా లేకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం అవకాశవాదంగా వ్యవహరించడం వల్ల సమస్య జటిలమవుతున్నది. దీనికి తోడు సీమాంధ్ర పత్రికలు, ఛానెల్స్ గందరగోళాన్ని శాశ్వతం చేసే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఒక సాధారణ సమస్యను సంక్లిష్ట సమస్యగా మారుస్తున్నాయి. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాచి వేయడం వల్ల రాష్ట్ర ఏర్పాటు సమస్య ప్రజాస్వామ్య ఉద్యమంగా మారింది. సీమాంధ్ర పెట్టుబడిదారులు, కోటీశ్వరుల స్వార్థం, వలస దోపిడీలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్య మం పోరాడుతున్నది. అంటే తెలంగాణ ఉద్యమం విప్లవ స్వభావం కూడా కలిగి ఉన్నది. తెలంగాణ ఉద్యమం సీమాంధ్ర వలస దోపిడీలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కులను, ఆత్మగౌరవాన్ని స్వయం పాలన సాధించడం కోసం సాగుతు న్న ఉద్యమం. తెలంగాణ వనరులను, నిధులను, నీళ్లను, ఉద్యోగాలను సంస్కృతి ని కాపాడుకొని తమ ప్రయోజనార్థం కోసం సాగుతున్న ఉద్యమం. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కాలక్రమేణా రూపాంతరం చెంది ప్రజాస్వామిక, విప్లవాత్మక లక్షణాలను సంతరించుకున్నది. అశేష జన సామాన్యాన్ని ఆకర్షిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సామాజిక, ఆర్థిక వ్యవస్థను మార్చే విప్లవం కాదు. కేవలం సీమాంధ్ర వలస దోపిడీకి వ్యతిరేకంగా, స్వయం పాలన, ఆత్మగౌరవం కోసం సాగుతున్న ఉద్యమం అనే విషయాన్ని మరిచిపోకూడదు.

కేసీఆర్ కరీంనగర్ సభలో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సాధించిన విజయాలు, ఉద్యమ గమనంలో ఏర్పడ్డ సమస్యల గురిం చి సింహావలోకనం చేసుకోవాలి. 1)కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపనకు ముందు ఈ ప్రాంత ప్రజలు తాము తెలంగాణ వారమనే భావనను మరిచిపోయా రు. సీమాంధ్ర వలస పాలన ఫలితంగా ఆర్థిక, రాజకీయ దోపిడీ, ఆధిపత్య విధానాలే కాకుండా తెలంగాణ సంస్కృతిపై దాడి జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పాలన కాలంలో రెండున్నర జిల్లాల భాష, సంస్కృతి తెలుగు భాషా స్వరూపం, సంస్కృతి గా చెలామణి అయింది. తద్వారా తెలంగాణ ప్రజల్లో తమ అస్తిత్వ భావనను మరిచిపోయారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తరం ప్రస్తుతం సమాజంలో పెద్దరికం స్థానాల్లో ఉన్నారు. వారి మనస్సుల్లో తెలంగాణ భావన సజీవంగా ఉన్నది. యువతరానికి తెలంగాణ భావన లేకుండాపోయింది. ఈ పన్నెండేళ్ల ఉద్యమంలో తెలంగాణలోని సబ్బండ వర్ణాలు, ముసలి వారి నుంచి పిల్లల వరకు అందరికీ తెలంగాణ అస్తిత్వ భావన, తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం బలమైన కోరిక ప్రబలింది. 2) కరీంనగర్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ఆవిర్భావసభలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. తర్వాత జరిగిన వరంగల్ సభలో 30 లక్షల మంది ప్రజలు సమీకృతమయ్యారు. అద్భుత జన సమీకరణ తెలంగాణ ఉద్యమంలో జరిగింది. అనేక సమస్యలపై తెలంగాణ ప్రజానీకం ఉద్యమబాటలో నడిచారు. 12 ఏళ్లుగా ఉద్యమం అహిం సా మార్గాన గాంధేయ పద్ధతిలో కొనసాగింది. ఏ ఒక్క ఆంధ్రవారిపై దాడి జరుగలేదు. 3) ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సాధన కోసం జీవితాంతం కృషి చేశారు. ఆయన ప్రజా ఉద్యమం, ఎన్నికలు, రాజకీయ ప్రక్రియ అనే మూడు పద్ధతుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఢిల్లీలో కేసీఆర్, జయశంకర్‌లు కలిసి అనేక జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నాయకులను కలిసి తెలంగాణకు మద్దతును కూడగట్టారు. తెలంగాణ సమస్య గురించి ఢిల్లీలోని జాతీయ నాయకులకు అందరికీ తెలియజెప్పారు. చివరికి సీపీఐ తమ సమైక్యవాద విధానా న్ని విడనాడి తెలంగాణ సమర్థించడం కేసీఆర్, జయశంకర్‌ల గొప్ప కృషికి నిదర్శ నం. 4)తెలంగాణ ఉద్యమాన్ని చీల్చడానికి , తద్వారా తెలంగాణవాదాన్ని మట్టుబెట్టడానికి అనేక కుట్రలు జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నాయకులను, ఎమ్మెల్యేలను, వైఎస్‌ఆర్ పాలనాకాలంలో ‘ఆపరేషన్ ఆకర్’్ష పేరుతో వలవేసి అనేక కుట్రలు చేశారు. కేసీఆర్‌కు, పార్టీకి వ్యతిరేకంగా అనేక కుట్రలు, కుహకాలు చేశారు. ఉద్యమంపై, కేసీఆర్‌పై నింద లు మోపి జనంలో పలుచన చేసి, తద్వారా ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఈ కుట్ర లో భాగస్వాములయ్యారు. కేసీఆర్‌పై జుగుప్సాకరమైన నిందలు వేయడం ద్వారా తెలంగాణ ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగాయి. రాష్ట్ర రాజకీయ చరివూతలో ఎన్నడూ లేని విధంగా.., ఈ జగుప్సాకరమైన గోబెల్స్ అబద్ధాలను తట్టుకుని ఉద్యమం నిలబడింది.

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో ఇందిరాగాంధీ నాయకత్వాన సుస్థిర ప్రభుత్వం కేంద్రంలో ఉండేది. బంగ్లాదేశ్ యుద్ధంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం సుస్థిరత, పలుకుబడి గొప్పగాఉండేవి. నాటి తెలంగాణ రాజకీయ నాయకత్వానికి, పాలకవర్గాల్లో ఉండే విభేదాలను ఉపయోగించుకునే అవకాశం నాడు లేదు. పైగా కేంద్ర ప్రభుత్వం చెన్నాడ్డి, మల్లికార్జున్ తదితర నాయకులలో విభేదాలు రెచ్చగొట్టి ఉద్యమనాయకుల్లో అనైక్యతను పెంచి పోషించి, రాష్ట్ర ఏర్పాటు కాకుండా కొన్ని రక్షణలు కల్పించి (సిక్స్ పాయింట్ ఫార్మ్‌లా) లొంగదీసుకుని తెలంగాణ ప్రజా సమితిని తన లో కలుపుకున్నది. జై ఆంధ్ర ఉద్యమంతో తెలంగాణ రక్షణలను , సీమాంధ్ర నాయకత్వం తొలగించింది. ప్రస్తుతం అధికార, ప్రతిపక్షపార్టీలు సంక్షోభంలో ఉన్నందువల్ల, ఆ పార్టీల్లోని విభేదాలను ఉపయోగించుకుని కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. తీవ్రమైన పోలీస్ నిర్బంధం, పోలీస్ కాల్పులు, రక్తపాతం, హింసలేకుండా లక్షలాది మంది ప్రజలను సమీకరించేందుకు కేసీఆర్ కృషిచేశారు. జేఏసీ ఏర్పాటు చేయడం ద్వారా కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, కుల సంఘాలకు తెలంగాణ ఉద్యమంలో సంఘటితం గా కదిలే అవకాశం ఏర్పడింది. తెలంగాణ సాధనకు ఒక రాజకీయ పార్టీ అవసరాన్ని గుర్తించి కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఉద్యమానికి నాంది పలికాడు. పంచాయితీ ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలు సాధించడం ద్వారా టీఆర్‌ఎస్‌కు, తెలంగాణ ఉద్యమానికి గుర్తిం పు తెచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్‌తో, రెండోసారి టీడీపీతో పొత్తుపెట్టుకోవడం ద్వారా , ఆరెండు పార్టీలతో తెలంగాణకు జై కొట్టించారు. దీంతో సమైక్యవాదాన్ని సూత్ర రీత్యా ఓడించడం జరిగింది.

డిసెంబర్ 9 చిదంబరం ప్రకటనను కేసీఆర్ తన ఆమరణ నిరాహార దీక్షతో సాధించారు. కాంగ్రెస్ , టీడీపీ పార్టీలు వచ్చిన తెలంగాణను అడ్డుకోవడం ద్వారా, ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని తేల్చి చెప్పడం జరిగింది. దీంతో ఆ రెండు పార్టీల పక్షపాత స్వభావం బట్టబయలు అయ్యిం ది. జగన్ పార్లమెంటులో సమైక్య ఆంధ్ర ప్లకార్డును పట్టుకోవడం ద్వారా తానూ సీమాంధ్ర తానులో ముక్కనేనని నిరూపించుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకితమైన రాజకీయ పార్టీ టీఆర్‌ఎస్, ఇతర తెలంగాణ అనుకూల రాజకీయ పార్టీలను , జేఏసీలను కలుపుకొని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి. ప్రజా ఉద్యమమైనా, లేదా యుద్ధమైనా సరిగ్గా నడిపించాలంటే నాయకత్వానికి సరైన వ్యూహం, ఎత్తుగడలు తెలియాలి. పురోగమనం, తిరోగమనం రెండింటినీ అర్థం చేసుకోవాలి. పురోగమనం కన్నా తిరోగమనం చాలా కష్టతరమని సైనిక శాస్త్రం చెబుతున్నది. ఎందుకంటే తిరోగమనంలోనే ప్రపంచంలోని గొప్ప బలమైన సైన్యాలు నాశనం చెందాయి. దీర్ఘకాల పోరాటం, సరైన వ్యూహం, ఎత్తుగడలకు పురోగమనం, తిరోగమనం తెలిసిన నాయకుడు కేసీఆర్. ఎలాంటి అవమానాలను ,అవహేళనలను లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన, నడిపిస్తున్న వ్యక్తి కేసీఆర్.

మాటల్లో అతివాదం, చేతల్లో మితవాదం అనుసరించే నాయకులను తెలంగాణ ఉద్యమం పట్టించుకోలేదు. ప్రజా ఉద్యమంలో సమయ, సందర్భాలు అనుసరించి ప్రధాన వైరుధ్యం మారుతూ ఉంటుందని మావో తెలిపాడు. ఒక సందర్భంలో ప్రచా రం ముఖ్యంగా ఉండి మరొక సందర్భంలో ప్రజా ఉద్యమం లేదా సమ్మెలు ముఖ్యం గా ఉంటాయి. ఇంకొక సందర్భంలో ఎన్నికలు ముఖ్యంగా ఉంటాయి. ఏ సందర్భంలో ఏది ముఖ్యమైనది, దేనికి ప్రాముఖ్యతనివ్వాలి అన్నది ఆ సందర్భానుసారం ముందుకు వచ్చిన ప్రధాన వైరుధ్యం మీద ఆధారపడి ఉన్నది. ప్రధాన వైరుధ్యం మీద కేంద్రీకరించడం ద్వారా ప్రజా ఉద్యమాన్ని లేదా యుద్ధాన్ని మందు కు తీసుకుపోగలుగుతామని మావో తెలిపాడు. మాటల్లో అతివాదం, చేతల్లో మితవాదులైన ఈ కుహనా నాయకులు ప్రజలకు అమలు చేయలేని పిలుపులు ఇస్తారు. ఆ పిలుపును అమలు చేయగలిగిన సత్తా, ప్రజలను సమీకరించే శక్తి వీరికి ఉండదు. ఉద్యమాన్ని పక్కదారి పట్టించి శత్రువుకు నిర్భంధం పెంచే అవకాశం కల్పిస్తారు. సకల జనుల సమ్మె సందర్భంలో ఎన్నికల గురించి, ఎన్నికల సమయంలో ప్రజా ఉద్యమం గురించి మాట్లాడే నాయకులను ఏమని పిలవాలి?

తెలంగాణ సమాజం రాష్ట్ర సాధన కోసం సమైక్యంగా పోరాడుతున్నది. కళాకారు లు, ఉద్యోగులు, రైతాంగం, సబ్బండకులాలు ఐక్యంగా కదులుతున్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను నిరసిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రాంత నేతల మధ్య ఐక్యతలేదు. సీమాంధ్ర నాయకత్వానికి బానిసలుగా ఉండే విధానాన్ని విడిచిపెట్టాలి. జేఏసీని మరింత పటిష్టం చేయాలి. తెలంగాణ ప్రాంతంలో కూడా చైతన్యం అన్ని ప్రాంతాల్లో ఏకరీతిన లేదు. కాబట్టే ఉద్యమ తీవ్రత కూడా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేదు. ప్రజల్లో ఆకాంక్ష బలంగా ఉన్నప్పటికీ నాయకత్వ లోపమే స్థానిక నాయకత్వ లోటే ప్రధానంగా ఉన్నది. అన్ని నియోజక వర్గాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. సరైన ప్రచార నైపుణ్యాన్ని రూపొందించాలి. టీఆర్‌ఎస్ తన మేథోమథనంలో సరైన పాలసీని తయారు చేసుకోవాలి. ఆ విధానాలను అమలు చేయగల నిర్మాణాన్ని, టెక్నిక్‌లను రూపొందించుకోవాలి. టీఆర్‌ఎస్ తెలంగాణ ఉద్యమానికి వ్యాన్‌గార్డ్ అన్న విషయం మరిచిపోవద్దు. అన్ని రకాల జేఏసీలను కార్మిక, ఉద్యో గ, విద్యార్థి, కళాకారులను , కవులను ఏకం చేయాలి. ఉద్యమాన్ని అంతటా ఏకరీతిన బలోపేతం చేయాలి. 2014 ఎన్నికలు లక్ష్యంగా తెలంగాణ వ్యతిరేకులకు డిపాజిట్లు కూడా దక్కకుండా ఉద్యమాన్ని నడిపించాలి. 2014 నాటికి సమైక్య, తెలంగాణ వ్యతిరేక పార్టీలన్నింటికీ తెలంగాణలో స్థానంలేదని నిరూపించే లక్ష్యంతోతెలంగాణ ప్రజలు కదలాలి. తద్వారా అమరవీరుల కలలను సార్థకం చేయగలుగుతాం.

-పెండ్యాల మంగళాదేవి
-సి. నిరంజన్‌డ్డి, టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు

35

MANGALADEVI PENDYALA

Published: Sat,December 29, 2012 11:08 PM

అఖిలపక్షం చర్చలు-పరిణామాలు

అఖిల పక్షంతో తెలంగాణ సమస్యకు పరిష్కారం వస్తుందని ప్రజలు ఆశించారు.కానీ చాలా మంది అనుమానపడుతున్నట్టే అఖిలపక్షం చర్చలు నిష్ఫలమైనవని ద

Featured Articles